Sunday, 17 March 2024

ఆస్తి - యజమాని (17-Mar-24, Enlightenment Story)

ఆస్తి - యజమాని

🌺🍀🌺🍀🌺🌺🍀



అతను చాలా పెద్ద ధనవంతుడు, కాని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడు. అలాంటివాడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. తన కుడి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని చాలా ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు. “నాకు చాలా కాలంగా రక్తపోటు, చక్కర వ్యాధి ఉన్నాయి. ఇప్పుడు నాకు క్యాన్సర్ కూడా ఉంది అని తెలిసింది. చాలా బాధ అనుభవిస్తున్నాను. మహాస్వామి వారే ఏదైనా పరిహారం చూపాలి” అని వేడుకున్నాడు.

మహాస్వామి వారు ”నేను చెప్పినట్టు చేస్తావా?” అని అడిగారు. ”ఖచ్చితంగా చేస్తాను” అని బదులిచ్చాడు. ”నీకు అది కొంచం కష్టం కావచ్చు” అని అన్నారు.

”పరవాలేదు. నాకు ఈ రోగాలనుండి విముక్తి లభిస్తే చాలు. పెరియవ ఏమి చెప్తే అది చేస్తాను. నాకు కావలసింది కేవలం ఈ రక్తపోటు, షుగర్, క్యాన్సర్ తగ్గితే చాలు” అని అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు.

మామూలుగా మహాస్వామి వారికి ఏ కారణము లేకనే అన్ని ప్రాణులయందు ఆపారమయిన దయ ఉంటుంది. ఇప్పుడు ఇతను బాధలో ఉన్నాడు. మరి స్వామి వారి వదిలేస్తారా?

అతనితో ఇలా అన్నారు, “బావిలో నీళ్ళు ఉంటాయి. కాని ఆ బావి ఎప్పుడు ఆ నీళ్ళు తనవి అని తాగదు”. చెట్లు పళ్ళు కాస్తాయి. కాని అవి ఎప్పుడు “ఇవి నా పళ్ళు నేను మాత్రమే తింటాను” అని అనవు. ఆవు పాలు ఇస్తుంది. కాని తన పాలు తాను ఎప్పుడూ తాగదు. ఎన్నో చెట్లు పాదులు కూరగాయలు ఇస్తాయి. కాని తమ్ అకోసం అని ఎప్పుడు దాచుకోవు.” నువ్వు చూసినట్లయితే ఎన్నో చెట్లు, ప్రాణులు ఇంత పరోపకారం చేస్తున్నాయి. మరి ఇంత విభూతి కలిగిన మనిషి ఎంత ఉపకారం చెయ్యాలి?

“నీ దగ్గర చాలా ధనం ఉంది. కాని నువ్వు దాన్ని నీకోసం కాని, ఇతరుల కోసం కాని ఖర్చు చెయ్యడంలేదు. ఎటువంటి ధర్మము(మంచి పనులు) చెయ్యడం లేదు. నీ పూర్వజన్మ పాపం నీకు ఇప్పుడు వ్యాధిగా వచ్చింది. నీవు ఆ పాపములనుండి బయటపడాలంటే మంచి పనులు చెయ్యడం ఒక్కటే దారి”

“ఇష్ట పూర్తం అనే ధర్మం గురించి ఎప్పుడైనా విన్నావా? ధనాన్ని బావులు తవ్వించడం, దేవాలయాల పునరుద్ధరణకు సహాయం చెయ్యడం , పేదలకు సహాయం చెయ్యడం, ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టడం వంటి మంచి పనులకోసం ఖర్చు పెట్టాలి. అంతే కాకుండా పేదవారికి అన్నథ పిల్లలకు మందులు కొనివ్వు, ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగితే వారిని వట్టి చేతులతో పంపించవద్దు. ఇదంతా అర్థమైందా?” అని అడిగారు.

”నీ దగ్గరున్న ధనానికి నువ్వు కేవలం సంరక్షకుడివి మాత్రమే. దానికి యజమానివని నువ్వు ఎన్నటికి అనుకోకు” అని చెప్పారు.

ఇదంతా విని ఆ ధనవంతుడు భోరున విలపించాడు. ఎన్నో ధర్మకార్యాలను చేస్తూ చాలా కాలంపాటు సుఖంగా జీవించాడు.

