Wednesday, 3 July 2024

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ

🍀🌺🍀🌺 🍀🌺🍀🌺

పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు.వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు.ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు.


"ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి!! స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు, మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో, ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. 'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు.అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు.

లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు.చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది.త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.

అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు.'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు_
సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు...

ధనికునికి కోపం తారాస్ధాయినంటింది,!! ... 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు.

ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది, తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది!! ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు!! ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు, బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని.

ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు.నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు.ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు,గుమాస్తా చదవడం ప్రారంభించాడు.

*1వ వాడు:*
ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!

*2వ వాడు:*
ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు.
ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా!!,

*3వవాడు:*
అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు.

చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.అంటూ వాపోయారు..సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు.

ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు.మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. 
మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు.ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.

*1వ వాడు:*
అన్నదాతా సుఖీభవ!

*2వ వాడు:*
ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.


*3వ వాడు:*
అమ్మయ్య ! ఆకలి చల్లారింది, అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి!!....


దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు.ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.

ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు. అదృష్టం అనేది కొంతమందినే వరిస్తుంది, దొరికితే మాత్రం వదూకుకోకూడదు*

 

🚩🕉️🚩 *జై శ్రీ రామ్* 🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼

Tuesday, 2 July 2024

చిరిగిన పంచె చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి (03-July-24, Enlightenment Story)

చిరిగిన పంచె చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి

🍀🌺🍀🌺 🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺

చిరిగిన పంచె చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీపై కూర్చోవడం చూసి,ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీ కోసం ఏమి తీసుకురావాలి అని?

ఆ వ్యక్తి ఇలా అన్నాడు జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌ దోశ తినిపిస్తాను అని  మా అమ్మాయికి వాగ్దానం చేశాను.మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి' అని అతను అడగడం జరిగింది.మీ అమ్మాయికైతే ఒక దోశ చెప్పారు. 

మరి మీకేమి కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు ? అతను కొంచం బాధాతత్వ హృదయంతో ఇలా అన్నాడు, నా దగ్గర ఒక దోశకి సరిపడే డబ్బే మాత్రమే ఉంది. కాబట్టి ఇంక నాకేమి వద్దు'!

విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి యజమాని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అనగా అప్పుడు అది విన్న యజమాని  వెయిటర్ ని  అభినందిస్తూ ఇలా అనడం జరిగింది. ఈ రోజు మనం మన హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం". అన్నాడు, ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు.


హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో  పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి మూడు దోశలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని  పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి ,సత్కరించిన హటల్ యజమానికి, వెయిటర్ కి  కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి ,కూతురు.

సమయం గడిచిపోయింది (కొన్ని సంవత్సరాల పిమ్మట).ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు అనగా.హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి.

అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థం గా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా .వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గా ఆ హోటల్ కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది- 

మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను ,మాతండ్రితో కలసి మీ హోటల్ కి వచ్చినప్పుడు నేను చదువులో మెుదటి ర్యాంకు తెచ్చికొన్న విషయం మీకు తెలిసి.మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు  సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడ అడగక పోవడమే కాక మమల్ని మీరు ఘనంగా సత్కరిృచడం జరిగింది.
                                         
ఆనాడు మీరిద్దరూ #మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి, మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు.

ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తరుపున, ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.  అలా అని అందరి ముందు హోటల్ యజమనితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది.

నీతి: పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న #ప్రతిభను గుర్తించి గౌరవించండి.... వాళ్ళను ప్రోత్సహించండి.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్* 🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼

Monday, 1 July 2024

చుట్టుపక్కల చూడు (02-July-24, Enlightenment Story)

చుట్టుపక్కల చూడు

🍀🌺🍀🌺 🍀🌺🍀🌺


చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. 

 కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియ కుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. చీకటి మిత్రులను గాఢంగా కౌగలించుకొని వారిని వదలలేక స్నేహం కొనసాగిస్తాడు. వారే అజ్ఞానం, అహంకారం, అంధవిశ్వాసాలు. వారి కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలిగా మారి తన జీవితాన్ని మట్టుపెడుతుందని తెలియని స్థితిలో కొట్టుమిట్టాడతాడు. రంగుటద్దాలు ధరించి లోకాన్ని చూస్తాడు. ఆ అద్దాల్లోంచి లోకమంతా రంగు రంగులుగా కనిపిస్తుంది. అదే నిజమైన ప్రపంచమని భ్రమిస్తాడు. తమ పబ్బం గడుపుకొనే ప్రబుద్ధుల ఇచ్చకపు మాటలకు లొంగి ప్రవర్తిస్తాడు. వారిపై నమ్మకం అతణ్ని అంధుణ్ని చేస్తుంది.


నమ్మకమనేది మైకం కలిగించే మధురపదార్థం లాంటిది. అది విషంతో నిండినా దాని మాధుర్యానికి బానిసై, అందించినవారు తన శ్రేయోభిలాషులని నమ్మి దాసోహమంటాడు. ఆ మత్తునుంచి మేల్కొనలేడు. హితైషుల పలుకులు చెవికెక్కవు. స్వార్థపరుల వలలో చిక్కి విలవిల్లాడిపోతారు. 

ఒక వ్యక్తిని నమ్మే ముందు క్షణకాలం అతణ్ని అనుమానించు’ అన్న ఆంగ్ల సామెత మనిషి నైజాన్ని చెప్పకనే చెబుతోంది. అందులో దోషం లేదు. పరీక్షిస్తే మనిషి తత్వం తెలుస్తుంది. అందంగా కనిపించే చక్కెరబిళ్లలు ఉప్పుకణికలో కాదో తేలిపోతుంది. కన్నవారిపై, నా అనుకున్నవారిపై మితిమీరిన ప్రేమను పెంచుకొన్నా, కొన్ని సందర్భాల్లో వారిపట్ల సందేహ భావనతో ప్రవర్తించడం బంగారానికి పరీక్షలాంటిదే. నలుగురితో నారాయణ అన్న సామెత నిజమే అయినా, గొర్రెదాటు ప్రవర్తనకు చుక్క పెట్టక తప్పదు. నమ్మించి వంచించే ఆషాఢభూతులపై దృష్టి నిలిపి నిలువరిం చకపోతే నష్టం తప్పదు. హద్దుదాటిన ప్రేమ, అంధ విశ్వాసం మనిషి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.

మహాభారతంలో పుత్రుడిపై ధృతరాష్ట్రుడు,  గాంధారి అవధులు మీరి చూపిన ప్రేమ అనర్థదాయకమై కురువంశ పతనానికి కారణభూతమైంది. సంతతిపై అభిమాన వాత్సల్యాలు ఎవరికైనా ఉంటాయి. అందించిన సంపదను సద్వినియోగిస్తున్నారా లేక తప్పు దారిని ఎంచుకున్నారా అన్న డేగకన్ను పరిశీలన అత్యావశ్యకం. 

అతిగా నమ్మి సంపదను ముందే మూటగట్టి ముడుపు చెల్లిస్తే స్థితిగతులు మారి కన్నవారు వృద్ధాశ్రమాలకు పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దాణా చూపించి గుర్రాన్ని పరుగెత్తించాలి గాని, దాన్ని ముందే నోటికందిస్తే అది మొరాయించక మానదు. 
నమ్మినవాళ్లు, నా అనుకున్నవాళ్లే చుట్టూ అగాధాలు, కందకాలు సృష్టిస్తారు. అవి గమనించక నమ్మి చేయినందిస్తే గోతిపాలు కాక తప్పదు. ‘నీ శత్రువు ఎక్కడో లేడు. నీ పక్కనే ఉన్నాడు’ అన్న రూజ్‌వెల్ట్‌ మాటలు అక్షర సత్యాలు. అసూయతో, స్వార్థంతో అలవిమాలిన మాటలు చెప్పి బంధుమిత్రుల మధ్య వైరాన్ని కల్పించే స్వార్థపరులు, మన ఉన్నతిని సహించలేక వక్రమార్గంలో మనల్ని మళ్ళించే అసూయాపరులు, తియ్యటి పలుకులతో వెన్నుపోటు పొడిచే మోసగాళ్లను ఒళ్ళంతా కళ్లు చేసుకుని గమనించాలి. ప్రమాదాలను తప్పించుకొని సురక్షితంగా పయనించేవారే గమ్యాన్ని చేరగలరు. మురిపించి మెరిపించే రంగులు వెలిసి పోయినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. అప్రమత్తులైనవారి జీవితంలో ఇంద్రధనుస్సు ఎప్పుడూ వెల్లివిరిస్తూనే ఉంటుంది!

