Tuesday, 5 December 2023

దేహం తండ్రి ప్రసాదం (08-Dec-23, Enlightenment Story)

 ’దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 ‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు  స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది.

తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది.

తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది.‘పుత్ర శబ్దానికి – తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.

‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి. దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు. అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు.

వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన ‘శ్రవణ కుమారుడు’. అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ‘ప్రవరాఖ్యుడు’ …

అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు. ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు.

అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు. అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’ కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం.

ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే! కాబట్టే విగ్రహవాక్యం – ‘ తల్లియును తండ్రియును ’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం.

‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే – భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది. కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’ లను మొదటి రెండుగా చెబుతారు.

వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక! ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక! లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు.

అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ.

ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!

అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన.

శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం !!

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️


స్వామికి మొక్కిన మొక్కు (07-Dec-23, Enlightenment Story)

 స్వామికి మొక్కిన మొక్కు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఒకసారి నా భార్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యుల అభిప్రాయం వెంటనే ఒక పెద్ద శస్త్రచికిత్స చెయ్యాలి. తిరుచ్చిలోని ఒక ప్రముఖ ఆసుపత్రులో తనని చేర్చాను. మరుసటిరోజు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాము. ఆమెను శస్త్రచికిత్సకు తీసుకునివెళ్లారు. బాధతో, ఆందోళనలతో మనస్సు కకావికలమైపోయింది. 

మా ఇంటి దైవమైన ఏడుకొండలస్వామిని ప్రార్థించాను. కానీ మన్సు కుదురుగా ఉండడంలేదు. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు గుర్తుకొచ్చారు. స్వామివారే తనని కాపాడాలని, శస్త్రచికిత్స విజయవంతమైన తరువాత ఇద్దరమూ వచ్చి, 1,008 రూ. కానుకగా సమర్పిస్తామని ప్రార్థించాను. ఒకటిన్నరగంట తరువాత శాస్త్రచికిత్స ముగియగానే, సాధారణ వార్డుకు మార్చారు.

“మేము ఏదేదో అనుకుణామూ కానీ, కానీ ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదు. శస్త్రచికిత్స విజయవంతమైంది” అని వైద్యులు నాతో చెప్పారు. వెంటనే నేను ఏడుకొండలవాడికి, పరమాచార్య స్వామివారికి మనస్సులోనే సాష్టాంగం చేశాను. మూడు రోజుల తరువాత ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాము.

తరువాత గోకులాష్టమి పండగ వచ్చింది. మనం కాంచీపురం వెళ్ళి, అక్కడి సేవకులకి మురుకులు, వెన్న గుళ్ళు ఇచ్చి, స్వామివారిని దర్శించుకుందామని నా భార్యకు చెప్పాను. అన్నిటినీ తీసుకుని శివాస్థానం చేరుకున్నాము. ఉదయం దర్శనం తరువాత ఏడుగంటలకి అనుష్టానానికి కూర్చున్నారు స్వామివారు. స్వామివారు అనుష్టానం కోసం శివాస్థానంలో ఒక పాకలోకి వెళ్ళడం మేము బయటినుండే చూశాము. నా విన్నపాన్ని స్వామివారికి ఎలా తెలియజేయాలో నాకు పాలుపోలేదు. అక్కడే ఉన్న ఒక సేవకుడిని పిలిచాను.

“స్వామివారికి చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. నేను స్వామివారికి కానుక మొక్కుకునాను. నా భార్యను కాపాడారు. నేను కానుకను సమర్పించాలి; ఎలా చెయ్యాలో నాకు తెలియదు. మంచి సమయం చూసుకుని నువ్వు స్వామివారితో చెప్పి వారి ఆదేశాన్ని నాకు తెలుపు” అని చెప్పాను.

స్వామివారి అనుష్టానం పూర్తవగానే, ఆ సేవకుడు గట్టిగా, “తంజావూరు సంతానం వచ్చాడు. స్వామివారికి విజ్ఞాపన చెయ్యడానికి సిగ్గు పడుతున్నాడు. అతని భార్యకు పెద్ద శస్త్రచికిత్స జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో ఆమెను కాపాడమని స్వామివారికి కానుక మొక్కుకున్నాడు. దంపతులిరువురూ బయట నించున్నారు” అని చెప్పాడు.

