Thursday, 27 June 2024

ఇది క‌దా జీవితమంటే (27-June-24, Enlightment Story)

 ఇది క‌దా జీవితమంటే..!*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

వారం రోజుల కింద‌ట తెగిన చెప్పు కుట్టిద్దామంటే విజ‌య‌వాడ‌లో కుట్టేవారిని క‌నిపెట్ట‌డం పెద్ద టాస్కే అయ్యింది. మొత్తానికి అయ్య‌ప్ప‌న‌గ‌ర్ రోడ్డులో ఇవాళ ఒకాయ‌న్ని ప‌ట్టుకుని చెప్పు కుట్టించుకున్నాను. అన్నిచోట్లా ఇర‌వై రూపాయ‌లు తీసుకుంటుంటే ఆయ‌న ప‌ది రూపాయ‌లే తీసుకున్నాడు. స‌రే ప‌నేం లేదు క‌దా అని ఆయ‌నతో కాసేపు మాట్లాడాను. 


ఆయ‌న తాత‌, తండ్రుల‌ది కూడా ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మీ పిల్ల‌లు ఏం చేస్తున్నారు? అని అడిగితే చెప్పాడు అస‌లు విష‌యం. వాళ్ల‌బ్బాయి ఇంజ‌నీరింగ్ చ‌దివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్లుడు బ్యాంక్ ఉద్యోగి. య‌న‌మ‌ల‌కుదురులో 7 సెంట్ల‌లో సొంతిల్లు. నెల‌కు వ‌చ్చే అద్దెలు 25వేలు.  నున్న‌లో ఎక‌రం మామిడి తోట‌. ఇన్ని ఉండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావ‌ని అడిగితే --


ఒక‌ప్పుడు ఈ ప‌నే మాకు అన్నం పెట్టింది. మా నాన్న ఈ ప‌నిచేసే అప్ప‌ట్లో రేటు త‌క్క‌వని నున్న‌లో మూడెక‌రాలు కొంటే నా వాటా ఎక‌రం వ‌చ్చింది. మా చిన్న‌ప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డ‌బ్బులకు బ‌దులు వ‌డ్లు ఇచ్చేవారు. అవి స‌రిపోక మా అమ్మ వ‌రి కోసిన పొలాల్లో ప‌రిగె ఏరుకొచ్చి అందులో గింజ‌లను వేరుచేసి మాకు అన్నం పెట్టేది. మేం త‌ర‌త‌రాలుగా ఆధార‌ప‌డి బ్ర‌తికిన ప‌ని ఇది. డ‌బ్బులున్నా ఈ ప‌నిచేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది "  అని ఆయ‌న చెప్పిన మాట‌లు అద్భుతంగా అనిపించాయి. మీరు ఎప్పుడైనా రండి ఉద‌యం నుంచి సాయంత్రం ఏడింటిదాకా ఇక్క‌డే ఉంటాన‌ని చెప్పాడు. 



వెనక కావాల్సినంత ఆదాయం ఉంద‌న్న ధీమా లేదు. ఒక‌రోజు కుట్ట‌క‌పోతే ఏంకాదులే అనే ఆలోచ‌న లేదు. అందుకే ఆదివారం కూడా అక్క‌డే ఉన్నాడు. నా త‌ర్వాత మ‌రొకాయన వ‌చ్చి 200 నోటుకు చిల్ల‌ర ఉందా? అని అడిగితే ఫ‌ర్లేదు స‌ర్ ఈసారి వ‌చ్చిన‌ప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పు తీసుకుని కుట్టేశాడు.


