Thursday, 11 January 2024

ముగ్గురు కూతుళ్ళు - Part 1 (12-Jan-24, Enlightenment Story)

ముగ్గురు కూతుళ్ళు -1

🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ఒక గ్రామంలో ఒక రైతు నివసిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. వాళ్ళందరికీ పెళ్ళి వయసొచ్చింది. దాంతో ఆ రైతు సంబంధాల కోసం వెదకసాగినాడు. ఒకసారి ఆ ముగ్గురు అమ్మాయిలు కడవలు తీసుకోని నీళ్ళు తేవడానికని చెరువు దగ్గరికి పోయినారు. నీళ్ళు ముంచుకుంటా... ముంచుకుంటా “ఏమే... నాన్న సంబంధాలు చూస్తా వున్నాడు గదా. నువ్వెవరిని చేసుకుంటావే... అంటే... నువ్వెవరిని చేసుకుంటావే” అని ఒకర్నొకరు అడుక్కోసాగినారు.
అదే సమయంలో ఆ వూరి యువరాజు మారువేషంలో అటువైపు వచ్చినాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటా వున్నారో విందామని ఒక పొద దాపున కూర్చున్నాడు.


అందరికంటే పెద్దామె "నేను ఈ రాజ్యాన్ని కాపాడే సేనాధిపతిని చేసుకుంటా... నాకు యుద్దాలన్నా, పోరాటాలన్నా చానా ఇష్టం" అనింది.

రెండో ఆమె "నేను తన ఎత్తులు జిత్తులతో ఈ రాజ్యాన్ని ప్రశాంతంగా వుంచే మంత్రిని చేసుకుంటా... నాకు సలహాలివ్వడమన్నా, సమస్యల్ని పరిష్కరించడమన్నా చానా ఇష్టం" అనింది.


చిన్నామె “నేను ఈ రాజ్యాన్ని పాలించే యువరాజును చేసుకుంటా... నాకు దాసదాసీలతో సేవలందుకోవడమన్నా, సింహాసనం మీద రాజు పక్కన కూర్చోని ప్రజల్ని పాలించడమన్నా చానా ఇష్టం" అనింది.

అంతలో పెద్దామె "పదపద... ఆలస్యమైపోతా వుంది. మనం ఇలా పొద్దుపోక వుత్తుత్త కలలు కనాల్సిందే గానీ... ఇవన్నీ నిజమవుతాయా... పాడా... మన నాన్న ఏ తలకు మాసినోన్ని తెచ్చినా తలొంచుకోని తాళి కట్టించుకోవడం తప్ప ఏం చేయగలం" అనింది బాధగా. ముగ్గురూ మౌనంగా కడవలు సంకన పెట్టుకోని గమ్మున ఇంటిదారి పట్టినారు.
యువరాజు వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ముగ్గురినీ చూసినాడు. ముగ్గురూ చానా చక్కగా అప్పుడే పూసిన రోజాపూవుల్లెక్క వంక బెట్టడానికి లేకుండా వున్నారు. “అరే... పాపం... ఈ అమ్మాయిలెవరో గానీ వీళ్ళ కోర్కెలు తీరుద్దాం. వీళ్ళకేం కన్నొంకరా... కాలొంకరా... చక్కగా పాలమీగడ లెక్కున్నారు” అనుకున్నాడు. వెంటనే అంతఃపురానికి పోయి మంత్రినీ, సేనాధిపతినీ పిలిచి జరిగిందంతా చెప్పి "మనం ముగ్గురమూ వాళ్ళ ముగ్గురినీ పెళ్ళాడదాం" అన్నాడు.

రాజే సరే అన్నాక మిగతా వాళ్ళదేముంది... వాళ్ళు గూడా సరే అన్నారు. తర్వాత రోజు ముగ్గురూ కలసి రైతు ఇంటికి పోయినారు. స్వయంగా తమను పాలించే రాజు, మంత్రి, సేనానే తమ ఇంటికి అల్లుళ్ళుగా వస్తామనే సరికి రైతు చానా సంబరపడ్డాడు. వాళ్ళు కోరుకున్నట్టే వారికి నచ్చిన వాళ్ళనిచ్చి పెండ్లి చేసినాడు.

