Tuesday, 18 June 2024

మనిషి సంఘజీవి (19-June-24, Enlightment Story)

మనిషి సంఘజీవి

🌺🍀🌺🍀🌺

మనిషికి ఇతరుల సహకారమవసరము, తప్పదు.

మనిషి సంఘజీవి.తానొక్కడే కూచుని తినకూడదని పూర్వము అతిథి లేందే భోజనం చేయకూడదని నియమం వుండేది.కొన్ని ఊర్లలో మధ్యాహ్నం,రాత్రీ  ఆఖరి రైలూ,బస్సూ వెళ్ళిపోయే వరకూ భోజనం చేసేవారుకారు.(అప్పుడు యిన్ని రైళ్ళూ.బస్సులూ ఉండేవి కావు) అందులో ఎవరైనా దిగి యింటికి భోజనానినికి వస్తారేమో నని ఎదురు చూసి మరీ భోజనం చేసేవారు.ఇద్దరు యజమానులు అతిథుల కోసం వీధిలో తిరుగుతూ ఒకరు కనబడితే మీరు మాయింటికి రావాలంటే మాయింటికి రావాలని దెబ్బలాడు కున్నారట.


ఈ విధానాన్ననుసరించే వనభోజనాలు ఏర్పడ్డాయి.కార్తీక మాసాలు వనభోజనం చెయ్యాలని అందరూ కలిసి వనభోజనానికి వెళ్తారు.అది యిప్పటికీ కొనసాగుతూంది.అందరూ కలిసి వనానికి వెళ్లి అక్కడే వండుకొని అక్కడే భోజనాలు చేస్తారు.దినమంతా ఆటపాటలతో సరదాగా గడుపుతారు.అదొక ఆనందం.సంతోషాల సరాగాల్ని నంజుకుంటూ తిన్న భోజనం ముందు ఒక్కడే త్రాగిన అమృతం కూడా బలాదూరే.

అందుకే "విందు భోజనం పసందు భోజనం ఏటి ఒడ్డు తోటలోన మేటి భోజనం అంటూ 'బాలభారతం' చిత్రం లో చిన్ననాటి కురు,పాండవుల్ని వనభోజనానికి పంపిస్తూ కమ్మటి పాటను వండి వార్చారు ఆరుద్రగారు.నేతిగారెలు,నేతిబూరెలు,జాతివడ్ల పులిహోర, పరవాన్నాలు,  అప్పడాలు, దప్పళాలు ,ఆవకూరలు,పేరు చెప్పగానే నోరూరే పిండివంటలు,బొబ్బట్లు,మినపట్లు ,నంజుళ్ళు,దబ్బకాయ లంతేసి పెద్ద లడ్డుండలు,

పులుపు తీపి కారాలు ముక్కు దాకా బాగా కలిపి కొట్టి తిన్నదే కమ్మని విందు,"అంటూ నోరూరేలా, నోరూరించేలా  వర్ణించిన కవి, సహపంక్తి భోజనానం లోని సందేశాన్ని

అభిరుచుల మేళవింపే నిండుభోజనం, అన్నదమ్ములారగించు దండి భోజనం,ఒంటిపిల్లి రాసాసిది ఉత్త భోజనం, అన్న బంతిలోన భోజనం పండగౌను పంక్తి  భోజనం,సహపంక్తి భోజనం. అని తేటతెల్లం చేశారు.

ఈనాటి వురుకూ పరుగుల జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి వనభోజనాలు,సహపంక్తి భోజనాలు లాంటి ఆటవిడుపు అవసరం. కొన్నిచోట్ల సమారాధనలు,సంతర్పణలు జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు మేమంతా కలిసి యింట్లో  పులుసన్నం,పెరుగన్నం,అప్పడాలు,వడియాలు,చేసుకొని
ఎడ్లబళ్ళు కట్టుకొని మావూరి ఏటి ఒడ్డుకు వెళ్ళేవాళ్ళం.

అరటి ఆకుల్లో భోజనం శ్రేష్టం. 

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 17 June 2024

గురువులది దైవస్థానం (18-June-24, Enlightment Story)

గురువులది దైవస్థానం

🌺🍀🌺🍀🌺 🌺🍀🌺🍀🌺          
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.పెద్దయ్యారు. పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు. ఒకరు గోవింద్, ఇంకొకరు శ్రీనాథ్. ఇద్దరి పుట్టిన ఊరు బాసర. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.గోవింద్ స్కూల్ టీచర్. శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం. ‘ఏరా అంటే ఏరా’ అనే సాన్నిహిత్యం వాళ్ళది.

జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది. గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు. అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి. కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు.పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో. గోవింద్ భార్య  సరళ  పేదింటి అమ్మాయి. గోవింద్ మేనమామ కూతురే. అందలం ఎక్కాలని ఆశ సరళకు.కానీ తీరేదెలా ?


ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు. వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు.
ఆడవాళ్లు  తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు. వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది..  సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు.!

శ్రీనాథ్ భార్య లక్ష్మి.మంచి కుటుంబం నుండి వచ్చింది. దాన ధర్మాలు చేయటం అలవాటు. దైవ భక్తి మెండుగా ఉంది. ఉన్న సంపదను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి. లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు.ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి.  లక్ష్మికి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది. పిచ్చి పిల్ల.సంపదలు ఉన్నా, సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితంలో అదే చెప్పింది చాలా సార్లు. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ డబ్బులున్న దారే వేరు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..??


రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.నలుగురూ పెద్దవాళ్ళయ్యారు.అది ఆగస్ట్ నెల.ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు. మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ .

ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది. శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.  రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని.పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది.శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు. ఫంక్షన్ బాగా జరిగింది. సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు.మంచి వాడు.పని లో చురుకుదనం చూపించే వాడని,అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..

స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు.మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని.స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.అందరూ ఆనందించారు.

ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు.చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..

వచ్చే నెలలో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.మామూలు స్కూలు టీచర్ గాచేరి ఇప్పుడు  ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు. కనీసం లో కనీసం తలదించు కోకుండా జరిగితే చాలు.అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..

రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది. ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి. మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన,సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది. గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..

ఆ రోజు మామూలు గా స్కూల్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు.కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..

సాయంత్రం నాలుగు గంటలయ్యింది.ఆ పాటికే సరళను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా స్కూల్ కి వచ్చారు. శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.

సరళ కు బెంగగా ఉంది. ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది. తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...

సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు. అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్లే కదా.సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు. ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ఎక్కడినుండి వచ్చారో.దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది.

ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు.అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు.చాలా మంది నుంచునే ఉన్నారు.ఫంక్షన్ అయ్యేంత వరకూ..

ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు.మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు.సరళ కు అంతా కల గా ఉంది.పల్లకీ లో  గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు.మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని..అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..

పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...

ఇంతలో పల్లకీ ని దింపారు.ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు. కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు..  ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా
జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు..

జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు,మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు. నీళ్ళు, కాళ్ళు  కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ  వారిద్దరి మీద..

పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు...

అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు.తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం అది వాడికి జరిగినా తనకూ జరిగినట్లే...

శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్  అని పిలువ గల అర్హత  కలవాడవటం  సంతోషంగా ఉందని అన్నాడు..

చివరగా గోవింద్ మాట్లాడాడు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.

నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు. పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు  గోవింద్ మాస్టారును. ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...

ఆ రోజు రాత్రి  శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు. భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం,  తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....

నాకూ ఇంత వరకూ తెలియదురా  అన్నది సరళ ఎంతో సంతోషంగా. శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..
వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను. సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ మనకు ఈ సంపద చాలు సరళా ఈ జన్మకు అన్నాడు..

ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న  ఆస్తి పిల్లల అభిమానమే... అన్నట్లుగా... ✍️
           



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday, 16 June 2024

ముక్తికి మార్గం (17-June-24, Enlightment Story)

 ముక్తికి మార్గం

🌺🍀🌺🍀🌺             

నా నేను కాదు అంతా భగవంతుడే! స్వధర్మమే ఈశ్వారార్పణ, మనం ఈ లోకంలో ఉన్నంతవరకూ, మనలో ప్రతి ఒక్కనికీ ఏదోకొంత పేరూ, ప్రతిష్ఠా కాలక్షేపానికి ధనమూ అవసరంగా వుంటుంది.

కొందరికి ఇవన్నీ ఆయాచితంగానే లభిస్తాయి. మరికొందరికి ఎంత శ్రమించినా, ఇవి అందకుండానే పోతాయి. ఐతే ఇవి మనతో స్థిరంగా ఉంటాయా అంటే వుండవు. జీవితకాలంలో వానిని మనమైనా వదలిపెడ్తాము లేదా అవైనా మనలను వదలి పెడ్తాయి. అందుచేత పేరుప్రతిష్ఠలకీ, ధనార్జనకూ మనం జీవితమంతా ధారపోయవలసిన అవసరం లేదని తేలుతుంది.




