Tuesday, 12 September 2023

అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖ (14-Sep-23, Enlightenment Story)

* ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన  లేఖ! *

  🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁🍁 

తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ  ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖ… ఇది ప్రతి తల్లికి, తండ్రికి, టీచర్ కు, విద్యార్ధికి చేరాల్సిన లేఖ.

" మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు. కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది. అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.

ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు.ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకిరావచ్చు. అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా? 

1.ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి. అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.

2.ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ  జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి.

3.అప్పనంగా దొరికిన ₹100 కన్నా సొంతంగా సంపాదించుకున్న ₹10  ఎక్కువ విలువైనవని నేర్పండి. స్కూల్లో మోసం  చేసి గెలవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి.

4.ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం,.. నేర్పండి.

5.అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.

6.అసూయకు వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.

7.వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి. కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.

8. ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి. 

9. పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి.

10. అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ, వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి.

11.అందరూ దేన్నో అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి.

12.అందరు చెప్పేదీ వినమనీ, సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.

13. తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి కానీ తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.

14. అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.

15.ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ,అప్పుడే మానవాళి మీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.

మీకు వీలైనంత వరకూ ప్రయత్నించి  వాడిని మంచి పిల్లవాడుగా మలచండి.మీరు మలచ గలరు. ఇది మా నమ్మకం.

* ఈ విలువైన సమాచారం ఉన్న ఈ ఉత్తరం నేటి తరం తల్లిదండ్రులకు,  ఉపాధ్యాయులకు*

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

దేవుడికి తెలుసు ఏది ఎలా చేయాలో (13-Sep-23, Enlightenment Story)

 *దేవుడికి తెలుసు ఏది ఎలా చేయాలో*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 

ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆగుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు.. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది. కుంభవృష్టి లా మారింది..


ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడలేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకోని ఆటవికులు పూజించే ఆదుంగని కొట్టబోయాడు. వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది. అందులో ఉన్న అమ్మ.. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో..

అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని.. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నాకడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆబోయవాడిని కనికరించిందా! అని గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎట్టాడో లేదో కళ్ళు పోయాయి. చూపు పోయింది.

అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని. దేవుడంటే ఏమిటో తెలియదు. నన్ను చూసి ఒట్టి కట్టే ముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వు అనుకోని నువ్వు కూడా అదేపని చేయబోయావు. ఏమితెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి.. అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు అనగా అమ్మ కనుక కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వేళ్ళు. వెళ్లి అక్కడ ఏమి జరుగుతుంది చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి..

బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజూ ఆరంగా ఆరంగ త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగత్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడలి.. బాగా త్రాగాలి అని అడిగాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లిపోయారు.. అకారణంగా వచ్చిన సంపద ఆకారణంగానే పోయింది. ఆసంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.🙏

చూసేరా నిత్యం పూజలు చేస్తూ మధ్యలో నాస్తికవాదం లోకి మారితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. దేవుడిని వేడుకోక ముందు కష్టాలు ఉన్నాయి. వేడుకున్న తరువాత ఇంకా కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసిన పాపాలు ముందుగా తీసేస్తున్నాడు అని అర్థం. అంతేకాని అడిగిన వెంటనే సుఖం ఇచ్చి కోరిన కోర్కెలు తీరిస్తే సుఖంగానే ఉంటాం.కానీ మళ్లీ ఏదో ఒక సమయంలో కష్టాలు చుట్టుముడతాయి. మళ్ల జన్మ ఎత్తాలి  అప్పుడు మళ్లీ మళ్లీ పరుగులుపెట్టాలి అవసరమా 

అదే మనం చేసిన పాపాలు ముందుగా ప్రక్షళన అయిపోతే చివరివరకు సుఖంగా జీవిస్తావు. అలాగే మనం కోరుకునే కోరిక కూడా మనకి తగినది అవునా కదా! అనేది కూడా తెలుసుకొని కోరుకోవాలి. కొందరు ఎంత వేడుకున్న కోరికలు జీవితంలో తీరవు. ఎందుకంటే వాడు దానికి అర్హుడు కాదు. 

