Thursday, 7 March 2024

భగవంతుడు ఎవరికి కనిపిస్తాడు? (08-Mar-24, Enlightenment Story)

 భగవంతుడు ఎవరికి కనిపిస్తాడు? 

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀 

ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు.

ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని మెచ్చుకోలేక పోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.” అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు. భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికి నాకు ఒకటే కోరిక! ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు..”



భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా..” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి “ఈ కోరికను తీర్చవలసిందే స్వామి” అన్నాడు. భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన చివరకు ఇలా అన్నాడు “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! నేను ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై, భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు తన నగరంలో దండోరా వేయించాడు. "రేపు అందరు కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికి కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఇది రాజుగారి ఆజ్ఞ!”


రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరిని తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒకచోట రాగి నాణేల నిధి కనిపించింది. ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. 
అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరచి, "అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే.. మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు. కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు  మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని!

రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక అందరికి ఒకచోట వెండి నాణేల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు కదా!’ అనిపించింది.

ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత అందరికి విచిత్రంగా బంగారపు నాణేల నిధి కనిపించింది. ప్రజలలో ఇక మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇంక కేవలం రాజు, రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు.
“చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో...! భగవంతుడి నిజ దర్శనం లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు! భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒకలెక్కకాదే!” నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరు ముందుకు సాగారు.

కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవటం ప్రారంభించి, "మీరు త్వరగా వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నింటిని పోగుచేసి ఉంచుతాను" అంది. అదిచూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.

నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు.ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో.. ఇక్కడే మీ అందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నాను.”రాజుగారు చాలా సిగ్గుతో, భగవంతుని ముందు తలదించుకున్నాడు.

ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు.“ఓ రాజా, ఎవరైన సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికి నేను లభించను, కనిపించను! వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు!”

ఎవరైన సరే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతున్ని శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి, ఇష్టంతో భక్తితో భగవంతున్ని కొలుస్తారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. అన్నాడు. నిజానికి ఈ సృష్టిలో భగవంతుడు ఎవరికి ఎక్కడ కనిపించడు. భగవత్ శక్తిని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday, 6 March 2024

హైదరాబాద్ లోని A. S. R. Nagar (07-Mar-24, Enlightenment Story)

 మీరు ఈసారి హైదరాబాద్ లోని A. S. R. Nagar కు వెళితే......

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀 

బహుశా 2000 వ సంవత్సరం అనుకొంటా, ఒక ముసలాయన హైదరాబాద్ సిటీ బస్సులో టికెట్ కొనుక్కొంటూ కండక్టర్ తో  " A.S.R నగర్ వస్తే చెప్పండి  " అన్నాడు. కాసేపయ్యాక బస్ ఆగితే ఆయన కండక్టర్ తో " ఇది ASR నగరేనా? " అని అడిగితే అపుడు కండక్టర్ విసుగ్గా " ఏమయ్యా, నీకు ASR నగర్ ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో తెలియదా? " అన్నాడు.

అపుడు పక్క సీట్లో వున్న మరో వ్యక్తి కండక్టర్ తో  "ఆయనే A. S. R. గారు " అన్నపుడు  కండక్టర్ తో పాటు అది విన్న ఇతర ప్యాసెంజర్లు కూడా ఆశ్చర్యపోయారుట. అంత నిరాడంబరత A. S. Rao గారిది. అయ్యగారి సాంబశివరావు గారికి 1960 లో పద్మశ్రీ, 1974లో పద్మభూషణ్ అవార్డులు వెతుక్కొంటూ వచ్చాయి.



కానీ ఆయన కారు వాడేవాడు కాదు. 'ఎందుకండీ, ఇంకా చేతనౌతుంది, నడచి పోవచ్చు. చాలా దూరం అనుకోండి సిటీ బస్సులు వున్నాయి కదా! ' అనేవారు ఆయన.


ఎవరు ఈ A. S. Rao గారు?

1914 సెప్టెంబర్ 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామం లో జన్మించిన రావు గారికి elementary మరియు middle school లో చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆయన తల్లి, ఆమె పెళ్లప్పుడు అమ్మ నాన్న లు పెట్టిన ఒక చీరను పాతగుడ్డలు కొనుక్కొనేవారికి అమ్మి, ఆ డబ్బును రావుగారికి ఇచ్చిందట. ఎంతనో తెలుసా?2 రూపాయలు !

