Friday, 21 April 2023

శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్ (03-May-23, Enlightenment Story)

*సమాజంలో గొప్ప వ్యక్తులు* 

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

1977 సంవత్సరం గణిత మేధావుల మధ్యలో ఒక ఆవిడ కుర్చోని వుంది. వారు 201 అంకెలున్న సంఖ్యకు 23 వ వర్గాన్ని చెప్పమనగా  ఆమె మనసులోనే గుణించి 50 సెకన్సులోనే  సమాధానం చెప్పింది. అది నిజమో కాదో  ధృవీకరించుకోవడానికి యూనివాక్ 1108 కంప్యూటర్ లోకి ఫీడ్ చేయగా అది నిమిషం పైన లెక్క కట్టి  ఆమె చెప్పిన సమాధానం సరైనదని తేల్చింది. వారు ఆశ్చర్యపోయారు.

 1980 జూన్ 18 ఇంపిరియల్ కాలేజ్ ,లండన్ కంప్యూటర్ విభాగం వారు మళ్ళీ ఆమెకి ఒక పరీక్ష పెట్టేరు.ఈ సారి కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన రెండు పదమూడు అంకెలగల సంఖ్యలను గుణించి ఫలితం చెప్పమనగా కేవలం  28 సెకన్స్ లో ఫలితం చెప్పి వారిని ఆశ్చర్యపరిచింది. వారు ఆమెను హ్యూమన్ కంప్యూటర్ గా అభివర్ణించారు.1995 లో గిన్నీస్ బుక్ లోకి ఎక్కిందామే పేరు.

ఆమె ఎవరో తెలిసే వుంటుంది. యస్ ,ఆమే శకుంతలాదేవి గణితంలో భారతదేశ కీర్తిని సగర్యంగా నిలబెట్టిన మేధావి. ఆమె ఏం చదివిందో తెలుసా??? ఒకటవ తరగతిలో రెండురూపాయల ఫీజు కట్టలేక బడిమానేసిన పేదరికం ఆమెది.వాళ్ళ నాన ఒక సర్కస్ కంపెనీలో చిన్న పనివాడు.కాని ఇంటి దగ్గరే సాధనచేసి 6 ఏళ్ళ వయస్సులో ,యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ లోనూ, 8 ఏండ్ల వయస్సులో మద్రాస్ యూనివర్సిటీలో గణితం పై ప్రదర్శనలిచ్చినది. నిద్రపోతున్న ఆమెను లేపి గతశతాబ్థంలో ఏ తేదిన ఏ వారం వచ్చిందో చెప్పమంటే ఠక్కున తముడు కోకుండా చెప్పేది.

గణితం,జ్యోతిష్యాలను అంశాలుగా తీసుకొని ఫన్ విత్ నంబర్స్ ,ఆస్ట్రాలజీ ఫర్ యు,మరియు ఫజిల్ టు ఫజిల్ ,మాథాబ్లిట్ ,ఎ వేకన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్ , ఇన్ ది వండర్ లాండ్ ఆఫ్ నంబర్స్ మొదలగు గణితపుస్తకాలు రాసింది. పేదరికంతో బడి మానేసిన అమ్మాయి ఇంత ఉన్నత స్థితికి చేరిందంటే ఎంత పట్టుదల సాధన అవసరమో కదా??? అన్నట్లు హ్యూమన్ కంప్యూటర్ గా పేరుగాంచిన శకుంతలాదేవి గారి వర్థంతి నేడు..ఆమె జ్ఞాపకార్ధమే ఈ చిన్న వ్యాసం...

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Thursday, 20 April 2023

మజ్జిగ - మహా పానీయం (24-Feb-24, Enlightenment Story)

*మజ్జిగ - మహా పానీయం *  

🥛🥛🥛🥛🥛🥛🥛 ✍🏼💧🥛

“మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గా, కైలాస౦లో ఉ౦డే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు. “

పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. “

“స్వర్గ౦లో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇ౦ద్రుడు బలహీనుడు అయ్యాడు."

 “మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” 


యోగ రత్నాకర౦ అనే వైద్యగ్ర౦థ౦లో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తు౦ది. 

మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!

వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు  దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు. 

అ౦దుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవు తు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. 

చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.

వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”    

ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని  ‘కూర్చిక’ అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు.  ”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.

వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”:

పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. భావ ప్రకాశ వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు

# ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి #

చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన  తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు

🌳🌳🥛🥛💎🥛🥛🌳🌳 🌳🌳🥛🥛💎🥛🥛🌳🌳 🌳🌳🥛🥛💎🥛🥛🌳🌳 🌳🌳🥛🥛💎🥛


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️


జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము (01-May-23, Enlightenment Story)

 *జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము*  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ పై తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై  అతని ముందున్న రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి వుంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది..

అందులో ఇలా వుంది

గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది

ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను.ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఇక ఋణం తీరిపోయింది 

ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది

ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది

దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!

చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది. కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడేపెట్టి వెళ్ళిపోయింది.

ఆయనకి మెలుకువ వచ్చింది.  తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద తను రాసింది కాకుండా ఇంకేదో రాసి వుండటం గమనించి చదవడం ప్రారంభించాడు

అందులో ఇలావుంది

గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి నుంచి శాశ్వతంగా ఉపశమనం లభించింది

ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని నా కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా  గడుపుతాను

ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే  ప్రశాంతంగా సహజమరణం చెందారు

ఈ ఏడాది నా కొడుక్కి పునర్జన్మనిచ్చింది. కారు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైనా నా కొడుకు ప్రాణాలతో బైటపడ్డాడు, కార్ కి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో మరో కొత్త కారు కొనుక్కున్నాను

హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"

అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు.

ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.

చాలావరకూ సమస్యలు మన ఆలోచనా దృక్పథం నుంచి ఉద్భవించేవే.. మన ఆలోచనా దృక్పథం #పాజిటివ్ గా ఉంటే ఎంతటి సమస్య ఐనా దూదిపింజెలా తేలికైపోతుంది,ఫలితం అనుకూలంగా ఉంటుంది. కానీ #నెగటివ్ ఆలోచనలు చిన్న సమస్యను కూడా బూతద్దంలో చూపించి మనశ్శాంతిని దూరం చేస్తాయి.ఆనందమయమైన 

🌸జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము🌸

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Wednesday, 19 April 2023

ప్రాణాయామం (30-Apr-23, Enlightenment Story)

 *ప్రాణాయామం *  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

23-Apr-23, Sunday- దయచేసి సూర్యభగవానుడు వీడియో చూడండి 

https://youtube.com/shorts/9cNI2tDnX7A

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️  

మన ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడానికి ఏవైనా వ్యాయామాలు కానీ, ఆహార జాగ్రత్తలు కానీ ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా చేయాలో అవగాహనా కోసం సలహాలు

1.- ఊపిరితిత్తుల ను శుభ్రం చేసుకునేందుకు రోజు ప్రాణాయామం చేయాలి.కొంత వ్యాయామం చేయాలి.సాత్వికాహారం తీసుకోవాలి.అంటే ఉప్పు,కారం, మసాలాలు చాలా తగ్గించి తీసుకోవాలి.వీలైనంతవరకు పళ్ళు తీసుకోవాలి.పచ్చి కారట్, కీరదోసకాయ వంటి వాటిని తురిమి పెరుగు లో వేసుకుంటే ఆరోగ్య మునకు చాలా మంచి ది.

2.-నిల్వ ఉంచిన పచ్చళ్లు,బిస్కెట్లు, వేపుళ్లు,పాలిష్ చేసిన పదార్థాలు, పంచదార వంటి వాటిని పూర్తిగా మానేయండి.పంచదారకు బదులు బెల్లం లేదా తేనెను తీసుకోండి.