మరి ప్రయత్నపూర్వకంగా మనం దేనికై పాటుపడాలి అన్న ప్రశ్నవస్తే పాపదూరమైన పుణ్యజీవనానికే శ్రమించాలి!’ అని బదులు చెప్పవలసి వస్తుంది. ఐతే పుణ్యజీవనం సిద్ధించేదెట్లా? 

  • ఒకటి మనం ఇదివరకు చేసిన పాపాలను నాశంచేసుకోవాలి. 
  • రెండవది అటుమీదట పాపాచరణకు పూనుకోక పాపబుద్ధిని తొలగించుకొని చిత్తనైర్మల్యంకోసం పాటుపడాలి.

పాపనాశనానికి మార్గమేమిటంటే భగవంతునిపై భారంవేసి, ‘మన రక్షకుడు అతడేఅనీ, జరిగేది ప్రతియొక్కటీ అతని ఎరుకలోనిదే అనీ, మనకుజరిగే మంచీ చెడ్డా రెండూ ఆయన ఇచ్ఛాపూర్వకంగానే జరుగుతున్నవనీ, జరిగేవన్నీ మన మంచికేనని దృఢనిశ్చయంతో ఉండటమూ, తన్ను పరిపూర్తిగా స్వామికి అర్పణ చేసుకొని ఈశ్వర ప్రవాహంలో తేలిపోవడమూ!’ ఇవే శరణాగతికి కీలకం.

మరి పాపబుద్ధి తొలగించుకోడానికి మార్గమేమిటంటే, మనము దొరికిన ప్రతిక్షణమూ భగవచ్చింతనకు వినియోగిస్తూ, అతని నామజపం చేస్తూ ఆయన పుణ్యకథా శ్రవణం చేయడమే.

మానవుల పాప ప్రక్షాళనానికై దేవుడు అవతరించాడనేది ఏదీ కూడా హైందవమతంలో కనబడదని కొందరు వాదిస్తూంటారు. ఇదిసరికాదని ఈక్రింది గీతాశ్లోకం చదివితే తెలుస్తుంది.

*“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ,*
*ఆహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః||”*


*'సర్వపాపేభ్యో, మోక్షయిష్యామి' నిన్ను అన్నిపాపాల నుండి నేను రక్షిస్తాను. 'సర్వధర్మాన్ పరిత్యజ్య' నీవు అన్ని ధర్మాలనూ వదలివెయ్యి. 'మామేకం శరణం వ్రజ' నన్నేశరణుపొందు - అని అర్జునుడితో భగవానులు అంటున్నారు.*

*ఈసందర్భంలో 'సర్వధర్మాన్ పరిత్యజ్య' అంటే సరియయిన అర్థం ఏమిటో తెలుసుకోవాలి.*

*గీతలో ఎక్కడ పడితే అక్కడ ప్రతివ్యక్తీ తన స్వధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ రావాలనే సూచనలున్నవి. మరి ఇక్కడ 'సర్వధర్మాన్ పరిత్యజ్య' అనటంలో అర్థమేమి, భగవానుడు అర్జునుడికి అన్ని కర్మలనూ వదలిపెట్టి ఏపనీ చేయకుండా వూరికే కూర్చోమని బోధిస్తున్నాడా...?”  లక్ష్యసిద్ధి ఒక్కకర్మ వల్లనే సిద్ధిస్తుందని అనుకోవద్దు ఈ కర్మలే లక్ష్యములనీ అనుకోవద్దు. అన్ని భారాలనూ నాపై వేసి అనన్యశరణంగా ఉండిపో”.  అని ఆయన అర్జునుడికి బోధిస్తున్నాడు. దీనికి ముందుశ్లోకం--*

*”మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,*
*మా మే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే||”*


*ప్రియోసిమే' అని కృష్ణపరమాత్మ అర్జునుడితో చెప్పుతున్నారంటే ఒక అర్జునుడే కాదు, మనమందరమూ వారికి ప్రియులమే. అందుచే 'సత్యం తే ప్రతిజానే' యని వారు మాట ఇస్తున్నారంటే అది మనకందరికిన్నీ ఇచ్చినమాటే. వారిచ్చిన మాట చొప్పున 'మా మేవైష్యసి' వారినే మనమందరమూ పొందుదాము దానికి మార్గం 'మన్మనా భవ'. భావాలన్నీ ఆయనవంకనే మనం ఉంచాలి. 'మద్భక్తోభవ' వారి భక్తులమై పోవాలి, 'మద్యాజీ భవ' వారి పూజకులమైపోవాలి. 'మాం నమస్కురు' వారికి నమస్కరిస్తూ, వారి చరణదాసులమై పోవాలి.*

