Tuesday, 21 November 2023

దేవుడు మెచ్చిన 8 పూలు (22-Nov-23, Enlightenment Story)

 *దేవుడు మెచ్చిన పూలు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

🍁మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. 

ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని. 

సగుణోపాసన - దైవాన్ని ఓ విగ్రహంలోనో, పటంలోనో, శిలలోనో చూసుకుంటూ, అదే నమ్మకంతో పూలు, ధూపదీప నైవేద్య, తాంబూలాదులతో అర్చించడం సగుణోపాసన, పేరు.. రూపం మొదలైనవి ఏవీ లేవని, 

నిర్గుణోపాసన - స్వామి నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడని ఆత్మజ్ఞానంతో, ధ్యానంతోఉపాసించడమనేది నిర్గుణోపాసన. 

🍁కొద్దికాలమే ఉండి, తరవాత వాడి, వాసన కోల్పోయి, నిర్మాల్యంగా మిగిలిపోయే ఈ పూలకంటే నిజంగా దైవం మెచ్చిన పూలు వేరే ఉన్నాయి. అవి అంతర్యామికి అర్పించుకోవడమే అసలైన పూజ అని విజ్ఞులు చెబుతున్నారు.

🍁పరమాత్మకు అందించవలసిన ప్రథమపుష్పం అహింస. మనం అహింసా ధర్మం పాటిస్తే ఆ పుష్పంతో పరంధాముణ్ని పూజించినట్లే. లోకంలో దీన్ని మించిన ధర్మం లేదు కనుక దీన్ని పరమధర్మం అన్నారు. శారీరకంగా సాటివారిని హింసించడం శారీరక హింస. మానసికంగా హింసించడం మానసిక హింస. ఈ రెండూ మనిషికి కూడనివి.

🍁రెండో కుసుమం- ఇంద్రియ సంయమనం. మనిషి ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే పాపాలు చేయడు. నేడు ముఖ్యంగా సంయమన లోపం వల్లనే సమాజంలో ఎన్నో దుష్కృతాలు జరుగుతున్నాయి. దోపిడీళ్లు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, పగలు, ప్రతీకారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మనోనియంత్రణ ఉంటే ఇటువంటి అల్లకల్లోలాలు చాలావరకు తగ్గుతాయి.

🍁మూడోది దయాపుష్పం. సృష్టిలోని ప్రతి ప్రాణికీ జీవించే హక్కుంది. 'బతుకు, బతకనివ్వు' అన్నారు అందుకే! సమాజం ఎంతోమంది అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పీడితులు, క్షుద్బాధతో అలమటిస్తున్నవారున్నారు. వారిపట్ల దయ చూపించడమే కాక, ఆదుకుని చేయి అందించడం మన ధర్మం. ఈ దయా ప్రసూనాన్నే దేవుడు స్వీకరిస్తాడు.

🍁మరో పుష్పం - క్షమా పుష్పం. క్షమ అంటే ఓర్పు, సహనం. క్షమ అనేది మనిషికి పెట్టని ఆభరణం. క్షమ వల్ల ఖ్యాతి లభిస్తుంది. గౌరవం, అధికారం, అభిమానం సహనం వల్లనే లబిస్తాయి.

🍁ఆశ్రితవత్సలుడు మెచ్చే మరో అపురూప ప్రసూనం- శాంతి. ఎన్ని కష్టాలు పడ్డా తుకారాం, మీరాబాయి శాంతిని విడనాడలేదు.

🍁తపఃపుష్పం దేవుడు మెచ్చే మరో పుష్పం. అడవుల్లో చేసేదే తపస్సు కాదు. నిరంతరం త్రికరణ శుద్ధిగా దైవాన్ని స్మరిస్తూ తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావడమూ తపస్సే. అరిషడ్వర్గాలను దూరంగా ఉంచి, తమ విధులనే నిధులుగా భావించేవారిని భగవంతుడు ఇష్టపడతాడు.

🍁మరో పుష్పం ధ్యాన పుష్పం. శ్వాసపైన ధ్యాస ఉంచి, అహం బ్రహ్మాస్మి అనుకోగల పరిణతి పొందడమే ధ్యాన పుష్పం.

🍁చివరి పుష్పం సత్యం. విశ్వమంతా సత్యం మీదనే ఆధారపడి ఉంది. సత్యం నిత్యమైనది. శాశ్వతమైనది. సత్యమే దైవమన్నారు.