పెద్దామె సేనాధిపతి పెండ్లాం అయితే, నడిపామె మంత్రి పెండ్లాం అయితే, చిన్నామె రాజ్యానికి యువరాణి అయింది. దాంతో చిన్నామెకు అడుగడుగునా దాసీలే. ఆమె భోగమే భోగం. పన్నీటి స్నానాలు, మెత్తని హంసతూలికా తల్పాలు, ఏడువారాల నగలు, లెక్కబెట్టుకోలేనన్ని పట్టు వస్త్రాలు... ఒకటని కాదులే... కను సైగ చేస్తే చాలు కోరుకున్నవన్నీ కాళ్ళముందుకొచ్చేవి. అదంతా చూసి పెద్దామెకు, నడిపామెకు కన్ను కుట్టింది. “ఛ... ఛ... ఆ రోజు చెరువుకాడ ఆ మాటలంటున్నప్పుడు అవి నిజమవుతాయని కలలో గూడా అనుకోలేదు. లేకుంటే మనం గూడా యువరాజే మొగుడు కావాలని కోరుకుంటుంటిమి. మనందరికన్నా చిన్నదయినా దీనికేమి అదృష్టం పట్టింది. ఎట్లాగయినా సరే వీళ్ళిద్దరినీ విడదీయాల" అనుకోసాగినారు.

చూస్తుండగానే గంటలు రోజులై, రోజులు వారాలై, వారాలు నెలలై... ఆ చిన్నపిల్లకు మిగతా ఇద్దరికన్నా ముందే కడుపు పండింది. అది చూసి యువరాజు చానా సంబరపడ్డాడు. కాలు కింద పెట్టనీయకుండా పసిపిల్లలెక్క అల్లారుముద్దుగా చూసుకోసాగినాడు. ఆమె ఏమడిగితే అది... ఎంత ఖరీదయినా సరే తెప్పించసాగినాడు. ఒక పూట తిన్న వంట మరొకపూట తినకుండా దేశదేశాల నుండి పేరు మోసిన వంటగాళ్ళనందరినీ పిలిపించి అమృతం లాంటి వంటకాలన్నీ చేయించి పెట్టసాగినాడు. ఇదంతా చూస్తావున్న కొద్దీ అక్కలిద్దరికీ మరింతగా మండిపోసాగింది. పైకి నవ్వుతా ఇకఇకలాడుతావున్నా... లోపల మాత్రం కుతకుతా వుడికిపోతా విషం కక్కుతా వున్నారు. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా... ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా... అని ఎదురు చూడసాగినారు.

అట్లా ఒక్కొక్క నెల గడుస్తా... గడుస్తా... ఆ చిన్నపాపకు తొమ్మిది నెలలు నిండినాయి. ఈ వారమా వచ్చేవారమా కానుపు అన్నట్టుంది. అంతలో అనుకోకుండా పక్క ఊరి నుండి ఒకరాజు ఆ రాజ్యం మీదికి దండయాత్ర కొచ్చినాడు. దాంతో యువరాజు తప్పనిసరై, సైన్యాన్ని తీసుకోని పోతా పోతా పెళ్ళాం అక్కలిద్దరినీ పిలిచి “మీ చెల్లెలు నిండుమనిషి. అక్కలైనా, అమ్మలైనా మీరే. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి" అని అప్పజెప్పినాడు. దానికి వాళ్ళు నవ్వుతా “దానిదేముందిలే యువరాజా! నీవు పోయిరా. మేం కంటికి రెప్పలా, కాలికి చెప్పులా కాపాడుకుంటాము" అన్నారు. పోయే ముందు యువరాజు పెండ్లాంతో “ఏమే... నాకు ముద్దులు మూటగట్టే కొడుకునిస్తావా... చూడ చక్కనైన కూతుర్నిస్తావా... ఎవరినిస్తావు” అన్నాడు. దానికామె నవ్వుతా “ఏమో... నాకేం తెలుసు. దేవుడు కడుపున ఎవర్ని వేసింటే వాళ్ళనిస్తా" అనింది. దానికి యువరాజు “మరి నేను అంత దూరంలో వుంటాను గదా... నాకెట్లా తెలుస్తాది... ఎవరు పుట్టినారో" అన్నాడు. దానికామె చిరునవ్వు నవ్వుతా “ఏముంది... నేను కనగానే ఆకాశంలోంచి ముత్యాలవాన కురిస్తే కొడుకు పుట్టినట్లు. పగడాల వాన కురిస్తే కూతురు పుట్టినట్లు... ఏం సరేనా" అనింది.

