Friday, 27 January 2023

శనివారం రథ సప్తమి సందర్భంగా (28-Jan-23,Enlightenment Story)

 🌞 *శనివారం రథ సప్తమి సందర్భంగా, 28-Jan-23*🌞

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

!!మాఘ మాసే శుక్ల పక్షే సప్తమ న్యాద్ర దస్యతు!!తత్ర స్కానాంచ దానాంచ తత్పర్యం చాక్టయ మబ్రవీత్!!

మాఘమాసం శుక్ల పక్ష సప్తమినే రథ సప్తమి అంటారు. సూర్యభగవానుడు రథాన్ని అధిరోహించి భూమికి దగ్గరగా వస్తాడు. అంతకు ముందు కొద్ది రోజుల నుండే, అంటే మకర సంక్రమణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ మవుతుంది.

ఉత్తరాయణం ప్రవేశించగానే మొట్ట మొదట వచ్చే శుద్ధ సప్తమే రథసప్తమి. సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణిస్తాడు. ఈ రథసప్తమినుండే ఆయన శక్తి సంపూర్ణంగా భూమిపై విస్తరించి ఉంటుంది. సూర్యుడు జన్మించిన రోజును రథ సప్తమిగా ఆచరిస్తున్నారు. ఆయన ప్రత్యక్ష నారాయణుడు రథం మీదే లోక సంచారం చేస్తూ భూమిపై ప్రజలందరకీ ఆరోగ్య ప్రదాతగా, ఐశ్వర్య ప్రదాతగా గోచరిస్తున్నాడు.

నమో రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మను సప్తమ తన్మే రోగం, శోకం, మాకరీ హంతు సప్తమీ ఏత జ్జన్మ కృతం పాపం, యజ్జన్మాంత రార్జితమ్ మనో వాక్కాయజం, యచ్చజ్ఞాతా జ్ఞాతేచ యే పునః ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్త కే సప్త వ్యాధ సమాయుక్తం, హరమాకరీ సప్తమీ

రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు శిరస్సుపై ఏడు జిల్లేడు. ఆకులను, రేగి పళ్ళను పెట్టుకొని ఈ శ్లోకం చదవాలి. అలా చేయడం వల్ల సకల పాపాలు పోయి, ఆరోగ్యంసిద్దింస్తుంది. రథానికి ఉన్న ఏడు గుర్రాలు ఏడు రోజులకు సంకేతంగా చెపుతున్నారు. యోగ శాస్త్ర ప్రకారం మనశరీరమే రథం. అశ్వాలు ఇంద్రియాలు. బుద్ధి రథసారథి. మనస్సు పగ్గాలు. మాఘమాసంలో ప్రతీ ఆదివారం మన ఇళ్ళల్లో సూర్య కిరణాలు పడేటట్లుగా, బియ్యంతో పరమాన్నం వండి ఆర్పిస్తారు. మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఎంతో మహిమాన్వితమైన ప్రసాదం ఆయువు వృద్ధి, సకల సౌభాగ్యాన్ని సమకూరుస్తుందని పురాణాలు విశదీకరిస్తున్నాయి.

సూర్యుడు త్రిశక్తి స్వరూపుడు. శ్రీఆదిత్య స్తోత్రంలో  

బ్రహ్మ స్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః

సంధ్యా కాలే స్వయం విష్ణుః స్త్రయీమూర్తి దివాకరః

అని మూడు సమయాలలో తన తేజస్సుతో ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యేకంగా రథ సప్తమి రోజున కూడా ఆదివారంలో లాగానే పరమాన్నం తయారుచేసి, చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి, ఆ సూర్య భగవానుని ఊరేగిస్తారు. సూర్య స్తుతి చేస్తారు. ఇంత ప్రాధాన్యత రథసప్తమికి ఉంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాతే కాదు. ఏది కోరితే అది ఇవ్వగల సమర్థుడు. పంచ పాండవులు అరణ్య వాసానికి వెళుతున్నప్పుడు పురజనులు, హితులు, మహర్షులు వెంట వస్తున్నప్పుడు, వారికి అతిథి మర్యాదలు, ఆహారం సమకూర్చడానికి మానసికంగా ఆలోచిస్తుంటే, వాళ్ళ పురోహితుడు, బోధించిన సూర్య అష్టోత్తర శతనామావళి చెప్పగానే ధర్మరాజు సూర్యుని ప్రార్థించగా "అక్షయపాత్ర" ఇచ్చిన సంగతి మనకు తెలుసు. సత్రాజిత్తు సూర్యోపాసన చేస్తే శమంతకమణిని ప్రసాదించినట్లుగా, వినాయక చవితి కథలో మనం చదువుకుంటాం. కర్ణుడుకి సహజ కవచ కుండలాలను ప్రసాదించాడు. శ్రీరాముడికి అగస్త్య మహర్షి సూర్యుని స్తుతి "ఆదిత్య హృదయం" బోధించడం వల్ల, శ్రీరాముడు శక్తిమంతుడై, రావణాసురుని యుద్ధంలో ఓడించాడు. ఆదిత్య హృదయం చాలా శక్తివంతమైనది. ఆరోగ్యాన్ని సమకూర్చేది. ఒక సారి ఆంధ్రప్రదేశ్ నుండి శృంగేరి పీఠాధిపతి దర్శనానికి వెళ్ళిన భక్తుడు, స్వామి ని దర్శించి, "తనకు చాలా రోజులనుండి అనారోగ్యంగా ఉంటోంది. వైద్యం చేయిస్తున్నా, కుదుట పడుటలేదు. తమరు ఏదైనా మంత్రోపాసన కాని, దీక్ష కాని చెపుతారని" అనగానే పీఠాధిపతి శ్రీశ్రీభారతీ తీర్థ మహా స్వామిజీ భక్తునితో “నిర్మల భక్తితో ప్రతీరోజూ ఆదిత్య హృదయం పదకొండు సార్లు, మండలం ( 40 రోజులు) పారాయణ చేయమని చెప్పారు. సంవరానికి ఆభక్తుడు సంతోషంగా స్వామిని దర్శించి, తనకు పూర్తి స్వస్థత చేకూరినట్లు తెలిపాడు.