3.-సిరి ధాన్యాలు కొత్త గా ప్రచారం లోకి వచ్చాయి.ఇవి ఆరోగ్య మునకు చాలా మంచి వి.వరి, గోధుమ లకు బదులు వీటిని వాడుకోండి.చాలా బాగుంటాయి.బిపి,సుగర్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి తీవ్రత తగ్గుతుంది.

4.-వ్యాయామం -చేయుట వలన గుండె కొట్టుకొనుట వేగవంతమై ఊపిరి తిత్తుల పనితీరు బాగుండి కండరములు ఆక్సిజెన్ సరఫరా మెరుగ్గా ఉండి కార్బన్ డయాక్సైడ్ ను వెలుపలకు పంపిస్తుంది.అన్ని రకముల కాలుష్యములకు దూరం పాటించాలి.

5.-ఇంటిలోపల ఫర్నిచర్ ను వాక్యూం చేస్తుండాలి (వారం -వారం )

6.-కిటికీలు తెరచి గాలి వెంటిలేషన్ ఉండే తట్టు గా చూడాలి

7.-కృత్రిమ ఎయిర్ ఫ్రెషనర్లు , కాండిల్స్ కూడదు

8.-ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రముగా ఉంచుకోవాలి దుమ్ము ధూళి వలన పీల్చే గాలితో ఊపిరితిత్తులను చేరి ఇర్రిటేషన్ కలుగ చేయును

9.-ఇంటిలో ధారాళమైన గాలికి -వెంటిలేషన్ -ఎక్సజాస్ట్ అమరిక ఉంచాలి

10.-అంటు వ్యాధులు బారిన పడకుండా జాగర్తలు పాటించాలి

11.-పండ్లు కూరగాయలు విరివిగా తీసుకోవాలి. ఎక్కువ మంచి నీరు తాగాలి

12.-వాక్సినేషన్లు తీసుకుంటూ ఉండాలి

13.-ఉచ్చాస -నిశ్వాసా ములను క్రమబద్దీకరణ పాటించాలి.(బ్రీతింగ్ ).

ఈ రోజుల్లో ఎవరికీ ఫలానా చేయండి అని సూచించకూడదు నా సలహాఇవన్నీ పాటిస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యవంతమై మనము కూడా ఆరోగ్యవంతులం కాగలం.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

ఇంటికి - పెద్దదిక్కు వుండాలి (29-Apr-23, Enlightenment Story)

 ఇంటికి  - పెద్దదిక్కు  వుండాలి (పురాణాల కధనం)

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

29-Apr-23, Saturday - దయచేసి శ్రీవారు వీడియో చూడండి 

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

ఇంటికి  - పెద్దదిక్కు  వుండాలి అంటారు. ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి. మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది.

కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు. ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి  -  తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేకపోయారు, విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు, భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం రాజ్యమే కూలిపోయింది..

పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి. నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి, ధర్మాన్ని చెప్పేవాడు ఓక్కడైనా వుండాలి, 

అదే ధృతరాష్ట్రుని గొప్పతనం.ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది.

అదే శకుడ్ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు. దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.

అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు, ధర్మ ప్రవర్తనతో బ్రతికారు, 

దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, గురువుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, శ్రేయోభిలాషుల మాట వినలేదు, భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు?

మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడి కోనైనా తెచ్చుకోవాలి."అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది,చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.. ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.

ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా?  అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి..

అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు. "ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని అంటాడు. ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు..

అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు.

కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

రాముడు - ప్రారబ్ద కర్మ (28-Apr-23, Enlightenment Story)

 *రాముడు - ప్రారబ్ద కర్మ*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

💝 మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే. ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో, పురాణాల లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం.

💖 రాముడు దండకారణ్యం లో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి, కారణం , ఒక మహాపతివ్రత శాపం !

💓 దేవాసుర సంగ్రామం సమయంలో, మృతసంజీవనీ మంత్రబలంతో చావులేకుండా, దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి, వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిల్చుందాఋషి పత్ని !

💓 శ్రీమహావిష్ణువు విధి లేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శనచక్రంతో హతమార్చాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త, మహా తపోధనుడు, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ శపించాడు. తన భార్యను హతమార్చి, తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్యావియోగం తో బాధపడాలి అని ! అందుకే రాముని వనవాసానికి కైక, లేదా మందర , లేదా దశరథుడు కారణంకాదనీ, వారు నిమిత్త మాత్రులనీ స్పష్టమౌతున్నది.



❤️ అంటే శ్రీరాముడిక్కూడా కర్మానుభవం తప్పలేదు. అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి, రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో తీరా కైకమ్మ వరాల విషయంగా, వనవాసం చేయడానికి వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు... "ఈ ముసలి తండ్రిని చంపి రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తాను” అన్నాడు.

💖 అప్పుడు రాముడు తమ్మునితో “నాయనా! నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు ఇప్పుడు మౌనంగా ఉండటం ఆయన తప్పు కాదు. అతి బలీయం విధివిధానం! అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో. పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు. ఈ ప్రారబ్దకర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు. కనుక కోపాన్ని తగ్గించుకొని తండ్రిఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణా!”అన్నాడు.

💓 భగవద్గీతలో చెప్పిన "స్థితప్రజ్ఞత" అంటే ఇదే ! కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడమే భావ్యం !"అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి.

❤️ భగవద్గీతలోని 18 వ అధ్యాయం 61 వ శ్లోకంలో, “ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ, జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను !!"అని గీతాచార్యుడు చెప్పినట్టుగా, సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే.

💓 వారే కాదు… భూమిపై జన్మించిన ఏ ప్రాణీ కూడా కర్మలకు అతీతుడు కాడు.! దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు. మనం కర్మలు చేయవలసిందే. ఆ కర్మల ఫలితం, సుఖమైనా, దుఃఖమైనా, ఇష్టమున్నా లేకున్నా, రాముడైనా, కృష్ణుడైనా అనుభవించ వలసిందే.

💞 వాలిని చెట్టుచాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రాముడు తన మరుజన్మ అయిన కృష్ణావతారంలో తన నిర్యాణంకోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో కర్మ ఫలితాన్ని తాను అనుభవించక తప్పలేదు.

💝 మరో దృష్టాంతం. ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయంతో బాటు తమ కళ్ళ ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు కూడా, జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు. భారత మహాసంగ్రామంలో మిడతల వలె మాడిపోయారు.

💖 అలా అన్యాయం చేస్తున్నవారితో బాటు, సమర్థత ఉండి, అన్యాయం జరగకుండా అడ్డుకునేశక్తి ఉండి కూడా చూస్తూ మిన్నకుండి పోయినవాళ్లు కూడా అంతే పాపాత్ములు. కనుకనే శిక్షకు పాత్రులు అవుతున్నారు. ఎంతటి ప్రజ్ఞాశాలియైనా తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు

💝 రామాయణ భారత భాగవతాలన్నీ “సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి” అని బోధిస్తున్నాయని మనం గ్రహించాలి.

💖 దేవుడు మనిషికి రెండు వరాలు అనుగ్రహించాడు. ఒకటి జ్ఞానం, రెండు మాట్లాడే ప్రతిభ. వీటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన, సత్ చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. ఉత్కృష్టమైన ఈ మానవజన్మను సార్థకం చేసుకోవాలి. ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా.

