☀️ఆత్మవిశ్వాసం☀️
🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻
రాము, తన డిగ్రీ పూర్తయి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటాడు .తన తోటి స్నేహితులందరూ అందరూ ఉద్యోగాల్లో స్థిరపడి పోవడంతో రాము తల్లిదండ్రులు ఎప్పుడూ రాముని బాధ్యతారాహిత్యంగా ఉన్నావ్ అని తిడుతూ ఉంటారు.
అలా రోజులు గడుస్తున్న కొద్దీ రాములో నిరాశ మరీ ఎక్కువైపోతుంది,అనేక చోట్ల తన విద్యార్హత కన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగాల కోసం వెతికినా కూడా, అది కూడా దొరకక చాలా అసహనానికి లోనవుతూ ఉంటాడు.
తనను అమితంగా ప్రేమించే వాళ్ళు ,గౌరవించే వాళ్ళు కూడా తనని మనిషిగా చూడకపోయే సరికి, తనకి విలువ ఇవ్వక పోయేసరికి రవికి చెప్పలేనంత బాధగా అనిపించి. ఈ జీవితం జీవించడం నాకు అవసరమా నేను ఎవరికీ ఉపయోగకరంగా లేను పైగా నా తల్లిదండ్రులకు నేను చాలా భారంగా ఉన్నాను … ఇటువంటి జీవితం నాకు జీవించడం ఇష్టం లేదు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చి రైలు పట్టాల వైపు అడుగులు వేస్తూ ఉంటాడు.
ఒక్కొక్క అడుగు వేస్తూన్న కొద్దీ జీవితంలో జరిగిన అవమానాలు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ముందుకు వెళ్తూ భగవంతుడు నా మొర ఆలకించి నాకు ఒక దారి చూపెడితే ఎంత బాగుంటుంది, అని ఆశ మళ్లీ మళ్లీ కలుగుతూ ఉంటుంది.
ఇంకా ముందుకు… నడుస్తున్న కొద్దీ అతను చిన్నతనం నుంచి ఎంత కష్టపడి చదివింది ,ఎంతమంది తనను ప్రశంసించింది అన్ని గుర్తుకు తెచ్చుకొని ఆకాశం వైపు చూస్తూ భగవంతుడా నువ్వు నాకు కొంచెం సాయం చేసివున్నట్లైతే నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు, ఎందుకూ చేతగాని వానిగా నన్ను ఎందుకు పుట్టించావు అని గట్టిగా ఏడుస్తూ… ఇక చేసేది ఏమీ లేదు అనుకొని అక్కడి నుంచి మరొక రెండు అడుగులు ముందుకు వేస్తాడు. అప్పుడు అతనికి రాము… అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుకకు తిరిగి చూస్తే ఒక వ్యక్తి కనిపిస్తాడు, రాము ఆ వ్యక్తిని గుర్తుపట్టలేక పోయాడు , అప్పుడు ఆ వ్యక్తి రాము దగ్గరకు వచ్చి రాము… నేను ఎవరో గుర్తుపట్టారా అని అడుగుతాడు… లేదండి అని అంటాడు రాము.
అప్పుడు అతను నేను నువ్వు చదువుకున్న కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాను అని చెపుతాడు. అప్పుడు రాము అవునండి నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అంటాడు. అందుకు ఆ వ్యక్తి నువ్వు మొన్న మీ ఫ్రెండ్ పెళ్లి లో పాడిన పాట విని ,ఆ పెళ్ళికి నాతో పాటు వచ్చిన నా పదేళ్ల కొడుకు నీ దగ్గర సంగీతం నేర్చుకుంటానని పట్టుపట్టాడు ,నెలరోజుల నుంచి నీకోసం నేను వెతకని ప్రదేశం లేదు ఎన్నాళ్ళకు నువ్వు నాకు దొరికావు అని ఆనందంగా అంటాడు.
అప్పుడు… రాము అయ్యో నాకు సంగీతం రాదండి అని చెపుతాడు, ఆ మాటవిని అతను ఏమిటీ! సంగీతం రాకుండా నువ్వు అంత శ్రావ్యంగా పాట ఎలా పాడను గలిగావు అంటాడు.అందుకు రాము నాకు చిన్నతనం నుంచి పాటలు అంటే చాలా ఇష్టం ,ఇష్టం కొద్దీ నేర్చుకున్నాను అని చెప్తాడు.
అప్పుడు ఆ వ్యక్తి ఇంత బాగా పాటలు పాడగలిగే వాడివి ఎంత అదృష్టవంతుడివి, నీ అంత అద్భుతమైన కంఠం ఎవరికన్నా జీవితంలో ఉంటే వారు ఎంత ఎత్తైనాఎదుగుతారు.నిన్ను కూడా నేను ఆ స్థానంలో చూస్తానని చాలా నమ్ముతున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అతని మాటలు విన్నాక రాము శరీరం అంతా చల్లగా అయిపోతుంది , అంతసేపు బాధతో విరక్తితో ఉన్న రాము శరీరమంతా ఆయన అనుకూలమైన మాటతో తేలికబడుతుంది.
రాము అక్కడే ఉన్న పెద్ద బండరాయి మీద కూర్చుండి , ఒక్క క్షణం నేను ఆలోచించకపోతే ఎంత అద్భుతమైన జీవితాన్ని చేజార్చుకునే వాడిన, నాలోనూ అంత ప్రతిభ ఉందా… , నేనూ ఇతరులను ప్రభావితం చేయగలనా…. నా లో వున్న ప్రతిభ ఏంటో ఇతరులు చెబితేగాని తెలియనిస్థితి లో నేను ఉన్నానా…
నేను ఈ అద్భుతమైన జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుని దాన్ని అంతం చేద్దామని నిర్ణయించుకున్నాను. అని తనలో తానే అనుకుంటూ ఉంటే ఒక్క క్షణం భయంతో శరీరమంతా ఓణికి పోతుంది, అప్పుడు ఆకాశంవైపు చూస్తూ భగవంతుడా నువ్వు ఉన్నావు… ఈ క్షణంలో నువ్వు నన్ను కాపాడావు, నాకు కనువిప్పు కలిగించి నా జీవితానికి చక్కని మార్గాన్ని చూపించావు అని మనసులో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి, అక్కడి నుంచి సంగీత నేర్చుకుందామ నే ఆలోచనతో ఇంటి వైపు నిశ్చయంగా అడుగులు వేస్తాడు రాము.
Moral🌚🌝 : ఒక ప్రశంస ఆ మనిషి జీవితాన్ని మార్చకపోవచ్చుకాని,అతనిలో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఖచ్చితంగా పెంచుతుంది.
🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼
No comments:
Post a Comment