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼

Sunday, 30 June 2024

పక్షి నేర్పిన పాఠం (01-July-24, Enlightment Story)

 పక్షి నేర్పిన పాఠం

🌺🍀🌺🍀🌺🌺🍀

ఓ వూరి దగ్గరి పొలంలో సారసపక్షుల జంట నివసిస్తూ వుండేది. ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది. కొంత కాలానికి గుడ్లలో నుంచి పిల్లలు బయటికి వచ్చాయి. వాటికి రెక్కలు వచ్చి, అవి ఎగరటానికి ముందే పంట కోతకు వచ్చింది. సారస పక్షులకు దిగులు చుట్టుకొనింది. రైతు పంటను కోయటానికి ముందే, పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి ఎగిరి వెళ్లాలి. కాని పిల్లలు ఎగరలేవే?


అప్పుడు సారసపక్షి పిల్లలతో ఇలా అంది “మేము లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.” అని.

ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయంకాలం గూడుకి చేరుకొంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి. “ఈ రోజు రైతు వచ్చాడు. పొలం చుట్టూ తిరిగాడు. ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది. ఇక కొయ్యాల్సిందే. ఈ రోజే వెళ్లి వూళ్లోని వాళ్లతో నా చేను కోయమని చెప్తాను.”

“అలా ఐతే మీరేమీ భయపడకండి. రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడే హాయిగా వుండొచ్చు” అని పక్షి పిల్లలతో చెప్పింది.

కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడుకి చేరుకొంది. అప్పుడు పిల్లలు బితుకు బితుకుమంటూ ఇలా చెప్పాయి..

“మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్లాలి. ఈ రోజు రైతు మళ్లీ వచ్చాడు. ఊళ్లోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు. నేను నా అన్నతమ్ముల్ని పిలిపించి వాళ్లతో పంట కోయిస్తాను.

సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది  “ఓ.. అయితే ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు. ఇంకో నాలుగైదు రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పొలం విడిచి మరో చోటికి పోవక్కర్లేదు.”

ఇలా మరి కొన్ని రోజులు గడిచి పోయాయి. సారసపక్షి పిల్లలు బాగా ఎగరసాగాయి. వాటికి భయం లేకుండా పోయింది. ఓ సాయంకాలం అవి సారస పక్షితో ఇలా అన్నాయి..

“ఈ రైతు మమ్మల్ని ఇలా ఉత్తుత్తినే భయపెడ్తున్నాడు. ఇతడు పైరు కోసినట్లే, ఈ రోజు కూడా వచ్చాడు. అన్నాడు కదా “నా అన్నతమ్ములు నా మాట వినడం లేదు. ఏదో ఓ నెపంతో తప్పించుకొంటు న్నారు. పైరు బాగా ఎండిపోయి గింజలు నేల రాలిపోతున్నాయి. రేపు పొద్దు పొడవగానే నేనే వచ్చి కోత మొదలు పెడతాను.”

అప్పుడు సారసపక్షి భయపడింది. “అరెరే! వెంటనే బయలుదేరండి. ఇంకా చీకటి పడలేదు. మనం మరో చోటికి వెళ్లి తలదాచుకొందాం. రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని అంది.పిల్లలు ఆదుర్దాగా అడిగారు “ఎందుకు వెళ్లాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?” అని.

సారసపక్షి ఇలా బదులు చెప్పింది

“రైతు గ్రామస్తులను, సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలుగలేదు. తన పని తాను చేయకుండా, ఇతరులు చేసి పెడతారని అనుకున్నంత కాలం ఎవరి పనులూ జరగవు. కాని ఎవరంతట వారు, తమ పనులు చేసుకోవాలని నిర్ణయించుకొన్న ప్పుడు, ఆ పనులు అడ్డంకులు లేకుండా చకచకా సాగిపోతాయి. రైతు తానే రేపు పంట కోస్తానని అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది.” అన్నది.