సింపుల్‌గా ఉండే ధ‌న‌వంతులు మ‌న‌కు రోల్‌మోడ‌ల్‌. సుధా నారాయ‌ణ మూర్తి సాదాసీదా నేత చీర క‌ట్టుకుంటే అదొక ఆశ్చ‌ర్యం మ‌న‌కి. సెల‌బ్రిటీలు రోడ్డు ప‌క్క‌న ధాబాలో తింటే అదీ ఒక వార్తే. అలా ఉండ‌టం వారి గొప్ప‌త‌న‌మే. ఈ చెప్పులు కుట్టే ఆయ‌న కూడా ఆ కోవ‌కి చెందిన వాడే. ఆయ‌నకు చ‌దువు లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. పిల్ల‌ల్ని చ‌దివించుకున్నాడు. ఇవాళ కూర్చుని తినే స్థితికి చేరాడు. అలాగ‌ని అన్నం పెట్టిన వృత్తిని వ‌దల్లేదు. 59ఏళ్ల ఆ ముస‌లాయ‌నకు ప‌ళ్లు ఊడిపోయే ద‌శ వ‌చ్చింది, అందుకే మాట స్ప‌ష్టంగా రావ‌ట్లేదు. నిరంత‌ర క‌ష్టం వ‌ల్ల ఒంట్లో ఇంకెలాంటి రోగాలు చేర‌లేదు. ఉద‌యం అన్నం తిని రావ‌డం. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి వెళ్లొచ్చి మ‌ళ్లీ రాత్రి వ‌ర‌కూ అక్క‌డే చెప్పులు కుట్ట‌డం. ఇదే సంతృప్తి అంటున్నాడు. 


ఆయ‌న వైపు నుంచి చూస్తే ఆయ‌న‌కిదే విలాస‌వంత‌మైన జీవితం. ఈ మ‌ధ్య ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో చూశా. ప‌చ్చ‌ని పొలాల మ‌ధ్య‌లో చిన్న పంపుసెట్ లాంటి ఇంట్లో ఒకాయ‌న ద‌ర్జాగా కూర్చున్న ఫొటో అది. ఈ ఆనందం ఎంత పెద్ద బంగ‌ళా ఉన్నా వ‌స్తుందా? అనేది ప్ర‌శ్న‌.  


*విలాసం, ఆనందం అనేవి న‌చ్చిన జీవన విధానంతో వ‌స్తాయి త‌ప్ప, కేవలం డబ్బు వల్ల మాత్రమే రావు.*



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday, 20 June 2024

గ్లాసుడు మజ్జిగపులుసు (21-June-24, Enlightment Story)

గ్లాసుడు మజ్జిగపులుసు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

భార్య : ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది.
భర్త : అవునా, అలాగైతే దాన్నేం చేస్తావు?


భార్య : ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే.
భర్త : అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి..."

భార్య : "ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!"
భర్త : "ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి.తినడానికీ రుచిగ ఉంటుంది."


భార్య : "గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను, వ్రాసుకోండి."
భర్త : "సరే చెప్పు..."

భార్య : "ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర.."
భర్త : "సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?"

భార్య : "ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ..."
భర్త : "బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?"

భార్య : "మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తరా? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి."
భర్త : "సరే... బయల్దేరనా?"

భార్య : "అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడ పెద్దవి. ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు..."
భర్త : "ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే?"

భార్య : "ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం.."
భర్త : "ఇక చాలా?"

భార్య : "కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి."
భర్త : "హల్వాకు ఇంగువ వేస్తారా?"

భార్య : "అబ్బా.... హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి?"
భర్త : "ఇకనైనా వెళ్ళనా?"

భార్య : "ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్..."
భర్త : "సరే.. బయల్దేరుతున్నాను."

భార్య : "అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు."
భర్త : "నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను."

భార్య : "ఎందుకు? మార్కెట్ కు పోరా?"
భర్త : "నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను.."

భార్య : "ఏమిటండీ, మీరే చెప్పారుగా..."
భర్త : ఓసి... నీ అమ్మ కడుపు మాడా బుద్ధి లేక చెప్పానే ..!

అట్లుంటది మరి వీళ్లతో 😉😂😆


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday, 19 June 2024

మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే (20-June-24, Enlightment Story)

మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

భగవంతుడికి ఎవరి మీద శ్రద్ధ గాని, ద్వేషము గాని ఉండదు. అందరి పట్ల సమభావనతో ఉంటారు. మనం చేసుకున్న కర్మలకు ఆయన సాక్షిభూతుడుగా ఉంటారు .మన జన్మలకి మనమే కారణము.మనం చేసిన కర్మను బట్టి తల్లిదండ్రులు అన్నదమ్ములు ,అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, చుట్టుపక్కల సమాజము ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి.


ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే అంటే మన కర్మను బట్టి ఇవన్నీ వస్తాయి. విత్తనము మొలకెత్తాలంటే నేల బాగుండాలి నీరు పోసేవారు ఉండాలి వాటిని పరిరక్షించేవారు ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటే విత్తనము మొలకెత్తలేదు అంటే కాలము దానికి సహకరించలేదు అని అర్థము. అంటే కాలము ఇక్కడ భగవంతుని స్వరూపం ఆయన ఆజ్ఞ లేనిదే ఆ విత్తనము మొలకెత్తదు.