మహాస్వామి వారు నవ్వుతూ, ఛాతీని ముట్టుకుని “నాకు మొక్కుకున్నాడా? ఎంత మొత్తమో అడుగు?” అన్నారు. “1,008 రూ. కానుక మొక్కుకున్నాను” అని చెప్పాను.

“ఆ ధనం తీసుకునివచ్చాడేమో అడుగు?”

“వెంటతెచ్చాను”

ఈ సంభాషణ అంతా విని నా భార్య నావైపు అయోమయంగా చూసింది. నా మొక్కు గురించి ఆమెకు తెలియదు. మేము అక్కడ ఉంచిన పళ్ళు, టెంకాయలు మరియు ఇతర పదార్థాలను రెండు పెద్ద పెద్ద పళ్లాలలో సర్దమని చెప్పారు స్వామివారు. “ఇక్కడ ఋగ్వేద పారాయణం చేసే శాస్త్రిగారిని పిలవండి” అని ఆదేశించారు. శాస్త్రి గారు రాగానే, మమ్మల్ని జంటగా నిలబడి 504 రూ. ఒక పల్లంలో ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు.

శ్రీమద్భాగవతం పారాయణం పూర్తిచేసిన మరొక శాస్త్రి గారిని పిలిపించి, మరొక్క పళ్ళెంలో 504 రూ. ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు.

తరువాత మందహాసంతో , అక్కడున్నవారికి వినబడేటట్లుగా “ఇది విన్నారా! ఇతను చెబుతున్నాడు ఇతని భార్యకు ఒక పెద్ద శాస్త్రచికిత్స జరిగింది. అందుకోసమని నాకు మొక్కుకుని 1,008 రూ. కానుకగా నాకు సమర్పించడానికి తెచ్చాడు. అందరూ దేవునికి, దేవాలయానికి మొక్కు చెల్లిస్తారు. చూడండి ఇతను నాకు మొక్కుకున్నాడు అంట!” అని గట్టిగా నవ్వగానే, అక్కడునవారందరూ స్వామివారితో శృతి కలిపారు.

స్వామివారు మాకు పూర్ణ అనుగ్రహాని ఇచ్చి, “వెళ్లిరండి” అని ఆశీర్వదించారు. ఎప్పటికీ నా కళ్లెదుటన ఉండే ఒక అపురూపమైన సంఘటన.

--- తంజావూరు సంతానరామన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

జీవితమంతా నేర్చుకోవడం (06-Dec-23, Enlightenment Story)

 జీవితమంతా నేర్చుకోవడం..!

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. 

అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు.మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు.

ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.


సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు. 

జైలర్‌ ”అయ్యో! దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు. 

సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు. సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు.

ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. 

శిష్యులు ”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు.

సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం!  మరణం గురించి ఆలోచించడం కాదు!! నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది. గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నాజీవితంలో గంట సమయముంది. అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.

శిష్యుల నోట్లో మాట రాలేదు. ఎంతటి గొప్ప ఆలోచన యిది!

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

పంచప్రాణాలు అంటే ఏమిటి (05-Dec-23, Enlightenment Story)

*పంచప్రాణాలు*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ప్రతి మానవుని దేహంలో ఐదు రకముల వాయువులుంటాయి: 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం, 5. వ్యానం. వీటిని పంచప్రాణాలని పిలుస్తారు.

హృది ప్రాణోగుదేపానః సమానోనాభిమండలే |
ఉదానః కంఠ దేశేస్యాద్ వ్యానః సర్వశరీరగః ||

5 వాయువులు

1. హృదయం లో ప్రాణం అనే వాయువు.

2. గుదం లో (మూలాధారంలో) అపానం

3.నాభి లో సమానం...

4.కంఠం లో ఉదానం

5. శరీరం అంతటా (దేహమంతా) వ్యానం అనే వాయువు.