🍁ఈ అష్టగుణ సుమాలతో చేసే ఆరాధనే తన కిష్టమన్నాడు ఆపద్బాంధవుడు.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Saturday, 18 November 2023

నేనెవరు? (21-Nov-23, Enlightenment Story)

 *నేనెవరు? *

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 .

ఒకసారి ఒక కుందేలు క్యారెట్లు కొరుక్కుంటూ పోతూంటే దానికో ధర్మ సందేహం కలిగింది. "నేనెవరు?" అని. అది పోయి వాళ్ల అమ్మను అడిగింది: "అమ్మా! నేనెవరు?" అని. "నువ్వు నా బిడ్డవు నాన్నా" అన్నది ఆ తల్లి. కానీ కుందేలు పిల్లకి అది పూర్తి జవాబు కాదనిపించింది.

అందుకని అది పోయి తన స్నేహితుడైన అడవి పిల్లిని అడిగింది: "సరేగానీ ఒరేయ్, నీకు పంది కొక్కుల్ని ఎలా వేటాడాలో తెలుసా? నాకు నిన్ననే నేర్పాడు మా నాన్న!" అన్నది అడవిపిల్లి ఉత్సాహంగా. దానికి తనెవరో తెలుసుకుందామని బొత్తిగా లేదు మరి!

కుందేలు పిల్లకు నిస్పృహ కలిగింది. అది నిరాశగా తల వంచుకొని పోతూంటే దానికో కోయిల ఎదురైంది- పాటలు పాడుకుంటూ. "నేనెవరు?" అని కుందేలు అడిగితే అది సంతోషంగా కూసింది. "నువ్వే నేను, నేనే నువ్వు! నిన్ను నువ్వు నేనంటే, నేను నిన్ను నిన్నంటా" అని పాడుతూ ఉత్సాహపడిందది.

కుందేలుకి ఆ పాట విని నవ్వైతే వచ్చింది కానీ, తన ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు.

ఆ పైన దానికి ఓ నెమలి ఎదురైంది. వాన గాలి చల్లగా వీస్తూంటే, దూరం నుండి తియ్యగా మట్టి వాసనని మోసుకొస్తుంటే ఆగలేక, అది నాట్యం మొదలెట్టింది. ముఖం చిన్నగా చేసుకొని కుందేలు `నేనెవరు?' అని అడిగింది దాన్ని. నెమలి నవ్వింది. "అరే, ఇది ఆలోచించే సమయం కాదురా, ఆనందించాల్సిన సమయం! చూడు చుట్టూతా, ప్రకృతి ఎంత బాగుందో!? ఇలాంటి సమయం ఎప్పుడూ ఉండదు. సంతోషపు ఘడియల్ని ఆలోచనల్తో వృధా చేసుకోవద్దమ్మా, నాట్యంచెయ్ నవ్వుతూ! దా, కావాలంటే నీకు నేను నాట్యం నేర్పిస్తాను!" అన్నది నెమలి, నాట్యం ఆపకుండానే.

కుందేలు చికాకు పడి, `వీళ్లను కాదు, అడగాల్సింది!' అనుకున్నది. "నీళ్లలో నిలబడి నిశ్చలంగా తపస్సు చేసుకొనే కొంగే ఈ ప్రశ్నకు జవాబివ్వగలిగేది." అలా అనుకుని, అది కొంగను వెతుక్కుంటూ పోయింది. అనుకున్నట్టుగానే కొంగ నీళ్లల్లో నిలబడి కనిపించింది దానికి. చాలా సార్లు పిలిస్తే కానీ దాని ఏకాగ్రత తెగలేదు. అప్పుడు కూడా అది కుందేలుకేసి ఓ సారి అలా చూసి, మళ్లీ నీళ్లలోకి చూడటం మొదలుపెట్టింది. కుందేలు చాలాసార్లు అడిగిన తరువాత, అది అన్నది మెల్లగా - "చూడు నాయనా, మనందరం చేపలమే. ఎటొచ్చీ అవి నీళ్లల్లో ఉంటాయి. మనం మాత్రం గాలిలో ఉంటాం. అవి నీళ్లలో తిరుగుతై, మనం గాలిలోనూ, నేలమీదా తిరుగుతాం" అని.