మనము భక్తి చేత గాని, ధ్యానం చేత గాని ,కర్మ చేత గాని ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పటికీ మన మొర భగవంతుడు ఆలకించలేదు అంటే మన పాపపు కర్మ ఇంకా ఉంది అని అర్థము. భగవంతునికి దగ్గర కాలేదు అని అర్థం. కాబట్టి మనం ఇంకా ప్రయత్నము ఎక్కువ చేయాలి అంటే కాలము కలిసి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉండాలి .

సహనముతో సాధించుకోవాలి. ఓకే కాలంలో ఒకే చెట్టుకి వచ్చిన పండ్లన్నీ ఒకే రుచిని కలిగి ఉండవు. అలాగే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించరు వారి వారి కర్మలను బట్టి వారి బుద్ధి ఆధారపడి ఉంటుంది.

ఎవ్వరిని ఏమీ అనక్కర్లేదు మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాను పుణ్యం చేస్తే పాపం అనేది తానంతగా తన పోతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉండండి. గోవులకు, కుక్కలకు వాటికి కూడా ఏమన్నా పెడుతు ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు మన విన్నపాన్ని తప్పకుండా ఆలకిస్తాడు. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి.

మన పాపమంతా పోయి భగవంతుడు మన మొర ఆలకించిన రోజు మనము ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. మనము అనుకున్నవి జరగటం లేదు అంటే మన పాపం పోలేదని మనం అర్థం చేసుకోవాలి.

కాబట్టి సాధన అనేది మనం ఇంకా పెంచుతూ వెళ్లాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా భగవంతుడితో సంబంధం ఏర్పడింది అని అర్థము. మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే.

ఆత్మ దర్శనం
 🪴🪴🪴🪴
సహజముగా మనమంతా ఆత్మ-స్వరూపులము,ఆనందస్వరూపులము. కానీ ఈ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఆనందం గురించి బయట ఎక్కడో వెతుక్కుంటున్నాము. అంటే మన గురించి మనమే వెతుక్కుంటున్నాం. ఇదే ఆశ్చర్యం.

ఆధ్యాత్మిక విద్య కేవలం వినడం తోనే సరిపోదు. దానిని ఆచరణలో పెట్టినపుడే పూర్తిగా అవగతమౌతుంది. తెల్లటి బట్టకు ఏ రంగు వేసినా చక్కగా అంటుతుంది. అలాగే సారవంతమైన భూమిలో ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది. సాత్వికమైన హృదయంలో ఆధ్యాత్మికత తొందరగా నాటుకుంటుంది.

ఆత్మ అనేది అవ్యక్తము. కనపడదు. వినపడదు. తాకబడదు. ఇంద్రియములకు, మనసుకు అతీతమైనది. సూక్ష్మమైనది.

ఆత్మ దర్శనం కావాలంటే ముందు హృదయం నిర్మలంగా ఉండాలి. ఆత్మ గురించి విచారణ చేయాలి. పురాణేతిహాసాలను, గ్రంధములను చదవాలి సద్గురువును ఆశ్రయించాలి. సరైన సాధనలు చేయాలి. తద్వారా ఆత్మ స్వరూపాన్ని గుర్తించాలి. అపుడే నిజమైన మనశ్శాంతి, ఆత్మానందము


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday, 18 June 2024

మనిషి సంఘజీవి (19-June-24, Enlightment Story)

మనిషి సంఘజీవి

🌺🍀🌺🍀🌺

మనిషికి ఇతరుల సహకారమవసరము, తప్పదు.

మనిషి సంఘజీవి.తానొక్కడే కూచుని తినకూడదని పూర్వము అతిథి లేందే భోజనం చేయకూడదని నియమం వుండేది.కొన్ని ఊర్లలో మధ్యాహ్నం,రాత్రీ  ఆఖరి రైలూ,బస్సూ వెళ్ళిపోయే వరకూ భోజనం చేసేవారుకారు.(అప్పుడు యిన్ని రైళ్ళూ.బస్సులూ ఉండేవి కావు) అందులో ఎవరైనా దిగి యింటికి భోజనానినికి వస్తారేమో నని ఎదురు చూసి మరీ భోజనం చేసేవారు.ఇద్దరు యజమానులు అతిథుల కోసం వీధిలో తిరుగుతూ ఒకరు కనబడితే మీరు మాయింటికి రావాలంటే మాయింటికి రావాలని దెబ్బలాడు కున్నారట.