 నిజానికి వాయువు ఒకటే అయినా, పలు ప్రదేశాలలో పలు పనులతో పలు పేర్లను కలిగి ఉంటుంది. ప్రాణవాయువు హృదయం నుండి నాసిక (ముక్కు) వరకు సంచరిస్తుంది

ప్రాణాపాన సమాఘతాత్ కందమధ్యాద్యదుత్థితం |
ప్రాణలింగం తదాఖ్యాతం ప్రాణాపాననిరోదిభిః ||

ఈ సంచారం రోజుకు 21600 సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాణవాయువు సంచారంతోనే శరీరం జీవించి ఉంటుంది లేకపోతే అన్ని క్రియలు ఆగిపోయి, మనషి మరణిస్తాడు. 

ఈ ప్రాణవాయువు ఊర్థ్వముఖం (పైకి) గా ప్రయాణిస్తుంది. గుద (పీఠ) స్థానంలో నెలకొన్న అపానవాయువు మలమూత్రములను బయటకు పంపే పనిని చేస్తుంది. ఇది అధోముఖంగా (క్రిందకు) ప్రయాణిస్తుంది. నాభి (బొడ్డు)లో ఉండే సమాన వాయువు మనిషి తిన్న అన్నం యొక్క రసమైన రక్తాన్ని అన్ని అవయవములకు వాటి పనులను మరియు స్థాయిని బట్టి సమానంగా పంచుతుంది.

ఉదానవాయువు కంఠ భాగంలో ఉండి చీమిడి, కళ్ళి వంటి వాటిని దేహంలోపలి నుంచి బయటకు పంపే పని చేస్తుంది. వ్యానవాయువు శరీరంలోని ప్రతినాడిలో సంచరించి రక్తప్రసరణ ప్రక్రియను సమతుల్యంగా చేసి కాపాడుతుంది, లేకపోతే పక్షవాతం వంటి రోగాలు శరీరంలోకి చేరుతాయి. ఇది మనపూర్వీకులు, పెద్దలు, పండితులు ఆయా సందర్భాలలో చెప్పిన విషయం.

ఇవి ఆయా స్థానాలలో ఉన్నా అవసరమైనపుడు ఇతర స్థానాలలోకి సంచరిస్తాయి ఇవే అగ్నులుగా పరిణమించి మనం తిన్నది రక్తం గా పరిణమించేందుకు వివిధ దశలలో పనిచేస్తాయి. మనం పీల్చే గాలి లోపల ఇన్ని పరిణామాలు చెందుతుంది.

( వాయోరగ్నిః— వాయువు నుండి అగ్ని పుడుతుంది అని వేదం. )


1) ప్రాణము : ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుందని చెప్పబడింది. మన వాక్కును, మ్రింగటాన్ని, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని తెలియజేయబడింది.


2)అపానము :నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తి చెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని ఇది నిర్వర్తిస్తుంది.

3)సమానము:ఇది నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుందన్నమాట

4)ఉదానము : ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఇది సహాయపడుతుంది. మనలోనుండి శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదపడుతుందన్నమాట.

5)వ్యానము : ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచుతుంది. శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మనాడులున్నట్లు చెపుతారు. ఇవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ ఉన్నట్లు పెద్దలు చెబుతారు. ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు అని చెప్పారు




☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 4 December 2023

శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం (04-Dec-23,Enlightenment Story)

 🎻🌹🙏కార్తీకమాసం సందర్భంగా  శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.  ....!!

🌿శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం.....

🌸సాధారణంగా శివుడు లింగ రూపంలో మనకు కనిపిస్తాడు.అయితే దేశంలో ఎక్కడా లేనట్లు ఇక్కడ పరమశివుడు కుర్చొని ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తాడు.సిద్ధాసనంలో (కుర్చొని) శివుడు కొలువై ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్దేశ్వరాలయం అని పేరు వచ్చింది.

🌿ఇక స్వామివారు జఠాజూటంలో చంద్రుడితో పాటు సూర్యుడు కూడా కనిపిస్తారు.కుడిచేతిలో బ్రహ్మకపాలాన్ని, మెడలో కపాలాలను కూడా స్వామి వారు ధరించి సగం మూసిన కనులతో స్వామివారు కనిపిస్తారు. 

🌸ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అమరాపురం మండలం హేమావతిలో ఉన్నది 

🌿ఇటువంటి రూపం భారత దేశంలో ఇదొక్కటే అని స్థానికులు చెబుతున్నారు. 