నేను సీఎం అవ్వాలి అనుకుంటే అయిపోతుందా  అవ్వదు ఎందుకంటే నేను దానికి అర్హురన్ని కాదు కాబట్టి ఆ కోర్కె తీరదు. కష్టపడతాను సాధిస్తాను అంటే జీవితకాలం కష్టపడుతూనే ఉంటావు. కోట్లమందిలో ఒక్కడికి మాత్రమే అవకాశం వస్తుంది. అది నేను ఎందుకు కాకూడదు అని పిడివాదం చేస్తే నాస్తికుడిలా మారిపోతావు. చివరికి భ్రష్టత్వం వస్తుంది. 

మనకు ఏది కావాలో మనకు తెలీదు.  మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు.

దైవానికి ఎవరిమీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతిపనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి.🙏

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Monday, 11 September 2023

డిగ్నిటీ ఆఫ్ లేబర్ (12-Sep-23, Enlightenment Story)

 *డిగ్నిటీ ఆఫ్ లేబర్*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

సికింద్రాబాద్ to విజయవాడ ట్రైన్ లో వస్తున్న ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ. ముందు సీట్లో  ఓ  కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు.




ఏరా తమ్ముడూ!! సమోసాలు మెుత్తం అమ్మేసావా. ”??

“అవును సార్!”

“పాపం రోజంతా కష్టపడుతున్నావ్?

“అవును సార్!! 

ఏంచేస్తాం.. పొట్ట కూటి కోసం తప్పదు కదా!!”

ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది...రా..???

“రూపాయి వస్తుంది సార్!!”

“రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??”

“మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 – 3,500 అమ్ముతాను.. ఇగ తక్కువలో తక్కువ 2000 సమోసాలు ఒక రోజుకు. గ్యారెంటిగ అమ్మే పోతా ఇంటికి

ఎదుటి వ్యక్తి  మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 సమోసాలంటే వీడికి 2000రూ.. నెలకు ₹ 60,000/- రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే.. వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా

“తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని”

“లేదన్నా మా యజమాని తయారుచేస్తారు.!!

“ఇవి కాకుండా ఏం చేస్తావు!!”

“వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్న..ఇంక సీజనల్ బిజినెస్ లు చేస్తా .... పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… నా అక్క పెళ్ళి చేసాను… ఆ పొలం విలువ ఇప్పుడు పది లక్షలుంటది…????????

ఎదుటి వ్యక్తికి  మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.. అనుకుని తమ్ముడు!! ఏం చదువుకున్నావు..

మూడో తరగతి ఏం నీకు చదవాలని లేదా!!!

సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు.. కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!! 

ఇదే మా అయ్య నాకు నేర్పిన నీతి… నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది… ఇంక నాకు చదువెందుకు.??

అబ్బా ఎంత గొప్పనీతి సూత్రం!!! అన్నా నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!!

ఇప్పుడు చెప్పండి…. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళూ కారు…. 

చదువులేని వారు అనామకులూ కాదు…

మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలచు కుంటే. రేపు మనదే…!!✍️

దీనినే …‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటారు.✍️

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Friday, 8 September 2023

తిలా పాపం తలా పిడికెడు (11-Sep-23, Enlightenment Story)

 *తిలా పాపం తలా పిడికెడు అంటే ఏమిటి? *

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁


ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతుంది ఆహారంగా చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదలిపెడుతుంది. అదే సమయానికి, గొల్లభామ తలమీది గంపలోని ఒక పెరుగు ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం (గాలి వీచి), పెరుగు ముంతలో విషం పడుతుంది. 

ఆ విషయము తెలియక గొల్లభామ పెరుగు ముంతను ఒక భక్తుడుకి అమ్ముతుంది.  భక్తుడు ఇంటికి వచ్చిన అతిధికి భోజనం లో వడ్డించగా విషపూరితమైన పెరుగు తిని కాలం చేసేడు

పాము ముందే మరణించింది, గొల్లభామ, గద్ద కూడా మరణించారు. ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమయింది, ఈ బ్రహ్మ హత్యాపాతకాన్ని ఆబ్దీకం పెట్టిన భక్తుడి కాతాలో రాశాడు, చిత్రగుప్తుడు.

భక్తుడి పాపాల చిట్టా చదువుతున్నాడు, చిత్రగుప్తుడు. అప్పుడు భక్తుడు, ధర్మ ప్రభో! ఇది అన్యాయం, ఈ బ్రహ్మహత్యాపాతకం నాది కాదు, నేను అతిధిని పిలిచి ఆయనకు భోజనం పెట్టాను తప్పించి, ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు, అందుకు తప్పు నాది కాదు కనక పాపం నాది కాదన్నాడు.

పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు, గొల్ల భామను విచారించాలి ప్రభో అన్నాడు. గొల్ల భామను పిలిచి ఈ పాపం నీ కాతా లో రాస్తాము, విషమున్న పెరుగు అమ్మేవు కనక, అదీ కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేశావు కనక అంటే, బాబోయ్! నాది తప్పు కాదండి, నేను పాలు పెరుగు అమ్ముకుంటాను, నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు, తెలిస్తే అది భక్తుడుకి  అమ్మను కదా, నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పేను. గాలికి ఎగిరిపోతే తప్పునాది కాదు, అందుకు నాది తప్పు కాదు, కనక పాపం నాకు సంబంధం లేదంది. గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పని, గాలిని పిలిచారు.

గాలి వచ్చి దేవా! వీచడం నా లక్షణం, నా ధర్మం, నేను స్థంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభూ, అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం? అని పిలిచారు పాముని. పాము ధర్మ ప్రభూ! నా ప్రాణం పోతున్న సమయం, గద్ద కాళ్ళలో ఉన్నాను, ఏమి జరుగుతున్నది నాకేతెలియని స్థితి, ఎక్కడ విషం వదలిపెడుతున్నదీ కూడా చూడగల సమయం కాదు, కనక తప్పు నాది కాదు, ఈ బ్రహ్మ హత్యా పాతకం నాది కాదని మొర పెట్టుకుంది.

అప్పుడు, ఇక మిగిలింది గద్ద కనక గద్దను పిలిచారు, ఈ పాపం నీదేనా? అన్నారు. మహాప్రభో! పాము నా అహారం, గగన విహారం నా లక్షణం, పాము విషం వదులుతొందో లేదో నేను చూడలేదు, అందు చేత పాపం నాది కాదు అంది. 

మరి ఇంతకీ ఈ బ్రహ్మ హత్యా పాతకం ఎవరి కాతాలో రాయాలో యమధర్మరాజుకు కూడా బోధ పడలేదు, సమవర్తి అయివుండి కూడా. అప్పుడు సమవర్తి, చిత్రగుప్తుడిని ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభూ! భూలోకంలో ప్రజలు ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఒకరు, గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్ల భామది తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన భక్తుడిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభూ! అని నివేదికలో సంగతి చెప్పేడు. మరి కొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి కాతాలో రాయాలి? కనక, తప్పు ఎవరిదో ఇదమిద్ధంగా తేలలేదు కనక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసీ, తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు.

అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే "తిలా పాపం తలా పిడికెడు" అని అంటారు. అందుకే ఏ సంగతయినా, నేరమైనా చేసింది చేయనట్లు చేయనిది చేసినట్లు, పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు. 

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


Thursday, 7 September 2023

ఒకరికి ఒకరై (10-Sep-23, Enlightenment Story)

ఒకరికి ఒకరై

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁



ప్రతి జీవి శరీరంలో జీవకణాలు ఉంటాయి. అవి సమయోజనీయతతో సమన్వయంతో కలిసి ఉండకపోతే ఘర్షణ ఏర్పడుతుంది. ఫలితంగా సమతుల్యత లోపించి అనారోగ్యం పాలవుతామని శాస్త్రీయంగా నిరూపణ అయింది. అవి సవ్య, అపసవ్య దిశలలో కలిసి శరీరం సంకేతాలకు అనుగుణంగా సాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. లేకపోతే వ్యాధులకు గురవుతాం. 

ఒకరికొకరు సహాయం చేసుకోవడం, పరోక్షంగా ఎవరికి వారు సహాయం చేసు కోవడమే. ఈ రహస్యం తెలియని వాళ్లు ప్రతిదానికీ గొడవ పడతారు. కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు లాంటి చెడ్డ భావాలతో మనసును కలుషితం చేసుకుని బతుకుతుంటారు. ఆత్మాభిమానం అనే పేరుతో భీష్మించుకుని ఉంటారు. మనకు ఇంకొకరితో పనే ముందని గిరి గీసుకుని బతుకు తుంటారు. ఇది ఎవరికి వారు చేసుకునే ఎనలేని నష్టం. 

