Tuesday, 24 January 2023

భద్రాద్రి రామదాసు జయంతి (25-Jan-23,Enlightenment Story)

 *భద్రాద్రి రామదాసు జయంతి*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

వాల్మీకి శోకమే నాడు రామాయణ కావ్యానికి కారణమైంది. ప్రభుత్వం సొమ్ముతో గుడి కట్టించినందుకు జైలు జీవితం గడిపిన రామదాసు శోకం నుంచి బయటకు వచ్చిన కీర్తన భద్రాచల సీతారామలక్ష్మణులు తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా ఉండేందుకు తోడ్పడ్డాయి. నిరుపమాన భక్తులు లౌకిక వాసనలతో ఉన్న ఈ ప్రపంచం దృష్టిలో పిచ్చివారిగా కనిపిస్తారు. కోపంతో ఉగిపోతారు. నింది స్తారు, అద్భుతంగా స్తోత్రం చేస్తారు. చిత్రాతిచిత్రంగా ఉంటారువారు. అలాంటివారిలో ఒకడు కంచర్ల గోపన్న, భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ, పలవరిస్తూ పాడిన ప్రతి తెలుగు పలుకు ఒక అమృత గుళిక.

శ్రీరాముడు హిందువులందరికీ ఆరాధ్యదైవం. అందులో సందేహం లేదు. అయితే సీతారామలక్ష్మణులను తెలుగు ముంగిళ్లలోకి తీసుకొచ్చి మరింత దగ్గర చేసిన ఘనత రామదాసుగా ప్రసిద్ధులైన కంచర్ల గోపన్నదే.

రామనామ మహిమ వల్ల మరి జన్మం డదు అని నమ్మినవాడు గోపన్న. 'శ్రీరామ నీ నామమేమిరుచిరా! ఓరామ నీనామమెంత రుచిరా! అని ప్రేమరూపమైన భక్తి ముక్తి రూప మైన బ్రహ్మానందంగా భావించి తాదాత్మ్యం చెందాడు. తాను శ్రీరామచంద్రుని కాలంలో పుట్టకపోతినే అని బాధపడ్డాడు. అప్పుడే నేను ఉంటే రామునికి జానకికి వివాహంలో శేషబి య్యం తెచ్చి ఉండేవాడిని. వారికి అడపకాడుగా ఆకులు మడచి తాంబూలాలిచ్చేవాడిని. కైకేయిని అడ్డుకునేవాడిని. అమ్మనెత్తుకుపోతే ఆమె జాడ తెలిపి అయ్య దుఃఖం మాన్పేవాడిని కదా అని పలవరిస్తూ పరితపించాడు. గోపన్న భక్తి, జ్ఞానా , కాల, స్థితి భేదం లేనివి. తన భక్తిని లు అవస్థా! సాధారణీకరించారు రామదాసులవారు.

చెరసాలలో ఉన్నా నాకేం తక్కువ అంటూ 'చక్రధారియే చెంతను ఉండగా' అంటూ ధైర్యం ప్రకటించాడు. మోక్షమివ్వకుండా ఎన్నాళ్లు నన్ను పట్టించుకోకుండా ఉంటాడా అని అసహ నం ప్రదర్శించాడు. అంతేకాదు 'పలుకే బంగా రమైందే ఎంత వేడినగాని సుంతైనా దయరాదు. పంతము చేయనేనెంతవాడను తండ్రీ!' అని విన్నవిస్తాడు. నేచేసిన నేరములేమి నీకు గుడి కట్టించటమే నేను చేసిన తప్పా సరేగాని నా తప్పులన్నీ క్షమించు ఓ జగన్నాథా నన్ను రక్షించు అన్నాడు. కడుపున పుట్టిన కొడుకు ఏవో దుడుకు పనులు చేసాడని తండ్రి కోప్పడతా. డంతేగా ‘కొడుకా రమ్మని చేకొను గాని నూతిలో పడవేయునా ఎంత పాపాత్మ కుండైన ' అంటాడు. 

