Saturday, 23 March 2024

చిలుక తెలివి (24- Mar-24, Enlightenment Story)

 *చిలుక తెలివి*

🌺🍀🌺🍀🌺🌺🍀




వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్చగా ఉండే చిలుకకు పంజరంలో వుండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగయినా సరే ఈ చెరనుండి బయటపడాలని అది నిశ్చయించుకొన్నది. ఆలోచించగా ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటీ లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి మూడు నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటినిజం చెబుతాను అదినీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అదికూడా నచ్చితే కొబ్బరిచెట్టుమీద కూర్చోవడనికి నాకు అనుమతి ఇవ్వాలి.

అప్పుడు మూడవ నిజంచెబుతాను. అదికూడా నచ్చితే నాకు స్వేచ్చను ప్రసాదించాలి. సరేనా! అని, వ్యాపారిని అడిగినది. దీనికి వ్యాపారి వప్పుకొన్నాడు. చిలక మొదటినిజం ఇలాచెప్పినది. ఏది పోగొట్టుకొన్నా భవిష్యత్తు మిగిలే ఉంటుంది. ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు. వ్యాపారికి ఈ సలహా నచ్చినది. చిలుకను డాబా మీదుకు వెళ్ళమన్నాడు. రెండవ సలహాగా చిలుక ఇట్లు చెప్పినది. ఏదయినా సరే నీకళ్ళతో నీవు చూచేదాకా నీవు నమ్మద్దు, వ్యాపారికి ఈ సలహా కూడా నచ్చింది. చిలుక కొబ్బరిచెట్టు కొసన కూర్చుంది. మూడవ సలహా చెప్పమని వ్యాపారి అడిగాడు. అప్పుడు చిలుక నాకడుపులో రెండు వైఢూర్యాలున్నాయి. నా కడుపు కోస్తే అవి లభ్యమవుతాయి అంది.

దాంతో వ్యాపారికి కలవరం పట్టుకొంది. అయ్యయ్యో! చిలుకను పట్టుకోలేనే! అనవసరంగా రెండు వైఢూర్యాలూ చెయ్యిజారిపోయే! అని బాధపడ్డాడు. చిలుక అందనంత ఎత్తులో ఉంది. ఎలాగైనా చిలుకను పట్టుకోవాలని వ్యాపారి అనుకొన్నాడు. అప్పటికే వ్యాపారి ధోరణిని గ్రహించిన చిలుక నవ్వుతూ వ్యాపారితో ఇలా చెప్పింది. నీకు రెండు సలహాలు ఇచ్చాను. అయినా నీవు పాటించలేదు. ప్రాణంతో సమానమైనది పోయిన బాధపడకూడదని చెప్పాను. వైఢూర్యాలు పోగొట్టుకుంటున్నానే అని బాధ పడిపోతున్నావు. అలాగే నీకళ్ళతో నీవు చూచే వరకు నమ్మవద్దని చెప్పాను. కానీ నీవు అలా చేయడం లేదు. నా కడుపులో వైఢూర్యాలున్నా యని చెప్పడంతోటే ఒకటే కలవర పడుతున్నావు. నాకడుపులో వైఢూర్యాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఉంటే నేనెలా బ్రతుకుతాను? సలహాలు పాటించనివారికి సలహాలివ్వకూడదని పెద్దలిచ్చిన సలహాను నేను మరచిపోలేను. ఇ ది నా మూడవ సలహా, వస్తాను అంటూ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. వ్యాపారి మొహం సిగ్గుతో చిన్నపోయింది.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday, 22 March 2024

అసలైన ఆనందం మనలోనే ఉంది (23- Mar-24, Enlightenment Story)

 అసలైన ఆనందం మనలోనే ఉంది

🌺🍀🌺🍀🌺🌺🍀

బయటి ప్రపంచంలో ఎంత సాధించినా ఎన్ని సాధించినా మరుక్షణమే అవి పాతబడిపోయి సాధించినప్పుడు ఉన్న ఆనందం మరుక్షణమే కనుమరుగైపోతుంది. అంతలా మన చుట్టూ ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి. అందుకోవాల్సిన వాటికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. ఫలితం వెంటనే మొహం మొత్తేస్తుంది.