నీతి: ఎవరి పనులు వారు చేసుకుంటేనే పనులు చక్కగా, సజావుగా సాగుతాయి.
సారసపక్షులు పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటికి ఎగిరిపోయాయి.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Saturday, 29 June 2024

భగవంతుని అనుగ్రహం (30-June-24, Enlightment Story)

 భగవంతుని అనుగ్రహం

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం!. మనం రైల్వే స్టేషన్‌కు చేరుకునే వరకు, మన సామాను తీసుకెళ్లడానికి ఒక గుర్రపు బండి లేదా సైకిల్ రిక్షా లేదా టాక్సీలో తీసుకెళ్తాం!!...

ఇవేవీ లేని పక్షంలో లగేజీని తలపై మోయాల్సి వస్తుంది,  స్టేషన్‌కు చేరుకుని రైలులో కూర్చున్నాక, రైలు మన లగేజీతో పాటు మనల్ని తీసుకువెళుతుంది!!...

రైలు ఎక్కిన తర్వాత కూడా లగేజీని తలపై పెట్టుకుంటామా! అలా పెట్టుకుంటే అంతటి కన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది?? మనల్ని మోసే రైలు మన లగేజిని మోయాలేదా?!




అలాగే మనం భగవంతునికి శరణాగతులమయి ఉండాలి, అప్పుడు నిస్సందేహంగా, షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి.అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి, అయన మనకు మంచిదానినే యిస్తాడు.

ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో వున్నపుడే సాధ్యమవుతుంది.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday, 28 June 2024

తపోఫలమా? సత్సాంగత్య ఫలమా? (29-June-24, Enlightment Story)

మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలము

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు.


చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటివరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు. విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు.


తపోఫలమా? సత్సాంగత్య ఫలమా? ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మవద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు.

ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు.

విశ్వామిత్రుడు వెంటనే ‘నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు.

అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్కపూట సమయంతో పాటు మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.

వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చ’ని అంటాడు.అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని ప్రశ్నించారు. ‘మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు అన్నాడు.

వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహించారు.

చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో?

ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మనమధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా అదే పని. ఏ ఇద్దరు కలిసినా అదే తీరు. ‘చరవాణి’ తోనే మాట్లాడుకుంటున్నారు. చరవాణితోనే గడుపుతున్నారు. దానితోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేదెప్పుడు?

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday, 27 June 2024

ఇ మెయిల్ ID లేదు (28-June-24, Enlightment Story)

ఇ మెయిల్ ID లేదు 

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

రమేష్ ఒక పెద్ద కంపెనీలో ఆఫీస్ బాయ్ ఉద్యోగానికి ఇంటర్వూకి వెళ్ళాడు.ఇంటర్వూ చేసే అతను నేలను తుడిచి చూపించమన్నాడు.రమేష్ శుభ్రంగా నేలను తుడిచాడు.ఇంటర్వూ చేసే అతను బావుందన్నట్టుగా తలాడించి నీకు జాబ్ ఇస్తున్నాను.నీ ఇ మెయిల్ ID ఇవ్వు.నీకు అప్లికేషన్ ఫార్మ్ పంపిస్తా.దాన్ని ఫిలప్ చేసి పంపించు అన్నాడు.రమేష్ ఒక క్షణం ఆగి చెప్పాడు.నాకు కంప్యూటర్ లేదు.ఇ మెయిల్ ID లేదు అని.అలా అయితే జాబ్ ఎలా ఇస్తాను.మా పద్ధతి అయితే ఇదే అని చెప్పాడు ఇంటర్వూ అతను.సరే అన్నట్టు తలాడించి బయటకు వెళ్ళాడు రమేష్.


అప్పుడు అతని జేబులో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి.ఎదురుగా కూరల మార్కెట్.ఆ వంద రూపాయలతో టమోటాలు కొన్నాడు.ఇంటింటికీ తిరిగి వాటిని అమ్మాడు.అన్నీ అమ్ముడయ్యేసరికి రెండు గంటలు పట్టింది.మళ్ళీ వచ్చిన లాభం, డబ్బులు కూడా కలిపి ఇంకా ఎక్కువ టమోటాలు కొన్నాడు.వేరే కాలనీకి వెళ్ళి కష్టపడి అన్నీ అమ్మాడు.అలా ఇంకోసారి చేసాడు.కష్టాన్ని సవాలుగా తీసుకున్నాడే కానీ అలసటను లెక్క చెయ్యలేదు.రాత్రికి ఇల్లు చేరేటప్పటికి చేతిలో మూడు వందలు ఉన్నాయి.వంద పెట్టుబడికి కష్టాన్ని జోడిస్తే రెండింతల లాభం మరియు పెట్టుబడి కూడా తిరిగి సంపాదించగలిగాడు రమేష్.