*మన ప్రేమలను కొంచెం పరిశీలించిచూస్తే భ్యార్య పై భర్త, భర్త పై భార్య ఉంచే ప్రేమైనాసరే,  పుత్రులపై తల్లిదండ్రులు ఉంచే ప్రేమైనా సరే నిజానికి   స్వాత్మ ప్రేమగానే పరిణమిస్తుంది. పుత్రుడున్నాడు, వానిపై చాలా మమత. ఆ పుత్రుడు పెళ్ళిచేసుకొని భార్యమోజులో పడి తండ్రిని కొంచెం నిరాకరిస్తే, ఈ తండ్రిగారి ప్రేమ ఒక్కమారుగా తుడిచిపెట్టుకు పోతుంది. దానిస్థానంలో వైరి బీజం మొలకెత్తుతుంది. అందుచేత మనం చెప్పే ఈప్రేమలన్నీ ఏదో ఒక వ్యాజంతో కూడు కొన్నవని తెలుస్తున్నవి. ఈ ప్రేమలకంతా ఏదో ఒక కారణం ఉంది.*

ఐతే మనలను మనమే ప్రేమించుకొంటున్నామే, ఆప్రేమను పరీక్షిస్తే, అది నిష్కారణమైన ప్రేమ. అవ్యాజమైన ప్రేమ అని తేలుతుంది. 'నేను' 'నేను' అని ఎప్పుడూ తగని అభిమానంతో నిరంతర ప్రేమతో వల్లెవేసుకొంటున్నామే, ఈ 'నేను' అనేది 'వాడే' అని గుర్తించేసరికీ మన మనస్సు వాని చింతనలతో నిండిపోతుంది. 'మన్మనా భవ' అన్న వాక్యానికి అదే అర్థం. ఆయనను ప్రార్థించడం ఆయన ఏదో మనకు వరాలిస్తాడని కాదు. ఆయనే మనమైతిమి. మన ఆత్మా ఆయనా ఒక్కటే ఆయెను. ఆయనను అనుకోని క్షణం లేకపోయెను. ఈ భావం బాగా రూఢి అయిపోయిందంటే మన మనస్సు ఆవ్యాజ భక్తితో మునిగి పోయిందన్నమాట.*

*ఈలాంటి అవ్యాజ భక్తికి మన పురాణాలలో ఎన్నో దృష్టాంతాలున్నవి.*

అక్రూరుడు, విదురుడు మొదలగు వారు అవ్యాజభక్తులే. చిన్నతనంలోనే భగవచ్చరణాగతిని పొందినవారు ధ్రువుడు, ప్రహ్లాదుడు, వారే కాకుండా నిరక్షరాశ్యులూ, నిమ్నజాతికి చెందిన వారూ కన్నప్పా, శబరీ, మొదలైన వారు, వీరిని తమ వ్యక్తిత్వాన్నే మరచునట్లు చేసింది వారి భక్తి స్రవంతి.

.       

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday, 14 June 2024

కర్మ ఫలం - పుణ్య ఫలం (15-June-24, Enlightment Story)

 కర్మ ఫలం - పుణ్య ఫలం

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన  కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.


 ఆ బస్సురెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు. ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దూరంలోనే పడ్డది .ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

 ఆ బస్సులో వున్న ఒక పెద్దయన  ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.!

 నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!

ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో!ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
            
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.మొదట గా ఆ పెద్దమనిషే  ధైర్యం చేసి భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో,  కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు ”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. అంటూ అతన్ని దూషిస్తూ, బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు ముాసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు.

కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు...!! ఆ బస్సుపై…అవును.. బస్సుపై పిడుగు పడి అందులో వున్న ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే, ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో వున్నవారు, వారి వారి స్వార్థం వల్ల ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. 

ఇంతసేపు అతను వారితో కలసి వుండడం వల్ల, ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షనం వారంతా మృత్యువాత పడడం జరిగింది.  