ఇది సాధిస్తే నా జీవితం ధన్యం అనుకుని దానికోసం తీవ్రంగా శ్రమించి సాధిస్తే తీరా మరుక్షణమో లేక మరొకరోజో మరొక లక్ష్యం వచ్చి చేరుతుంది. ఇలా ఎన్నో లక్ష్యాలు ధన్యం అయినట్టే అనుకున్నవి. కాని ఎన్ని సాధించినా వాటి ఆనందం ఈరోజు ఉందా! ఉందా! అంటే లేదనే చెప్పాలి.

 *ఎందుకంటే అసలైన ఆనందం మనలోనే ఉంది. ఇది ఎలా తెలుసుకోవడం?*


ఏదైనా ఉంటేనే కనబడుతుంది. లేకపోతే లేదు. ఇదే కదా సూత్రం. అలానే నీలో ఉన్న భావతరంగాలు అంటే సంతోషం, దుఖం, ఆనందం, బాధ సుఖం, ఇవన్ని నీలోనే ఉన్నాయి. అవి సందర్భాన్ని బట్టి ప్రకటితమౌతున్నాయి. వస్తువే లేకపోతే తీసుకోవడానికి ఏమీ ఉండదు. ఈ భావాలు నీలో నిగూఢంగా ఉన్నాయి కనుక ఆయా సందర్భాలను బట్టి అవి వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా అనారోగ్యం వస్తే మందులు వేసి ఆరోగ్యం బాగుచేశామని చెప్తారు. నిజానికి ఆరోగ్యం ఉంది. మందు వేసింది అనారోగ్యానికే. వ్యాధి నయం చేశారు అంతే. ఆరోగ్యం చెడిపోవడం బాగుపడటం ఉండదు. శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు ఔషదం ఇచ్చి వ్యాధి తగ్గిస్తారు.

నిజానికి ఆనందం నీలో ఉంది. కాకపోతే ప్రాపంచిక వ్యవహారాలతో మనస్సుని మలినం చేసుకొని ఆనందం అంటే ప్రపంచంలో ఫలానా సాధిస్తేనే దొరుకుతుంది అనే ఒక భ్రమలో పడిపోయారు. ప్రపంచంలో ఏమీ లేదు. ఉన్నదంతా నీలోనే ఉంది. ప్రపంచాన్ని చూసి ఇలా ఉంటే సుఖం, ఇలా ఉంటే దుఃఖం, ఇలా ఉంటే సంతోషం, ఇది సాధిస్తే ఫలానా అని లోనే కొలువై ఆనందానికి దూరంగా వెళ్ళిపోతున్నారు.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday, 21 March 2024

గౌరవం (22-Mar-24, Enlightenment Story)

 గౌరవం కథ

🌺🍀🌺🍀🌺🌺🍀

20 ఏళ్ళ క్రితం Hyderabad  Branchmanager గా Transfer అయ్యాక మా పాప పెళ్ళికి, మా office staff అందరిని ఆహ్వానించాను. వచ్చిన వాళ్లందరూ తలో కానుక ఇచ్చి ఆశీర్వదించి వెళ్లారు నవ వధూవరుల్ని

పెళ్లి హడావిడి అంతా తగ్గాక, తిరిగి office కి వెళ్ళాక  మా office watchman వెంకట్రాముడుని పిలిపించి అడిగాను,వెంకట్రాముడు గారు,మీరు సతీసమేతంగా మా కూతురు పెళ్ళికి రావడం, ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. .కానీ  కానుకగా మీరు ఇచ్చిన 10గ్రాముల బంగారు గొలుసు ఇవ్వడం మీకు తలకు మించిన భారం అవ్వలేదా? అసలు అంత విలువైన కానుక మీకు ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడిగాను తాను కానుకగా ఇచ్చిన బంగారు గొలుసును తనకే తిరిగి ఇచ్చివేస్తూ…


కానీ వెంకట్రాముడు, నా చేతినుండి దూరంగా తన చేతిని తీసుకుంటూ, అయ్యా, కానుకను తిరిగి ఇచ్చి నన్ను అవమానపర్చొద్దు. నా ముప్పయి ఏళ్ళ service లో నన్ను “గారు”  అని కానీ “మీరు”  అని  కానీ పిలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్క మీరు తప్ప! !కానీ, పొద్దున్న మీరు office కి enter అయ్యేప్పుడు ప్రతీ రోజూ పలకరిస్తారు నన్ను Good morning వెంకట్రాముడు గారు, బాగున్నారా? అని .మీ పలకరింపు వినడానికే నేను ,మీకన్నా ముందే వచ్చి gate దగ్గర నిలబడుతాను. ..

