Wednesday, 8 March 2023

నీరా ఆర్య - దేశభక్తి (12-Mar-23, Enlightenment Story)

నీరా ఆర్య - దేశభక్తి 

🌷🙏🌷🌷🙏🌷

స్త్రీ లేకపోతే జననం లేదు.

స్త్రీ లేకపోతే గమనం లేదు.

స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.

స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు.

కుబేరుల కుటుంబంలో  పుట్టిన ఆ ఆడపిల్ల దేశం కోసం భర్తనే కడతేర్చి, జైలు కెళ్ళి జీవన చరమాంకంలో పూలు కట్టుకుని, వాటిని అమ్ముకుని బ్రతికింది తప్ప ప్రభుత్వం ముందు చేయిచాచి అడుక్కోలేదు. అండమాన్ నికోబార్ జైలులో కాలాపానీ చెరసాలలో బంధీకృతమై దేశం కోసం తన యెదను కోయించుకుంది తప్ప తమ నాయకుడు బోస్ వాకబు విప్పలేదు. దర్జాగా కూర్చుని కాలుమీద కాలేసుకుని బ్రతకగల జీవితాన్ని కాదనుకుని దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆ వీరవనిత పేరు నీరా ఆర్యా. ఇలాంటి ఎందరో త్యాగధనుల రక్తం ధారపోస్తే లబించిన స్వాతంత్ర్యం నేడు బిచ్చం విదిలిస్తే లొంగిపోయే అప్రదిష్ట ప్రస్థానం చూస్తుండటం తీరని చేటు.

నీరా ఆర్య గురించి ఎం.వి.జి. ఆంజనేయులు గారి ఆడియో విన్నాక ఇలా ఎందరు ఉన్నారు అని మనసు అల్లాడి పోతుంది. స్త్రీ తన యెదను కోయించుకోవడం కన్నా భయంకరమైన శిక్ష ఏముంటుంది?. నీరా ఆర్య ఉత్తర ప్రదేశ్ వనిత. ధనవంతుల కుటుంబం. తండ్రి సేఠ్ జఠ్మల్. కలకత్తా లో చదువుకుంది. ఆమెకు యుక్త వయసు రాగానే బ్రిటిష్ ప్రభుత్వంలో సి.ఐ.డి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే శ్రీకాంత్ జయరాం దాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల ఆసక్తి పెరిగి రహస్యంగా ఝాన్సీ లక్ష్మి రెజిమెంట్ లో చేరి తన దేశ భక్తిని చాటుకుంది నీరా. అదే సుభాష్ చంద్రబోస్ ను పట్టుకునే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం ఆమె భర్తకు అప్పగించింది. విధి విచిత్రం అంటే ఇదేనేమో. దేశభక్తి నిండిన భార్య. దేశభక్తుల్ని పట్టించే ఉద్యోగ భర్త. ఈ క్రీడలో చివరకు భర్తను హతమార్చి జైలు పాలైన భార్య వీరవనిత నీరా...

🌹🌹🌹🌹🌹🌹🌹

ఎలాగంటే సుభాష్ చంద్రబోస్ ఆంతరంగిక సేనాని అయిన నీరా ఆర్య గురించి భర్తకు తెలిసింది. తనకు బోస్ ను పట్టించమని ఆమెను అడిగాడు భర్త. తాను ఎప్పటికీ అలా చేయనని తెగేసి చెప్పింది నీరా. అయితే ఆమెకు చెప్పకుండా ఓ రోజు రహస్యంగా వెంబడించి వెళ్ళాడు ఆ భర్త. సుభాష్ చంద్రబోస్ కారులో వెళ్తూ కనిపించగానే కాల్చేశాడు. బుల్లెట్టు బోస్ కి కాకుండా డ్రైవర్ కి తగలటంతో బోస్ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. తన భర్త ఆగడం పసిగట్టిన భార్య తక్షణం కత్తి దూసి అతని కుత్తుక కోసి ప్రాణాలు తీసేసింది. ఇది సాధ్యమా? దేశభక్తి అంత గొప్పది మరి. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో నీరా ఆర్య చేసిన ఈ తెగువ అసామాన్యమైనది. ఆమె చరిత్ర మరువలేనిది. బ్రిటిష్ ప్రభుత్వం ఆమె నేరాన్ని విచారించి జీవిత ఖైదు విధించింది. ఆమెను కాలాపానీ చెరసాలలో గొలుసులుతో కట్టి ఉంచారు. ఓ రోజు గొలుసులు తెంపే క్రమంలో సుత్తితో ఆమె కాలుపై కొట్టడంతో విలవిలలాడుతూ ఆ వ్యక్తిని తిట్టింది. దాంతో సుభాష్ స్థావరం ఎక్కడో చెప్పమని హింసించారు. తాను ససేమిరా చెప్పనని, ఆయన స్థావరం తన గుండెల్లో ఉందని చెప్పింది. అంతే మదించిన బ్రిటిష్ అధికారి ఆమె రొమ్ములు కోసేయమని ఆజ్ఞాపించాడు. చెట్టు కొమ్మలు నరికే రంపంతో ఆమె కుడి రొమ్ము కోసేశారు. రక్తం చిమ్ముతూన్న ఆమె యెద తెగి నేలపై పడింది. విలవిలలాడుతూ కుప్పకూలిన ఆమె దైన్యావస్థను చూసి పగలబడి నవ్వుకున్న బ్రిటిష్ దమనకాండ ఈ తరానికి ఎలా తెలుస్తుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹

 ఆమె ధైర్యం తెగువ చూసిన అక్కడి భారతీయ వైద్యులు ఆమెకు చికిత్స చేసి బ్రతికించారు. కాలాపానీ జైలులోనే నరక యాతన అనుభవించి, ‌స్వాతంత్ర్యం వచ్చాక ఆమె విడుదలైంది. మారిపోయిన దేశకాల పరిస్థితుల్లో ఆమె హైదరాబాద్ కు చేరుకుంది. చిన్న పూరె గుడిసె వేసుకుని పూలు అమ్ముకుని బ్రతికింది. ఆమె త్యాగం ఎవరికి పట్టలేదు. ఏ స్వాతంత్ర్య పింఛను పొందలేదు. రికమండేషన్ లెటర్స్ తో స్వాతంత్ర్య యోధుల జాబితాలో పేరు చేర్చుకుని చంకలు గుద్దుకున్న వంచకులు ఎందరో... కానీ విషాదం ఏమిటంటే ఆమె వేసుకున్న గుడిసె,  ప్రభుత్వ స్థలమని కూల్చేశారు. ఆమె ఎవరినీ దూషించలేదు. అలాగే గాలికి ధూళికి బ్రతికింది.  చివరికి 96 ఏళ్ల వయసులో ఆమె 1998 లో మరణించారు. ఈ కధనం మనలో జాలి పుట్టిస్తే అది పెదవి వట్టి విరుపు. దేశభక్తి నింపితే అది నిజమైన గట్టి మలుపు.  స్త్రీ జాతి ధైర్యసాహసాలకు, దేశభక్తికి, త్యాగనిరతికి నీరా ఆర్య జీవితం ఈ దేశంలో మహిళలందరికీ స్ఫూర్తి. 

🌹🌹🌹🌹🌹🌹🌹

 మార్చి 5 జన్మించిన నీరా ఆర్య గురించి  తెలుసుకోవడం సముచితం. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల ఆనాడు దేశభక్తితో ఎందరో మహిళలు చేరి దేశానికి తమ సేవలందించారు. ఈనాడు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు దిగుతున్న మహిళలు ఈ కధ విన్నాక తమ జీవితాలను సరైన అవగాహనతో నడుపుకుంటారని ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటారని ఆశిద్దాం. 

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

ముడి వజ్రం (10-Mar-23, Enlightenment Story)

🌷ముడి వజ్రం🌷

ఒక రైతు నడుస్తూ పట్నం వెళుతున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక అయిదు రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది. తళతళమని మెరిసి పోతోంది. అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు అడుగుల కుదుపుకి రాయి వచ్చి నాణేనికి తగులుతోంది.

అయిదు రూపాయల బిళ్ల ఎగతాళిగా రాయితో ఇలా అంది. ‘‘నన్ను తాకకు, దూరంగా, మర్యాదగా ఉండు. నేను నీలా విలువ లేని రాయిని కాను. నన్ను డబ్బు అంటారు. నాతో ఆహార పదార్థాలు, వస్తువులు కొనుక్కోవచ్చు. "ధనమూలం ఇదం జగత్‌" అంటారు తెలుసుగా?’ అంటూ గొప్పలు పోయింది.

రాయి ‘అలాగా’ అన్నట్లుగా ప్రశంసగా చూసింది. ఇక నాణెం రెచ్చిపోయి తన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది. తను ఇప్పటి వరకు ఎన్ని చేతులు మారిందీ, తనతో కొనుక్కో దగిన వస్తువులెన్ని ఉన్నాయో వినిపించింది. అన్నింటినీ ప్రశాంతంగా వినసాగింది రాయి.

ఇంతలో లేత మొక్కజొన్న పొత్తులు నిప్పులపై కాలుస్తున్న కమ్మటి వాసన వచ్చింది.