కర్మ ఫలం (పుణ్య ఫలం)అంటే ఇదే కాబోలు, దీని అర్థం నీవు చేసిన పుణ్యఫలం నీ వాల్లనే కాదు నీ చుట్టూ వున్న అందరిని కాపాడి రక్షిస్తుంది.అందుకే దైవ కార్యాలకు వీలైనంత సహకారం అందించండి. హోమాలు యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు ఇలా వీలైన విశేష పూజలలో పాల్గొని దైవానుగ్రహం పొంది మిమ్మల్ని మీరు మీ కుటుంబ సభ్యులను మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాపాడండి.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday, 13 June 2024

శ్రీ శ్రీ భాషా చమత్కారాలు (14-June-24, Enlightment Story)

శ్రీ శ్రీ భాషా చమత్కారాలు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు.
"దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీ శ్రీ. (
శ్రీరంగం శ్రీనివాసరావు )

మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప
మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీ శ్రీ 

ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు.
ప్లాట్ ఫాం పై ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు. "లేదు ఊరికే" అని
బదులిచ్చాడు శ్రీ శ్రీ.



ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి
ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కాని నీరు దొరకదా?" అనడిగాడు.
శ్రీ శ్రీ.

ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ "అరే
ఇంతకుముందిక్కడ మనుషులుండే వారే" అనన్నాడు. 
శ్రీ శ్రీ.

ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు,"అని వల్లె
వేయటం విని "ఒరే ! మొద్దబ్బాయ్ ! అలాకాదురా ! అది 'ఎవడురా త్రిలోక
కంటకుడు" అని సరి చేశాడు.

ఓ హరిదాసు విశ్వనాథ సత్య నారాయణ గార్ని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి
సహకరించమని అడిగాడు.

"మీ ఊరిలోనే చెప్ప కూడదటయ్యా" అనన్నాడు సత్యనారాయణగారు . మా ఊరి వారు చెప్పిచ్చు కోరండి" అనన్నాడా హరిదాసు.మా ఊరి వారు చెప్పుచ్చు కుంటారే" అనన్నాడు సత్యనారాయణగారు*

"దోసె," ; "పూరీ"; " వడ" ; "సాంబారు" పదాలతో శివపార్వతుల కల్యాణం గురించిన
పద్యం :


జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యమొప్పారగన్
నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందంజాజి పూరీతి;పా
వడ యట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి యా
పడతిన్ బార్వతి బెండ్లియాడితివి సాంబా! రుద్ర! సర్వేశ్వరా!


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday, 11 June 2024

మన సంస్కృతిని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి (12-June-24, Enlightment Story)

మన సంస్కృతిని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺


1) మాతృదేవోభవ,పితృదేవోభవ అని చెప్పిన దేశం భారత దేశం. కానీ దానిని ఆచరించేది  ఆస్ట్రేలియా. (పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది)



2) గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం.కానీ దానిని ఆచరించేది చైనా. (గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది)

3) యత్ర నార్యంతు పూజ్యతే అని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది నార్వే. (మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం)

4) పెద్దలను,వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్. (మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే)

5) సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం. కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.)

6) కష్టేఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా. ( హార్డ్ వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియా దే)

7) ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం. కానీ ఆచరిస్తున్నది నార్వే.(ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.)

8) భగవద్గీత బోధించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది జపాన్.(కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో  మొదటి స్థానం జపాన్ దే)

9) ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది సింగపూర్.(క్రమ శిక్షణ లో మొదటి స్థానం సింగపూర్ దే)

10) విద్యను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం. కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. (విద్య , విలువలులో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే)

పై విషయాలలో స్వల్ప తేడాలతో టాప్ ట్వంటీ లో ఉన్న  దేశాలు ఇవి.. నార్వే, ఐస్ ల్యాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్ ల్యాండ్, జపాన్, యూకే, చైనా, స్విట్జర్లాండ్,  న్యూజిలాండ్, సింగపూర్ , దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, యూఏఈ, ఆస్ట్రేలియా . చెప్పడం కాదు. చేసి చూపిస్తేనే విలువుంటుంది. 



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 10 June 2024

పరమశాంతి-శాశ్వత ఆనందం (11-June-24, Enlightment Story)

 పరమశాంతి-శాశ్వత ఆనందం

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺
               
నీవు ఎవరవు ?  ఎవరి వాడివి ?  ఎక్కడి నుండి వచ్చావు ? భార్యాభర్తలు అన్యోన్యంగా, అనురాగంగా ఉంటారు, అలా ఉండాల్సిందే ! అయితే వారి మధ్య ఉండవలసిన బంధం యొక్క అసలు తత్త్వం తెలిసి ఉంటే వారి బంధం అందంగాను, అద్భుతంగా ఉంటుంది.