ఈ విధానాన్ననుసరించే వనభోజనాలు ఏర్పడ్డాయి.కార్తీక మాసాలు వనభోజనం చెయ్యాలని అందరూ కలిసి వనభోజనానికి వెళ్తారు.అది యిప్పటికీ కొనసాగుతూంది.అందరూ కలిసి వనానికి వెళ్లి అక్కడే వండుకొని అక్కడే భోజనాలు చేస్తారు.దినమంతా ఆటపాటలతో సరదాగా గడుపుతారు.అదొక ఆనందం.సంతోషాల సరాగాల్ని నంజుకుంటూ తిన్న భోజనం ముందు ఒక్కడే త్రాగిన అమృతం కూడా బలాదూరే.

అందుకే "విందు భోజనం పసందు భోజనం ఏటి ఒడ్డు తోటలోన మేటి భోజనం అంటూ 'బాలభారతం' చిత్రం లో చిన్ననాటి కురు,పాండవుల్ని వనభోజనానికి పంపిస్తూ కమ్మటి పాటను వండి వార్చారు ఆరుద్రగారు.నేతిగారెలు,నేతిబూరెలు,జాతివడ్ల పులిహోర, పరవాన్నాలు,  అప్పడాలు, దప్పళాలు ,ఆవకూరలు,పేరు చెప్పగానే నోరూరే పిండివంటలు,బొబ్బట్లు,మినపట్లు ,నంజుళ్ళు,దబ్బకాయ లంతేసి పెద్ద లడ్డుండలు,

పులుపు తీపి కారాలు ముక్కు దాకా బాగా కలిపి కొట్టి తిన్నదే కమ్మని విందు,"అంటూ నోరూరేలా, నోరూరించేలా  వర్ణించిన కవి, సహపంక్తి భోజనానం లోని సందేశాన్ని

అభిరుచుల మేళవింపే నిండుభోజనం, అన్నదమ్ములారగించు దండి భోజనం,ఒంటిపిల్లి రాసాసిది ఉత్త భోజనం, అన్న బంతిలోన భోజనం పండగౌను పంక్తి  భోజనం,సహపంక్తి భోజనం. అని తేటతెల్లం చేశారు.

ఈనాటి వురుకూ పరుగుల జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి వనభోజనాలు,సహపంక్తి భోజనాలు లాంటి ఆటవిడుపు అవసరం. కొన్నిచోట్ల సమారాధనలు,సంతర్పణలు జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు మేమంతా కలిసి యింట్లో  పులుసన్నం,పెరుగన్నం,అప్పడాలు,వడియాలు,చేసుకొని
ఎడ్లబళ్ళు కట్టుకొని మావూరి ఏటి ఒడ్డుకు వెళ్ళేవాళ్ళం.

అరటి ఆకుల్లో భోజనం శ్రేష్టం. 

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 17 June 2024

గురువులది దైవస్థానం (18-June-24, Enlightment Story)

గురువులది దైవస్థానం

🌺🍀🌺🍀🌺 🌺🍀🌺🍀🌺          
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.పెద్దయ్యారు. పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు. ఒకరు గోవింద్, ఇంకొకరు శ్రీనాథ్. ఇద్దరి పుట్టిన ఊరు బాసర. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.గోవింద్ స్కూల్ టీచర్. శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం. ‘ఏరా అంటే ఏరా’ అనే సాన్నిహిత్యం వాళ్ళది.

జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది. గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు. అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి. కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు.పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో. గోవింద్ భార్య  సరళ  పేదింటి అమ్మాయి. గోవింద్ మేనమామ కూతురే. అందలం ఎక్కాలని ఆశ సరళకు.కానీ తీరేదెలా ?


ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు. వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు.
ఆడవాళ్లు  తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు. వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది..  సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు.!

శ్రీనాథ్ భార్య లక్ష్మి.మంచి కుటుంబం నుండి వచ్చింది. దాన ధర్మాలు చేయటం అలవాటు. దైవ భక్తి మెండుగా ఉంది. ఉన్న సంపదను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి. లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు.ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి.  లక్ష్మికి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది. పిచ్చి పిల్ల.సంపదలు ఉన్నా, సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితంలో అదే చెప్పింది చాలా సార్లు. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ డబ్బులున్న దారే వేరు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..??


రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.నలుగురూ పెద్దవాళ్ళయ్యారు.అది ఆగస్ట్ నెల.ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు. మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ .

ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది. శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.  రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని.పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది.శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు. ఫంక్షన్ బాగా జరిగింది. సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు.మంచి వాడు.పని లో చురుకుదనం చూపించే వాడని,అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..

స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు.మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని.స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.అందరూ ఆనందించారు.

ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు.చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..

వచ్చే నెలలో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.మామూలు స్కూలు టీచర్ గాచేరి ఇప్పుడు  ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు. కనీసం లో కనీసం తలదించు కోకుండా జరిగితే చాలు.అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..

రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది. ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి. మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన,సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది. గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..

ఆ రోజు మామూలు గా స్కూల్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు.కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..

సాయంత్రం నాలుగు గంటలయ్యింది.ఆ పాటికే సరళను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా స్కూల్ కి వచ్చారు. శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.

సరళ కు బెంగగా ఉంది. ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది. తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...

సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు. అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్లే కదా.సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు. ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ఎక్కడినుండి వచ్చారో.దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది.

ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు.అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు.చాలా మంది నుంచునే ఉన్నారు.ఫంక్షన్ అయ్యేంత వరకూ..

ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు.మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు.సరళ కు అంతా కల గా ఉంది.పల్లకీ లో  గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు.మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని..అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..

పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...

ఇంతలో పల్లకీ ని దింపారు.ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు. కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు..  ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా
జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు..

జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు,మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు. నీళ్ళు, కాళ్ళు  కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ  వారిద్దరి మీద..

పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు...

అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు.తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం అది వాడికి జరిగినా తనకూ జరిగినట్లే...

శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్  అని పిలువ గల అర్హత  కలవాడవటం  సంతోషంగా ఉందని అన్నాడు..

చివరగా గోవింద్ మాట్లాడాడు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.

నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు. పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు  గోవింద్ మాస్టారును. ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...

ఆ రోజు రాత్రి  శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు. భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం,  తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....

నాకూ ఇంత వరకూ తెలియదురా  అన్నది సరళ ఎంతో సంతోషంగా. శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..
వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను. సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ మనకు ఈ సంపద చాలు సరళా ఈ జన్మకు అన్నాడు..

ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న  ఆస్తి పిల్లల అభిమానమే... అన్నట్లుగా... ✍️
           



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday, 16 June 2024

ముక్తికి మార్గం (17-June-24, Enlightment Story)

 ముక్తికి మార్గం

🌺🍀🌺🍀🌺             

నా నేను కాదు అంతా భగవంతుడే! స్వధర్మమే ఈశ్వారార్పణ, మనం ఈ లోకంలో ఉన్నంతవరకూ, మనలో ప్రతి ఒక్కనికీ ఏదోకొంత పేరూ, ప్రతిష్ఠా కాలక్షేపానికి ధనమూ అవసరంగా వుంటుంది.

కొందరికి ఇవన్నీ ఆయాచితంగానే లభిస్తాయి. మరికొందరికి ఎంత శ్రమించినా, ఇవి అందకుండానే పోతాయి. ఐతే ఇవి మనతో స్థిరంగా ఉంటాయా అంటే వుండవు. జీవితకాలంలో వానిని మనమైనా వదలిపెడ్తాము లేదా అవైనా మనలను వదలి పెడ్తాయి. అందుచేత పేరుప్రతిష్ఠలకీ, ధనార్జనకూ మనం జీవితమంతా ధారపోయవలసిన అవసరం లేదని తేలుతుంది.




మరి ప్రయత్నపూర్వకంగా మనం దేనికై పాటుపడాలి అన్న ప్రశ్నవస్తే పాపదూరమైన పుణ్యజీవనానికే శ్రమించాలి!’ అని బదులు చెప్పవలసి వస్తుంది. ఐతే పుణ్యజీవనం సిద్ధించేదెట్లా? 

