Friday, 16 December 2022

కాళిదాసుకు పరీక్ష (17-Dec-22,Enlightenment Story)

🎻🌹🙏 కాళిదాసుకు పరీక్ష...!!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

🌿మహాకవి కాళిదాసు ఒకసారితీర్ధయాత్రలు  చేస్తూ వున్నాడు.  మార్గంలో ఒక దగ్గర ఆయనకి దాహంవేసింది.       🌸కాళిదాసు కి కొంచెం కొంచెం దూరంలో ఒక నూతి వద్ద ఒక స్త్రీ నీరు తోడుతూవుండడం కనిపించింది.                   🌿నూతి వద్దకు వెళ్ళి  ఆ మహిళను మంచినీరు అడిగాడు. ఆ మహిళ  కాళిదాసు తో ఇస్తాను..ముందు మీరెవరో  పరిచయం తెలుపండి అని అడిగింది. 

🌸తనెవరో తెలుసుకునేంత గొప్ప స్త్రీ కాదని తలచిన  కాళిదాసుతను ఒక ప్రయాణీకుడునని చెప్పాడు.                  🌿వెంటనే ఆ స్త్రీ ఈ లోకంలో ఇద్దరే ప్రయాణీకులు వున్నారు. వారు సూర్య చంద్రులు నిత్యం ఉదయించడం , అస్తమించడంసదా ఈ పయనంలోనే నిమగ్నమైవుంటారు అన్నది ఆమె.

🌸సరే , నేను ఒక అతిధినిఅన్నాడు కాళిదాసు. ఆమె యీ లోకంలోఇద్దరే అతిధులు వున్నారు.యవ్వనం, సంపద ఈ రెండూ తాత్కాలికమే అందువలన వాటినే అతిధులనవచ్చునుఅన్నది ఆమె.

🌿కాళిదాసు కి ఆశ్చర్యం కలిగినది అయితే, నన్ను  సహనశీలిగా భావించు అన్నాడుకాళిదాసు. దానికి  ఆమె ఒప్పుకోలేదు. 

🌸 లోకంలో ఇద్దరే సహనశీలురు వున్నారు. భూమి, వృక్షము మాత్రమే.భూమిని ఎంత త్రొక్కినా , పండ్ల కోసం చెట్టు మీదకి ఎన్ని రాళ్ళు విసిరినా , ఎంతో సహనంతో  ఓర్పుతో భరిస్తూవున్నాయి అన్నది ఆమె.

🌿కాళిదాసుకి ఓర్పు నశించినది.సరే, నేను మొండి వాడినిఅని అన్నాడు. ఆ స్త్రీ చిరునవ్వుతో, లోకంలో పట్టు వదలని మొండివి రెండే రెండు.*మన గోళ్ళు, శిరోజాలు* మనం కత్తిరిస్తూ వుంటే ఎదుగుతూనే వుంటాయి.

🌸కాళిదాసుకి కోపం మిన్నంటింది.నన్ను ఒక మూర్ఖుడని అనుకో,అన్నాడు. అప్పుడు కూడా ఆమె చలించలేదు.యీ లోకంలో తెలివితేటలు లేకుండా రాజ్యాన్ని పాలించే రాజు, ఆ రాజునిపొగిడే మంత్రి, వీరిద్దరే రెండువిధాలైన  మూర్ఖులవుతారు.అన్నది ఆమె. 

🌿కాళిదాసుకు జ్ఞానోదయమయింది. ఆమె సామాన్య స్త్రీ కాదని గ్రహించాడు. తన వాదం ఓడి పోయినదని ఒప్పుకున్నాడు. ఆమెకి పాదాభివందనం చేశాడు.

🌸అప్పుడే, కాళిదాసును సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసే దృశ్యం సాక్షాత్కరించింది. విద్యాధిదేవత అయిన సరస్వతీదేవి ఆయన ముందు ప్రత్యక్ష మైనది. 

🌿*కాళిదాసా  ! నీవు మేధావివే.. కాని,నిన్ను నీవు  తెలుసుకొన్న నాడే నీవు పరిపూర్ణుడవు. ఎవరైతే తనని తాను గుర్తించుకోలేరో వారు ఉన్నత పురుషులు కాజాలరు*అని ఉపదేశించి కాళిదాసుని ఆశీర్వదించింది...స్వస్తీ..🚩🌞🌹🙏🎻

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂


No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...