🌸ఇదే ఆలయంలో పంచ లింగాలు కూడా మనం చూడవచ్చు.శివరాత్రి రోజు సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ దేవాలయంలోని మూల విగ్రహం నుదిటిమీద ఖచ్చితంగా పడుతాయి. 

🌿ఇలా ఎలా పడుతున్నయన్న దానికి ఇప్పటి వరకూ ఖచ్చితమైన సమాధానం లేదు.

🌸ఇక ఆలయంలో శివుడికి ఎదుగా ఉన్న నంది స్వామివారిని చూస్తున్నట్టుగా కాక కొంత పక్కకు తిరిగి ఉంటుంది. 

🌿పడమర ముఖంగా ప్రవేశ ద్వారం ఉన్న దేవాలయాల్లో హేమావతి సిద్దేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి.

🌸హేమావతిని పూర్వ కాలంలో హెంజేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది హేమావతిగా మారింది. 

🌿పూర్వం ఈ ప్రాంతాన్ని నోలంబరాజులు పరిపాలించేవారు. అందువల్ల హేమావతిలోని సిద్దేశ్వరుడిని నోలంబేశ్వరుడు, ఎంజేరప్ప అని కూడా అంటారు.

🌸అనంతపురం, హిందూపురాలకు రైల్వే సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హేమావతిని చేరుకోవచ్చు....స్వస్తీ...🚩🌞🙏🌹🎻

ఈక్షేత్రము ఎక్కడ ఉన్నది? అనంతపురం నుంచి పెనుకొండ, మడకశిర, బసవనపల్లి మీదుగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హేమావతికి చేరుకోవచ్చు. అది కాకుండా ఇటు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, కుందుర్పి, నాగేపల్లిగేట్‌ మీదుగా 120 కి.మీ ప్రయాణించి అమరాపురం, ఇక్కడి నుంచి 12 కి.మీ ప్రయాణిస్తే హేమావతి ఆలయం వస్తుంది. అంతే కాక అమరాపురం నుంచి ఆటోలు, బస్సులు హేమావతికి వెళుతుంటాయి.



☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Saturday, 2 December 2023

పుటుక్కు జరజర డుబుక్కు మే (03-Dec-23, Enlightenment Story)

 పుటుక్కు జరజర డుబుక్కు మే ఈ సామెతకు అర్థమేమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం


అదోపాఠశాల మైదానం. బాలికలాడి యాడి అలసి పోయారు. గుంపుగా ఓ చోట కూచున్నారు. ఆయాసం కారణంగా వారి ఎదలెగ సెగసి పడుతున్నాయి. ఓ అమ్మాయి నెత్తి నుండి ప్లాస్టిక్ పిన్ను తీయ బోయింది. ఆది పుటుక్కున విరిగిపోయింది. ఆ బాలికకు చిన్న గాయమయింది. అమ్మా అన్నది. ఇది చూసి నవ్వారు. ఆ అమ్మాయి మనస్సులో ఏవో పూర్వ స్మృతులు తైతక్కలాడాయి. అంతే.


 పుటుక్కు..జరజర... డుబుక్కు... మే..." అన్నది. అమ్మాయి నవ్వుతూనే “పుటుక్కు జరజర డుబుక్కుమే" ఒక్క సారి కాదు; రెండు మూడు పర్యాయాలన్నది; అంటూనే నవ్వుతున్నది; నవ్వుతూనే అంటున్నది.


ఆ కథస్మృతిలో తిరిగిన వారంతా ఆ నవ్వుకు నవ్వుకలిపారు. కొందరు ఆశ్చర్యంలో మునిగారు; మరికొందరు ప్రశ్నార్థక ముఖలయ్యారు. ఈ తతంగంలో ఆసహనం రేకెత్తిన కొందరు పిన్ను విరిగిందానికన్నా మీ విరుగుబాటే బాధాకరంగా ఉందన్నారు.


'నవ్వుతూన్న ఓ అమ్మాయిని 'చాల్చాల్లేవే' అంటూ మరో అమ్మాయి. మోచేతితో పొడిచింది. 'నన్ను మోచేతితో పొడుస్తావా? అయితే నేనో పొడుపుకథ పొడుస్తాను. విప్పుకో!' అంది అమ్మాయి. 'సరే సరే' అన్నారందరు.