కుందేలుకు ఆ సమాధానమూ తృప్తినివ్వలేదు.

చివరికి అది ఓ ఋషి ఆశ్రమానికి చేరింది. అక్కడ ఋషి కూర్చొని ఏవో ధర్మ గ్రంథాలు చదువుకుంటున్నాడు. "నేనెవరు స్వామీ" అడిగింది కుందేలు చేతులు జోడిస్తూ. "అది కనుక్కునేందుకే నేను ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నానమ్మా కుందేలూ! నాకు ఇంకా ఈ జీవితం ఏంటో అర్థం కాలేదు" అన్నాడు ఋషి, విచారంగా.

అయితే కుందేలు సంతోషంగా ఎగిరి, నమస్కారాలు పెట్టి, ఉత్సాహంగా ఇంటి వైపుకు పరుగులు తీసింది. దానికి అర్థమైపోయింది- తను వేరెవరో కాదు, తను కుందేలు!" అని. అడవి మూల నుండి మరికొన్ని క్యారెట్లు పెరుక్కొని తింటూ అది ఉత్సాహంగా అనుకున్నది మళ్లీ మళ్లీ - "నేను కుందేలును! నేను కుందేలును!" అని.ఒక అన్వేషణగా సాగి, పేరు మళ్లీ గుర్తుకుతెచ్చుకోవడంతో ముగుస్తుంది 

మానవుని కథాఅంతే, లౌకికవ్యవహారాలలో పడి,మానవుడు తాను ఎవరైనదీ మరచిపోతున్నాడు. “నేనెవరు?” అని ప్రశ్నించుకొని,సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు.

ఈ నిస్పృహ నుండి బయటపడి జీవితం పట్ల ఆసక్తీ,ఉత్సాహం ఏర్పడాలంటే సమాజాన్ని, పరిస్థితుల్ని దాటి చూడాలి. అత్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ఇందుకు సంస్కృతి సహకరిస్తుంది

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Monday, 13 November 2023

మౌనం యొక్క మహిమ (20-Nov-23, Enlightenment Story)

 *మౌనం యొక్క మహిమ*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

1. మౌనము జీవితమునకు పరమ మిత్రుడు.

2. మౌనము ద్వారా ఆత్మ చింతన యొక్క బలము లభిస్తుంది.

3. మౌనము  ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది.

4. మౌనము ఆధ్యాత్మిక  జీవితము కొరకు బ్రహ్మాస్త్రము.

5. మౌనము అనగా వ్యర్థమైన మరియు సాధారణమైన సంకల్పాల నుండి ముక్తి అవ్వడం.

6. మౌనము మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుతుంది.

7. మౌనము అశరీరి స్థితిని తయారు చేసుకునేందుకు సహజ సాధనం.

8. మౌనము అనగా శ్రేష్టమైన క్వాలిటీ కలిగిన సంకల్పాలు చేయాలి.

9. మౌనము -  వ్యర్థం నుండి ముక్తి చేసే అద్భుత ఇంజక్షన్.

10. మౌనము -  ఆలోచనా విధానాన్ని శ్రేష్టంగా చేసుకునేందుకు ఒక టానిక్.

11. మౌనము - కలహః, క్లేశాలను సమాప్తం చేసే ఒక మంచి ఔషధం.

12. మౌనము -  మనస్సు యొక్క స్థితిని ఏకరసంగా తయారుచేసే మందు.

13. మౌనము - మౌనం యొక్క సాధన ద్వారా మనస్సు యొక్క శక్తి పెరుగుతుంది.

14. మౌనము - స్వధర్మంలో స్థితులయ్యేందుకు ఒక  శ్రేష్ఠ విధి.

15. మౌనము - పరమాత్మ ప్రేమలో లవలీనమయ్యేందుకు సహజ ఉపాయం.

16. మౌనము -  విస్తారాన్ని సారములోనికి తీసుకువచ్చేది.

17. మౌనము - దేహము మరియు దేహపు ప్రపంచము నుండి అతీతంగా అయ్యేందుకు సహజ ఉపాయం.

18. మౌనము-  పరమాత్మ సుఖం యొక్క అనుభూతిని చేసుకునేందుకు సహజ సాధనము  

19. మౌనము - మన్మనాభవ మరియు మధ్యాజీభవగా అయ్యేందుకు  సంజీవని మౌలిక.