తల్లి గర్భమునుండి ధనము దేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణ మన్న మెకాని, మెరుగు బంగారంబు మ్రింగబోడు, విత్తమార్జనజేసి విఱ్ఱవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు,

పొందుగా మఱుగైన భూమిలోపలబుట్టి దానధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో? దొరల కవునో? తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూషాణవికాస! శ్రీధర్మపురనివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday, 15 March 2024

ఆనంద సృష్టి (16-Mar-24, Enlightenment Story)

 ఆనంద సృష్టి

🌺🍀🌺🍀🌺🌺

పువ్వులను మనం సృష్టించలేం. వాటికవే పుష్పించి, వికసించి అందరికీ ఆనందం కలగజేస్తాయి. నవ్వులను మనం సృష్టించుకోగలం. ఆ నవ్వుల్లో మునిగి ఆనంద డోలికల్లో తేలియాడగలం. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. పెద్ద పనుల్ని మనం చెయ్యలేకపోయినా చిన్నచిన్న పనులను పెద్ద హృదయంతో చెయ్యాలి. గొప్ప పనులు చెయ్యలేకపోతున్నామని బాధ పడకూడదు. ఆ సందర్భం వస్తే అనుకోకుండా అద్భుతమైన పనుల్లో మనం భాగస్వాములమవుతాం.

ఆనందం, మనం చేస్తున్నది చిన్నపనా పెద్దపనా అని కొలతలు వెయ్యదు. ఎంతగా మనసు పెట్టి, హృదయపూర్వకంగా పసివాడిలా ఆ పని చేస్తున్నామా అని చూస్తుంది. ఆనందానికి మనం చిరునామా అయిపోవాలి. బాధలు కిటికీ తెరలు. మహాద్వారం మన అంతులేని సంతోషమే. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ గృహంలో నిత్యం గంతులు వేస్తూ ఉత్సవం. చేసుకోవాలి. చెట్టును, పిట్టను, కొంగను, కోడిని చూసి మురిసిపోవాలి. కూడా ప్రతీ దృశ్యం సూర్యోదయంలా ఉండదు. ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా సంగీతాన్ని ఆలపించదు. చేతిలో చిన్న వెదురుముక్క కూడా, నాలుగు రంధ్రాల్లో చక్కటి వేణుగానం వినిపిస్తుంది. హృదయంలో సంతోషం సంతకాలుండాలి. మనసులో మంచి జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి. ప్రేమ లేకుండా మనిషిని భగవంతుడు సృష్టించలేదు. ఆనందం లేకుండా అతడిని జీవించమని చెప్పలేదు. మనిషి ఆనందిస్తుంటే మురిసిపోయేవాడు ఆ దేవదేవుడే.

ఉదయం లేవగానే రెండే రెండు అవకాశాలు మన ముందుంటాయి. రోజంతా సంతోషంగా ఉండాలా, లేదంటే వేదనతో కాలం గడపాలా అని. ఆనందం మన హక్కు ఆనందంగా ఉండటం మన స్వభావంపుట్టుకతో బాధలు అందరికీ ఉండవుమధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఆనందాన్ని సృష్టించు. అపరిమితంగా సృష్టించు. గడ్డిపువ్వుల్లోనూ మానస సరోవర బ్రహ్మకమలాన్ని చూడగలిగే మనసును తయారుచేసుకోవాలి. బతకడానికి సిరులు-సంపదలు కాదు కావాల్సింది. పెద్ద హృదయంలో చిన్ని చిన్ని ఆనందాలు సృష్టించుకోవడం తెలిసిన నేర్పరితనం కావాలి. బృందావనంలో ప్రవేశించినంతనే శ్రీకృష్ణ దర్శనం కాదు. కాని, బృందావన దర్శనం అవుతుంది. అది పరమాత్మ తిరిగిన ప్రదేశం. ప్రతి మొక్క, ప్రతి పూవు, గాలి, నీరు మాట్లాడతాయి. మనసును తెరచి ఉంచుకోవాలి. అంతే!

మనలోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే, కళ్లకు విశ్వమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది. భావంతో దైవాన్ని మనం లోపల సృష్టించకపోతే బాహ్యప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు... నిత్య సంతోషికి దూరంగా దేవుడు ఉండగలడా? కొంత సంతోషం ఇతరుల మీద చల్లగలిగితే మనకు అది రెట్టింపై తిరిగి వస్తుందిజీవితాంతం నవ్వుతూ ఉండటం జీవన రహస్యం తెలిసినవాడికి మాత్రమే సాధ్యమవుతుంది. అతడే జ్ఞానిఅతడే తనకు చాలా ఇష్టమైనవాడు అంటాడు గీతాచార్యుడు. బాధలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. ప్రపంచం భూతంలాగా కనిపిస్తుందిసంసారం సముద్రంలాగా అనిపిస్తుంది. వైరాగ్యంతో మనసు చేదెక్కిపోయి ఉంటుంది. అక్కడే మనిషి తన భావాన్ని మార్చుకుని చిరునవ్వు నవ్వగలిగి ఉండాలివెంటనే మరిచిపోయి, కళ్లు తుడుచుకున్న చిన్నపిల్లాడిలాగా జీవితాన్ని ఆహ్వానించాలి. ప్రపంచాన్ని కౌగిలించుకోవాలి. నవ్వుతూ అందరినీ పలకరించాలి.