యువరాజు అట్లాగేనంటూ యుద్ధానికి వెళ్ళిపోయినాడు. అట్లా పోయిన వారం రోజులకు ఆమెకు నొప్పులు మొదలయినాయి. అప్పుడు అక్కలిద్దరూ చెరోపక్కన చేరి “ఏం భయపడొద్దు చెల్లీ... మేమున్నాం గదా... కళ్ళు మూసుకోని కాసేపు బాధ బిగబట్టుకో, బోసినవ్వులు నవ్వే పాప పక్కనుంటాది" అంటూ కాన్పుకు తీసుకోని పోయినారు. ఆమెకు కాసేపట్లో ముచ్చటగొలిపే కొడుకు పుట్టినాడు. వెంటనే అక్కలిద్దరూ ఆమె కళ్ళు తెరవక ముందే మత్తుమందు కలిపిన నీళ్ళిచ్చి, ఆమె లేచేలోగా ఆ పిల్లవాన్ని అక్కడి నుంచి తీసుకోని పోయి ఒక పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలేసి, ఒక చచ్చిపోయిన పిల్లవాన్ని తెచ్చి పక్కన పన్నబెట్టినారు. ఆమెకిదంతా తెలీదు... దాంతో మత్తు దిగినాక కొడుకు చనిపోయి వుండటాన్ని చూసి బాధ పడింది.

అక్కడ యువరాజు యుద్ధంలో వుండగానే ఆకాశంలోంచి ముత్యాలవాన కురిసింది. అది చూసి యువరాజు “ఆహా... నాకు ముత్యంలాంటి కొడుకు పుట్టినట్టున్నాడు" అని ఎంతగానో సంబరపడ్డాడు. యుద్ధం పూర్తి కాగానే ఎప్పుడెప్పుడు కొడుకును చూద్దామా అని సంబరపడతా బెరబెరా ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడ పసిపాప నవ్వుల్లేవు. చనిపోయాడని తెలుసుకొని ఎంతగానో బాధపడ్డాడు. ఐనా కాసేపటికి తమాయించుకొని “సరే.. జరిగిందేదో జరిగిందిలే... మనకు నుదుటన రాత రాసినట్టు లేదు. ఈసారి మాత్రం చూడచక్కనైన కూతురినివ్వు" అన్నాడు. మళ్ళా ఆమెను ఇంతకు ముందులాగే బాగా చూసుకోసాగినాడు.

ఇంతకు ముందు బాబును పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలినారు గదా... ఆ పెట్టె కొట్టుకోని పోయి, కొట్టుకోని పోయి ఒక ముసలి సాధువుకు దొరికింది. ఆయనకు పెళ్ళాం, పిల్లలు ఎవరూ లేరు. ఒక్కడే. పిల్లలకు చదువు నేర్పిస్తా వుంటాడు. ఆయన ఆ పసిపిల్లోన్ని చూసి “ఎవరు కన్నబిడ్డో ఏమో. పాపం. ఎంత కష్టమొచ్చిందో. ఇట్లా వదిలేసింది" అనుకోని పెంచుకోడానికి ఇంటికి తీసుకోని పోయినాడు.

పార్ట్ 2 రేపటి కథలో కొనసాగుతుంది .....