మనిషి వృత్తిని బట్టి కాక, మనిషికి గౌరవం ఇచ్చే మీలాంటి గొప్పోడి కడుపున పుట్టిన బిడ్డకు నేను ఎంతటి కానుకలు ఇచ్చినా  గొప్పవేం కాదు సార్

మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు. కానీ, మా ఆత్మగౌరవం నిలబెట్టే మీలాంటి మర్యాదస్తులకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాం సార్ .దయచేసి కాదనకండీ అంటూ దండం పెట్టి
కళ్ళనీళ్లతో వెళ్ళిపోయాడు.


ఒక మనిషికి గౌరవం ఇస్తే, ఇంత ప్రేమిస్తారా, అభిమానిస్తారా? అని నాలో నేను ఆలోచనలో పడ్డాను. అవును, నిజమే కదా, వేంకటరాముడు చెప్పింది .మనిషి వృత్తిని బట్టి కాదు, సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తే చాలు. ప్రేమిస్తే చాలు ఖచ్చితంగా లక్షలరెట్ల ప్రేమ తిరిగి మన పైన వర్షిస్తారు. మీరుకూడా దయచేసి గౌరవించండి,

మనం సాటిమనిషిని ఎవరి నైనా గౌరవించాలి.గౌరవం హోదాని బట్టీ ఇచ్చేది కాదు అని నా ఉద్దేశ్యం.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday, 20 March 2024

పిల్లలు దైవ స్వరూపాలు (21-Mar-24, Enlightenment Story)

పిల్లలు దైవ స్వరూపాలు

🌺🍀🌺🍀🌺🌺🍀

 ఒక చిన్న పాప  తన నాన్న పుట్టినరోజున తన నాన్న గారికోసం సాయంత్రం 5గంటల నుండి చాలా చాలా  ఎదురుచూస్తోంది. మాటి మాటి కి ఇంటి తలుపు వద్దకు వెళ్లి మళ్ళీ లోపలకి వచ్చి గడియారం వైపుకు చూస్తూ పచార్లు చేస్తోంది. వాళ్ళ అమ్మ అదంతా గమనిస్తూ అబ్బో దీనికి ఈ రోజు కాళ్ళు ఒక చోట నిలబడడం లేదు, అని అనుకుంటూ తన పని తను చేసుకుంటుంది. కాని నాన్నగారు రాలేదు. 


సమయం 6 అయ్యింది..వాళ్ళ అమ్మ హోం వర్క్ చేసుకో నాన్న గారు వస్తారు లే అని చెప్పింది. పాప ఎప్పుడు  రాత్రి 8 వరకు కూడా తెమలని హోం వర్క్ 6-30 లోపే చేసేసింది. ఇంతలో బైక్ సౌండ్ వచ్చేసింది..వెంటనే పరు  గెత్తు కెల్లింది. కాని వచ్చింది మామయ్య. వెంటనే ఎప్పుడు మామయ్య చేతుల వైపు ఆనందంగా చూసే పాప వీడెందుకు వచ్చాడురా.

ఇప్పుడు అని ఒక పేస్ పెట్టేయ్య గానే, మామయ్య తన చేతిలోని చాక్లెట్లుఇచ్చినా వాటిని ఏదో అల తీసుకొని చిన్న నవ్వు నవ్వింది. ఇంతలో వాళ్ళ అమ్మ కలుగ జేసుకొని మీ బావ  గారి బర్త్ డే ఈ రోజు. అది వాళ్ళ నాన్న గారికి ఒక గిఫ్ట్ తయారు చేసింది. అది ఇవ్వాలని తెగ ఇదయి పోతోంది.

అపుడు మామయ్య ఏది ఆ గిఫ్ట్ నేనొకసారి చూస్తాను. అంటే లేదు. ఇది ముట్టకూడదు. ఇది నాన్న గారే ఓపెన్ చేసుకోవాలి. అమ్మా నువ్వు కూడా ఓపెన్ చెయ్యకూడదు. గిఫ్ట్ ను చూడకూడదు అని వార్నింగ్ ఇచ్చింది. అప్పటికే 7-30pm అయ్యింది.ఆ గిఫ్ట్ ని అలాగే పట్టుకొని పడుకుని పోయింది...