20. మౌనము - పరమాత్మ శక్తులను అనుభూతి చేసుకొనేందుకు శ్రేష్ట మార్గము.


☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

తృప్తితోనే పరమానందం! (19-Nov-23, Enlightenment Story)

     *తృప్తితోనే పరమానందం!*

     🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

"గురూజీ! నేను ఈ గ్రామములో ధనికుణ్ణి. విరివిగా  దాన ధర్మాలు చేస్తుంటాను. తమరు మా గ్రామానికి వచ్చిన శుభ సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేశాను. మీరు దయతో  మా ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాను.

"ఓ కోటీశ్వరుడా! విశ్వాన్ని సృష్టించినా, నిగర్వముగా ఉండే పరమాత్ముని కన్నా ధనికుడెవరు ? మేరు పర్వతమంత ధనం కూడా ఆయనకు చిల్లి గవ్వతో సమానం. ప్రకృతి దాన గుణానికి మరో పేరు. అది అందరికీ అన్నిటినీ ఇస్తూనే ఉంటుంది.    అలాంటి ప్రకృతిని ప్రపంచానికి దానం చేసిన మహాదాత ఆపరమాత్మ. ఆయన దాతృత్వం ముందు ఎవరూ అధికులు కారు. 

నేను మర్యాదలు ఆశించను. నీకంటే ముందు ఈ పేద వడ్రంగి తన ఇంటికి భోజనానికి పిలిచాడు. నేను ఎవరి ఇళ్ళకు వెళ్ళను. అది తెలిసే అతడు ఇక్కడికే ఆహారం తెచ్చాడు. నువ్వు కూడా అలాగునే చేయవచ్చును!" అని అన్నాడు గురు నానక్.

ఆ మాటలు విన్న కోటీశ్వరుడు "అలాగే గురు మహరాజ్ !" అంటూ తన సేవకులతో విందు భోజనాన్ని పరుగుల మీద అక్కడికి తెప్పించాడు.

గురునానక్ చుట్టూ ఆ గ్రామ ప్రజలు చేరారు. ఎవరి ఆహారం గురువు మెచ్చుకొంటాడో అని అందరూ కుతూహలంతో చూస్తున్నారు.  వండ్రంగి తెచ్చిన ఆహారంలో ముతక గోధుమ పిండి రొట్టెలు, రెండు మామిడి పళ్ళు వున్నాయి.

ధనికుడు తెచ్చిన ఆహారంలో మేలు రకం గోధుమ పరోటాలు, పసందైన మామిడి రసాలు ఉన్నాయి. గురునానక్ కుడి చేత్తో, వండ్రంగి తెచ్చిన మామిడి పండు తీసుకొన్నాడు. ఎడమ చేత్తో ధనికుడు తెచ్చిన మామిడి పండు తీసుకున్నాడు.

ముందుగా వండ్రంగి తెచ్చిన మామిడి పండును గట్టిగా పిండాడు.  అందు లోంచి పాలు వచ్చాయి.  అందరూ ఆశ్చర్యపోయారు. 

మామిడి పండులోంచి పాలు రావడమేమిటని ? 

అప్పుడు ధనికుడు తెచ్చిన తెచ్చిన పండును పిండాడు గురునానక్. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎర్రని నెత్తురు కారింది. ధనికుని నోట మాట రాలేదు.

ఓ ధనికుడా ! ఈ వడ్రంగిది కష్టార్జితం. రెక్కల కష్టంతో సంపాందించినది. అందుకే అది పాలతో సమానం. నువ్వు అవినీతితో, పేదలను పీడిస్తూ కూడబెట్టిన సొమ్ము నెత్తుటి కూడుతో సమానము. అందువల్లన మాలాంటి సాధువులు తినకూడదు.

భగవంతునికి, సాధువులకు కష్టార్జితమే సమర్పించాలి. ఎవరికి వారు కష్టార్జితం తింటేనే, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. అన్యాయార్జితం అనారోగ్యాన్నీ , అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది.