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️



Wednesday, 10 January 2024

చీమ - బాతు- హంస (11-Jan-24, Enlightenment Story)

 *చీమ - బాతు- హంస*

🍀🌺🍀🌺🍀🌺

రామకృష్ణ పరమహంస అంటారు. నేను జీవితంలో కొన్నిటిని చెపుతాను. వాటిని ఆదర్శంగా పెట్టుకో. ఇంతకన్నా ఆదర్శమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు. అంటారు. అవి ఏమిటి?

మొదటిది చీమ. 

చీమను నీవు ఆదర్శంగా తీసుకో. కొంచెం పంచదార, కొంత ఇసుక కలిపి అక్కడ పోస్తే చీమ పంచదార రేణువులను మాత్రమే తీసుకువెళుతుంది. ఇసుక రేణువులను వదిలివేస్తుంది. ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచి పెట్టడం నేర్చుకోవాలి. సారవంతమైన విషయమును లోపల పదిలపరచుకోవడం నేర్చుకోవాలి.

రెండు.... బాతులా బ్రతుకు

బాతు తెల్లగా ఉంటుంది. కానీ బాతు బురదలో ఉంటుంది. ఆ బాతు మీద బురద చుక్క వచ్చి పడుతుంది. అది శరీరమును దులుపుకుం టుంది. వెంటనే బురద చుక్క జారి కింద పడిపోతుంది. తెల్లటి మల్లెపువ్వులా ఉండే బాతు ఎప్పుడూ బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అంటడం లేదు.

మనలో చాలామంది ... నేను ఫలానా వాళ్ళతో తిరిగి ఇలా పాడైపోయాను. నేను ఇలా పాడైపోవడానికి కారణం వాళ్ళే. నా సాంగత్యం మంచిది కాదు. నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను... అని అంటూ ఉంటారు.

కానీ అలా అనకూడదు. బురదలో ఉన్న బాతుకి బురద అంటలేదు. మరి నీకెందుకు చెడ్డ గుణములు అంటుకోవాలి? నీవు మనసులో స్వచ్ఛంగా ఉంటే , ఇతరులను మార్చగలవేమో కానీ ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గర ధీశక్తి లేనప్పుడే నీవు ఇతరులు చెప్పిన మాటలకు లొంగిపోతావు. నీది పిరికి మనసు. అటువంటపుడు నీవు తొందరగా దుర్గుణములకు వసుడవు అయిపోతావు. నీ మనసు బలహీనమైనది. దానిని పదిలం చేసుకోవడం మానివేసి, శక్తిమంతము చేసుకోవడం మానివేసి, చీడా పీడా తొలగించడం మానివేసి, నీవు పాడవడాని కి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు. అది మరొక పెద్ద దోషం. కాబట్టి నీవు బాతులా ఉండడం నేర్చుకో.



మూడు.... హంస... నీవు హంసలా ఉండడం నేర్చుకో.

హంస పాలను, నీటిని కలిపి పెడితే పాలను తీసుకుని నీటిని విడిచిపెడుతుంది. జగట్టునందు బ్రహ్మమును దర్శనం చేసి, జగత్తును విడిచిపెట్టడం అలవాటు చేసుకో.

ఈ మూడింటిని అలవాటు చేసుకుంటే ఇంతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 8 January 2024

ఏది సమస్య (10-Jan-24, Enlightenment Story)

 ఏది సమస్య

🍀🌺🍀🌺🍀🌺

గూగుల్ సంస్థ సీయీవో సుందర్ పిచ్చాయ్ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...ఒకసారి నేను రెస్టరెంట్ కి వెళ్లాను. నాకు కొంత దూరంలో ఉన్న టేబుల్ దగ్గర ఇద్దరమ్మాయిలు కూర్చుని ఉన్నారు. ఎవరి మాటల్లో వారుండగా ఎక్కణ్నుంచి వచ్చిందో బొద్దింక ఒకమ్మాయి మీద పడింది. అంతే ఆ అమ్మాయి లేచి రెస్టరెంట్ దద్దరిల్లేలా అరుస్తూ గెంతులేసి ఎలాగైతేనేం ఆ బొద్దింకను విసిరికొట్టింది. అది కాస్తా వెళ్లి పక్కనున్న అమ్మాయి మీద పడింది. ఆమె కూడా అలాగే గగ్గోలు పెడుతూ దాన్ని తోసేసింది. 