అలా తెలుసుకోలేక పోతే దుఃఖమయం అవుతుంది! కళ్ళు అందంగా కనిపించాలని కాటుక పెట్టుకుంటారు, అది సరైనది కాకపోతే అందం సంగతి ఎలా ఉన్నా కళ్లు పోయే ప్రమాదం ఉంటుంది...!

అలాగే భార్యాభర్తల మధ్యగల బంధం యొక్క యదార్థస్థితిని తెలుసుకోలేకపోతే సుఖం కోసం చేసుకున్న వివాహం దుఃఖంతో అంతమవుతుంది...! భార్యాభర్తలు కలసి ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి, కాని ఇలా కలిసి ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య కొంచెం ఎడం ఉండాలి.

ఒకరికొకరు పూర్తిగా అతుక్కుపోతే, ఒకరు లేకపోతే మరొకరు బ్రతుకలేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటే అది ఇద్దరిలోను ఎవరో ఒకరికి భరించలేని దుఃఖ కారణమవుతుంది, కనుక తత్త్వాన్ని విచారించాలి!



1) కాతేకాంతః

నీ భార్య ఎవరు ? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకు ఏ ప్రమేయమూ లేదు. ఆమె ఎక్కడో పుట్టింది, నీవు ఎక్కడో పుట్టావు, అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది. పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా.. చివరిదాకా ఇలా కలిసే ప్రయాణిస్తారా ? అదేం లేదు. ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు, ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి, అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు, వెళ్ళిపోవటం కూడా ఒక్కసారిగా జరగటం లేదు, ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను, కొంతకాలం కలసి మెలసి జీవిస్తారు అంతే !

ఇదంతా రైలు ప్రయాణం లాంటిది, ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు, కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. లోకాభిరామాయణంతో ప్రారంభమై రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు.ఎంతో ఆత్మీయులయ్యారు, మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు.
రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు, ఇంతే వారి మధ్య సంబంధం.

భార్యాభర్తల సంబంధం కూడా ఇలాంటిదే..! అందుకే తత్త్వ విచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి, అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది...```


2) కస్తే పుత్రః

అలాగే నీ కుమారుడెవరు ? అని కూడా విచారించు, పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో ప్రేమాస్పదుడైన కుమారుడు, మరి.అంతకుముందు..? అతడు నీ భార్య గర్భంలో పిండం. అంతకు ముందో..!  అతడు నీలో బీజరూపం..! ఆ బీజం ఎలా వచ్చింది..? నీవు తిన్న ఆహారం ద్వారా నీలో తయారైంది..! మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది..? భూమిలో నుండి వచ్చింది.

అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది. అంటే మట్టి యొక్క చివరి రూపమే నీ కుమారుడు అన్నమాట.

మరి నీవు ఎవరు..? నీవూ అంతే... కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో నీవు ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే, ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టి ముద్ద మరొక చిన్న మట్టి ముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, ప్రేమను పెంచుకుంటుంది.

విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విల విలలాడి పోతుంటుంది, దూరంగా ఉండి ఈ రెండు మట్టి ముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం, కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టి ముద్దల పాత్రలను పోషిస్తున్నాం, ఇదే భ్రమ, ఇదే మాయ, ఇదే అజ్ఞానం...!

ఉన్నది ఉన్నట్లుగ చూడలేక 'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం.


ఎంత చిత్రం.. అందుకే ఈ సంసారం అతి విచిత్రం, తమాషా అయినట్టిది. ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవు ఎవరు..? ఎవరి వాడవు..? ఎక్కడి నుండి వచ్చావు..? ఈ విచారణ ముఖ్యమైనది.

వేదాంతంలో నేనెవరు..? అని విచారణ చేయటమే మానవ జీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం.
సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతమే ఈ "నేనెవరు..?" అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం...!

నేనెవరు..? నేను ఈ శరీరమా..? కాదు... ఇదొక గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా..? కాదు... అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే, అవీ జడమే..!

వాటిని నేను ఉపయోగించుకుంటున్నాను, మరైతే నేనెవరు..? దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను.

అయితే జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను..? ఎక్కణ్ణించి వచ్చాను..? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను...!

నేను వచ్చింది అక్కణ్ణించే, మరి ఎక్కడకు వెళ్ళాలి..? ఆ పరమాత్మ వద్దకే... పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. అప్పుడే పరమశాంతి,శాశ్వతానందం.!


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...