అప్పులు చేసి, పస్తులుండి చదువే ఆయుధంగా ముందుకు నడచి రావు గారు కాశీ లోని ప్రఖ్యాత Benaras Hindu University లో MSc physics చేరారు. హాస్టల్ సౌకర్యం దొరక్కపొతే, వాళ్ళను వీళ్ళను పావలా, అర్ధరూపాయ అడుక్కోంటూ 8 రూపాయలు అయితే దానితో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి MSc పూర్తీ చేసారు.

అపుడు అమెరికా (క్యాలిఫోర్నియా ) లోని Stanford University లో Masters చేయాలని రావు గారి కోరిక. పేదరికం వెక్కిరించింది. కానీ ఆయన ప్రతిభ ఎవరినో ఆకర్షించింది. ఎవరు వారు?  TATA సంస్థ  40 000 రూపాయలను ఆయనకు ఇచ్చి Stanford University కి పంపింది.

అక్కడ ఆయన మేధస్సుకు అమెరికన్ శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, Masters తరువాత వాళ్ళు "ఇండియా వెళ్ళకండి. ఇక్కడే ప్రొఫెసర్ గా వుంటూ మా వాళ్ళను గైడ్ చేయండి, " అని ఆయనకు నెలకు పెద్ద జీతం ఆఫర్ చేసారు. ఎంతనో తెలుసా?  1,50,000 రూపాయలు.

కానీ రావు గారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, "క్షమించాలి. నేను నా మాతృదేశం ఋణం తీర్చుకోవాలి, నన్ను ఇక్కడికి పంపిన TATA సంస్థ కు నా సేవలు అందించాలి" అన్నారట. భారత్ తిరిగిచ్చాక టాటా వాళ్ళు Tata Institute of Fundamental Research (TIFR ) Mumbai లో ఉద్యోగం ఇచ్చారు. అపుడు ఆయన జీతం ఎంతనో తెలుసా?  300రూపాయలు! ఎక్కడ 1,50 000? ఎక్కడ 300?

ఈ కాలం లో అయితే ఆయన నిర్ణయాన్ని మనం పిచ్చి అంటాం. అవును మనకు డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ప్రతిష్ట పిచ్చి, సుఖాల పిచ్చి ! ఆయనకు దేశమంటే పిచ్చి, కర్తవ్యం అంటే పిచ్చి, కృతఙ్ఞత అంటే పిచ్చి, నైతిక విలువలంటే పిచ్చి!

ముంబై లో రావు గారి పరిశోధనలు ఏ స్థాయిలో వుండేవంటే, సాక్షాత్తూ Father of Indian Nuclear Programme అని పిలవబడిన Dr. Homi Zahangir Bhabha తానే స్వయంగా ముంబై వెళ్లి రావు గారిని అభినందించి వచ్చారట.

తరువాతి రోజుల్లో ఆయన ఎన్నో విభాగాల్లో దేశానికి, సైన్స్ టెక్నాలజీ రంగాల్లో సేవలు అందించి, హైదరాబాద్ లో Electronics Corporation of India Ltd (ECIL) ను కూడా స్థాపించారు.

2003 లో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రి లో చేరినప్పుడు ఒక డాక్టర్ గారు ఆయనకు ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్ అమరుస్తూ వున్నారు. ఆయనకు తెలుసు రావు గారు ఇక కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతారని. అపుడు రావు గారు డాక్టర్ ను దగ్గరికి పిలిచి "నాకు ట్రీట్మెంట్ ఇచ్చి నీవు పైకి లేచేటప్పుడు జాగ్రత్త, పైన వున్న మానిటర్ నీ తలకు తగిలే ప్రమాదముంది" అని అన్నారట.

చివరి శ్వాస వరకూ ఇతరుల కష్టం, ఇతరుల బాధ తనవిగా భావించే సున్నితత్వం, మానవత్వం వారిది.ఇవే కదా ఒక మనిషి character ను నిర్ణయించేది ! ఈసారి హైదరాబాద్ లోని ASR నగర్ వెళితే ఆ మహనీయుడిని గుర్తు చేసుకోండి.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 4 March 2024

నీవు ఎవరు (06-Mar-24, Enlightenment Story)

నీవు ఎవరు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

 *64 లక్షల జీవకణాలు* అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం  మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే.  ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్. అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో  బయటికి వస్తుంది.   రూపాన్ని పొందుతుంది.   కాళ్ళు చేతులు కదపలేని,  నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి.  క్రమంగా దేహం పెరుగుతుంది.   దేహం మీద మోహం  పెరుగుతుంది.
ఈ దేహం నేనే అంటాం.