💓 పరపీడనం పాపాన్నీ, తాపాన్నీ కలిగిస్తుంది. నవ్వులాటకైనా ఏ ప్రాణినీ హింసించకూడదు. ఎందుకంటే అన్ని శరీరాల్లో ఉన్నది కూడా పరమాత్ముడే. అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ అన్నీ గమనిస్తూ… మనలోనే ఉంటూ మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మరచిపోవద్దు.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

ఇందిరా గాంధీ 3వ ప్రధాని - జై గోమాత (27-Apr-23, Enlightenment Story)

 *ఇందిరా గాంధీ 3వ ప్రధానిగా పదవి అలంకరించడానికి ముందు పరిస్థితి*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

27-Apr-23, Thursday - దయచేసి గురుబోధ వీడియో చూడండి 

https://youtube.com/shorts/iwEVl3c3HXk

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

ఆమె ఎట్టి పరిస్థితులలో ప్రధాని అయ్యే అవకాశమే కనిపించలేదు ఆనాటి పరిస్థితులలో (దక్షిణాది) మద్రాస్ వాడైన నిజలింగప్పకు పూర్తి మద్దతు ఉంది.  అప్పుడు ఇందిరా గాంధీ గారు సాధు సంతుల ఆశీర్వాదం కోసం తిరిగింది.  వారిలో కరపాత్రి స్వామి (హరిహరానంద సరస్వతి) ఒకరు.  ఆయన అమ్మా మాకు ఒక మాట ఇస్తే మేము నీవు ప్రధనిగా కావడానికి ఆశీర్వాదం ఇస్తాము అన్నారు.  మీరు కోరిన ప్రమాణం చేస్తాను నన్ను ప్రధాని పదవి వరించేట్లు ఆశీర్వదించండి అని వేడుకుందట ఇందిర...

నీవు ప్రదాని పదవిని చేపట్టిన వెంటనే గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి అన్నారు.  అలాగే స్వామి అని ఇందిరా గాంధీ మాట ఇచ్చింది. కరపాత్రి స్వామి (హరిహరానంద సరస్వతి) మరియు శంకరాచార్య ఇద్దరూ ఆమెను ఆశ్వీర్వదించారు.  వారి ఆశీర్వాద బలమో లేక ఆమె అదృష్టమో గాని తర్వాత ఇందిరా గాంధీ భారతదేశానికి 3వ మురియు మొదటి మహిళా ప్రధాని గా పదవి చేపట్టింది.

కరపాత్రి స్వామి, శ్రీ శంకరాచార్య ఇద్దరూ రెండు సార్లు ఆమెను కలసి ఆమె ఇచ్చిన మాటనిలబెట్టుకోమని అడిగారు. ఆమె వారికి కల్లబొల్లి కబుర్లు చెప్పి పంపించి వేసింది.  గోపాష్టమి నాడు కరపాత్రి స్వామి, శ్రీ శంకరాచార్యుల ఆద్వర్యంలో డిల్లీకి గోవులు సంతులు  బయలు దేరారు.

ఇందిరా గాంధీ వారిమీద కాల్పులు జరిపించింది.  అనేకమంది సంతులు చాలా గోవులు తూటాల బారిన పడి చనిపోయాయి. కరపాత్రి స్వామి కోపంతో అమ్మా మమ్మల్ని బాధించావు.. సంతులం కనుక క్షమిస్తాము.  కానీ మా తల్లి గోమాతలను చంపించావు.. దీనికి నా శాపం తప్పక నీకు తగిలి తీరుతుంది.  నీ వంశం నిర్వంశమౌతుంది అని శపించారు.

ఈ విషయం ఆనాటి పత్రికలలో వచ్చింది. ఆర్యవ్రత్, కేసరి పత్రికలలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు.

  • సాధువుల శాపవాక్కుకు ఎంతటి బలం ఉందో చూడండి.
  • ఇందిరా గాంధీ సాధువుల మీద, గోవులమీద తుపాకులతో కాల్పులు జరిపించిన రోజు గోపాష్టమి..
  • ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ చనిపోయినది గోపాష్టమి నాడు..
  • ఇందిరా గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు..
  • రాజీవ్ గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు..

సాధువులను, గోవులను హింసించిన వాడు ఎవ్వరూ బాగుపడలేదని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.

గమనిక ::ఎవరికైనా అనుమానం ఉంటే ఆసంవత్సరం,రోజుని క్రాస్ చెక్ చేసుకోండి..                                                   

🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄  

 🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏

 🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏

 🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏🚩  జై గోమాత🙏

🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄  🐄 🐄 🐄  

మహాకవి కాళిదాసు - సరస్వతీదేవి (26-Apr-23, Enlightenment Story)

*మహాకవి కాళిదాసు*  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

 26-Apr-23, Wednesday - దయచేసి కృష్ణుడు వీడియో చూడండి 

https://youtube.com/shorts/OrU2U1Vh1PY

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి *దాహంగా ఉంది,నీళ్లు ఇవ్వండి* అని అడుగుతాడు.

గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి  ‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు?'అంటుంది.

కాళిదాసు*నేను ఎవరో తెలియకపోవడం ఏంటి?నేను ఓ పెద్ద పండితుడను.ఎవరిని అడిగినా చెబుతారు* అని అంటాడు.

ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..'మీరు అసత్యమాడుతున్నారు.మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’అంటుంది.

కాళిదాసు కాసేపు ఆలోచించి"నాకు తెలియదు.గొంతు ఎండి పోతుంది,ముందు నీళ్లు ఇవ్వండి"అని బతిమాలుకుంటాడు...

"ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....

ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు....

అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....

తెల్ల ముఖం పెట్టి మాతా!"నీళ్ళు ఇవ్వండి.లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు....

వాళ్ళు సూర్యచంద్రులు’అని తెలిపి"మరి మీరెవరో సెలవివ్వండి.నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....

కాళిదాసు దీనంగా"నేను అతిథిని"అని బదులిస్తాడు....

"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు.ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే.ఒకటి ధనం, రెండోది యవ్వనం.అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు"అంటుంది ముసలావిడ....

కాళిదాసు"నా సహన పరీక్ష  తరువాత చేద్దురు.ముందు నీళ్లు ఇవ్వండి"అని వేడుకుంటాడు....

"ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు.వారెవరో శెలవివ్వ గలరా" అంటూ...బిక్కమొహం వేసిన కాళీదాసుతో"ఒకటి భూమి,రెండోది వృక్షం"అని భోద పరచి"ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....

ఓపిక నశించిన కాళిదాసు"నేను మూర్ఖుడను.ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి"అని సాగిల పడతాడు....

ఆ అవ్వ నవ్వుతూ"ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు"అని అంటుంది....

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....

ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి,అహంకారం కాదు.కీర్తి,ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.

విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

సూర్య నమస్కారాలు (25-Apr-23, Enlightenment Story)

*సూర్య నమస్కారాలు*  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

25-Apr-23, Tuesday - దయచేసి హనుమంతుడు వీడియో చూడండి 

https://youtube.com/shorts/fGCNHcWHySY

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా, అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.

ఆసనానికో ప్రయోజనం :-సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...

ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.




మరెన్నో లాభాలు :-

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.

ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

1.నమస్కారాసనం (ఓం మిత్రాయ నమ):- సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2.హస్త ఉత్తానాసనం (ఓం రవయే నమః) :- కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :- శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4.ఆంజనేయాసనం (ఓం భానవే నమ) :- ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :- కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6.సాష్టాంగ నమస్కారం (ఓం పూష్ణే నమః) :- ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7.సర్పాసనం (ఓం హిరణ్యగర్భాయ నమః) :- శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8.పర్వతాసనం (ఓం మరీచయే నమః) :- ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9.ఆంజనేయాసనం (ఓం ఆదిత్యాయ నమః) :- నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి

10.పాదహస్తాసనం (ఓం సవిత్రే నమః) :- మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయ నమః) :- రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12.నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః) :- నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

జీవిత సత్యం! (24-Apr-23, Enlightenment Story)

 🌹 *జీవిత సత్యం!*   🌹

 🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️   

24-Apr-23, Monday- దయచేసి శివుడు వీడియో చూడండి 

https://youtube.com/shorts/tDHUTaK96Yg

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️   

    (శ్రీమతే రామానుజాయ నమః)  రుచించక పోయినా ఇదే యదార్థం!

   మూసిన కన్ను తెరవకపోయినా,   తెరిచిన కన్ను మూయకపోయినా,

   శ్వాస తీసుకుని వదలకపోయినా,  వదిలిన శ్వాస తీయకపోయినా,

   ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు     

మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచి పోయేలా చేస్తుంది కాలం!  విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.

ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు!

ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఏవరిదో? ఏమవుతుందో ఎవరికి తెలుసు?

ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే, అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా, నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో, పరమాత్మకు తప్ప ఎవరికీ తెలియదు!

ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు.

ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు  మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో  మోసుకువెళ్లక తప్పదు...!

 చెట్టుకూ,  పుట్టకూ, రాయికి, రప్పకు ఉన్న ఆయుర్థాయం కూడా మనకు లేదు. ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే.

కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ. అశాశ్వతమైన వాటిని జపధ్యానములతో ఛేధిద్దాం. అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం ధ్యానం!

అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం.  అందులోని  సంశయాలను తీర్చుకుందాం. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు.

భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం. ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశంపొంది ధర్మాచరణ, కర్మాచరణ చేద్దాం!

నిరంతరం భగవత్ ధ్యానంతోఉంటూ, సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి ఎంతో కొంతపంచుతూ ఉన్నతంగా జీవిద్దాం!

!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు  లోకా సమస్తా సుఖినోభవ!!!

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? (23-Apr-23, Enlightenment Story)

 *దేవుడంటే ఏంటి?  పూజ చేయకపోతే ఏమవుతుంది? అని*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️   

23-Apr-23, Sunday- దయచేసి సూర్యభగవానుడు వీడియో చూడండి 

https://youtu.be/kl8yD7vv3bc

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️   

చిన్నపిల్లలే కాదు ..  నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. "అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని!  మనకు భవవంతుని గురించి అవగాహన లేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు మనం వాడే మాట అదే!.

కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా ! మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు. తెలియని వారికి అలా చెప్పడం వల్ల ... వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.

*పూజ*అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ. 

"దీప ప్రజ్వలనం" అనేది.. త్రాటకం అనే యోగ ప్రక్రియ.

రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది, ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే.స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.

పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి. మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి. అదే సమయంలొ మూఢ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది.

1. మూలవిరాట్ 🚩 భూమిలో ఎక్కడైతే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.

 2. ప్రదక్షిణ🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు, కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు Vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.

 3. ఆభరణాలతో దర్శనం 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.

 4. కొబ్బరి కాయ 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.

 5. మంత్రాలు 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే    మనకి తెలియకుండానే neurons ని ఏక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.

6. గర్భగుడి 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.

7. అభిషేకం 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించి నపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించు కుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.

8.  హారతి 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో ‘స్వేదకర్మ’ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.

9. తీర్థం 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు.

10.  మడి 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!✍️

  🌷🙏🌷*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*  🌷🙏🌷

  🌷🙏🌷*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*  🌷🙏🌷     

  🌷🙏🌷*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*  🌷🙏🌷          

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

స్వామివారి హామీ (22-Apr-23, Enlightenment Story)

 *స్వామివారి హామీ*  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

22-Apr-23, Saturday - దయచేసి శ్రీవారు వీడియో చూడండి 

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

*స్వామికి బియ్యం తెచ్చాను..రేప్పొద్దున పొంగలి పెట్టుకొని నేనూ మా కుటుంబం అంతా స్వామిని దర్శించుకుంటాము..రాత్రికి ఇక్కడే ఉంటాము..రేపు మా మనవడికి ఇక్కడ పేరు పెట్టించాలి.." అన్నాడు ఆ పెద్దమనిషి..దగ్గర దగ్గర అరవై ఏళ్ల వయసుంటుంది..ఆయన పేరు దేవరకొండ వెంకటేశ్వర్లు..ఉప్పుగుండూరు గ్రామం..రశీదు రాసిచ్చాను..తీసుకొని వెళ్ళిపోయాడు.*

ఆరోజు శనివారం..సాయంత్రం పల్లకీసేవ హడావిడిలో మేమున్నాము..బియ్యం తెచ్చి ఇచ్చిన వెంకటేశ్వర్లు కూడా తన భార్యా బిడ్డలతో కలిసి పల్లకీసేవ లో పాల్గొనడానికి మంటపం లో కూర్చుని వున్నాడు..శ్రీ స్వామివారి పల్లకీ ప్రదక్షిణాలకు బైలుదేరేముందు తన కుమారుడికి చెప్పి, అతని చేత పల్లకీ మోయించాడు..ఆ కుమారుడు కూడా అత్యంత భక్తిగా పల్లకీ మోసాడు..

ఆ కార్యక్రమం పూర్తీ కాగానే..వెంకటేశ్వర్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి.."రేపుదయం మా మనవడికి పేరు పెట్టాలి అని చెప్పాను కదా..ఎన్ని గంటలకు మమ్మల్ని రమ్మంటావు..?" అని అడిగాడు..ఉదయం పది గంటలకు రమ్మన్నాను..సరే అని వెళ్ళిపోయాడు..ప్రక్కరోజు ఆదివారం నాటి  ప్రభాతసేవ కార్యక్రమం పూర్తి కాగానే..దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి మాకు ఎక్కువగా ఉంటుంది..ఆ హడావుడిలో వెంకటేశ్వర్లు విషయమే నాకు గుర్తు రాలేదు..

అర్చక స్వాములకు ఒక నామకరణ కార్యక్రమం ఉన్నదీ అని చెప్పడం మర్చిపోయాను..ఈలోపల ఇద్దరు ముగ్గురు భక్తులు శ్రీ స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయించుకోవాలని పూజా సామాగ్రి తీసుకొని లోపలికి వచ్చేసారు..అర్చక స్వాములు అభిషేకాలు చేయడం కొద్దిగా ఆలస్యం అవుతుందనీ..పది గంటలకు అభిషేకం చేస్తామని వాళ్లకు నచ్చచెప్పి..ఒక ప్రక్కన కూర్చోబెట్టారు..సరిగ్గా అప్పుడు నాకు గుర్తుకొచ్చింది..

వెంకటేశ్వర్లు కు కూడా పది గంటలకే నామకరణం చేస్తామని చెప్పాను కదా..అభిషేకము , నామకరణం రెండూ ఒకేసారి జరుపలేము కదా..అని..పూజారి ని పిలిచి విషయం చెప్పాను..పూజారి గారు ఒక్కక్షణం ఆలోచించి.."ముందు అభిషేకాలు పూర్తి చేస్తాను..వెంకటేశ్వర్లు కు నచ్చచెప్పి నామకరణం ఆ తరువాత చేస్తాను..వెంకటేశ్వర్లు వాళ్ళు కూర్చొని వుంటారు లేండి..మీరేమీ కంగారు పడకండి.." అన్నారు..

తొమ్మిదిన్నరకే వెంకటేశ్వర్లు తన కుటుంబం తో సహా లోపలికి వచ్చాడు..అతనిని దగ్గరకు పిలిచి.."అభిషేకాలు ఉన్నాయి..అవి పూర్తి కాగానే మీ మనుమడికి నామకరణం చేయిస్తాను..కొద్దిగా ఆలస్యం అవుతుంది.." అన్నాను.."అయ్యా నా కుమారుడి నామకరణం ఇక్కడే చేసాను..నా మనుమడికి నామకరణం ఇక్కడే అనుకున్నాను..నా విషయంలో స్వామివారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయరు..అంతా అనుకున్న సమయానికే పూర్తి అవుతుంది.." అన్నాడు.."అంత నమ్మకంగా చెపుతున్నావే..ఏమిటి కారణం..? " అన్నాను..