దీనివల్ల వారు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నిస్సహాయులుగా మిగిలిపోతారు. ప్రకృతితో, సృష్టితో క్రమక్రమంగా సంబంధాలు తెగిపోయి, ఒంటరివాళ్లయిపోతారు. ఇంకొందరు సహాయం చెయ్యకపోగా, ఇతరుల మనసులను పనిగట్టుకుని గాయపరుస్తుంటారు. ఇందులో లేశమాత్రమైనా సందేహం లేదు. వారు ప్రకృతికి, సృష్టికి వ్యతిరేకంగా జీవిస్తున్నవాళ్లు. నిక్కచ్చిగా చెప్పాలంటే వారికి బతకడం రాదు. బతుకులో ఇమడలేరు. నిత్యం విమర్శలతో, నిందలతో, అననుకూల ఆలోచనలతో, పాలలాంటి బతుకులో విషం కలుపుకొంటూ ఉంటారు.

ఆత్మ అందరిలో ఉంది. అది ధరించే శరీరాలన్నింటితో కలిపి పరమాత్మ అయింది. ఆ పరమాత్మ, ఏకత్వ భావనతో అలరారుతోంది. ఏ జీవికి మనం సహాయ నిరాకరణ చేసినా, అది మనల్ని పరమాత్మతత్త్వానికి దూరం చేస్తుంది. సహాయం చెయ్యడంతోనే ఆధ్యాత్మికత మొదలవుతుంది. జీవుడు జీవుడికి సహాయం చెయ్యాలి. జీవుడు దేవుడికీ సహాయం చెయ్యాలి. దేవుడికి సాయమా అని అనుకోకూడదు. దైవం చేస్తున్న పనికి తనవంతు సాయం చెయ్యాలి. శ్రీరాముడికి ఉడుత చేసిన సాయంలా.

భౌతికమైన కంటికి, స్థావర జంగమాత్మక ప్రపంచం అంతా విడిగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి భిన్నత్వంలో ఏకత్వం ఉంది. చూసే చూపు మారితే రూపు మారుతుంది. మనసు మారుతుంది. మనుగడ తీరు మారుతుంది. ఎదుటివాడిని ఎందుకు ప్రేమించకుండా ఉండకూడదో, దాని వల్ల కలిగే హాని ఏమిటో అరటిపండు వలిచి పెట్టినట్లు అర్థమవుతుంది.

మనిషి భూమి మీదకు రావడం నుంచి, తనను తాను తెలుసుకొని, తనలోని దైవత్వాన్ని గుర్తించేవరకు ఎంతో సహాయం పొందుతాడు. ఇది అందరికీ తెలియదు. కాని అది నిజం. ఈ దివ్యమైన ఆటలో పక్కవాడికి సహాయం చెయ్యడంలో గొప్పతనం, దివ్యత్వం ముందుగా ఎవరు గుర్తిస్తారో. వారే తమ ప్రయాణం చక్కగా సాగించి ధన్యులవుతారు!

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Tuesday, 5 September 2023

దేవుడు ఎక్కడ వున్నాడు (09-Sep-23, Enlightenment Story)

 దేవుడు ఎక్కడ వున్నాడు

 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂              

కాశీ వెళ్లే  ఓ రైల్లో   తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు. *స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా?* కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను.

సాధువు తల ఎత్తి అతని వంక చూసి,.  ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు. *దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?* పరిహాసంగా అడిగాడు అతను. అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు…



"నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు…పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. 

ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను". చెప్పిందా పిల్ల.

"ఎవర్ని చేసుకుంటావయితే?" ప్రశ్నించింది తల్లి. "మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు?" ఆడిగిందా అమ్మాయి. "మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు" చెప్పాడు తండ్రి.

"అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను."   చెప్పిందా పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి. తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక 'సరే' అన్నాడు.

ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. 'నన్ను పెళ్లి చేసుకో ' అని అడగబోతుండగా, 

ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది.   'ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు?' అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది.. 

అతని దగ్గరకు వెళ్లి   ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది.      

 'ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప. చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి' అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, 

ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది.    

కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే".

కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు. మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. 

భగవంతుని కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే , ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా భగవంతుడు దొరకడు. 