అందుకే అత్యాశకు బానిసలు కాకండి. లభించిన దానితో తృప్తి పొందండి. తృప్తితోనే పరమానందం లభిస్తుంది.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Friday, 10 November 2023

🧘‍♂️ఒక మంచి స్ఫూర్తి నిచ్చే కథ🧘‍♀️ (18-Nov-23, Enlightenment Story)

 🧘‍♂️*ఒక మంచి స్ఫూర్తి నిచ్చే కథ*🧘‍♀️

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

దట్టమైన అడవిలో చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్ తొలి డెలివరీ కేసు1943 డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే హుబ్లీలో ఉంటాడు తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి.

జూలై తుఫాను రాత్రి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్ ’’

ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు. గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె. అయోమయంగా చూశాడు డాక్టర్.

ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… 

‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి 

ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు డాక్టర్ కదా ఊరుకోలేకపోయాడు

నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు ఆమెను అడిగాడు అసలు ఎవరు నువ్వు ? ఇక్కడికి ఎలా వచ్చావు..?’

‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ  *మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు* అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు  అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను ఈ కడుపు ఆ ప్రేమ వల్లే కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు.

 ఇటువైపు ఎవరూ రారు నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు అంటూ రోదించసాగింది. డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది. కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు. పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది. డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి. నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్’

కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు, పిల్ల ఏడ్చింది. ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే.తన జీతమే 75 రూపాయలు. ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది. ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు. ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు.

సంతోషమో, దుఖమో. మన చేతుల్లో ఏమీ లేవు. జరిగిందేదో జరిగిపోయింది. అన్నీ మరిచిపో .నీ జీవితం నీది ప్లాన్ చేసుకో ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది. అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు. వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు తను తప్పక సాయం చేస్తాడు ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఏళ్లు గడిచాయి. కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు. ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు. అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు. ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది. సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా.?’ అనడిగింది.

‘అవును, చాలా ఏళ్ల క్రితం. నాకు ఆ ఊరితో బంధముంది.అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’

‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’

‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్…నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను.

'ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’

‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది.

డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా ఆయన పాదాలపై పడింది ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్ ఆయన గందరగోళంలో పడిపోయాడు తరువాత ఆమె చెప్పింది

‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు ఆరోజు పుట్టింది ఈ బిడ్డే మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను స్టాఫ్ నర్స్ అయ్యాను నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను మీరే స్పూర్తి ఆశీర్వదించండి సార్అంది చేతులు జోడిస్తూ

ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి తన తొలి డెలివరీ కేసు ఆమె అదీ ఓ గడ్డు స్థితిలో డాక్టర్ చంద్రను అడిగాడు ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’ అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను

అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే.  మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే ఆమె చెబుతూనే ఉంది

ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు ఆగడం లేదు జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే

చెప్పనేలేదు కదూ… ఈ డాక్టర్ కులకర్ణి ఎవరో తెలుసా..? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి.

ఆహా...ఎంత గొప్ప మనసులు...

ఇటువంటి చరిత్రను నేటి తరం పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తేనే మన భావితరం ఆదర్శంగా జీవిస్తారనటంలో అతిశయోక్తి లేదేమో.!!

ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే కథ.!హృదయలోతుల్లోంచి ఆర్ధ్రత పొంగుకు వచ్చే కథ.!  చదువుతుంటే  కళ్ల వెంట ఆనందబాష్పాలు రాల్చిన కథ.!


☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

🪷🪷🧘‍♂️🧘‍♀️🪷🪷

Thursday, 9 November 2023

మాయ యొక్క ప్రభావమును తప్పించుకోవడం (17-Nov-23, Enlightenment Story)

*మాయ యొక్క ప్రభావమును తప్పించుకోవడం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁               

పరమాత్మ పాదాలు ఆశ్రయిస్తే మనం ఎలా రక్షింపబడతాము. ఆ స్వామి పాదాలచెంతకు మనం చేరగలిగితే మనకిక ఏచింతా వుండదు.

అది ఎలానో వివరిస్తాను....

ఒక బెస్తవాడు చెరువులో చేపలు పట్టడానికి….  వలను చెరువులోనికి విసురుతూవుంటాడు. ఆ వలలో చిక్కుకొని ఎన్నో చేపలు ప్రాణాలు కోల్పోతుంటాయి. ప్రతిరోజు అదే విధంగా జరుగుతూ వుంటుంది రోజురోజుకూ చేపలసంఖ్య తగ్గిపోతూవుంటుంది. అప్పుడు ఆ చేపలకు ఒక ఆలోచన వచ్చింది…. 