అది ఈసారి అటుగా వచ్చిన సర్వర్ మీద పడింది. అతను చాలా శాంతంగా దాన్ని తీసుకెళ్లి బయటపడేశాడు. అదంతా చూసిన నాకు 'అక్కడ సమస్య బొద్దింకా లేక ఆ ఇద్దరమ్మాయిలా.. ' అనిపించింది. బొద్దింకే అయితే, సర్వర్ కూడా వాళ్లలా కంగారుపడాలి కదా. అంటే కారణం బొద్దింక కాదు. దాని వల్ల కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరమ్మాయిలూ ఒకలా స్వీకరిస్తే అతను మరోలా స్వీకరించాడు. అపుడు నాకర్ధమైందేంటంటే...ఆదిత్యయోగీ.



ఇంట్లో నాన్న అరిచారనీ ఆఫీసులో బాస్ తిట్టారనీ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువుండనీ నాకు కలిగే చికాకుకీ అసహనానికీ కారణం ఆయా వ్యక్తులూ పరిస్థితులూ కాదనీ ఆ సందర్భంలో చికాకు కోపం రాకుండా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాననీ, సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళం  అవుతుందని బౌదింక ఘటన వల్లే నాకు తెలిసింది. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడన్నా శాంతంగా ఉన్నాడన్నా అర్థం అతడికి సమస్యలు లేవని కాదు, ఆ సమస్యలను సరైన వైఖరితో అధిగమించాడని విశేషించారు...


లైఫ్ జాకెట్ తీసేసి నీ కోసం చూసే వరకు నువ్వు నీళ్ళ మీద తేలతావో లేదో నీకు ఎప్పటికీ తెలీదు. ధైర్యంగా ఉండి ముందు ప్రయత్నించు. చెత్త దృష్టాంతంలో నువ్వు నీటిలో మునిగిపోవచ్చు కానీ ఎవరైనా మీ స్విమ్మింగ్ ప్రాక్టీస్‌ని పర్యవేక్షిస్తే మిమ్మల్ని కాపాడుతుంది. అన్ని మతాలు, తత్వాలు మొదలైన వాటి విషయంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. అవి మీకు బాహ్య సహాయక వ్యవస్థలు మాత్రమే.

కన్నుమూసి, మనసును కప్పినా, బుద్ధి తెరచుకుని, దాని గుణాన్ని ప్రదర్శించి, ప్రయోగిస్తుంది. కనుక బుద్ధి దాని గుణ సంస్కారమే, మనసును ప్రభావితం చేయాలి. మౌనమూ, మనసులోనిదే. మూసిన కంటికి, మాటలు ఎక్కువ. చూచిన నేత్రానికి, ఆలోచనలు తక్కువే.ఆదిత్యయోగీ..

కళ్ళు తెరిచి చూస్తే ఆలోచనలు తక్కువగా ఉంటాయని, కన్ను మూసుకుంటే ఆలోచన సంఖ్య పెరుగుతాయని, కళ్ళు తెరిచే ధ్యానం కొనసాగించాలని,  అందరికీ ఎంతో అవసరమైన రహస్యాన్ని జ్ఞానంగా అందజేశారు శ్రీ గురుదేవులు.

సూక్షం నుండి స్థూలం వరకు ప్రతి విషయములో కూడా, నిఘాఢంగా ఉండే నిజాలను, సాధనా రహస్యాలను, జ్ఞానంగా మనకు తెలియచేస్తూ నడిపిస్తున్న *నవయుగ నిర్మాణ దీప్తి; విశ్వమాత..

గతం ఎంత గొప్పదైనా, దాని తలంపు ఇప్పుడు భాదే కదా, భవిష్యత్ ఏదైనా సరే అంగీకరించవలసిందే, దీని ఆలోచన కూడా ఇప్పుడు భాదే కదా, ఇప్పటి ఈ  క్షణం గడిస్తే గతము కదా, ఇప్పటి ఈ క్షణం భవిష్యత్ కాదేమో కదా, కానీ ఇప్పటి ఈ క్షణమును, ఆనందముగా మార్చుకోవడం అంటే ఈ క్షణంలో ఈ క్షణం గా జీవించడమే. అది " కల్పవృక్షం " అని తెలుసుకున్నారు.


.🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

రామతారక మంత్రం (09-Jan-24, Enlightenment Story)

 *ఆ బాలుడు మందమతిగా ఉండేవాడు. చదువు అబ్బలేదు. చదివింది గుర్తుండేది కాదు. ఇక చదవండి*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺


కుమారుడికి చదువు యోగం లేదేమోనని తల్లిదండ్రులు మథనపడేవారు. ఇంతలో ఆ అబ్బాయికి బాబాయి వరసయ్యే వారి దూరపు బంధువు ఒకరు వాళ్లింటికి వచ్చాడు. తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొడుకుకు సరస్వతీ కటాక్షం కలిగేదెప్పుడోనని బాధపడ్డారు. అది చూసి బాధపడిన బంధువు బాలుణ్ణి తానుండే రాయవేలూరుకు తీసుకువెళ్లాడు. వారి ఇలవేల్పు శోళింగపురం యోగనరసింహస్వామి. ఆయన ఆ స్వామిలో శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ నిరంతరం రామమంత్రాన్ని జపించేవారు. రామమంత్రంపై ఆయనకు అంత గురి. అందుకే ఓ శుభ సమయాన తన అన్న కుమారుడికి కూడా ‘ *_రామతారక మంత్రం_*’ ఉపదేశించాడు. ప్రతి నిత్యం ఆ మంత్రాన్ని జపించ మని సూచించాడు.

ఆ రోజు నుంచీ బాలుడు ఉదయం లేచినప్పటి నుంచి నిరవధికంగా రామనామాన్ని జపించనారంభించాడు. దాని ప్రభావంతో ఏకసంథాగ్రాహిగా మారిపోయాడు. అక్షరంముక్క రాదని అందాకా ఎగతాళికి గురైన ఆ బాలుడు అనతి కాలంలోనే తరగతిలో అత్యుత్తమ విద్యార్థిగా గురువుల మన్ననలు అందుకున్నాడు. ఎన్నో విశ్వవిద్యాలయాల పట్టాలు పొందాడు. చదువే రాదేమో అనుకుంటే.. చదువు చెప్పే అధ్యాపకుడయ్యాడు. ఆనక ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అయ్యాడు. భారత రెండో రాష్ట్రపతిగానూ ప్రకాశించాడు. రామనామంతో తల రాతనే మార్చుకున్న ఆ మహానుభావుడు మరెవరో కాదు, సర్వేపల్లి రాధాకృష్ణన్‌. వారికి రామనామ ఉపదేశాన్ని ప్రసాదించిన వారు సర్వేపల్లి నరసింహన్‌. కాలాంతరంలో వారే రమణ మహర్షి ప్రత్యక్ష శిష్యులైన స్వామి ప్రణవానంద.



🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

కర్మ , తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో (08-Jan-24, Enlightenment Story)

 కర్మ , తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

*ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది. ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే, ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు*

*దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది. ఏమీ  అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి.రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు. ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.*

*అతడి పరిస్థితి,తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను*కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు*


*భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది ఒకరోజు భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు*

*సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త *వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది *దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు*

మిత్రులారా *జీవతం చాలా నేర్పిస్తుంది*
*నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది*
*అహంకారం అసలు పనికిరాదు*
*జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు, ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని*
*నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.*
*మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది మిత్రులారా!