ఇంతకీ ఎక్కడికెళ్లాడో ఆ భద్రాద్రి వాసుడు. ఎక్కడ ఉన్నాడో నా పాలిదేవుడు అసలు జాడేమి తెలియడంలేదు. 'నాడు గజేంద్రుని కీడు బాపినవాడు' ఆ భద్రాద్రి యందు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనపడడు, ఉన్నాడోలేదో భద్రాద్రియందు. ఎలా భరించనయ్యా ఈ బాధలెలా తట్టుకునేది ఒక్కసారి కనపడ వయ్యా ఎందుకు నన్ను మోసం చేస్తావు వంచన చేయక నన్ను రక్షింపవే వారిజదళ లోచన స్వామి' అన్నాడు. నేనంత ద్రోహినా 'నీకు శర చాపశక్తులు దప్పెనా, నీ ధైర్యము జలధిలో జొచ్చెనా చక్రం. పట్టిందెందుకు దాస జనుల రక్షించడానికే కదా. 'ఎందుకు నాపై దయ చూపవు అన్నాడు. మరో చోట ఈ భవసాగరాన్ని ఈదలేకపోతున్నాను ఏతీరుగ నను దయ జూచెదవో' అని రాముని పరిపరి విధాల వేడుకుని విసిగి వేసారి పోయా డా రామ భక్తుడు. మరో సందర్భంలో ఇదిగో నిన్ను పూజించిన ఈ చేతుల్ని కట్టేసి కొట్టారు. ఎంతసేపని ఓర్చుకు నేది. ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నా వంటే నేనెవరివాడను నువ్వే చెప్పు. నీ వాడినా కాదా? నిన్న రాత్రి చిటికెన వేలికి తేలు కుట్టింది 'పాహిమాం శ్రీరామా' అంటే అసలు ఉలకూ పలుకూ లేదు. అని ఉక్రోషంతో అంటాడు. 'నిందలనెడబాప వయ్యా' అంటూ నా అప్పులు నీవు కడితే అప్పులోళ్లు నీ వెంట పడతారని దాక్కున్నావా దొరా! అంటూ మనం మన సన్ని హితునితో అబ్బ ఈ దెబ్బలను తాళలేనురా తండ్రీ అంటూ తాను సీతారామలక్ష్మణులకు చేయించిన ఆభరణాల చిట్టా కూడా చదివాడు 'నీ గుడికి ప్రాకారం కట్టిచ్చా, సీతమ్మకు చింతాకు పతకం, నీకు కలికితురాయి, లక్ష్మణునికి బంగారు మొలత్రాడు అని లెక్క చెప్పాడు. ఇవన్నీ ఎవరిచ్చారు నీ అబ్బ ఇచ్చాడా, లేక నీకు పిల్లనిచ్చిన మామిచ్చాడా! నేనే కదా ఇచ్చింది? అని గద్దించాడు. మరు నిముషంలో 'అబ్బా. అని తిట్టానని కోపమా స్వామి ఈ దెబ్బలకోర్వ లేక అబ్బ తిట్టితినయ్యా ఏమనుకోకు' అంటాడు. ఒక సందర్భంలో 'నీతో మోహమాటమేమిటి? అడుగుదాటి కదలనియ్యను అంటాడు. నాకభయమియ్యక ఎలా వెళతావో చూస్తాను అంటాడు. అయితే చివరి కంటాడు 'నీచేతేమి కాదుగా సీత భామకైనా చెప్పరాదుగా అమ్మకే. చెబుతాను అంటాడు. అమ్మవారిని వేడాడు. ఆమె హృదయం నవనీతం కదా. అయ్యగారి వద్ద పని కాకపోతే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడంలోకరీతి. 'నాదు మనవి గైకొని జగజ్జనకునితో తెల్పవే ఓ జననీ' అని వేడుకున్నాడు. అమ్మా! రామచం ద్రుల వారు, మీ ఆయన గారు నా గురించి అసలు పట్టించుకోవటం లేదు నువ్వెనా చెప్పవమ్మా అంటూ 'నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, వారు నీ పక్కన కూచుని 'ఏకాంతమయున ఏక శయ్యపై నుండు వేళ్ళ నెలతరో నాబాధలు ఆయన తలకెక్కేలా చెప్పు తల్లి” అంటాడు. మా అమ్మవని కదా. నిన్నడుగుతున్నాను అంటాడు. నిజంగా రామదాసు వేసిన ఎత్తు ఫలించినట్టయింది. సీతమ్మ రాముల వారికి రామదాసు గురించి చెప్పే ఉంటుంది. సాక్షాత్తు రామలక్ష్మణులే బంట్లుగా వచ్చి పైకం చెల్లించి తానీషాకు చెల్లించి రామదాసును చెర నుంచి విడిపించారు.

సీతారాములను తన పదాలతో ప్రతి తెలుగింటా ప్రతిష్ఠ చేశాడు గోపన్న. రామచం ద్రునితో మొర పెట్టుకున్నా,మాట్లాడినా, పోట్లా డినా, రామదాసు ప్రజల బాషనే వాడాడు. ఆయనది ప్రజా సంగీతం. పండితపామరు లను రంజింపజేసే ఆయన భక్తి బావనలు తెలుగు ప్రజలు ఊరూరా అమృతగానంతో నేటికీ స్మరించుకుంటున్నారు.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...