🌺*సంపూర్ణ అన్నవరం - స్థలపురాణం*🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య, శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందినారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నాకరుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామ చంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారాడు రత్నాకరుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసి రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారాడు
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోర్సా గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామరాయణిం బహద్దరు రాజా ఐ.వి.రామరాయణం వారి ఏలుబడిలో ఆరంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియ,మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి అంతర్ధానం అయ్యారు
మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, అన్నవర గ్రామదేవత,స్వామి ఆవిర్భవానికి సంకేతం గ పూర్వమే వేలసిన నేరేల్లమ్మ కి నమస్కరించి, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటకే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (. కృష్ణకుటజము),కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాపై,విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు.
ఆలయాన్ని శాలివాహన. శ. 1934 లో బ్రహ్మశ్రీ అద్దేపళ్లి కృష్ణశాస్త్రి గారు ప్రముఖ కాశి పండితులు చే నవాఆవారణ ,సహిత విష్ణుపంచాయతన, పూర్వకంగా ప్రతిష్ఠించారు ,పంచాయతనానికి, ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నముగ శూల శిఖరములతో ఉన్నాయి. పై చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు గల గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. పంపాతి అనే స్త్రీ తపస్సు చేసి పంపా(తీర్ధం)నదిగా ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది, నిత్యం స్వామి కి జరిగే అర్చనలు ఈ నీటితోనే నిర్వహిస్తారు,
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండడం , ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభాని అనుకుని మండపం ఉంటుంది. ఈ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూవుంటుంది
కొండ దిగువున కనకదుర్గమ్మ పాదచారులకు రక్షణ గా కాపాడుతుంది, స్వామి మెట్లు మార్గం మొదటి లో స్వామి దివ్య పాదములు చెక్కబడి వున్నాయి
స్వామి,ఆలయం రెండు అంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద్విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది. ఆ యంత్రం లో అనేక దేవతలు 13 ఆవరణలో వుండి ఇక్కడ స్వామి ని సేవిస్తూ, భక్తులకను అనుగ్రహిస్తున్నారు
ఇక్కడ అమ్మవారు అనంత లక్ష్మి సత్యవతి గ ఉపాసనాపరులకు ఆద్యాది మహాలక్ష్మి గ దర్శనమిస్తూవుంటారు,ఇక్కడ శైవ,వైష్ణవ అభేదంగ ఒకే పీఠం పై హరిహరలు దర్శనమిస్తూ అదైత మూర్తి గ దర్శించ వచ్చు
శ్రీ సత్యనారాయణ స్వామివారిని
" మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతశ్చ మహేశ్వరం, అధతో విష్ణురూపాయ,, త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.
ఇక్కడ స్వామి వ్రతం ఆచరించిన వెయ్యి క్రతువు ల ఫలం ,ప్రతి నిత్యం తనని శిరము మోస్తున్న భక్తునికి స్వామి స్వయంగా కొండ దిగి కార్తికపౌర్ణమి నాడు ప్రదక్షిణం చేసి అనుగ్రహిస్తున్నారు ,రత్నాకరుడు ని స్మరిస్తూ
కొండకి (రత్నాకరుడికి) నమస్కరించి స్వామిని దర్శించుదాం స్వామి కృపకు పాత్రులు అవుదాం. భక్త రత్నాకరుడులా మనం కూడా స్వామిని సేవిద్దాము.
🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