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday, 3 January 2024

నమ్మకానికి మరో రూపమే దేవుడు (04-Jan-24, Enlightenment Story)

 నమ్మకానికి మరో రూపమే దేవుడు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺

ఒకప్పుడు ఒక ప్రాంతంలో కర్ఫ్యూ విధించబడింది, అలా నిర్వహిస్తున్నప్పుడు, ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితులు,  అదే ప్రాంతంలో ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది! ఈ కర్ఫ్యూ వల్ల ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మోకాళ్ళ మీద మొకరిల్లి ప్రార్థన చేస్తోంది…

ప్రార్థనలో భాగంగా ఆవిడ దేవునితో,  "భగవంతుడా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు పక్షితో ఆహారాన్ని సమకూర్చావని విన్నాను, అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది.

ఆ మాట విన్న తన మనవడు భగవంతుడు పంపే పక్షి తనకు ఆహారాన్ని తెస్తుందని నమ్మి , పక్షి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి ఉండాలని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.

అయితే… ఆ కిటికీ పక్కనే కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగి చూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..



ఆ పోలీసు  "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు.

ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు పక్షితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కిటికీ తలుపు తీసాను అన్నాడు.

అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్ల వాడితో "ఆకలి వేస్తుందా? " అని అడిగి  "మీ బామ్మ చెప్పిన పక్షిని నేనే ..! నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు.

ఆ పోలీసు ఒక మూసి ఉన్న పచారి కొట్టు తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు.

ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ పోలీసు ద్వారా ఆకలి తీర్చాడు.

ఒకరిది ప్రార్థన ..!
ఇంకొకరిది విశ్వాసం ..!
మరొకరిది ప్రేమ పూరిత సహాయం ..!
దిక్కు లేని వారికి దేవుడే దిక్కు!


ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన ..!

’నమ్మకం’ ఆచిన్న పిల్ల వాడు తన మామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం ..!

నమ్మకానికి మరో రూపమే..  ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు ‘సహాయం’ చేయడం ..!

పాలలో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లు నీ నమ్మకం లో ఎన్నో మహా అద్భుతాలు దాగి ఉన్నాయి!  అవి చూడాలంటే… కాస్తంత ఓపిక, మనోధైర్యం కష్టపడే తత్వం ఉంటే చాలు!

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

నలుగురు స్నేహితులు (04-Jan-24, Enlightenment Story)

నలుగురు స్నేహితులు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺 

ఒక ఊరిలో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. వీరందరూ గర్భ దరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరోపూట పస్తుండేవారు. నలుగురూ ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. 


ఊరు వదిలి కృష్ణా నది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక చోట జడలుకట్టుకు పోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటబడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామంచేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి "ఈ జ్యోతిని మీ చేతులలో పెట్టుకుని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో జ్యోతి ఎక్కడ పడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది" అని చెప్పాడు.

ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకుని హిమాలయ కొండలవైపు బయలుదేరారు. ఒకచోట ఆ జ్యోతి చేతులలోనుంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా త్రవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ నలుగిరిలో ఒకడు తనకు కావలసింది తీసుకుని దానో తృప్తిపడి వెనకకు మరలిపోయాడు. 

మిగిలిన ముగ్గురూ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారి పడిపోయింది. అక్కడ త్రవ్విచూశారు. అదో పెద్ద వెండి గని. ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళాడు. 

మిగిలిన ఇద్దరూ ఇంకా ఉత్తమోత్తమమైనది దొరుకుతుందేమోనని బయల్దేరి నడక ప్రారంభించారు.మూడోసారి జ్యోతి పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం! అదో బంగారు గని. మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తిపడ్డాడు. 

ఇంక నాలుగోవాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు, రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంతదూరం వచ్చేటప్పటికి ఒక చోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిర తిరుగుతూవుంటే అక్కడ ఆగి "ఇదేమిటి నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతూంది?: అని అడిగాడు. 

ఆ పెద్ద మనిషి "మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో. తరువాత కథ చెబుతాను" అన్నాడు. దీనికి నాలుగోవాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీదికి పెట్టనిచ్చాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. "నేనూ నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకుని ఇంతవరకూ వచ్చాను. నేనూ ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు. దొరికిన వెండితో తృప్తిపడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూంది. నీలాగే నేనూ ఈ చక్రంలో తల దూర్చాను. ఇటివంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు.


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...