"నా చిన్నతనం లో నేనూ మా నాయనా మాలకొండ వచ్చాము..అప్పుడు స్వామివారు  అమ్మవారి మఠం లో వున్నారు..మా నాయన తో ఉన్న నన్ను చూసి, "వీడు నీ కుమారుడా..అని అడిగారు..అవునన్నాడు మా నాయన..వీడికి అన్నీ సక్రమంగా జరుగుతాయిలే..నువ్వు వీడివల్ల ఇబ్బంది పడవు.." అన్నారు..అదిగో ఆనాటి నుంచి..నాకు ఏ కష్టమూ రాలేదు..నేను కూడా ఈ స్వామినే నమ్ముకున్నాను..నా పెళ్లి ఇక్కడే జరిగింది..నా కుమారుడి నామకరణం ఇక్కడే చేసాను..వాడి పెళ్ళీ ఇక్కడే జరిపించాను..ఇప్పుడు మనుమడి కోసం వచ్చాను..ఆలస్యం అని నువ్వు చెపుతున్నావు..స్వామి ఏ ఏర్పాటు చేస్తాడో..చూద్దాం.." అన్నాడు.

వెంకటేశ్వర్లు ఆ మాట ముగించే లోపలే..మా అర్చక స్వామి నా వద్దకు వచ్చి.."ఎవరిదో నామకరణం వుందన్నారుగా..వాళ్ళను పిలవండి..ఆ కార్యక్రమం పూర్తి చేస్తాను.." అన్నారు..నేను ఆశ్చర్యంగా చూసాను.."అభిషేకాలు ఉన్నాయని అనుకున్నాము కదా..మరి వాళ్ళ సంగతి..? " అన్నాను..

"ఏమో సార్..ఇప్పటిదాకా అభిషేకం ఎప్పుడు? అని అడిగారు..తీరా నేను వాళ్ళను రమ్మని పిలిచే సరికి.."ఇప్పుడు అభిషేకం వద్దు..మా వాళ్ళు బైటకు వెళ్లారు..తరువాత చేయించుకుంటాము"..అన్నారు..ఈలోపల ఈ నామకరణం చేద్దామని అనుకున్నాను.." అన్నారు..

"వీడికి అన్నీ సక్రమంగా జరుగుతాయిలే.." అని స్వామివారు వెంకటేశ్వర్లు విషయంలో స్వయంగా చెప్పిన ఆనాటి మాట..మా కళ్ళముందే ఋజువు అయింది..

వెంకటేశ్వర్లు కు సాక్షాత్తూ స్వామివారే హామీ ఇచ్చి వున్నారు మరి!!

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

పరిశీలాత్మక శక్తి - బోర్డ్ అంతా షాక్ (21-Apr-23, Enlightenment Story)

  *పరిశీలాత్మక శక్తి *  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

బ్రహ్మానందం నెమ్మదిగా  ఇంటర్వ్యూ జరుగుతున్న రూమ్ డోర్ ని తట్టాడు. కొద్దిగా డోర్ తెరిచి "మే ఐ కమిన్ సార్?" అన్నాడు. ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న వారిలో ఒకరు. "ఎస్! కమిన్!" అన్నాడు. లోపలికి అడుగు పెట్టిన బ్రహ్మానందం వారితో ఏదో చెప్పబోయాడు. 

"ఫస్ట్ యూ సిట్!" అన్నారు వాళ్ళు.ఇక గత్యంతరం లేక కూర్చున్నాడు బ్రహ్మానందం. బోర్డ్ సభ్యుల్లో ఒకరు "ఈ గది గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు గంభీరంగా.

"చక్కని ఫర్నీషింగ్ తో చాలా బాగుంది సార్! మంచి అందమైన కార్పెట్, కిటికీలకు అత్యంత సుందరమైన కర్టెన్స్, బోర్డ్, ప్రొజెక్టర్, వైట్ స్క్రీన్ చాలా గొప్పగా, కళాత్మకంగా ఉంది సార్!"

"ఓహ్! నైస్ అబ్సర్వేషన్!  కానీ పేపర్ ముక్కలు ఉండ చుట్టి ఓ పక్కన పడి ఉన్నాయి. అది గమనించలేదా? ఇంత అందమైన రూమ్ కి దిష్టి చుక్కలా లేదా?"

"సార్! నేను రూమ్ లోకి అడుగుపెట్టినప్పుడే అది చూశాను. కానీ నేను ఆ విషయం చెబితే, ఆ ఉండలు పడేసిన వ్యక్తి ఫీల్ అవుతాడు కదా! అందుకే చెప్పలేదు. అది పడేసిన వ్యక్తి ఎడమ వైపు నుంచి రెండవ స్థానంలో కూర్చున్నాడు. అతని వద్ద ఉన్న ప్యాడ్ పైన పేపర్స్ చించినట్టు కనిపిస్తోంది. పక్కన మరో రెండు ఉండలు పడి ఉన్నాయి"

"గుడ్! నీలో మంచి పరిశీలాత్మక శక్తి ఉంది. బయట ఉన్న స్వీపర్ ను ఓ సారి పిలిచి, క్లీన్ చేయమని చెప్పగలవా?"ఎస్ సార్!అమె పేరుచెప్పండి!"  బోర్డ్ మెంబర్స్ ఎవరూ మాట్లాడలేదు. "ఓకే సార్! మీకెవ్వరికీ ఆమె పేరు ఏంటో తెలియదనుకుంటా! ఎనీవే! నేను కనుక్కుని, పిలుస్తాను!" 

అని రూమ్ బయటకు వెళ్ళాడు. అక్కడ ఉన్న హెల్పర్ బాయ్ ని అడిగి, పేరు తెలుసుకుని, ఆమెను పిలిచి రూమ్ క్లీన్ చేయమనిచెప్పాడు. ఆమె వచ్చి, క్లీన్ చేసి, వెళ్ళింది. 

మళ్ళీ ఇంటర్వ్యూ మొదలుపెట్టారు.

"నువ్వు చాలా మంచి పని చేసావు. గుడ్! ఏ పని చేసేవారిని అయినా నువ్వు గౌరవిస్తావన్నమాట! ఈ ప్రశ్నకు జవాబు చెప్పు! ఇక్కడ ఉన్న మాలో ఎవరు ఏ కంపెనీ బాస్ నో చెప్పగలవా?"

"ఎస్ సార్! మీలో ఆ ఇద్దరూ జస్ట్ వాచింగ్. చూస్తూ కూర్చున్నారు అంతే!   వారిలో ఒకరు ఫైనాన్స్ పర్సన్ అంటే శాలరీ బేరసారాలు చేసే వ్యక్తి. ఇక రెండో ఆయన హెచ్ ఆర్ అతను. ఆ చివర కూర్చున్న వ్యక్తి కేవలం ఓ చిన్న నవ్వు నవ్వడం, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అతనే అసలైన బాస్! మధ్యలో కూర్చున్న వ్యక్తి మీ అందరితో తెగ మాట్లాడుతూ వున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అతనే బాస్ అని నేను కన్ఫ్యూజ్ అవ్వాలనేమో!" అని వివరించాడు బ్రహ్మానందం.

వెంటనే సంతోషంగా చప్పట్లు చరిచి "అద్భుతంగా వివరించావు. మేము నీవంటి క్యాండిడేట్ కోసమే చూస్తున్నాము. యూ ఆర్ సెలెక్టెడ్! బయట వెయిట్ చేసి, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో!"

"ఇంకా ప్రశ్నలు అడగరా సార్? సర్దార్ పటేల్ స్టాట్యూ హైట్ ఎంత? రాష్ట్రపతి అవ్వకమునుపు ఆమె ఎక్కడ ఎమ్మెల్యే గా చేసింది?  మొదలైన ప్రశ్నలు అడగరా?" 

"ఇంకా ప్రశ్నలు అడిగే అవసరం లేదు. నీ పేరు ఒక్కటి కన్ఫర్మ్ చేసుకోవాలి. యూ ఆర్ మిస్టర్ గిరిధర్ ఫ్రమ్ హైదరాబాద్. కరెక్టే కదా!"

"సారీ సార్! అతను బయట వెయిట్ చేస్తున్నాడు"

"అయితే నువ్వు ఎవరు?"