  • ఒకటి మనం ఇదివరకు చేసిన పాపాలను నాశంచేసుకోవాలి. 
  • రెండవది అటుమీదట పాపాచరణకు పూనుకోక పాపబుద్ధిని తొలగించుకొని చిత్తనైర్మల్యంకోసం పాటుపడాలి.

పాపనాశనానికి మార్గమేమిటంటే భగవంతునిపై భారంవేసి, ‘మన రక్షకుడు అతడేఅనీ, జరిగేది ప్రతియొక్కటీ అతని ఎరుకలోనిదే అనీ, మనకుజరిగే మంచీ చెడ్డా రెండూ ఆయన ఇచ్ఛాపూర్వకంగానే జరుగుతున్నవనీ, జరిగేవన్నీ మన మంచికేనని దృఢనిశ్చయంతో ఉండటమూ, తన్ను పరిపూర్తిగా స్వామికి అర్పణ చేసుకొని ఈశ్వర ప్రవాహంలో తేలిపోవడమూ!’ ఇవే శరణాగతికి కీలకం.

మరి పాపబుద్ధి తొలగించుకోడానికి మార్గమేమిటంటే, మనము దొరికిన ప్రతిక్షణమూ భగవచ్చింతనకు వినియోగిస్తూ, అతని నామజపం చేస్తూ ఆయన పుణ్యకథా శ్రవణం చేయడమే.

మానవుల పాప ప్రక్షాళనానికై దేవుడు అవతరించాడనేది ఏదీ కూడా హైందవమతంలో కనబడదని కొందరు వాదిస్తూంటారు. ఇదిసరికాదని ఈక్రింది గీతాశ్లోకం చదివితే తెలుస్తుంది.

*“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ,*
*ఆహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః||”*


*'సర్వపాపేభ్యో, మోక్షయిష్యామి' నిన్ను అన్నిపాపాల నుండి నేను రక్షిస్తాను. 'సర్వధర్మాన్ పరిత్యజ్య' నీవు అన్ని ధర్మాలనూ వదలివెయ్యి. 'మామేకం శరణం వ్రజ' నన్నేశరణుపొందు - అని అర్జునుడితో భగవానులు అంటున్నారు.*

*ఈసందర్భంలో 'సర్వధర్మాన్ పరిత్యజ్య' అంటే సరియయిన అర్థం ఏమిటో తెలుసుకోవాలి.*

*గీతలో ఎక్కడ పడితే అక్కడ ప్రతివ్యక్తీ తన స్వధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ రావాలనే సూచనలున్నవి. మరి ఇక్కడ 'సర్వధర్మాన్ పరిత్యజ్య' అనటంలో అర్థమేమి, భగవానుడు అర్జునుడికి అన్ని కర్మలనూ వదలిపెట్టి ఏపనీ చేయకుండా వూరికే కూర్చోమని బోధిస్తున్నాడా...?”  లక్ష్యసిద్ధి ఒక్కకర్మ వల్లనే సిద్ధిస్తుందని అనుకోవద్దు ఈ కర్మలే లక్ష్యములనీ అనుకోవద్దు. అన్ని భారాలనూ నాపై వేసి అనన్యశరణంగా ఉండిపో”.  అని ఆయన అర్జునుడికి బోధిస్తున్నాడు. దీనికి ముందుశ్లోకం--*

*”మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,*
*మా మే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే||”*


*ప్రియోసిమే' అని కృష్ణపరమాత్మ అర్జునుడితో చెప్పుతున్నారంటే ఒక అర్జునుడే కాదు, మనమందరమూ వారికి ప్రియులమే. అందుచే 'సత్యం తే ప్రతిజానే' యని వారు మాట ఇస్తున్నారంటే అది మనకందరికిన్నీ ఇచ్చినమాటే. వారిచ్చిన మాట చొప్పున 'మా మేవైష్యసి' వారినే మనమందరమూ పొందుదాము దానికి మార్గం 'మన్మనా భవ'. భావాలన్నీ ఆయనవంకనే మనం ఉంచాలి. 'మద్భక్తోభవ' వారి భక్తులమై పోవాలి, 'మద్యాజీ భవ' వారి పూజకులమైపోవాలి. 'మాం నమస్కురు' వారికి నమస్కరిస్తూ, వారి చరణదాసులమై పోవాలి.*