కానీ ఎలా?  నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది? ఏ భాగము వినదు. వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.

చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా  అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.

  • ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
  • ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
  • ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
  • ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే.   

నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు  నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో. రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం  ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం  తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం  ఔతాయి.


రూపానికి ముందు నువ్వున్నావు. రూపంలో  నువ్వున్నావ్. రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం.  ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు.ఆయనే తయారు చేశాడు.   

ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి.  ఈ  దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి  అధికారం లేదు.  ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన  ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.

కాబట్టి  ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నంచెయ్.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday, 3 March 2024

భక్తుడు - బిచ్చగాడు - దేవుడు (04-Mar-24, Enlightenment Story)

 భక్తుడు-బిచ్చగాడు-దేవుడు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀

ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది.

బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.
తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.
తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.
భక్తుడు సరేనన్నాడు. 

ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యితవ్వసాగాడు. ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది.వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.
అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.

కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను. దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది!
అని దేవుణ్ణి ప్రశ్నించాడు.

అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు.అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.

అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు.నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు. 

వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడు కావాలి!

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని (05-Mar-24, Enlightenment Story)

కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀 

ఒకప్పుడు భద్రాచలం ప్రయాణమంటే, ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అటువంటి పరిస్థితుల్లో, రామదర్శనంకై వచ్చే భక్తులకు ఏదైన సహాయం చేయా లన్న సంకల్పం పమిడిఘంటం వెంకట రమణ దాసుది.


కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని ఆయన యాయవార వృత్తి ద్వారా సంపాదించిన దానితోనే, నిత్యాన్నదానం చేయాలన్న గొప్ప సంకల్పంతో ఇల్లిల్లు తిరిగి దానంగా వచ్చేదానిని శుభ్రంగా వండి, వేడి వేడి అన్నం, కాస్త పప్పో, పచ్చడినో, మజ్జిగలతో భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుండేవాడు. అంతకంతకు భక్తజనం పెరగడం, అన్ని ఇళ్ళకు వెళ్ళి అడిగి తెచ్చిన వాటితో వచ్చినవారికి లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఒకనాడు ఆయన ఏర్పాటు చేసిన ఆ అంబ సత్రంలో వంటపాత్రలను ఎవరో ఎత్తుకు పోవడం, వేరే వంటపాత్రలు లేకపోవడంతో వండేవాళ్ళు వెళ్ళిపోవడంతో, 

అంతా రాములవారే చూసుకుంటారని, రాముడే దిక్కని, రామునిపై భారం వేసి నిబ్బరంగా ఉండగా, ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి, తాము వంటవాళ్ళమని, వండటానికి తమ దగ్గర రెండు గుండిగలు వున్నాయని, ఈరోజు వంటపని తాము చేసిపెడతామని చెప్పి, వెంటనే వంట ప్రారంభించి, ఎప్పటిలాగే భక్తులు వచ్చే సమయానికి వండడం పూర్తి చేసారు. కమ్మటి వాసన, చక్కటి రుచులతో రోజుటి కంటే గొప్పగా ఉన్నాయంటూ భక్తులు లొట్టలు వేసుకుంటూ తిన్నారట. ఆపై కుర్రాళ్ళు కనిపించలేదు. వారికోసం వెతికినా వారి ఆచూకి తెలియలేదు. 

రూపం వున్న కుర్రవాళ్ళని గతంలో ఎవరూ చూసి ఎరగరు. గోపన్నను విడిపించేందుకు తానీషాకు మాడలు చెల్లించిన అన్నదమ్ములు రామలక్ష్మణులే నేడూ నిరంతరాయంగా జరుగుతున్న ఈ అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించినట్లు గ్రహించారంతా. ఆ తర్వాత ఆ గుండిగలలో వండి, చేస్తున్న అన్న ప్రసాదం బహు బాగుండేదని భక్తుల మాట. 

భక్తులు అంతకంతకూ పెరగడం యాచించింది సరిపోవడం లేదని, నీవే దిక్కని రామున్ని ప్రార్ధించడం, హఠాత్తుగా ఒక ధనవంతుడు వచ్చి, నా తల్లి స్వప్నంలో కనిపించి మీ సత్రానికి తన భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పిందని, 4వేల ఎకరాలు మీకు రాసిస్తున్నానని, ఆ పత్రాలు అందజేయడం జరిగింది. 