నాన్న గారు రాత్రి 9కి వచ్చారు. పాప పడుకొని ఉంది. అపుడు వాళ్ళ అమ్మ ఏంటండి? పాప మీకోసం ఎంత ఎదురు చూసింది. మీరు ఈ రోజే లేట్ గా వచ్చారు. అదిగో ఆ గిఫ్ట్ మీకోసం తయారు చేసింది..చూడండి...అని చెప్పేసి వెళ్ళిపోయింది...

అపుడు వాళ్ళ నాన్న గారు గిఫ్ట్ చూసారు. అది చాల చక్కగా బ్లూ కలర్ లో రెడ్ రిబ్బన్ తో నాన్నకు ప్రేమతో అని రాసి ఉన్న ఒక అందమైన డబ్బా , ఓపెన్ చేసి చూసాడు.. ఆశ్చర్యం అందులో ఏమి గిఫ్ట్ లేదు. 

నాన్న గారికి కొంచెం అసహనం వచ్చింది. సర్లే పోనీ అని రేపు మార్నింగ్  అడుగుదాం అనుకొని కాస్త అసహనం తో పడుకుండి పోయాడు. తెల్లవారి పాప నిద్ర నుండి  లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి గిఫ్ట్ ఓపెన్ చేసారా ?అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఆ గిఫ్ట్ లో ఏమి లేదు కదా? అని అడుగుతాడు. అపుడు ఆ పాప ఇలా సమాధానం ఇస్తుంది

"నేను అందులో బోలెడన్ని ముద్దులు పెట్టి అవి మీకు మాత్రమే అందేలా ప్యాక్ చేసాను" అని చెప్తుంది

అప్పుడు వాళ్ళ నాన్న ఒక్క క్షణం నిశ్చేష్టుడై ,తన బంగారు తల్లి ని అపార్ధం చేసుకున్నాను అనుకొని
పాపకు ముద్దు పెడతాడు. పిల్లల్ని అర్ధం చేసుకోవడం కష్టమైన పని వాళ్ళను వాళ్ళ పనులను అర్ధం చేసుకోవాలనుకొంటే  మనం పిల్లల్లా ఆలోచించాలి. అంటే పిల్లల్లాగా స్వార్ధ రహితంగా  స్వచ్ఛంగా  ఆలోచించాలి.

పిల్లలు దైవ స్వరూపాలు


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday, 19 March 2024

దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది (20-Mar-24, Enlightenment Story)

దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀 

దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది కాని కూడబెట్టడంవల్ల కాదు. మేఘాలు నీటిని దానం చేస్తున్నాయి కనుక వాటి స్థానం పైన ఉంది. సముద్రం నీటిని కూడబెడుతోంది కాబట్టి దాని స్థానం కిందనే ఉంది. దానధర్మాలు అనేది సాధారణంగా వాడే పదం. దానం ధర్మం ఈ రెండు వేర్వేరు శబ్దాలు అయినా దానం అనేది ధర్మాలలో నొకటి. దానం అనేది అతి సులువైన ధర్మం. దానం ద్వారా అన్నింటిని పొందవచ్చును. దానమే పరమ ధర్మమని గరుడ పురాణంలోవుంది. దానం చేయడానికి ముఖ్యంగా రెండు గుణాలుండాలి. అవి దయ, త్యాగభావన. కలియుగంలో యజ్ఞయాగాదులు చేయడం ఎక్కడో కానీ అంతటా సంభవం కాదు. అందువలన ఈ యుగంలో దానమే ప్రధాన ధర్మం అనేది ఋషుల వచనం. దాని వలన సుఖం లభిస్తుంది, సంపదలు వృద్ధి పొందుతాయి, యశస్సు కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. పాపం హరించుకుపోతుంది, పుణ్యం వస్తుంది.


కేవలం తన కొరకే వండుకొనువారు పంచసూన పాపభూయిష్టితమగు అన్నమును తినుచున్నారు అని భగవద్గీత తృతీయాధ్యాయంలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపియున్నాడు. ఈ విషయాన్ని మరింత వివరంగా వ్యాస భగవానుడు శ్రీమద్భాగతంలో చెప్పి ఉన్నాడు.