అదే కొనసాగించాడు.కొన్ని నెలలకి కూరల బండి కొనుక్కున్నాడు.తరువాత ఇంకొన్ని నెలలకి  ట్రాలీ కొనుక్కున్నాడు.చివరికి కూరలు అమ్మే సూపర్ మార్కెట్ తెరిచాడు.అలా కొన్నేళ్ళకు కష్టపడి లాభానికిలాభం సంపాదించుకుంటూ కష్టేఫలిలా స్వయంకృషితో ఓ కంపెనీ స్థాపించాడు.సరైన ప్రణాళిక , కష్టం కలిస్తే విజయం తప్పక సొంతం అవుతుంది అని చేసి చూపించాడు.

ఇక ఒక రోజున ఇంక తన కుటుంబానికి అవసరం అనిపించి ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుందామని ఒక ఏజెంట్ ని ఇంటికి పిలిచి అతనితో చర్చించి ఒక మంచి పాలసీ ని కుదుర్చుకున్నాడు.ఇన్స్యూరెన్స్ అతను సార్ మీ ఇ మెయిల్ ID చెప్పండి అన్నాడు.మళ్ళీ అప్పటిలానే రమేష్ ఒక క్షణం ఆగి నాకు ఇ మెయిల్ ID లేదు అన్నాడు.పాలసీ అతను ఆశ్చర్యంగా.ఇంత పెద్ద స్థానానికి వచ్చారు.ఒక పెద్ద సంస్థకు యజమాని మీరు.మీకు ఇ మెయిల్ ID లేదా ఒకవేళ ఉండుంటే ఇంకెంత బావుంటుందో ఊహించండి అన్నాడు.దానికి రమేష్ తలూపుతూ ఊ అవును ఇ మెయిల్ ID ఉండి ఉంటే నేను ఆఫీస్ బాయ్ గా ఉండేవాణ్ణి అని అన్నాడు అర్ధం కాక పాలసీ అతను తల గోక్కున్నాడు.

ఒక్కోసారి ఊహించని ఒక ప్రారంభం ఒక మనిషిని మంచి ఎత్తులకు  తీసుకెళ్ళగలదు కాకపోతే ఎంత కష్టపడితే అంత విజయం సాధించగలము.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

ఇది క‌దా జీవితమంటే (27-June-24, Enlightment Story)

 ఇది క‌దా జీవితమంటే..!*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

వారం రోజుల కింద‌ట తెగిన చెప్పు కుట్టిద్దామంటే విజ‌య‌వాడ‌లో కుట్టేవారిని క‌నిపెట్ట‌డం పెద్ద టాస్కే అయ్యింది. మొత్తానికి అయ్య‌ప్ప‌న‌గ‌ర్ రోడ్డులో ఇవాళ ఒకాయ‌న్ని ప‌ట్టుకుని చెప్పు కుట్టించుకున్నాను. అన్నిచోట్లా ఇర‌వై రూపాయ‌లు తీసుకుంటుంటే ఆయ‌న ప‌ది రూపాయ‌లే తీసుకున్నాడు. స‌రే ప‌నేం లేదు క‌దా అని ఆయ‌నతో కాసేపు మాట్లాడాను. 


ఆయ‌న తాత‌, తండ్రుల‌ది కూడా ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మీ పిల్ల‌లు ఏం చేస్తున్నారు? అని అడిగితే చెప్పాడు అస‌లు విష‌యం. వాళ్ల‌బ్బాయి ఇంజ‌నీరింగ్ చ‌దివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్లుడు బ్యాంక్ ఉద్యోగి. య‌న‌మ‌ల‌కుదురులో 7 సెంట్ల‌లో సొంతిల్లు. నెల‌కు వ‌చ్చే అద్దెలు 25వేలు.  నున్న‌లో ఎక‌రం మామిడి తోట‌. ఇన్ని ఉండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావ‌ని అడిగితే --