*🙏|సర్వేజనా సుఖినోభవంతు|🙏*

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday, 14 March 2024

అమ్మ - ఓపికకు మారు పేరు (15-Mar-24, Enlightenment Story)

అమ్మ - ఓపికకు మారు పేరు         

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

మనం ఎంత పెద్ద అయినా, అమ్మ మనకి ఎంత తెలిసినా ఇంకా ఇంకా అమ్మ మనల్ని ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. మనం ఎప్పటికి అమ్మలా ఆలోచించ గలుగుతాం అని నాకు అనిపించే క్షణాలు ఎన్నో!*

 నేను నా పిల్లలతో వున్న ప్రతి సారీ  మా అమ్మ మాతో ఉన్నట్టు నా పిల్లలతో ఉన్నానా? అమ్మలా అన్ని చేస్తున్నానా? అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించు కుంటాను. ఒక్కసారీ తృప్తిగా నేను మా అమ్మ మాకు చేసినట్టు నా పిల్లలకి చేస్తున్నాను అని అనిపించదు. అమ్మ తో సరిసమానం కావటం కష్టం అని పోల్చి చూసుకోవటం మానేసాను.

చిన్నప్పుడు రాత్రి అందరి భోజనాలు అయ్యి మేము మంచాలు ఎక్కి రేడియో లో పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ వంటింటిని మర్నాటి కోసం సిద్ధం చేసే పనిలో ఉండేది. స్టవ్ కడగటం, వంటిల్లు కడగటం, మంచినీళ్ల బిందెలు తోమటం ఇలా..అమ్మ పని చేస్తుంటే వెళ్లి సాయం చేయాలి అని తోచక పోగా అమ్మా త్వరగా రా, ఎంతసేపు పని చేస్తావ్ అని పిలిచేదాన్ని.


అమ్మ వస్తూనే నిద్ర పోయేది. అమ్మా నీకు నీరసం రాదా? రోజంతా పని చేస్తావు? అని అడిగితే అమ్మ స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉండేది , "అమ్మని కదమ్మా ! నీరసం ఉండదు" అని.*

అది విని చిన్నప్పుడు ఓహో అమ్మలకి నీరసం రాదేమో అనుకునేదాన్ని. ఎక్కడకి అన్నా వెళ్లి వచ్చాకా కాళ్ళు నొప్పులు అని మేమంతా కూర్చుంటే అమ్మ చకచకా పనులు చేసేసేది. మళ్ళి నాది సేమ్ క్వశ్చన్, అమ్మ సేమ్ ఆన్సర్. ఇంక నేను ఫిక్స్ అయిపోయా 'అమ్మలకి నీరసం, కాళ్ళు నొప్పులు, విసుగు లాంటివి వుండవు అని.*

అందుకే రాత్రి అందరం పడుకున్నాకా అమ్మ వీధి గుమ్మం తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతున్నా, బట్టలు ఉతికి ఎర్రటి ఎండలో మోకాళ్ళ నొప్పులతో మేడ ఎక్కి ఆరేసినా నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదు. అమ్మ కి బోలెడు ఓపిక , అంత పిల్లలకి ఉండదు, కాబట్టి మనం ఎంత ఓపిక ఉంటే అంతే పని చేయాలి, ఓపిక లేక పోతే రెస్ట్ తీసుకోవచ్చు అనుకునేదాన్ని.


ఇప్పుడు 73 ఏళ్ల వయసులో కూడా మేడం చకచకా పనులు చేయటానికి ముందుకు ఉరుకు తుంది. అలసట ఉండదా అంటే 'అమ్మని కదమ్మా , పిల్లల కోసం చేస్తుంటే అలసట గా ఉండదు' అంటుంది.*

మా అందరికి ఇష్టం అయినవి అడగాలే కానీ వంటింటిలోకి ప్రవేశించి ఎన్ని గంటలు అయినా విసుగు లేకుండా వండేస్తుంది. పైగా మేము చేస్తాం అంటే ' వద్దమ్మా , అలసి పోతారు అంటుంది.' ఇన్నేళ్లు వచ్చినా మేము పిల్లలమే  అమ్మ కి.*

పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అవుతోంది , ఇప్పటికీ పచ్చళ్ళు, ఆవకాయలు, కారప్పొడులు, మెంతి పొడులు, చారు పొడి ఏవీ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. నాకు రాదు అని అమ్మ గట్టిగా నమ్మి అన్నీ  చేసి పంపిస్తుంటుంది.