తన అవసరానికి మించినదానిని ఆశించేవారు, సేకరించేవారు దొంగ అనిపించుకుంటారు. వారు శిక్షార్హులు. కడుపు నిండడడానికి ఎంత అవసరమో అది మాత్రమే నీది. ఈ సంపదలు నీ ప్రయోజనం వలన సమకూరలేదు. ఈశ్వరుని దయవలన నీవు సంపాదిస్తున్నావు. అందువలన అది ఈశ్వరుని సంపద. నీవు ధర్మకర్తవు. అధిక సంపదలు తిరిగి ఈశ్వరునికే అర్పించాలి. అందుకు ధర్మబద్ధనా ధనం దానం. దీన దుఃఖితులకు, అసహాయులకు సహాయం చేయడమే మానవ జన్మకు పరాకాష్ఠ. ఇది ఆర్షమత సిద్ధాంతం.


దానం చేసే దాతలు కొన్ని నియమాలు పాటించాలి. దానం చేసే ద్రవ్యం దాత స్వార్జితమై వుండాలి. న్యాయార్జితం, ధర్మబద్ధంగా ఆర్జించిన ధనమువల్లనే దానఫలం లభిస్తుంది. అక్రమార్జిత ధనం దానం చేస్తే సద్గతులుండవు. అది పాపకృత్యం. నీదికానిది నీవెలాగు ఇతరులకివ్వగలవు? క్షేత్రమెరిగి బీజం- పాత్ర మెరిగి దానం అంటారు. సారవంతమైన నేలలో నాటిన విత్తనం మాత్రమే మొలకెత్తి పెరిగి ఫలాలనిస్తుంది. అట్లే పాత్రుడైనవానికే దానం చేయాలి. అపాత్రునికి ఎట్టి పరస్థితులలోనూ దానం చేయరాదు. దానాలు పది రకాలు అని చెబుతారు. అవి గోవు, భూమి, తిలలు, బంగారం, నెయ్యి, వస్తమ్రు, ధాన్యము, బెల్లము, ఉప్పు, వెండి. నేటి కాలంలో మరికొన్ని దానాలు ప్రాచుర్యం పొందాయి. ప్రాణదానం, విద్యాదానం, అన్నదానం. దానఫలాలు మూడు రకాలు. ఒకటి స్వయంగా పాత్రుడైన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇచ్చిన దానికి ఫలితం ఉత్తమం. తన వద్దకు పిలిచి ఇచ్చిన దానికి ఫలితం మధ్యమం. యాచించినవానికి ఇచ్చిన దానఫలితం అథమం. ఇది అధమముదైనా దానం చేసినందున దోషం లేదు. ఏమంటే యాచకుడికి మీ అవసరం ఉంటుంది.


ధనానికి మూడు రకాల గుణాలున్నాయి. ఒకటి దానము, రెండు భోగము, మూడు నాశము. దానము ఉత్తమమైనది. భోగము మధ్యమమైనది. నాశము అంటే దుర్వినియోగము అధమమైనదని పెద్దలు చెప్తారు. ఉత్కృష్టదానం చేసినవారు మనకు పురాణేతిహాసాలలో గోచరిస్తారు. వామనుడికి భూమి దానం చేసిన బలి చక్రవర్తి, రాక్షస సంహారార్థం దేవతలకు తోడ్పడుట కొరకు ప్రాణదానం చేసిన దధీచి మహర్షి, శరణాగతి కోరిన కపోతాన్ని రక్షించడానికి దేహత్యాగానికి సిద్ధపడిన శిబి చక్రవర్తి, ఊంఛ వృత్తిద్వారా సంపాదించిన ఆహారాన్ని అతిథులకు నివేదించిన ముద్గలమహర్షి, కవచ కుండలాలను దానం చేసిన కర్ణుడు, రాజర్షి పురుషోత్తమదాస్ టండన్‌ను ఈ దానమూర్తుల సరసన చేర్చవచ్చు. దానం వినయంగా శ్రద్ధగా అహంకార రహితంగా చేయాలి.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 18 March 2024

భగవంతుడు - భక్తుడు (19-Mar-24, Enlightenment Story)

 భగవంతుడు - భక్తుడు

🌺🍀🌺🍀🌺🌺🍀

భగవంతుని గుర్తించి మనము స్వీకరిస్తే ఆయన ఉంటాడు, కనబడుతాడు...ఆయనను తిరస్కరిస్తే ఆయన ఉండడు, కాక కనబడడు కూడా హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడన్నాడు, కనుక ఎక్కడా కనబడలేదు, అతనికి...అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు. కాబట్టి స్తంభము నుండి వెలిసి, ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు... అంతే కానీ, హిరణ్య కశిపుని సవాలు ఎదుర్కోవడం కోసమని స్తంభములో  ప్రవేశించడం కాదు...