అదే భగవంతుని చిరునామా". వెతకవలసిన చోటు  మన హృదయం లో ఉన్న పరమాత్మను.భక్తితో ఆయనను దర్శించాలని అనుకోవాలి.✍️

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

నాస్తికుడికి దారి చూపించిన దేవుడు (08-Sep-23, Enlightenment Story)

⚜️  నాస్తికుడికి దారి చూపించిన దేవుడు !  ⚜️

 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂    

ఒక రోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు..!సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని,తిరుగు దారి పట్టాడు..! అలా ఓ గంట నడిచాక కాని అతనికి అర్థం కాలేదు..! తాను దారి తప్పి పోయాడని..!


అసలే అది కృూర మృగాలు కూడా తిరిగే అడవి..! ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు..! ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది..! నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు..!

అతనికి ఏం చేయాలో పాలుపోలేదు..!ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని, తెచ్చుకున్న కాసిన్ని నీళ్ళు కూడా తాగేసాడు..! పోనీ తన స్నేహితులకి,తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే,అక్కడ సిగ్నల్ అస్సలు లేదు..!

తనకు తెలియకుండానే… 'భగవంతుడా..!నాకేంటి ఈ పరిక్ష' అని సణిగాడు..!

వెంటనే తనలో తాను 'నా పిచ్చి కాని భగవంతుడే లేడు,ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు??'   అని అనుకున్నాడు ! అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని  కాపాడమని కోరుకోవాలనుకున్నాడు..!

వెంటనే ఆ నాస్థికుడు రెండు చేతులు జోడించి,తన మనసులో 'శివయ్య..!నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు.!' అని మొక్కాడు..!

మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కి పడి గావు కేక వేసాడు ఆ నాస్తికుడు.! ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు.!

అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి "దొర గారు,ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది!మీరేమైనా చూసారా?" అని అడిగాడు..! అందుకు ఆ నాస్తికుడు "నేను గంట నుంచి,ఈ చెట్టు కింద గుంట నక్కలా  కూర్చున్నా..!ఈ వైపు ఏ కుందేలు రాలేదు..!" అన్నాడు..!

ఆ వేటగాడు ఆశ్చర్యంగా "నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను!ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది!ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు..!ఈ రోజు వేట వృథా అయినట్టే.." అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు..!

వెంటనే ఆ నాస్తికుడు "ఆగు ఆగు..!నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్నా.!నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా..!" అంటూ కొంచం ధీనంగా అడిగాడు..!

అందుకు,ఆ వేటగాడు-ఆ నాస్తికుణ్ణి తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు. నాస్తికుడు,ఆ వేటగానితో మాటలు కలిపి "నిజానికి నేను దేవుడిని నమ్మను!ఈ అడవిలో మొదటి సారి భయం వేసినపుడు నన్ను కాపాడమని వేడుకున్నా..!ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడ లేదు..!మనిషే కాపాడాడు..!నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి..!" అన్నాడు..!

ఆ మాటలు విన్న వేటగాడు క్షణ కాలం ఆగి "ఏందయ్యా సామి?? దేవుడు లేడంటావా? మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు..! అలాంటిది రామునికి మాయ లేడి కనిపించినట్టు, ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది..! ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేలకొరిగిస్తాను..!అలాంటిది,ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను..!అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు..! నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని, పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయింది..! అంతా శివ లీల" అన్నాడు..!

దానికి నాస్తికుడు "అంతా శివ లీలనా? ఇదంతా ఆ శివుడు చేయించే బదులు, శివుడే వచ్చి దారి చూపొచ్చు కదా..?" అని నవ్వుతూ ప్రశ్నించాడు..! అందుకు ఆ వేటగాడు "మీకు ఆకలేసినపుడు హోటళ్ళోకి వెళ్ళి కూర్చుంటే,అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కాని ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా..!" అంటూ..

ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి, తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు.. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి,కొంత డబ్బు తీసి,ఆ వేటగానికి ఇవ్వబోయాడు..

అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు..అతని ముందు,వెనక,మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు.! ఆ నాస్తికుడు గుండెలు పిండేసాయి!కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను 'నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని, నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా బయట పడేసావు..! నీవు శివుడివో? శివుడు పంపిన దూతవో నీకే తెలుసుశివయ్య..! ఇదంతా నిజంగా నీ లీలనే.!" అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్థికుడు..!

ఇంతకీ ఆ నాస్తికుని పేరు చెప్పలేదు కదూ..!  అతని పేరు "శివ కేశవ".....!

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...