"సార్! నేను మీ కంపెనీ పక్కన క్యాంటీన్ లో మేనేజర్ గా చేస్తున్నాను. ఇవ్వాళ ఇంటర్వ్యూలు ఉన్నాయని, టీ, కాఫీలు చెప్పారు. అవి ఎన్ని కావాలి? ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా కావాలేమో కనుక్కుని రమ్మని నన్ను పంపించారు. నేను అదే చెప్పబోతుంటే విన్పించు కోకుండా కూర్చోమని, ఇంటర్వ్యూ చేశారు. 

ఈ ఇంటర్వ్యూ చాలా బావుంది సార్! చాలాఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెప్పండి! ఎన్ని కాఫీలు, టీలు కావాలి? ఎన్ని తీసుకురమ్మంటారు?" అని అడిగాడు అదే నమ్రతతో.


 బోర్డ్ అంతా షాక్


🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

కొత్తావకాయ, కొత్తకాపురం - వేసవి ప్రత్యేకం (20-Apr-23, Enlightenment Story)

 కొత్తావకాయ, కొత్తకాపురం (వేసవి ప్రత్యేకం)

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

బడినుంచి ఇంటికిరాగానే అమ్మని వెతుక్కున్నట్టు అన్నాలకి కూర్చోగానే ఆవకాయ జాడీ ఎక్కడుందో వెతుకుతాయి కళ్లు. వేడివేడిగా కలగూరపప్పు, మువ్వొంకాయ కూర, ముక్కలపులుసూ ఉన్నాసరే, ఆవకాయ కనబడకపోతే ఇళయరాజా పాటలో ఫ్లూటెక్కడా వినబడనట్టు లోటుగా అనిపిస్తుంది. 


ఈలోగా అ ఓమూల ఆలయప్రాంగణంలో పూలచెట్టులా నేనున్నానంటూ ధీమాగా పలకరిస్తుంది పింగాణీ పిల్ల. అసలీ ఆవకాయ జాడీలతో మనకు బోల్డన్ని జ్ఞాపకాలు.

మా చిన్నతనంలో వంటింట్లో నీలంరంగు చెక్కతలుపుల బీరువా తెరవగానే పదునెక్కిన పాతవాసన వచ్చేది. అదో రకమైన ఘాటు. తలుపులు మూసేసి మళ్లీ వెంటనే తెరవాలనిపించేంత వ్యసనం. తీరా తెరిచిచూస్తే  మూతికి గుడ్డ బిగించి కట్టిన పొడవాటి జాడీ ఒకటి అలా నిలువుగా మా పెదనాన్నలా గంభీరంగా కనబడేది... కిందంతా పట్టుపంచెలా తెల్లగానూ, పైనేదో లేతపసుపు ఉత్తరీయం కప్పుకున్నట్టుగానూ!

ఆ జాడీని ఏ పదిరోజులకోసారో చూసేవాళ్లం. దాన్ని పెద్దావకాయ అనేవారు అమ్మానాన్నా గుండ్రంగా, గునగునలాడుతూ మా పెద్దత్తయ్యలా కనబడే చిన్నజాడీ ఒకదాన్ని ఎప్పుడూ అన్నాల దగ్గర పెట్టేది అమ్మ. ఎందుకంటే పెద్దావకాయ తియ్యడానికి మడీ తడీ అంటూ చాలా హడావిడుంటుంది .

ఎవరితోనూ మాటాడకుండా అత్యంత శ్రద్ధతోనూ, ఇంకా బోలెడంత శుభ్రతతోనూ స్టీలు గరిటొకటి పట్టుకుని అమ్మ బయల్దేరిందంటే మా ఇలవేల్పు సినిమాలో కె.ఆర్. విజయని చూసినంత భయభక్తులతో చూసేవాళ్లం. 

అలా తిన్నగా వంటింట్లోకెళ్లి కిడ్నాప్ చేసిన హీరోయిన్‌ నోట్లోంచి గుడ్డలు తీసినట్టు వాసినిగుడ్డ విప్పేది. ఆనక పెద్దజాడీలోంచి చిన్నజాడీలోకి దఫదఫాలుగా ఆరేడు గరిటెల ఆవకాయ నింపుతుండేది. గరిటె బయటపడిన ప్రతిసారీ కమ్మని నూనెవాసన, కళ్లనీళ్లొలికించే ఆవఘాటూ తగిలేవి. ఇక వెల్లుల్లావకాయైతే మధ్యమధ్యలో ఒక్కొక్కటి కనబడి ‘ఏరా, బావున్నావా?’ అని మమ్మల్ని పలకరించుకుంటూ జాడీలోకి జారుకునేవి.

ఇదంతా చూస్తూ ఎదిగాం. 

అసలు ఈ ఆవకాయల కోసం పెళ్లివారిలా నెలముందునుంచీ హడావుడి చేసేవారు నాన్నగారు. బారామాసి కాయలైతే ఊట బావుంటుందని, ఏడాదంతా పాడవదని అవే తెచ్చేవారు. పోనీ ఇప్పట్లా ఆ కాయలవాడి పక్కనే గోనెపట్టా వేసుక్కూర్చుని ముక్కలు కొట్టే అబ్బాయి చేత కొట్టించేవారా? ఎబ్బే! అలాచేస్తే సంతృప్తుండదుట. 

మాయింట్లోది కాకుండా పక్కింట్లోంచి మరో కత్తిపీటో, మర కత్తిపీటో తెచ్చేవారు. అదేంటో పక్కవాళ్ళ కత్తిపీటలే బావుండేవి ఎప్పుడూ! వాటితో ఈయన మొత్తం కాయలన్నిటినీ అరగంటలో తరిగేసేవారు. అప్పుడు పిల్లలం ఐదుగురం శుభ్రంగా ఉతికిన తెల్లటి గుడ్డలొక ఐదు తీసుకొచ్చి ముక్కల బేసిన్ చుట్టూ కూర్చునేవాళ్లం. స్నానం చేయించాక చంటిపిల్లల్ని తువ్వాలుతో తుడిచినట్టు తడిలేకుండా ముక్కలన్నిటినీ తుడిచి ఇచ్చేసేవాళ్లం. జీడిమీద ఉండే పల్చటి పొరల్ని చాకుతోనో, చెంచాతోనో తియ్యడమంటే నాకు భలే సరదాగా ఉండేది.

ఈలోగా అమ్మానాన్నా కారాలూ మిరియాలూ... సారీ, కారాలు, ఉప్పూ కలిపిన ఆవపిండితో సిద్ధంగా ఉండేవారు. ఏళ్లతరబడి అందరి నోళ్లలోనూ నానుతున్న అంబటి సుబ్బన్న నువ్వులనూనె ఓపక్కగా కేజీ సైజు హార్లిక్స్ సీసాలోంచి బంగారంలా మెరిసిపోతూ ఎప్పుడెప్పుడు శివుడి జటాజూటంలోంచి కిందకి దూకుదామా అని ఎదురుచూసే గంగలా ఉండేది. ఆవకాయలో ఒలకగానే ఆత్మానందం దానికి. ఇక ఏడాదంతా ముక్కల్నీ, పిండినీ, మనల్నీ సంతోషంగా ఉంచాల్సిన బాధ్యతంతా తనదే కదా! అక్కణ్ణుంచి ఆ నూనె తాలూకా కమ్మదనం కాస్తా అమ్మదనంలా మారిపోతుంది. 

అబ్బ, ఆవకాయకి ఇంత వర్ణన అవసరమా అని అడుగుతారేమో? అవసరం కాదు. విధాయకం. మా మూడో మేనత్త తన ఏడుగురు కొడుకులకీ పొద్దున్నే ఇంత ఆవకాయేసి గిన్నెడు చద్దన్నం తినిపించేసి బయటికి తోసేసేది. అదే బ్రేక్‌ఫాస్ట్. వీధిలో పిల్లలతో ఆడినంతసేపు ఉత్సాహంగా ఉంటారని, దాని ఉపయోగాలు, పోషకవిలువల గురించి పాఠం చెబుతూండేది. లేకపోతే అంతమందికీ ఇడ్డెన్లూ, దోశలంటూ కూర్చుంటే బట్టలుతకడాలు, అంట్లపనీ, వంటపనీ అయ్యేనా? 