ఆ అమ్మాయి మరోసారి 'పుటుక్కు, జరజర, డుబుక్కు, మే' అంది. ఆ కథ తెలిసిన బాలికలొకరిద్దరు మేము ముడి విప్పుతాం అన్నారు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. 'పిన్ను విరిగి ఏడుస్తున్న పిల్లయినా చెప్పాలి, లేదా పొడిచిన మోహినైనా చెప్పాలి, పట్టు పట్టింది.


"మా యిద్దరికీ దాని అర్థమేంటో తెలియదు తల్లీ! నీవే చెప్పు. ఇద్దరూ చేయెత్తి మొక్కారు. ఆ అమ్మాయి పైట నడుంకు చెక్కి, గళం సవరించుకొని పొదుపు కథకు విడుపు ప్రారంభించింది.


"అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్లో ఓ పూరిల్లు, ఆయింటి చూట్టూరా చక్కనికూరగాయల మొక్కలు. అమొక్కల మధ్యమధ్య చిక్కుడు, పొట్లతీగలు, బీర తీగలు, ఆ యింటి పై కప్పుపై పచ్చని గుమ్మడి తీగ, కప్పునిండ గుమ్మడి ఆకులు చిలుక పచ్చగా నిగనిగలాడుతోన్న గుడిసె. ఆకుల మధ్య పసుపు పచ్చని గుమ్మడి పూలు.


ఆ గుడిసె పేద రైతుది. అతనికో మేక ఉంది. దాని నెప్పుడూ గుడిసె తలుపుకే కట్టి వేస్తారు. ఆ మేక కడుపునిండా తిన్నది; హాయిగా నెమరు వేస్తూఉన్నది; నిలబడే ఉన్నది, గుడిసె మీద ఆకుల్లో ఎలుకలున్నాయి. అవి అటూ ఇటూ పరుగెత్తుతున్నాయి. ఓ ఎలుక పెద్ద గుమ్మడి పండు కాడ కొరికింది. కొండల్నే పిండిగా చేసే ఎలుకకు గుమ్మడి పండో లెక్కా... పక్కా!


ఇంకేం! కాడ 'పుటుక్కున' తెగింది. గుడిసె మీన్నుండి గుమ్మడి పండు 'జరజర' జారింది. నెమరు వేస్తున్న మేకమీద 'డుబుక్కున' పడింది. హఠాత్ ఘటన! మేక బెదురుకుంది 'మే' అంది.


ఆ అమ్మాయి విడుపుకథ ఆపింది. అందరిదిక్కు చూసి గలగలా నవ్వింది. అందరూ 'పుటుక్కు, జర జర డుబుక్కు, మే' అంటూ నవ్వారు.


ఆ నవ్వుల తళతళలు ఇంటింటా ప్రసరించాయి. వీధుల్లో కాంతిని నింపాయి.ఈ కథ ఆ నగరం రాజ- చెవిలో దూరింది. రాజు పండితుల్ని అడిగాడు. శబ్దార్థాలు మాత్రమే తెలిసిన పండితులకిది తలకు మించిన కార్యమైంది.


ఇది ఏదో సంఘటనకు ముడి అనుకున్నారు. ఆ చిక్కుముడి విప్పితే గాని దీని అర్థం తేలదనుకున్నారు. అందుకే రాజును వారం రోజుల గడువడిగారు. పండితులు జనపదాలపై పడ్డారు. శబ్దాలు తెలుసు; శబ్దార్థాలు తెలుసు; కాని జరిగిన సంఘటన తెలువదు. మొత్తంమీద జనహృదయ సంశోధనం చేసి సాధించారు. కొండను త్రవ్వి ఎలుక పట్టారన్న సామెత ఎలాంటిదైనా తవ్వితే గాని అంతకు అంత దొరకదు మరి! ఇంత దొరికినప్పుడు అంతా అర్థమవుతుందిగా మరి!

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️ ☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼

పూల కిరీటం – పండిత గౌరవం (02-Dec-23, Enlightenment Story)

 *పూల కిరీటం – పండిత గౌరవం*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సదాశివం సేలంలో నివసించే ఒక బ్రహ్మచారి యువకుడు. మహాస్వామి వారిపై అతనికి ఎనలేని భక్తి. ఒక హోటలు గదిలో అద్దెకు నివసించేవాడు.

