Thursday, 4 April 2024

జీవితంలోని ఆఖరి ఏడు రోజులు (05-Apr-24, Enlightenment Story)

 జీవితంలోని ఆఖరి ఏడు రోజులు

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


ఒకానొకప్పుడు, ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపు చూసి, ఏమీ సమాధానమివ్వకుండా, మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.

అక్కడ ఉన్న శిష్యులలో ఒకరికి ఆ మాటలు విని కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది.

ఉపన్యాసం ముగిసిన తరువాత, అతను గురువు వద్దకు వచ్చి, "గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు, ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు? దయచేసి చెప్పండి, మీరు అలాంటి పరిస్థితిలో కూడా ఇంత ప్రశాంతంగా, నవ్వుతూ ఎలా ఉండగలిగారు? మీకు కొంచెం కూడా కోపం రాలేదు, కనీసం మీ ముఖ కవళికలు కూడా మారలేదు. మీ రహస్యం ఏమిటి?", అని అడిగాడు.


సాధువు చిరునవ్వుతో, "ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను అయితే ముందుగా, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి" అని అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. "ఏమిటి గురూజీ, దయచేసి చెప్పండి" అని అడిగాడు. సాధువు ఇలా చెప్పాడు, "నీవు ఒక వారం తర్వాత చనిపోతావు, మీ జీవితపు అంతం దగ్గర పడింది."

అది విని శిష్యుడు చలించిపోయాడు. కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్లనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో, కానీ ఆయన తన గురువు, ఆయన పై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది. అందువల్ల, దానిని నిజం అని నమ్మాడు, అతను జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

శిష్యుడు చాలా కృంగిపోయాడు. నిరాశా నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపో యాడు. కానీ తరువాత ఒక క్షణం స్థిరంగా ఉండి, ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించాడు. అతను తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులు సంపూర్ణంగా జీవించాల ని నిర్ణయించుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు.దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచనలో మునిగిపోయాడు!

చాలా ఆలోచించిన తరువాత, అతను తన గురూజీ బోధనలను అనుసరించి, వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన ఏడు రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు.

ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది! ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయం తో కలుస్తున్నాడు. దేనికీ ఎవరి పైనా కోపం తెచ్చుకోవట్లేదు! అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు. అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు, తెలిసి లేదా తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారందరినీ క్షమాపణ కోరాడు. తన దినచర్యను ముగించిన తర్వాత, అతను భగవంతుని స్మరణలో మునిగిపోయాడు. ఇలా ఆరు రోజుల పాటు సాగింది.

ఏడవ రోజు, శిష్యుడు తన అంతః సమయాని కి  ముందు తన గురువును ఒకసారి చూడాలని, కలవాలని కోరుకున్నాడు. తన గురువును కలుసుకుని, అతని పాదాలను స్పృశించి, "గురూజీ, నా ముగింపు దగ్గర పడింది, నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను. దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి" అన్నాడు.                 

సాధువు ఇలా అన్నాడు, "నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు". ఏడు రోజుల క్రితం గురువు వద్ద విన్న విషయం తర్వాత, తన గురువు నోటి నుండి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు.

తన శిష్యుడిని ఆశీర్వదించిన తరువాత, గురువు అడిగాడు, "ఇప్పుడు చెప్పు, గత ఏడు రోజులు ఎలా ఉన్నాయి? నీవు మునుపటిలా అందరిపై కోపంగా ఉన్నావా?"

ముకుళిత హస్తాలతో శిష్యుడు ఇలా జవాబిచ్చాడు, "లేదు, అస్సలు కాదు, గురూజీ. నేను జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంది. నేను అలాంటి పనికిమాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేయగలను? బదులుగా, నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టి ఉండినవారికి క్షమాపణ కూడా చెప్పాను."

దానికి గురువు చిరునవ్వు నవ్వి, "చూడు, ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది, నువ్వు కూడా అనుభూతి చెందావు. నేను ఏ క్షణంలో నైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు, ఎవరియందైనా చెడు భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను?  బదులుగా, అందరి ఎడలా నా హృదయాన్ని తెరిచి ఉంచి, నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను."
పశ్చాత్తాపం, పగ, తగాదాలు, వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. జీవితమంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే. జీవితపు నిజమైన లక్ష్యం ఆనందం. ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో, వారు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉంటారు.   జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణమూ, అదే నీ చివరి క్షణమని భావించి జీవించు."

ఈ మొత్తం ఉపాయమేమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ రోజు ప్రశాంతమైన, ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు!

*కేవలం ద్వేషాన్ని తొలగించండి, సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది.*

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday, 3 April 2024

నేను లేకపోతే (04- Apr-24, Enlightenment Story)

 నేను లేకపోతే

🌺🍀🌺🍀




అశోక వనంలో రావణుడు సీతమ్మ వారి మీదకోపంతో కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని

కానీ మరుక్షణంలోనే మండోదరి, రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! ఆశ్చర్య చకితుడయ్యాడు.

'నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను  రక్షించే వారెవరు అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు!


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?'అని. సీతామాతను రక్షించే పనిని, శ్రీరామచంద్రుడు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో వారి ద్వారానే శ్రీరామచంద్రుడు ఆపని చేయించుకుంటాడు' అని.

మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, 
అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను అనీ చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది 
చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు.తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు

అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు. తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, శ్రీరామచంద్రుడు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అనుకున్నాడు.

హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు. హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు.అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం శ్రీరామచంద్రుడు విభీషణునిపై ఉంచాడు అని.

ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే. విభీషణుడు ఆ మాట చెప్పగానే.రావణుడు  ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్టండి' అన్నాడు.

అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "
శ్రీరామచంద్రుడు నాకే చెప్పి ఉంటే, నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటికే ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు.అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన 
శ్రీరామచంద్రుడు తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది!

అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .అందువల్ల *నేను లేకపోతే ఏమవుతుందో* అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు. నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు.

*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో అతి చిన్నవాడను అని ఎఱుక కలిగి ఉందాం*


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday, 2 April 2024

మానవత్వం ఉంటే చాలు (03- Apr-24, Enlightenment Story)

మానవత్వం ఉంటే చాలు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

 ఒక వ్యక్తి రాత్రి బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. ఉన్నట్టుండి ఏదో చప్పుడైతే తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. అక్కడ ఒక దేవదూత కూర్చోని ఏదో వ్రాసుకుంటూ ఉంది. ఆమె దగ్గరకి వెళ్ళి        "అమ్మా! ఏమి వ్రాస్తున్నారమ్మా!" అని అడిగాడు. దానికి ఆమె ఇలా అంది. "దేవుడంటే ఎంతమందికి ప్రేమ భక్తి ఉన్నాయో తెలుసుకుని ఈ పుస్తకంలో వ్రాస్తున్నాను. " వెంటనే ఆతురతగా ఆ వ్యక్తి ఇలా అడిగాడు. " మరి ఆ పుస్తకంలో నా పేరు ఉందా? ఒకసారి చూసి చెప్పమ్మా!" బాగా వెతికి లేదని సమాధానం చెప్పింది ఆ దేవదూత... తనపేరు లేదని చెప్పగానే బాధపడకుండా నవ్వుతూ ఇలా అన్నాడు. "నా తోటి మనుషులకు సహాయాన్ని అందిస్తూ ఉంటాను. మానవత్వం అనే పుస్తకంలో నాపేరు ఖచ్చితంగా ఉండి ఉంటుంది " అని అన్నాడు. దానికి దేవదూత నవ్వుతూ వెళ్ళిపోయింది, మరుసటి రోజు ఆ దేవదూత మళ్ళీ వచ్చింది. 


తన చేతిలో ఒక పుస్తకాన్ని కూడా తీసుకుని వచ్చింది. ఆమె చేతిలోని పుస్తకాన్ని అలాగే చూస్తున్నాడు ఆ వ్యక్తి. " ఏంటి తదేకంగా చూస్తున్నావు. ఇది దేవుడికి ప్రియమైన భక్తుల పేర్లు ఉన్న పుస్తకం. దేవుడు నీకు చూపించి తీసుకుని రమ్మన్నారు. చూస్తావా? " అంది దేవదూత.*

*" తప్పక చూస్తాను తల్లీ! " అని ఆతృతగా ఆ పుస్తకాన్ని అందుకున్నాడు ఆ వ్యక్తి. పుస్తకాన్ని తెరిచి చూశాడు. ఆశ్చర్యంగా ఆ పుస్తకంలోని మొదటిపేజీలో మొదటి పేరు తనదే ఉండటాన్ని గమనించాడు. ఆనందంతో తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలసాగాయి. మనం ఎందుకు ఈ ప్రపంచానికి వచ్చామో ముందు తెలుసుకోగలగాలి. తోటివారిలో దేవుడిని చూడగలగాలి... ఎదుటి వ్యక్తిని హింసించి... చివరికి చంపడానికి కూడా మనిషి వెనుకంజ వేయడం లేదు. కొందరైతే ఎదుటివారి నాశనాన్ని దేవుడి దగ్గరికి వచ్చి మరీ వరం అడుగుతుంటారు.*

దేవుడికి ఇష్టమైన వారిగా మనం మారాలంటే మనలో కాస్త మానవత్వం ఉంటే చాలు. వేలకు వేలు దేవుడికి సమర్పించక్కరలేదు. చేతనయినంతవరకు ఇతరులకు సహాయాన్ని చేయండి. చేసిన సహాయాన్ని మరచిపోకండి దేవుడు గుర్తుపెట్టుకుని మిమ్మల్ని రక్షిస్తాడు.