ఇక పెసరావకాయ, మెంతావకాయ, పులిహోరావకాయ అంటూ రకరకాలుగా దశాలంకరణలు చేసినా మెగాస్టార్ మాత్రం ఒరిజినల్ ఆవకాయే! 

చిన్నతనంలో మనం ఉండే మధ్యతరగతి ఇళ్లలో పెళ్లిమాటలైనా, రహస్యాలైనా అన్నీ పిల్లల ఎదురుగానే నడుస్తూ ఉండేవి. అలానే ఊరగాయలు, ఉపవాసాలూ కూడా మనకు ఎలా, ఎప్పుడు, ఎందుకు అనేది బాల్యంనుంచీ తెలుస్తూనే ఉండేవి. ఈ విజ్ఞానానికి అదే కారణం. చదువులదేం ఉంది, తిన్నగా బడికెళితే వంటపడుతుంది. కానీ ఇలా కారాలు, మమకారాలు తెలియాలంటే మాత్రం జీవితాన్ని చదవాలి.

అదృష్టవశాత్తూ తనుకూడా నాలాగే అటువంటి ఒళ్లోనే పెరిగి, అలాంటి బళ్లోనే చదివొచ్చిన ఇల్లాలు. ఇన్నేళ్ల కాపురంలో నేను కోసే కోతల గురించి (నే చెప్పేది మావిడికాయ గురించి) బానే తెలుసుకుంది. అందుకే ఈ ఆవకాయల సీజన్లో ఎప్పుడైనా అలా నోట్లో పెన్నో, కలర్‌నోట్‌లో వేలో పెట్టుకుని ఆలోచిస్తుండగా తనొచ్చి పిలుస్తుంది.

‘ఆల్చిప్పల్లాంటి కళ్లతో...’ అని ఓ రెండు లైన్లు రాయగానే రెండు ఆల్చిప్పలు నాముందు పడేసి మాగాయకి తొక్కు తియ్యమంటుంది. నేనేమో వినయవిధేయరాముళ్లా కూర్చుని చెప్పిన పనల్లా చేస్తోంటే తను టీవీనైన్ వాళ్లలా స్టింగ్ ఆపరేషనొకటి నిర్వహిస్తూ ఫొటోలు, వీడియోలు తీసేసి, వాటన్నిటినీ ‘అరాచక కుటుంబ సమూహం’ అనే వాట్సప్ గ్రూపులో పెట్టేస్తుంది.

‘ఓమూల అమ్మాయి ఉద్యోగం చేస్తోందికదా, ఇంకా ఈ చాదస్తాలేవిఁటి డాక్టర్ గారూ, కాస్త కాస్త ఏ ప్రియా పచ్చళ్లో కొనితెచ్చేసుకుని నాలిక్కి రాసుకోకా?’ అని మీరడగొచ్చు. తనకి నచ్చవు. ఇవేకాదు. దీపావళికి మతాబాలూ అంతే. కూర్చుని కూరతాం ఇప్పటికీ. అది నా సంతోషం. 

ఈ ఆవకాయనేది ఒక్కోసారి ఒక్కో రుచితో మనల్ని అలరిస్తుంది. చద్దన్నంతో తింటోంటే పల్లెటూళ్లో పొలంగట్టుమీద కూర్చున్నట్టనిపిస్తుంది. వేడివేడన్నంలో వెల్లుల్లావకాయ కలిపి తింటోంటే వెంకటేశ్వరస్వామి ఎదురుగా కూర్చున్నట్టనిపిస్తుంది. ఆ క్షణం ఎన్ని జన్మలైనా మనిషిగానే, అదికూడా తెలుగువాడిగానే పుట్టించమని ఆయన్ని వేడుకోవాలనిపిస్తుంది.

ఆవకాయ కలిపిన రోజున ఇంకా ఆ ఘాటదీ పూర్తిగా దిగకముందే ఓ నాలుగుముద్దలన్నం కలుపుకుని తినిచూడండి. కొత్తపుస్తకం అట్టవాసనలా మర్చిపోలేని మధురానుభూతి కలుగుతుంది. చిరుచేదుతో ఆవపిండి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మర్నాటికల్లా అది తన ఉనికిని మర్చిపోయి మావిడికాయతో తల్లీబిడ్డా న్యాయంగా కలిసిపోతుంది. 

ఎంత సంపాదించినా చివరిదశకి కొంత మిగుల్చుకోవాలని చిన్నప్పటి నుంచీ పొదుపూ అదుపూ నేర్పారు మనందరికీ. మనమంతా ఏం మిగుల్చుకోకపోయినా ఆవకాయన్నం తిన్న తరవాత ఓరెండు బద్దల్ని పెరుగన్నంలోకి మాత్రం మిగుల్చుకోవాలి. లేకపోతే ఆ అసంతృప్తి రోజంతా వెంటాడుతుంది. ఇది నిజం.

హొటళ్లలో వెనిగార్ ఆవకాయలవీ తిని అణగారిన ఆశలతో బతుకు జట్కాబండిని లాగే కుర్రాళ్లంతా నామాట విని త్వరగా పెళ్లిళ్లు చేసుకోండి.

కొత్తావకాయ, కొత్తకాపురం బావుంటాయి.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Friday, 14 April 2023

అనారోగ్యం - అరటిదూట (19-Apr-23, Enlightenment Story)

 *అనారోగ్యం - అరటిదూట*  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

*ఒక భక్తురాలికి ఆమె కొడుకు తప్ప వేరే ఆధారం లేదు*

ఆ అబ్బాయికి ఏదో చర్మవ్యాధి వచ్చి వేగంగా శరీరమంతా వ్యాపించి బాధిస్తోంది. వొళ్ళంతా చాలా దురదగా ఉంటుంది ఆ అబ్బాయికి.  బాధ తట్టుకోలేక గోకితే చర్మం పగిలి తీవ్ర రక్తస్రావమయ్యి, పెద్ద పుండు పడేది. ఆ మాతృహృదయం పిల్లవాడి బాధను చూడలేకపొయింది. పరమాచార్య స్వామి దగ్గరకు వచ్చి తన కష్టాలని చెప్పుకుంది. 

*మీ అనుగ్రహం వల్లనే నా కొడుకు వ్యాధి నయం అవ్వాలి పెరియవ. నేను మందుల ఖర్చు కూడా భరించలేని స్థితిలో ఉన్నాను. మీరు తప్ప నాకు దిక్కు లేదు* అని వేడుకుంది. 

మహాస్వామివారు ఆమెను ఆమె కొడుకుని మఠంలోనే ఉండమని చెప్పారు.  ఆ పిల్లవాడితో, *నేను భిక్ష చేసాక మిగిలినది తప్ప నువ్వు ఏమీ తినకు, తాగకు - కాఫీ, టీ, పాలు కూడా ఏమీ తీసుకోకూడదు* అని ఆజ్ఞాపించారు. ఆ తల్లి చాలా సంతోషంతో గురు ఆదేశాన్ని పాటించడానికి అంగీకరించింది.

స్వామివారు శ్రీమఠం వంట బృందానికి కొన్ని సూచనలు ఇచ్చి, తాను మరలా చెప్పేదాకా వాటిని పాటించవలసిందిగా సూచించారు. స్వామివారు కేవలం అరటిచెట్టు యొక్క దూట లోపలి భాగాన్ని మాత్రమే భిక్షగా స్వీకరించేవారు. వంటవాడు అరటి దూటను ముక్కలుగా తరిగి కొంచెం ఉప్పువేసి ముక్కల్ని ఉడికించేవాడు. మహాస్వామి వారు దాన్ని భిక్షగా స్వీకరించి కొద్దిగా మజ్జిగను త్రాగేవారు.  స్వామివారు తినగా మిగిలిన అరటి దూట పదార్థాన్ని, మజ్జిగని ఆ పిల్లవాడికి పెట్టేవారు. 