*అల్లం పచ్చడితో సహా అమ్మ చేయటం , నాన్న జాగ్రత్త గా ప్యాక్ చేసి పంపించటం. మేము వాటిని అందుకుని తిని అమ్మా సూపర్ అంటే ఆవిడ తృప్తి చూడాలి. పొరపాటున ఎప్పుడన్నా నేను చేసుకుంటాను, నువ్వు ఎందుకు కష్టపడటం అంటే, 'నీ మొహం నీకు రాదు, అయినా నీకు ఖాళీ ఎక్కడ ? అలసి పోతావ్ ,  అలాంటి పనులు పెట్టుకోకు ' అంటుంది.*             

అమ్మ కి అలసట ఉండదు ఇది ఇప్పటికీ అమ్మ చెప్పే సూత్రం. ఆ సూత్రం అర్ధం ఏంటో నేను అమ్మ అయ్యాకా తెలిసింది. అమ్మ ని చూస్తే ఎక్కడ లేని నీరసం వచ్చి , కూర్చుని అమ్మతో పనులు చేయించుకుంటానా?’*

మా పిల్లలిద్దరూ ఏమడిగినా ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. వాళ్ళు అడిగింది చేసి పెట్టేదాకా నీరసం గుర్తు రాదు. ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు 'అమ్మా నీకు నీరసంగా ఉండదా? అని.' నేను మా అమ్మ నాకు చెప్పిన డైలాగ్ వాళ్ళకి చెబుతాను. రేపు వాళ్ళు అమ్మలు అయ్యాకా దాని అర్ధం తెలుస్తుంది వాళ్ళకి.*

*తరం తరం నిరంతరం అమ్మకి నీరసం ఉండదు.*


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday, 13 March 2024

కోడిపిల్ల ఉపాయం (14-Mar-24, Enlightenment Story)

 *కోడిపిల్ల ఉపాయం*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

ఒక కోడి ఉండేది. ఒకనాడు అది గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు అందులోంచి కోడి పిల్లలు వచ్చాయి. అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేవి.అనుకోకుండా ఒక రోజు కోడి పక్క వూరికి వెళ్లాల్సి వచ్చింది. పిల్లల్ని పిలిచి, 'జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ పూర్తిగా నమ్మకండి. కలిసి కట్టుగా మసులుకోండి' అని చెప్పి వెళ్లింది. కోడి వెళ్లడాన్ని ఓ నక్క చూసింది. ఎలాగైనా రాత్రి వచ్చి వాటిని ఆరగించాలనుకుంది. అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి, 'కోడి కూనలూ! ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు?' అని అడిగింది.

'మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం' అన్నాయవి ముక్తకంఠంతో. నక్క సంబరంగా వెళ్లిపోయింది.


అది వెళ్లగానే కోడిపిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ 'అమ్మ ఎవరినీ పూర్తిగా నమ్మవద్దంది కదా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి' అనుకున్నాయి. ఆ రాత్రి అవి తమ గూట్లో ముళ్లు పడేసి బయటకి వచ్చేసి పొయ్యిలో పడుకున్నాయి. రాత్రి సద్దుమణిగాక నక్క నెమ్మదిగా వచ్చి గూట్లోకి మొహం పెట్టింది. దాని మూతి నిండా ముళ్లు గుచ్చుకున్నాయి. అది మూలుగుతూ అడవిలోకి పారిపోయింది.

మర్నాడు నక్క మళ్లీ వచ్చి, 'కోడి కూనలూ! ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారు?' అని అడిగింది.

'అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం' అన్నాయి. నక్క సంగతి తెలిసిన అవి పొయ్యిలో బొగ్గులు పడేసి గడ్డివాములో పడుకున్నాయి. రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోయింది.

పట్టువదలని నక్క మర్నాడు ఉదయం వచ్చి, 'ఇవాళ ఎక్కడ పడుకుంటారర్రా' అని అడిగింది.

'అదిగో ఆ గడ్డివాములో' అన్నాయి కోడి పిల్లలు. నక్క వెళ్లగానే కోడిపిల్లలు, 'దీని మూతి మీద ముళ్లు గుచ్చుకున్న మచ్చలు, కాలిన గాయాలు ఉన్నాయి. ఇది మనని తిండానికే వస్తోంది. ఇవాళ ఎలాగైనా దీని పీడ వదిలించుకుందాం' అనుకుని కలిసికట్టుగా ఆలోచించి ఉపాయం పన్నాయి.

రాత్రి అవన్నీ అటక మీదకి ఎక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి. నక్క వచ్చి గడ్డివాములో దూరింది. వెంటనే కోడిపిల్లలు గడ్డివాముకు నిప్పు అంటించాయి. ఆ మంటల్లో నక్క మాడి మసైపోయింది. తల్లి కోడి రాగానే పిల్లలు ఇదంతా చెప్పాయి. అది ఆనందంగా వాటిని తన రెక్కల్లో పొదువుకుని, 'ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్లనేం?' అంది. కోడి పిల్లలన్నీ ఆనందంగా కిచకిచలాడాయి.
🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐣🐥🐥🐥🐥🐥

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...