అన్నిటా, అంతటా నిండి ఉన్నట్లే, ఆ స్తంభములో కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు...ఆ క్షణంలో తన ఉనికి ప్రదర్శించాడు, అంతే!... సాధు సత్పురుషులు, మహర్షులు, ఆర్తితో ప్రార్ధించినపుడు, భగవంతుడు అవతరిస్తాడు...

*ఆయన కర్తవ్యాలు మూడు...!!!*
  • వేద రక్షణ,
  • ధర్మ రక్షణ,
  • భక్త రక్షణ...

నిశ్చలమైన విశ్వాసము, నిర్భయం, నిరహంకారం, సద్గుణం, ఇవి లేకుండా, ఆడంబరంగా పూజ చేస్తే, వ్యర్థమే... కాలము, శక్తీ, అన్నీ వృధా అవుతాయి... ఇలాంటి సందర్భంలో మనము పవిత్ర గ్రంధాల నుండీ, పురాణముల నుండి, ఉపనిషత్తులనుండి, ప్రసంగాల నుండీ మనము పొందుతున్న లాభమేమిటి?...

వీటి మూలంగా మనమైనా బాగు  పడ్డామా? లేక చదివితేనే పుణ్యము వస్తుంది, అనుకొంటే మనకన్నా ముందు టేబురికార్డులకు, మన సెల్లులకు ముందుగా పుణ్యం వస్తుంది, అవి నిత్యం పటిస్తున్నాయి కాబట్టి...

భగవంతుని దర్శన భాగ్యం పొందిన మనము ఎంతవరకు పురోగమించాము? దర్శనమాత్రమునే పుణ్యము వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది అనుకుంటే, మనకన్నా ముందు, నిత్యం ఆయన కోవెలలో ఉన్న చీమలకు, దోమలకు, కీటకాలకు వస్తుంది. ఎందుకనగా అవి నిత్యం ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి...

ఆయన దగ్గర నుంచి పారమార్థిక జీవిత రహస్యం , తెలుసుకున్న దానికి  నిదర్శనంగా మన జీవన సరళిలో ఏదైనా మంచి మార్పు కన పడాలి. 

మనలోనుండి మధుర భాషణం, విజయ, పరాజయాలకు పొంగని, కృంగని ఆత్మ నిగ్రహం మనము ప్రదర్శించాలి. 

ఇవన్నీ మన భక్తికి సంకేతాలు, లేశమైన అహంభావము లేకుండా, భగవంతుని శరణాగతి పొందాలి. అప్పుడే మనము భక్తులు అని పించుకోగల అర్హత పొంద గలుగుతాము.

          

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday, 17 March 2024

దేవుడే దిక్కు (18-Mar-24, Enlightenment Story)

దేవుడే దిక్కు

🌺🍀🌺🍀🌺🌺🍀

ఒక గ్రామంలో తల్లీ కుమారులు జీవిస్తూ ఉండేవారు. కుమారుడు పుట్టిన తరువాత తండ్రి చనిపోయినాడు. వారిద్దరికీ జీవించడానికి ఎట్టి ఆధారము. లేకపోయింది. తల్లి కష్టపడి పనిచేస్తూ, పిల్లవానిని చదివించింది. ఆమె తన ఆశలనన్నింటినీ కుమారుని పైననే పెట్టుకొన్నది. కుమారుడు కూడ చురుకుగ చదువుతూ 10వ తరగతికి వచ్చాడు. పరీక్షలు దగ్గరపడినవి. పరీక్ష ఫీజు 50 రూపాయలు కట్టవలసి వచ్చింది. ఆ అబ్బాయి "అమ్మా! పరీక్షఫీజు కట్టాలి" అని తల్లితో అన్నాడు. ఆమెకు ఏమీ తోచలేదు. కష్టపడి పనిచేస్తే వచ్చే ఆదాయము వారిద్దరూ ఒకపూట భుజించడానికి మాత్రమే సరిపోతుంది. ఆమె హెడ్మాస్టర్ను కలిసి తమ పరిస్థితిని వివరించినది. హెడ్మాస్టర్ ఆమెతో "అమ్మా! నేను చేయగలిగినది ఏమీలేదు. ఇవి గవర్నమెంటు రూల్స్" అన్నాడు.