మొదట్లో అతనికి ఈ భోజనం సహించేది కాదు. కాని తనకి గురూచ్చిష్టం తినే భాగ్యం కలిగింది అని గ్రహించి ఆనందంగా పెట్టింది తినేవాడు. ఒక 10 రోజులయ్యాక దురద మరియు చర్మం పైన ఉన్న మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టసాగాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాధి తగ్గి చర్మం తేటపడి ఆరోగ్యంగా తయారౌతోంది. మండలం రోజులయ్యేసరికి అతని చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యి ఆ పిల్లవాడు కొత్త తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించాడు. 

ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. 

*నా కొడుకు అదృష్టాన్ని ఏమని చెప్పగలను. పూర్వ జన్మ పాప కర్మ వలన ఈ చర్మ వ్యాధి వచ్చింది అని అనుకున్నాను. కాని, పూర్వ జన్మ పుణ్య ఫలం వల్లనే ఈ వ్యాధి వచ్చింది. ఎందుకంటే మండలం రోజుల పాటు ప్రతి రోజూ పరమాచార్య స్వామి ఉచ్చిష్ఠం తినే భాగ్యం ఎవరికి కలుగుతుంది* అని ఆ తల్లి ఆనందపడింది.

"ఇది కేవలం అరటిదూట లోని ఔషధ గుణాల వలన మాత్రమే తగ్గింది" అని మహాస్వామివారు అన్నారు. 

"అరటి దూట ఔషధం అతని బాధను నివారించడానికి ఒక నెపం మాత్రమే. కేవలం మీ ఉచ్చిష్టాన్ని భుజించడం వల్లనే అది తగ్గింది" అని ఆ తల్లి పరిపూర్ణ కృతఙ్ఞతా భావంతో స్వామికి నమస్కరించింది.

||అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం||

||శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Wednesday, 12 April 2023

పోతన భాగవతంలోని నవమస్కంధం (18-Apr-23, Enlightenment Story)

🥀 పోతన భాగవతం లోని నవమ స్కంధం🥀

🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

పూర్వం చంద్ర వంశం లో గాధి అనే క్షత్రియుడు ఉండేవాడు. ఈ దంపతులకు మగ సంతానం కలగాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఇతనికి సత్యవతి అనే కూతురు మాత్రమే జన్మించింది. ఈమెను ఋచీకుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు గాధి.   గాధి కి మగ సంతానం కలగాలనే ఆకాంక్ష తో తన అల్లుడు బ్రాహ్మణుడు అయిన కారణంగా ఆయనతో యజ్ఞాలు జరిపించాలని పూనుకొని ఋచీకుడి తో విషయం చెప్పాడు. ఋచీకుడు తన మామ చెప్పిన మాటలు విని తన భార్య అయిన సత్యవతి కోసం బ్రాహ్మణ మంత్రాలతో, తన మామ అయిన గాధి కోసం క్షత్రియ మంత్రాలతో యజ్ఞాలను విడివిడి గా నిర్వహించి, యజ్ఞ ఫలాలను తయారు చేశాడు.

ఋచీకుడు యజ్ఞాలు పూర్తి చేసి చరువులను (యజ్ఞ ఫలాలను) తన భార్య సత్యవతికి బ్రాహ్మణ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, తన అత్త అయిన గాధి భార్య కు క్షత్రియ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, విడివిడిగా ఇచ్చి స్నానానికి వెళ్ళిపోతాడు.  గాధి భార్య కొంత దుర్బుద్ధి తో ఆలోచించి ఇలా అనుకుంది "ఋచీకుడు తన భార్య కు మంచి లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం జరిపించి మంచి ఫలాన్ని తన భార్యకు, మామూలు లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం గావించి ఆ ఫలాన్ని నాకు ఇచ్చి ఉంటాడు. ఎలాగైనా ఈ యజ్ఞ ఫలాలను తారు మారు చేయాలి" అనుకుంది. తన కూతురు అయిన సత్యవతిని ఒప్పిస్తుంది. సత్యవతి కూడా విషయం తెలియక ఒప్పుకుని తన ఫలాన్ని తన తల్లి కి మరియు తన తల్లి ఫలాన్ని తానూ తారు మారు చేసుకుని సేవిస్తారు.

స్నానం చేసుకుని తిరిగివచ్చిన ఋచీకుడు జరిగిన విషయం తెలుసుకొని తన భార్య కు ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు. ఇలా జరిగినందుకు నీకు (అంటే ఋచీకుడు మరియు సత్యవతీ దంపతులకు) క్షత్రియ లక్షణాలు కలిగిన బాలుడు, మీ అమ్మ (గాధి దంపతులకు) కు బ్రాహణ లక్షణాలు కలిగిన బాలుడు జన్మిస్తాడు అని ఋచీకుడు తెలియజేస్తాడు. ఋచీకుడు, సత్యవతి కోరిక మేరకు జరిగిన తప్పు ను మన్నించి పుట్టబోయే సంతానం లో కొంత మార్పు చేస్తాడు. తమకు (సత్యవతి, ఋచీకుల దంపతులకు) కొడుకు గా కాకుండా మనుమడు గా క్షత్రియ లక్షణాలు గల బాలుడు జన్మిస్తాడు అని చెబుతాడు.  తద్వారా గాధి దంపతులకు జన్మించిన బాలుడు విశ్వామిత్రుడుగా, సత్యవతి - ఋచీకుల దంపతులకు జన్మించిన బాలుడు జమదగ్ని మహర్షి గా ఎదుగుతారు. ఈ జమదగ్ని మహర్షి కుమారుడే పరశురాముడు.

ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే.ఈ మధ్య కాలం లో కులాల పేరుతో చాలా గొడవలు, హత్యలు జరుగుతున్నాయి కానీ వారికి కులం అనేది పుట్టుకతో వచ్చింది కాదు వృత్తి ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అనే విషయం తెలియదు. ఇటువంటి కథలు చదివినపుడు మాత్రమే అసలైన విషయం తెలుసుకుంటారు

పూర్వం సూర్య వంశం లో శ్రాద్ధ దేవుడు - శ్రద్ధ అనే దంపతులకు దృష్టుడు, దిష్టుడు అనే కుమారులు ఉన్నారు. వీరిలో దృష్టుడు పేరుతో దార్జ వంశం అవతరించింది. ఈ దృష్టుడు పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి బ్రాహ్మణుడి గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దిష్టుడు కూడా పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి వైష్యుడి గా పేరు గాంచాడు.

ముగింపు: విశ్వామిత్రుడు, పరశురాముడు, ధృష్టుడు,దిష్టిడు మొదలైన వారి కులాలు పుట్టుకతో నిర్ణయించబడలేదు. వారి వృత్తి ధర్మాన్ని బట్టి వారి కుల నిర్ణయం జరిగింది. 

అంటే ఉదాహరణకు 

బ్రాహ్మణ కులం లో జన్మించిన వ్యక్తి వ్యాపారాలు చేసినట్లైతే వైశ్యుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేస్తే క్షత్రియుడు గా, సేవా కార్యక్రమాలు చేస్తే శూద్రుడు గా పరిగణించవచ్చు. అలాగే శూద్రులు కూడా వేదాలు పఠించడం, పాఠాలు చెప్పడం వంటివి చేసినపుడు బ్రాహ్మణుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేసినపుడు క్షత్రియుడు గా, వ్యాపారాలు చేసినపుడు వైశ్యుడు గా పరిగణించాలి. ఇదే నియమం క్షత్రియులకు మరియు వైశ్యులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించినపుడు కులాల పేరుతో జరిగే గొడవలను మనం ఆపగలము.

గమనిక: పై రెండు కథలు పోతన భాగవతం లోని నవమ స్కంధం లోనివి.

⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ 
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...