ఒక‌ప్పుడు ఈ ప‌నే మాకు అన్నం పెట్టింది. మా నాన్న ఈ ప‌నిచేసే అప్ప‌ట్లో రేటు త‌క్క‌వని నున్న‌లో మూడెక‌రాలు కొంటే నా వాటా ఎక‌రం వ‌చ్చింది. మా చిన్న‌ప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డ‌బ్బులకు బ‌దులు వ‌డ్లు ఇచ్చేవారు. అవి స‌రిపోక మా అమ్మ వ‌రి కోసిన పొలాల్లో ప‌రిగె ఏరుకొచ్చి అందులో గింజ‌లను వేరుచేసి మాకు అన్నం పెట్టేది. మేం త‌ర‌త‌రాలుగా ఆధార‌ప‌డి బ్ర‌తికిన ప‌ని ఇది. డ‌బ్బులున్నా ఈ ప‌నిచేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది "  అని ఆయ‌న చెప్పిన మాట‌లు అద్భుతంగా అనిపించాయి. మీరు ఎప్పుడైనా రండి ఉద‌యం నుంచి సాయంత్రం ఏడింటిదాకా ఇక్క‌డే ఉంటాన‌ని చెప్పాడు. 



వెనక కావాల్సినంత ఆదాయం ఉంద‌న్న ధీమా లేదు. ఒక‌రోజు కుట్ట‌క‌పోతే ఏంకాదులే అనే ఆలోచ‌న లేదు. అందుకే ఆదివారం కూడా అక్క‌డే ఉన్నాడు. నా త‌ర్వాత మ‌రొకాయన వ‌చ్చి 200 నోటుకు చిల్ల‌ర ఉందా? అని అడిగితే ఫ‌ర్లేదు స‌ర్ ఈసారి వ‌చ్చిన‌ప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పు తీసుకుని కుట్టేశాడు.


సింపుల్‌గా ఉండే ధ‌న‌వంతులు మ‌న‌కు రోల్‌మోడ‌ల్‌. సుధా నారాయ‌ణ మూర్తి సాదాసీదా నేత చీర క‌ట్టుకుంటే అదొక ఆశ్చ‌ర్యం మ‌న‌కి. సెల‌బ్రిటీలు రోడ్డు ప‌క్క‌న ధాబాలో తింటే అదీ ఒక వార్తే. అలా ఉండ‌టం వారి గొప్ప‌త‌న‌మే. ఈ చెప్పులు కుట్టే ఆయ‌న కూడా ఆ కోవ‌కి చెందిన వాడే. ఆయ‌నకు చ‌దువు లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. పిల్ల‌ల్ని చ‌దివించుకున్నాడు. ఇవాళ కూర్చుని తినే స్థితికి చేరాడు. అలాగ‌ని అన్నం పెట్టిన వృత్తిని వ‌దల్లేదు. 59ఏళ్ల ఆ ముస‌లాయ‌నకు ప‌ళ్లు ఊడిపోయే ద‌శ వ‌చ్చింది, అందుకే మాట స్ప‌ష్టంగా రావ‌ట్లేదు. నిరంత‌ర క‌ష్టం వ‌ల్ల ఒంట్లో ఇంకెలాంటి రోగాలు చేర‌లేదు. ఉద‌యం అన్నం తిని రావ‌డం. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి వెళ్లొచ్చి మ‌ళ్లీ రాత్రి వ‌ర‌కూ అక్క‌డే చెప్పులు కుట్ట‌డం. ఇదే సంతృప్తి అంటున్నాడు. 


ఆయ‌న వైపు నుంచి చూస్తే ఆయ‌న‌కిదే విలాస‌వంత‌మైన జీవితం. ఈ మ‌ధ్య ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో చూశా. ప‌చ్చ‌ని పొలాల మ‌ధ్య‌లో చిన్న పంపుసెట్ లాంటి ఇంట్లో ఒకాయ‌న ద‌ర్జాగా కూర్చున్న ఫొటో అది. ఈ ఆనందం ఎంత పెద్ద బంగ‌ళా ఉన్నా వ‌స్తుందా? అనేది ప్ర‌శ్న‌.  


*విలాసం, ఆనందం అనేవి న‌చ్చిన జీవన విధానంతో వ‌స్తాయి త‌ప్ప, కేవలం డబ్బు వల్ల మాత్రమే రావు.*



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...