ఆమె ఇంటికి తిరిగివచ్చి తన కుమారుని భవిష్యత్తును గురించి చింతించసాగింది! కుమారుని భవిష్యత్తు యీ పరీక్షమీద ఆధారపడి వుంది. కానీ నేనేమీ చేయలేని పరిస్థితులలో వున్నానే, అని చెట్టుక్రింద కూర్చుని ఏడవసాగింది.

ఆ సమయంలో కుమారుడు పరిగెత్తుకొని వచ్చి 'అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు?' అని అడిగాడు. “ఏమీలేదు నాయనా! రా! భోజనం చేసి మాట్లాడుకుందాం" అన్నది. కానీ పిల్లవాడు ఊరుకోలేదు. "నాయనా! నీ పరీక్షఫీజు కట్టే శక్తి నాకులేదు. రేపటినుంచి నీవుకూడా నాతోపాటు వచ్చి పనిచేయవలసి వస్తుందే అని దుఃఖిస్తున్నాను" అని కుమారునితో అన్నది. "అమ్మా! నేను చదువుతాను. పరీక్ష వ్రాస్తాను. ప్రస్తుతానికి ఎవరిదగ్గరయినా అప్పు తీసుకొని ఫీజుకట్టు. పరీక్షలు అయిన తర్వాత కూలిపని చేసి అప్పు తీరుస్తాను" అని ఆ అబ్బాయి అన్నాడు. ఆమె, "మనకు అప్పు ఎవరు ఇస్తారు నాయనా! దిక్కులేని వారికి దేవుడే దిక్కు" అంటూ యింట్లోకి వెళ్లింది. కుమారుడు అమాయకంగా "అమ్మా! ఆ దేవుడు ఎక్కడ వుంటాడమ్మా" అని ప్రశ్నించాడు. ఆమె "నాయనా! అతడు మహాశక్తి సంపన్నుడు. సకలైశ్వర్యసంపన్నుడు, అందరికీ అన్నీ యిచ్చేది ఆయనే!" అని తన ధోరణిలో చెప్పుకుంటూ పోయింది.

ఆ అబ్బాయి "ఆ దేవుడు అసలు ఎక్కడ వుంటాదో చెప్పమ్మా! అతని కాళ్లు పట్టుకొని, బ్రతిమాలి డబ్బులు తెస్తాను" అన్నాడు అమాయకంగా, తల్లి నిట్టూరుస్తూ "అందరికీ దిక్కు వైకుంఠంలో ఉండే నారాయణుడే" అన్నది. ఆ అబ్బాయి తన జేబు తడుముకుంటూ పోస్ట్ ఆఫీసుకి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. జేబులో సరిగ్గా పోస్ట్కార్డుకు సరిపోయేటంత డబ్బులు వున్నాయి. 

ఒక కార్డుకొని తన ప్రార్ధన వ్రాసి, 'టు, శ్రీమన్నారాయణ, వైకుంఠం' అని అడ్రసు వ్రాసి పోస్ట్బక్సు వద్దకు వెళ్ళాడు. పోస్ట్బక్సు ఒక ఎత్తయిన స్తంభానికి కట్టివుంది. కార్డు బాక్సులో వెయ్యాలంటే ఆ అబ్బాయికి అంత ఎత్తు అందలేదు. ఎగిరి ఎగిరి బాక్సులో జాబు వేయాలని ప్రయత్నిస్తున్నాడు. పోస్ట్ మాస్టరు కిటికీలో నుండి అబ్బాయి అవస్థను గమనించాడు. బయటకు వచ్చి, "ఆ జాబు నాకు యివ్వు నేను బాక్సులో వేస్తాను" అన్నాడు. ఆ అబ్బాయి "ఈజాబు చాలా అర్జెంట్గా చేరాలి. సార్, నేను పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు రావాలి సార్! ఈ జాబు తొందరగా చేరే మార్గం చూడండి సార్" అని ప్రార్ధించాడు. పోస్ట్ మాస్టరు కార్డుపైన అడ్రసు చదివాడు. పోస్ట్ మాస్టరు "నాయనా! అడ్రసు నీకు ఎవరిచ్చారు?" అని అడిగాడు. " మా అమ్మ సార్, నాకు చదువుకోవాలని చాలా ఆశ. మా వద్ద డబ్బులేదు. ఈ నారాయణగారు చాలా డబ్బుగల వాడట సార్, దిక్కులేని వారికి సహాయం చేస్తాడట! అని మా అమ్మ చెప్పిందండి" అని ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. పోస్ట్ మాస్టరు హృదయం ద్రవించిపోయింది. "ఆహా! ఈ పిల్లవాడు ఎంత నిర్మల హృదయుడు. తల్లిమాటలపై ఎంత విశ్వాసం" అని తనలో తాను అనుకుంటూ, "నాయనా! ఈ జాబు అర్జంటుగా చేరే మార్గం నేను చూస్తాను. నీవు ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఇక్కడకు రా! నీ డబ్బు తప్పకుండా వస్తుంది" అని అన్నాడు..