ఆ ధనవంతుడు హనుమకొండ నుండి వచ్చిన తుంగతుర్తి నరసింహారావు అనే వకీలు గారు. దాసుగారు తదనంతరం, క్రమేణా ఆ సత్రాన్ని అందరు మరిచినా, ఆ సత్రం పాడుబడిన, ఆస్తి అన్యాక్రాంతమైన, కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరిపీఠం తన ఆధీనంలోకి తీసుకొని, చక్ర సిమెంట్స్ అధినేత కృష్ణమోహన్ గారి సహకారంతో వేద పాఠశాలను నెలకొల్పి మరల అన్నదానం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ రెండు గుండిగలు రామ గుండిగ, లక్ష్మణ గుండిగ పేరిట ఉన్నాయి..


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Saturday, 2 March 2024

సూర్యుడు - సంజ్ఞాదేవి - ఛాయాదేవి (03-Mar-24, Enlightenment Story)

సూర్యుడు - సంజ్ఞాదేవి - ఛాయాదేవి

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀 

లోకాలకు వెలుగునిచ్చే పెద్ద కొలువులో వున్నాడు కదా’ అని విశ్వకర్మ తన కుమార్తె సంజ్ఞాదేవిని ఆదిత్యునికిచ్చి పెండ్లి చేశాడు. వీరి మొదటి సంతానం శ్రాద్ధదేవుడు. ఇతనినే ‘వైవస్వత మనువు’ అంటారు. మనువులచే పరిపాలించబడటం వలన మనం మానవులుఅయినాము.

సూర్యుని తేజస్సు భరించలేక భర్తతో సుఖించేప్పుడు సంజ్ఞాదేవి కనులు మూసుకొన్నది. సూర్యునికి కోపం వచ్చింది. ‘అఖిల జనుల ఆయుష్షును నియంత్రించేవాడు కొడుకుగా పుడతా’డన్నాడు. అలా పుట్టినవాడే యముడు. ధర్మ స్వరూపుడైన 'యముడు' అష్టదిక్పాలకులలో ఒకడైనాడు. యముడే ధర్మదేవత.జీవుల పాపపుణ్యాలను గుణించి,శిక్షించి, కర్మ పరిహారం చేసే ' నరకలోకాధిపతి 

ఈసారి ఆమె కళ్లు మూసుకోలేదు కానీ, భర్తను చంచలదృష్టితో చూస్తూండి పోయింది. ‘నీకు విలోలయైన కుమార్తె పుడుతుంద’న్నాడు సూర్యుడు. పుట్టిన కూతురు పేరు యమున

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday, 1 March 2024

బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు (02-Mar-24, Enlightenment Story)

 *బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు..? మేనమామనే ఎందుకు తీసుకొస్తారు..?*

🌺🍀🌺🍀🌺🌺🍀  🌺🍀🌺🍀🌺🌺🍀  🌺🍀🌺🍀🌺🌺🍀  🌺🍀🌺🍀🌺🌺🍀  


పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది. ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ? పెళ్లిలో కన్యను గంపలో మేనమామ ఎందుకు తేవాలి, తెస్తారు? ముందుగా అమ్మాయితో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు .

బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం ఋషి ఋణం తీరవు. అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.

ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి! పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది. ఆమెయే ఆతని లక్ష్మి.

అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది. ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది. ఆమె 'నిత్యానపాయినీ'. ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.
శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా చారజనంబు గాఁగ, విరజానది గౌతమిగా, వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!

శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల - ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

ఇక్కడ లక్ష్మి పుట్టింది. అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం. ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి. ఎంతో ధార్మికంగా సంపాదించాలి. ఆయనకి సంతానం కలగాలి. ఆయన సంతోష పడిపోవాలి. ఆయన తండ్రి కావాలి, తాత కావాలి. ముత్తాత కావాలి. ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.

ఆ సంతానం నానుండి రావాలి. 'ధర్మ ప్రజాపత్యర్థం' ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి. అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం. ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. ఈమె నీ లక్ష్మి.

ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోనక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది. బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు. అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. మేనమామలు ప్రేమైక మూర్తులు.

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి. అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు. లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.

మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది. అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను. భర్తృ భావనతో చూడలేదు. పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు. అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.
అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి ఆధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు. వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు. ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి సంస్కృతి మనది!!!!


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...