‘‘ఈ రైతు నన్ను ఆ బండి వాడికిచ్చి ఓ కండె కొనుక్కుంటే బాగుండు. వాడి గల్లా పెట్టెలో నా స్నేహితులతో కలిసి పోతాను. మురికిగా ఉన్న నీతోఉండలేకపోతున్నాను’అంది నాణెం బడాయిగా.

‘ నిజమే ’ ఒప్పుకుంది రాయి నిజాయతీగా. కానీ రైతు నడక ఆగకుండా సాగింది. భోజన సమయానికి ఒక చెట్టు కింద ఆగాడు. అక్కడ కూర్చుని తెచ్చుకున్న మూటవిప్పి గోంగూర పచ్చడి నంచుకుంటూ పెరుగన్నం తిన్నాడు. కాసేపు నడుం వాల్చాడు. ఇంతలోనే లేచి ఎవరితోనో మాట్లాడసాగాడు.

ఆ మాటలను బట్టి పట్నం నుంచి పల్లెకు వస్తున్న అతడి మిత్రుడొకడు ఎదురు పడినట్లుగా నాణేనికి, రాయికి అర్థమైంది.

‘‘నీ కోసమే పట్నం బయలుదేరాను మిత్రమా! నా తండ్రి చనిపోతూ ఈ రాయిని నా చేతిలో ఉంచి కన్నుమూశాడు. ఇదేపాటి విలువ చేస్తుందో చెప్పగలవా? నువ్వు రత్నాల వ్యాపారివి కదా’’ అంటూ జేబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడికి చూపించాడు.

దాన్ని పరీక్షించిన రైతు మిత్రుడు ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు. ‘‘ఇది ముడి వజ్రం. సానబెడితే ఈ చుట్టుపక్కల వూళ్లన్నీ కొనేయగలవు’’ అన్నాడు.

ఆ మాటల్ని జేబులోంచి వింటున్న నాణెం తెల్లబోయింది. రైతు కళ్లు సంభ్రమంతో మెరిశాయి. వజ్రాన్ని కళ్లకద్దుకుని తిరిగి జేబులో వేసుకున్నాడు.

జేబులో చేరిన రాయిని చూసి నాణెం గౌరవంగా దూరం జరిగింది. తన గొప్పలకి సిగ్గుపడి మౌనంగా ఉంది. రాయి నాణేన్ని స్నేహంగా చూస్తూ ‘‘మౌనంగా ఉండిపోయావేం మిత్రమా? నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంది’’ అంది.

నాణెం సిగ్గుతో ‘‘నీ విలువ తెలియక బడాయి పోయాను. నన్ను క్షమించు. నువ్వు విలువైన వజ్రానివని ముందే నీకు తెలుసా?’ అంది.

తెలుసన్నట్లు తలూపింది రాయి.

‘‘మరి నేను అన్ని గొప్పలు పోతుంటే నాకు బుద్ధి వచ్చేలా అసలు విషయం చెప్పలేదెందుకు?’’ అంది నాణెం.

‘‘ఇదిగో, ఇందుకే. నాకు సహజమైన స్నేహం కావాలి. నువ్వు చూడు. ఇప్పుడు ఎలా వినయంగా, బిడియంగా ఉన్నావో? కృత్రిమత్వం నాకు నచ్చదు. నేను ఎవరో తెలిస్తే నువ్వు నీలా ఉండవు. మన నిజమైన విలువ స్నేహంగా, నిజాయతీగా ఉండే మన ప్రవర్తనని బట్టి ఉంటుంది. డబ్బుతో తూచగలిగేది నిజమైన విలువ అనిపించు కోదు’’ అంది రాయి.

వజ్రపు ఆలోచనా ధోరణికి ముగ్ధురాలైంది నాణెం. చేరువగా వచ్చిన నాణేన్ని ఆదరంగా చూసింది రాయి. మళ్లీ మునుపటిలానే ఎడతెగకుండా నాణెం కబుర్లతో హాయిగా సాగిపోయింది ప్రయాణం!

ఎవరూ కూడా సంపదనుచూసి స్నేహం చేయకండి! మనసుచూసి స్నేహం చేయండి🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

రక్త సంబంధం (09-Mar-23, Enlightenment Story)

 🙏🙏రక్త సంబంధం🙏🙏

🌷🙏🌷🌷🙏🌷🌷

తోబుట్టువులంటే ఇప్పటి కాలంలో  ఒక బరువులా  భావిస్తున్నారు.ఒకే తల్లి కడుపులో పుట్టి పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటాం. పెళ్ళి అవగానే ఎవరి జీవితం వారికి ముఖ్యం అని తలచి తోడబుట్టినవారి కష్టాలను పట్టించుకోము

అప్పట్లో..