*మన ప్రేమలను కొంచెం పరిశీలించిచూస్తే భ్యార్య పై భర్త, భర్త పై భార్య ఉంచే ప్రేమైనాసరే,  పుత్రులపై తల్లిదండ్రులు ఉంచే ప్రేమైనా సరే నిజానికి   స్వాత్మ ప్రేమగానే పరిణమిస్తుంది. పుత్రుడున్నాడు, వానిపై చాలా మమత. ఆ పుత్రుడు పెళ్ళిచేసుకొని భార్యమోజులో పడి తండ్రిని కొంచెం నిరాకరిస్తే, ఈ తండ్రిగారి ప్రేమ ఒక్కమారుగా తుడిచిపెట్టుకు పోతుంది. దానిస్థానంలో వైరి బీజం మొలకెత్తుతుంది. అందుచేత మనం చెప్పే ఈప్రేమలన్నీ ఏదో ఒక వ్యాజంతో కూడు కొన్నవని తెలుస్తున్నవి. ఈ ప్రేమలకంతా ఏదో ఒక కారణం ఉంది.*

ఐతే మనలను మనమే ప్రేమించుకొంటున్నామే, ఆప్రేమను పరీక్షిస్తే, అది నిష్కారణమైన ప్రేమ. అవ్యాజమైన ప్రేమ అని తేలుతుంది. 'నేను' 'నేను' అని ఎప్పుడూ తగని అభిమానంతో నిరంతర ప్రేమతో వల్లెవేసుకొంటున్నామే, ఈ 'నేను' అనేది 'వాడే' అని గుర్తించేసరికీ మన మనస్సు వాని చింతనలతో నిండిపోతుంది. 'మన్మనా భవ' అన్న వాక్యానికి అదే అర్థం. ఆయనను ప్రార్థించడం ఆయన ఏదో మనకు వరాలిస్తాడని కాదు. ఆయనే మనమైతిమి. మన ఆత్మా ఆయనా ఒక్కటే ఆయెను. ఆయనను అనుకోని క్షణం లేకపోయెను. ఈ భావం బాగా రూఢి అయిపోయిందంటే మన మనస్సు ఆవ్యాజ భక్తితో మునిగి పోయిందన్నమాట.*

*ఈలాంటి అవ్యాజ భక్తికి మన పురాణాలలో ఎన్నో దృష్టాంతాలున్నవి.*

అక్రూరుడు, విదురుడు మొదలగు వారు అవ్యాజభక్తులే. చిన్నతనంలోనే భగవచ్చరణాగతిని పొందినవారు ధ్రువుడు, ప్రహ్లాదుడు, వారే కాకుండా నిరక్షరాశ్యులూ, నిమ్నజాతికి చెందిన వారూ కన్నప్పా, శబరీ, మొదలైన వారు, వీరిని తమ వ్యక్తిత్వాన్నే మరచునట్లు చేసింది వారి భక్తి స్రవంతి.

.       

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday, 14 June 2024

కర్మ ఫలం - పుణ్య ఫలం (15-June-24, Enlightment Story)

 కర్మ ఫలం - పుణ్య ఫలం

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన  కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.


 ఆ బస్సురెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు. ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దూరంలోనే పడ్డది .ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

 ఆ బస్సులో వున్న ఒక పెద్దయన  ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.!

 నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!

ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో!ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
            
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.మొదట గా ఆ పెద్దమనిషే  ధైర్యం చేసి భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో,  కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు ”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. అంటూ అతన్ని దూషిస్తూ, బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు ముాసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు.

కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు...!! ఆ బస్సుపై…అవును.. బస్సుపై పిడుగు పడి అందులో వున్న ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే, ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో వున్నవారు, వారి వారి స్వార్థం వల్ల ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. 

ఇంతసేపు అతను వారితో కలసి వుండడం వల్ల, ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షనం వారంతా మృత్యువాత పడడం జరిగింది.  

కర్మ ఫలం (పుణ్య ఫలం)అంటే ఇదే కాబోలు, దీని అర్థం నీవు చేసిన పుణ్యఫలం నీ వాల్లనే కాదు నీ చుట్టూ వున్న అందరిని కాపాడి రక్షిస్తుంది.అందుకే దైవ కార్యాలకు వీలైనంత సహకారం అందించండి. హోమాలు యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు ఇలా వీలైన విశేష పూజలలో పాల్గొని దైవానుగ్రహం పొంది మిమ్మల్ని మీరు మీ కుటుంబ సభ్యులను మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాపాడండి.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...