ఆ అబ్బాయి పట్టలేని ఆనందంతో యింటికి తిరిగి వెళ్ళి "అమ్మా! నేను ఫీజు కట్టేస్తాను. పరీక్ష వ్రాసేస్తాను" అన్నాడు తల్లితో, తల్లి ఏమీ అనలేక నవ్వి పూరుకుంది. ఆ రెండు రాత్రులు ఆ అబ్బాయి ఎట్లా గడిపాడో! పోస్ట్ మాస్టరు చెప్పిన ప్రకారం మూడవ రోజు ఉదయం 9 గంటలకు పోస్టాఫీసుకి వెళ్ళాడు. వెళ్ళి పోస్ట్ మాస్టరుతో "సార్! నేను 10 గంటలకు ఫీజు కట్టాలి. అక్కడనుంచి ఏమయినా డబ్బు వచ్చిందా!" అని ఆ అబ్బాయి అడిగాడు. పోస్ట్ మాస్టరు "వచ్చింది నాయనా! ఇదిగో కవరు!" అని ఒక కవరును ఆ అబ్బాయికి అందించాడు. ఆ కవరును. అందుకొని యింటికి పరిగెత్తుకొని వెళ్ళి "అమ్మా! డబ్బు వచ్చింది!" అని ఆ కవరును తల్లికి అందించాడు. తల్లి కవరులో గల 50 రూపాయల డబ్బును చూసింది. ఆమెకు ఆశ్చర్యం, భయం కలిగాయి. వీనికి ఈ డబ్బు ఎలా వచ్చింది. దొంగలించాడా? ఎవరినైనా అర్థించాడా? గుట్టుగా జీవిస్తున్న నాకు వీని మూలంగా ఎంత అప్రతిష్ఠ! అని ఆలోచించసాగింది. 

కొంతసేపటికి కోపంగా "ఎవరు నీకు యీ డబ్బు యిచ్చారో వారి వద్దకు నన్ను తీసుకొనిపోరా!" అని కుమారుని చేయి పట్టుకొని బయలుదేరింది. "అమ్మా! నీవు చెప్పినట్లు నారాయణగారికి జాబు వ్రాసాను. ఆయనే పంపించాడు యీ డబ్బు, పద! పోస్ట్ మాస్టరు గారిని అడుగు" అని అబ్బాయి అన్నాడు. పిల్లవానిని బయటనే నిలబెట్టి. ఆమెలోనికి వెళ్ళింది. తల్లి పోస్ట్ మాస్టరుతో "అయ్యా! ఈ పిల్లవాడు చెప్తున్నదంతా నిజమేనా!" అని అడిగింది. పోస్ట్ మాస్టరు ఆమెతో "అవునమ్మా! భగవంతుడే. పంపించాడు! మొన్నటిదినం యీ పిల్లవాడు వ్రాసిన జాబుచూసి, నా హృదయం కరిగింది. నా మనస్సులో భగవంతుడు ప్రవేశించి, నాచేత యీ డబ్బు యిప్పించాడు. అమ్మా! దయచేసి యీ డబ్బు వాపసు యివ్వకండి. ఆ పసివాని విశ్వాసం దెబ్బతింటుంది. నిర్మల హృదయులైన పిల్లలు ప్రార్థిస్తే, భగవంతుడు ఆ ప్రార్ధనను తప్పక అలకిస్తాడు. ఏదో ఒకవిధంగా ఆదుకుంటాడు. నేను నిమిత్తమాత్రుణ్ణి" అన్నాడు.

ఈ కథనుండి మనము తెలుసుకోవలసినది ఏమిటి? నిర్మల హృదయంతో, సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే, భగవంతుడు ఏదో ఒక రూపంలో మనం కోరిన దానిని అందిస్తాడు.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...