సమయానికి తగ్గట్టుగా మనకు ఆశీస్సులు అందజేస్తాడు... అంటే దేవుణ్ణి అమితంగా ఇష్టపడి, పూజలు, ఆరాధనలు, భజనలు చేస్తే దేవుడు ఆనందించడు, మానవత్వం కలిగిన ఏ కొద్దిభక్తి, ఇష్టత అయినా దేవుడు అమితంగా ఇష్టపడి, మనలను అనుగ్రహిస్తాడు.*

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 1 April 2024

గ్రానైట్ ముక్కలు - గజదొంగలు (02- Apr-24, Enlightenment Story)

గ్రానైట్ ముక్కలు - గజదొంగలు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

శ్రీమఠం మకాం కార్వేటినగరంలో ఉంది. కారులో చెన్నై నుండి వచ్చిన ఒక కుటుంబం ఆరోజు సాయింత్రానికే తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. అంతా సిద్ధం చేసుకున్నారు. మహాస్వామి వారు వెళ్ళమని చెప్పగానే బయలుదేరివెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.

మహాస్వామివారు ఒక బిల్వవృక్షం కింద కూర్చున్నారు. సబేసన్ కుటుంబం స్వామివారికి నమస్కరించి ప్రసాదం కోసం వేచియున్నారు. ప్రసాదం తీసుకుని కారు వద్దకు వెళ్తుండగా స్వామివారు చిటికేసిన శబ్ధం వినపడడంతో ఆత్రుతగావెనక్కు వచ్చారు. కొద్దిదూరంలో ఉన్న విరిగిపోయిన గ్రానైట్ రాళ్ళముక్కల గుట్టవైపు చూపిస్తూ “వీటిని కొన్ని ఒక చిన్న గోనెసంచిలో తీసుకుని, గట్టిగా కట్టి ఇంటికి తీసుకుని వెళ్ళు” అని చెప్పారు.



అందరూ అయోమయంగా చూశారు. విరిగిపోయిన గ్రానైట్ రాళ్ళని కార్వేటినగరం నుండి చెన్నై తీసుకుని వెళ్ళడం ఎందుకు?ఆ రాళ్ళకున్న ప్రత్యేకత ఏమిటీ? ఎవరూ స్వామివారిని అడిగే ధైర్యం చెయ్యలేదు. కాబట్టి సబేసన్ కొన్ని రాళ్ళని గోనెసంచిలో తీసుకుని గట్టిగా ముడివేసి, దాన్ని కారువెనుక భాగంలో పెట్టి బయలుదేరాడు.

పుత్తూర్ రోడ్డు ఇరువైపులా రాళ్ళ గుట్టలతో ఉంటుంది. ఆ రాత్రి సమయంలో నలుగురైదుగురు మగవారు రోడ్డు మధ్యలో నిలబడి కారుని ఆపారు. వారు హైవే దొంగలని తెలుస్తోంది. కారులోనుండి అందరిని బయటకు తోసి లోపల దేనికో వెతకనారంభించారు. కాని ఏమి దొరకలేదు. కోపంతో కారు వెనుకభాగాన్ని తెరవగా అక్కడ ఉన్న మూట కనపడింది.

“ఒరే! అది ఇక్కడుంది రా” అరిచాడు వాళ్ళల్లో ఒకడు.

మరొకడు దాన్ని తీసుకొవడానికి ప్రయత్నించాడు కాని చాలా బరువుగా ఉండడం వల్ల కుదరలేదు. అందరూ కలిసి దాన్ని కిందకు దింపారు. “వెళ్ళిపోండి వెళ్ళిపోండి” అని సబేసన్ కుటుంబాన్ని తొందరపెట్టారు. సబేసన్ ఎక్కడాఆగకుండా కనీసం వెనుకకు చూడకుండా చాలా వేగంగా కారుని నడుపుతూ ఏదో ఒక చిన్న ఊరు కనపడడంతో కారు ఆపి ఊపిరి పీల్చుకున్నారు.

”నాకు చాలా భయమేసింది. ఖచ్చితంగా వళ్ళు మన నగలను అడుగుతారు అనుకున్నాను” అంది అతని భార్య. ”అదృష్టం! మనందరిని కలిపి కట్టెయ్యలేదు” అని అన్నాడు కొడుకు. ”దేవుడా కృతజ్ఞతలు. వాళ్ళు మా కారుని ధ్వంసం చెయ్యలేదు” అన్నది కూతురు. సబేసన్ కార్వేటి నగరం వైపుకు తిరిగి చేతులెత్తి స్వామివారికి నమస్కరించాడు.

ఆ దొంగలు ఆ బరువైన సంచిలో చాలా డబ్బుందని భ్రమపడి ఇతరములపై దృష్టి పెట్టలేదు. రెండురోజుల సబేసన్ ఒక్కడే పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చి భక్తితో, ఆశ్చర్యంతో జరిగిన విషయమంతా చెప్పాడు.

”భగవంతుడు నిన్ను రక్షించాడు” అని చెప్పారు మహాస్వామి వారు.

అవును నిజమే. సబేసన్ కి తెలుసు తనను రక్షించిన భగవంతుడు ఎవరో. అప్పటి నుండి విరిగిపోయిన గ్రానైట్ ముక్కల్ని పనికిరానివాటిగా చూడలేదు.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం .
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...