ఆ బెస్తవాడికి దూరంగా మనము వుంటున్నాము కనుకనే  వలలో చిక్కుతున్నాము. అదే అతని పాదాలచెంత చేరామంటే వలలో పడబోము!’అనుకొని అన్నీ అతని పాదాలచెంతకు చేరుకున్నాయి. 

ఆరోజునుండి ఏచేపకూడా వలలో చిక్కుకోలేదు!   వాటి ప్రాణాలను  కాపాడుకోగలిగాయి. మనకు వచ్చే కలతలు కష్టాలు కూడా ఆ వలలాంటివే!

కాలం ఎప్పుడూ మనపై ఏదో ఒక మాయ అనే వల విసురుతూనే వుంటుంది! వాటికి భయపడకుండా మనము ఆ పరమాత్మ పాదాలు ఆశ్రయిస్తే మనకు తప్పక రక్షణ దొరుకుతుంది. 

’మన భారం అంతా ఆ తండ్రే చూసుకుంటాడు !’ అనే నమ్మకంతో వుండగలగాలి! అంతే... భగవంతుని పాదాలు ఆశ్రయించినవారికి మాయ దారి ఇస్తుంది!  అంటే వారి పై మాయ యొక్క ప్రభావం పని చేయదు.✍️

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

బ్రహ్మము గురించి బ్రహ్మమై చెప్పాలి (16-Nov-23, Enlightenment Story)

 *బ్రహ్మము గురించి బ్రహ్మమై చెప్పాలి*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మనం  పూజగదిలోనే  దేవుడికి  పరిమితమై  ఉంటాం.  బయటికి  వచ్చాక  దేవుడితో  సంబంధం  లేకుండా  ఉంటాం.  అలా  భౌతికం,  ఆధ్యాత్మికం  అని  రమణమహర్షిగారు  విడదీయరు.  నువ్వు  ఎవరికైనా  ఏదైనా  సహాయం  చేస్తున్నా  దేవుడికి  చేస్తున్నావని  తెలుసుకోవాలి.  నీ పని  నువ్వు  చేస్తున్నప్పుడు  కూడా  అది  నీ సొంతం  అనుకోకుండా  దేవుడు  నీకు  పురమాయించిన  పనినే  నువ్వు  చేస్తున్నావు  అని  తెలుసుకోవాలి.  

Everything  happens  in  its  own  time.

భౌతికమైనా,  ఆధ్యాత్మికమైనా  నువ్వు  ఆత్రుత  పడినంతమాత్రాన  జ్ఞానం  రాదు.  మామిడికాయను  సరైన  సమయానికి  అంటే  పక్వానికి  వచ్చినప్పుడు  మగ్గేస్తే  పరవాలేదు.  ఈ లోపు  కంగారుపడి  మగ్గేస్తే  ముగ్గదు  సరికదా  కుళ్ళిపోతుంది.  భౌతికమైన  విషయాలైనా,  ఆధ్యాత్మికమైన  విషయాలైనా  అంతే.  నీ చేతిలో  ఉన్నపని  నువ్వు  చేస్తూ  జ్ఞానానికి  కూడా  కంగారు  పడకూడదు.  నీకెప్పుడు  తెలియబడాలో  ఆ సద్వస్తువు  నిర్ణయించుకుంటుంది.  మనకు  రేపు  మరణం  రావాలని  ఉంటే  రేపే  వస్తుంది  గాని  ఇవాళ  రాదు  కదా!

భౌతికమైన  సంఘటనలు  అయినా,  ఆధ్యాత్మికమైన  అనుభవాలు  అయినా  ఏవి  ఎప్పుడు,  ఎక్కడ,  ఎలా  జరగాలో  అలా  జరుగుతాయి.  ఇక్కడ  రహస్యం  ఏమిటంటే,  నువ్వు  Deserve  అయితే  నీకు  Desire  అక్కర్లేదు.  యోగ్యత  కలిగినప్పుడు  కోరికతో  సంబంధం  లేకుండా  భగవంతుడు  నిన్ను  అనుగ్రహిస్తాడు.  నీకు  యోగ్యత  లేనప్పుడు  కోరిక  ఉన్నా  అది  నీకు  లభించదు  అనేది  సూత్రం.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...