సేలంలోని కంచి మఠంలో 1990 లో ఒక పెద్ద హోమం జరిగింది. దాదాపు 60 మంది వేద పండితులను, విధ్వాంసులను దూరప్రాంతాల నుండి పిలిపించారు. ఆ హోమం 11 రోజుల పాటు జరిగింది. ఆ యాగానికి కావాల్సిన పూలను సర్దుబాటు చెయ్యడం సదాశివం బాధ్యత.

సశాస్త్రీయంగా వైదిక నిష్ఠతో హోమం ముగిసింది. నిర్వాహకుల తదుపరి కర్తవ్యం మరుసటి రోజు ఆ తీర్థ కలశాలను, హోమ రక్షను మహాస్వామి వారికి సమర్పించి వారి ఆశీర్వాదం పొందటం. ముగ్గురు ప్రముఖులతో కలిసి వైదిక పండితులు బృందం మూడు వాహనాల్లో కాంచీపురానికి బయలుదేరారు. మొత్తం హోమానికి పూలను సమకూర్చిన, పూల అలంకారాలు చేసిన సదాశివం కూడా వారితో బయలుదేరాడు. కాంచీపురం వెళ్ళే మార్గమంతా బాగా వర్షం పడుతోంది. కొన్ని గంటల ప్రయాణం తరువాత వారు హోమ భాగాలతో కంచి చేరుకున్నారు.

మహాస్వామి వారిని దర్శించుకుని వారు తెచ్చిన కలశ తీర్థంతో పాటు హోమము భాగములన్నిటిని పరమాచార్య స్వామి ముందు పెట్టారు. వాటిని చూడగానే మహాస్వామి వారు చాలా మహాదానందపడ్దారు. ఎందుకంటే వారికి మాత్రమే తెలుసు జరిగిన ఆ హోమము యొక్క ఫల్ము బలము ఎంతటిదో. .

“ఎవరు చేసారు దీన్ని?” మహాస్వామి వారు అడిగారు. 

వాహనాల్లో వచ్చిన వారు సమాధాన పూర్వకంగా సదాశివం వైపు చెయ్యి చూపించారు. నడుముకు లుంగి చుట్టుకుని పైన ఎర్ర చొక్కా వేసుకున్న అతను గుంపు నుండి ముందుకు వచ్చాడు.

పరమాచార్య స్వామి వారు ఆ పూల కిరీటాన్ని తమ తలపై ఉంచుకుని, పెదవుల పై చిరునవ్వుతో “నాకు బాగా కనిపిస్తోందా?” అని అడిగారు.

ఆనందంలో ఏమి మాట్లాడాలో తెలియక చుట్టూ ఉన్నవారు బావుందన్నట్టు తల పంకించారు. పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసారు. ఈలోగా సదాశివం తన చొక్కా విప్పి, ముందుకువెళ్ళి మహాస్వామి వారి ముందు నిలుచున్నాడు. శ్రీవారితో ఏమి చెప్పాలో అతనికి తెలియదు. చేతులు కట్టుకుని వారి ముందు నిలబడ్డాడు. కళ్ళల్లో నుండి కన్నీరు ఉబికి వస్తూ ఉంది. పరమాచార్య స్వామి వారు వారి తలపై నుండి ఆ పూల కిరీటం తీసారు. సదాశివాన్ని చూసి చిన్నగా నవ్వి, కొద్దిగా ముందుకు వొంగమన్నారు. వెంటనే తమ చేతులలో ఉన్న ఆ కిరీటాన్ని అతని తలపై ఉంచారు. అహా ఎంతటి అదృష్టం!!

అక్కడున్న వారందరికి తన్మయత్వంతో ఒళ్ళు పులకరించింది. అప్పటి దాకా పండితులు, విద్వాంసులకు మాత్రమే మహాస్వామి వారు తమ స్వహస్తాలతో పూల కిరీటం పెట్టి గౌరవించేవారు.

బహుఃశా తనను పూలతో ఇలా ఆరాధించి పూజిస్తున్న ఇతనికి కూడా ఆ గౌరంవం ఇవ్వాలని స్వామివారికి అనిపించిందేమో!!!✍️

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...