ఒకసారి నారద మహర్షి యాదవులను సందర్శించిన సందర్భంలో, వారంతా లేచి, మహర్షిని గౌరవించారు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు, జాంబవతిలపుత్రుడు సాంబుడు, మహర్షిని గౌరవించలేదు. దాంతో నారదుల వారికి కోపం వచ్చి "నువ్వు కుష్టు రోగంతో బాధపడతావు" అని శపించాడు. కొద్ది కాలానికి, సాంబుడు కుష్ఠురోగంతో బాధపడలేక, తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు మధ్య భారత దేశంలోని చంద్రభాగ నదీ ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని సూర్యోపాసన నిష్ఠగా భక్తితో చేయగా రోగం మాయమైంది. ఆయన ద్వారా నే మనకు ద్వాదశాదిత్యుల స్థుతి, సూర్య నమస్కారాలు వంటివి ఎన్నో లభించాయి. ఆంజనేయునికి వేదవిద్యను బోధించాడు. గాయత్రీ మంత్రానికి అధి దేవత సూర్యుడే. అందుకే సంధ్యా వందనం చేస్తారు. సూర్యభగవానుడి కిరణాలు వల్ల చర్మరోగాలు నయమవుతాయి. కంటి జబ్బులు, గుండె జబ్బులకు సూర్యోపాసన పరిష్కారం చేస్తుంది.

మధ్య భారత దేశంలో భద్రేశ్వరుడు అనే రాజు అందగాడు. రాజ్యపాలన సమర్థవంతంగా చేస్తున్నాడు. ధర్మాత్ముడు. అయినా ఆయనకు శ్వేత కుష్టు రోగం (బొల్లి ) శరీరం అంతా వ్యాపించింది. మనోవ్యధతో రాజ్యాన్ని కుమారులకు అప్పగించి, తన పురోహితుల సూచన మేరకు కాశీ క్షేత్రం వెళ్ళి, సూర్యోపాసన గురువుల ద్వారా ఉపదేశం పొంది, బీజాక్షర మంత్ర సహితంగా సూర్యుడిని ఆరాధించాడు. సూర్యుడు ప్రత్యక్షమై సంపూర్ణ ఆరోగ్యంతోబాటు తదనంతరం సూర్య లోకానికి వస్తావని వరమిచ్చి అంతర్థానమయ్యాడు. భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ 

ఆదిత్యానా మహం విష్ణుః జ్యోతిషాం రవి రంశుమాన్

మరీచి రతామస్మి నక్షత్రాణాం మహం శశీ

ద్వాదశాదిత్యులలో విష్ణువు అనే ఆదిత్యుడను నేనే అనిచెప్పాడు. భాగవతం 12వ స్కంధంలో ద్వాదశాదిత్యుల గురించి వివరణ ఉంది. ఒక్కోనెలలో ఒక్కో పేరుతో సూర్యుడిని ఆరాధిస్తారు.

ఆ పన్నెండు నెలలలో ఉండే వారే ద్వాదశాదిత్యులు. 

1. ధాత (చైత్రం) 2. ఆర్యముడు ( వైశాఖం ) 3. మిత్రుడు (జ్యేష్ఠ) 4. వరుణుడు. (ఆషాఢం) 5. ఇంద్రుడు (శ్రావణం) 6. వివస్వంతుడు (భాధ్రపదం) 7. త్వష్ట (ఆశ్వీయుజం) 8. విష్ణువు (కార్తీకం) 9. అంశుమంతుడు (మార్గశిరం ) 10. భగుడు (పుష్యమాసం) 11. పూషుడు (మాఘమాసం) 12. క్రతువు ( పాల్గుణం) ఇలా భవిష్యత్ పూరాణం, పద్మపురాణం, సాంబుడు ఉప పురాణం చదివితే సూర్యోపాసన గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.

సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్

శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


🌞 శ్రీ సూర్య నారాయణ దండకం 🌞

శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ  || 2 సార్లు

ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా

నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా 

మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా ||

పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా

మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య

దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార

గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి

ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి ||

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు

వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు

సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ

మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి

కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి

నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో ||

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక

శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప

నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ

భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు

ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత

నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు

నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా ||

శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్

స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి

విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్

కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా

నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ||

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...