Monday, 12 December 2022

దేవుడు ఏరూపంలో వుంటాడంటే (13-Dec-22,Enlightenment Story)

 దేవుడు ఏరూపంలో వుంటాడంటే (13-Dec-22,Enlightenment Story)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

అది ఒక చిన్న హోటల్! చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు హోటల్ యజమానితో అన్నా, అమ్మ పది ఇడ్లీలు తీసుకు రమ్మంది. డబ్బులు రేపు ఇస్తానుఅని చెప్పాడు.ఆ హోటల్ యజమాని “ఇప్పటికే చాలా బాకీ ఉన్నది అని అమ్మతో చెప్పు. గిన్నె ఇలా ఇవ్వు బాబూ సాంబార్ పోసిస్తాను.” అని చెప్పాడు.

ఇడ్లీలు  పొట్లం కట్టి, గిన్నెలో సాంబార్ పోసి ఆబిడ్డ చేతిలో పెట్టాడు.“సరే వెళ్ళొస్తాను, అమ్మకు చెప్తాను!”అని చెప్పి బయల్దేరాడు. అదే హోటల్ లో అన్నీ గమనిస్తున్న ఓవ్యక్తి యజమాని దగ్గరకు వెళ్లి అడిగాడు..”ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు. మళ్ళీ ఎందుకండీ ఇచ్చి పంపారు?” అని.

ఆయజమాని… “ఆహారమే కదండీ నేను ఇస్తున్నది. పెట్టుబడి పెట్టి నేను నడుపుతున్నది. కానీ ఇటువంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు!  ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తాయండి. కాకపోతే కాస్త లేటుగా ఇస్తారు అంతే! అందరికీ డబ్బులు అంత సులభంగా దొరకవు. బిడ్డ ఆకలితో అడిగుంటుంది అందుకే పంపారేమో!”

”నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. నాది కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి, ఎలాగైనా నాకు వస్తుందండి, మోసం చేయరు. కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది కదండీ అది ముఖ్యం!”

”నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆతల్లికోసం దొంగతనం చేయొచ్చు, లేదా ఆ తల్లి ఆ బిడ్డను బిక్షమెత్తడానికి పంపవచ్చు! లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు! ఇప్పటికి నేను నష్టపోవచ్చు కానీ సమాజంలో జరిగే మూడు తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే!” అన్నాడు.

ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి.దేవుడు లేడని ఎవరండీ చెప్పేది?ఇలాంటి వారి మనస్సులో ఉన్నాడండి. వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి. ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం కచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటే వస్తారు. మనకు మించిన సహాయం చేయమని చెప్పడంలేదు… మనకు ఉన్నదాంట్లో చిన్న సాయం అయినా చాలు అంటున్నాను.✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...