ఒకరోజు అన్నయ్య ఫోన్ చేసాడు. చెల్లి నీ వదినను తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.  అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు.రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది.

బెల్ మోగిందిఅన్నయ్య వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.  ఎదురుగా అన్నయ్య, వదిన, వదిన తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది.  అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.

వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. వదిన ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. అన్నయ్య ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది. అన్నయ్యకి 7up అంటే ఇష్టం అని చెబుతూ.

అన్నయ్య అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అచెల్లి కు.

చెల్లి నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు. అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే. జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే.అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.

ఇక వెళ్ళొస్తామంటూ.  బయల్దేరారు ముగ్గురూను.

అన్నయ్య చెల్లి  దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "చెల్లి.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, చెల్లికు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, చెల్లి కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.  👍

"ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా.నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ.

ఆలోచించుకుంటూ. ! ఇలా ఉండాలిదా..!  

బంధం అనే కాదు.కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.  ఆత్మీయతను కోల్పోకండి.!

దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా.మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు. ఏమంటారు"..?

ఇలాంటి ఆత్మీయతలను; *అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Friday, 3 March 2023

ధ్యానం అంటే ఏమిటి? (08-Mar-23, Enlightenment Story)

 *ధ్యానం అంటే ఏమిటి?

🙏🙏🙏🙏🙏🙏🙏

ఈ ప్రశ్న ఒక పిల్లాడిని వెంటాడుతూ ఉంది. ఆ కుర్రవాడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో ఎలా వివరించాలో ఎంత ఆలోచించినా అతని తల్లిదండ్రులకు తెలియలేదు.

ఒకసారి వారు కుటుంబ సమేతంగా రమణ మహర్షి దర్శనానికి వెళ్లారు.బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షి ముందుంచాడు.

"ధ్యానం   అంటే   ఏమిటి గురువుగారూ?" అని ఆ అబ్బాయి అడిగాడు.

శ్రీ రమణమహర్షి తనలో తానే నవ్వుకున్నాడు. అప్పుడు చిరునవ్వుతో తన భక్తుడిని పిలిచి, వంటగదిలోంచి దోసె తీసుకొచ్చి ఆ అబ్బాయికి వడ్డించమని  చెప్పాడు.

ఒక అరిటాకుపై, ఒక దోసె వడ్డించారు.  రమణమహర్షి ఆ కుర్రాడి వైపు చూసి, "ఇప్పుడు నేను  ‘మ్మ్’  అంటాను. అప్పుడే నువ్వు తినడం మొదలు పెట్టాలి.   మళ్ళీ  ‘మ్మ్’ అంటాను.  ఆ తర్వాత నీ ఆకులో చిన్న దోసె ముక్క కూడా మిగలకూడదు." అని అన్నారు.

ఆ కుర్రాడు  చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. అందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు.

ఇప్పుడు ఆ కుర్రాడు రమణమహర్షి ముఖంలోకి చూస్తూ, సంకేతం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. "మ్మ్" అని సంకేతం ఇవ్వగానే ఆ కుర్రాడు తినడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు   అతని  దృష్టి  అంతా రమణమహర్షి పైనే ఉంది. సంకేతం ఇచ్చే ముందే  దోసె పూర్తి చేయాలనుకుని, అతను హడావిడిగా దోసెను పెద్ద పెద్ద ముక్కలుగా చింపి తింటున్నాడు కానీ, ఆ సమయమంతా అతని దృష్టి రమణమహర్షి పైనే ఉంది.

దోసె పరిమాణం క్రమంగా తగ్గుతూ వచ్చింది.   ఒక చిన్న ముక్క మాత్రమే మిగిలి ఉంది.  రెండో సంకేతం కోసం అతను రమణమహర్షి వైపు ఆత్రుతగా చూశాడు. 

సంకేతం ఇచ్చిన క్షణం, ఆ కుర్రాడు వెంటనే చివరి దోసె ముక్కను నోటిలో పెట్టేసుకున్నాడు.

ఇప్పుడు రమణమహర్షి అతనిని…    "ఇప్పటి వరకు నీ దృష్టి ఎక్కడ ఉంది? నాపైనా    లేక   దోసెపైనా     లేక ఇతరులపైనా?" అని అడిగారు.

"నా దృష్టి   మీ మీదా,    దోసె మీదా మాత్రమే ఉంది, ఇంక దేనిమీదా లేదు”, అని ఆ అబ్బాయి బదులిచ్చాడు.

రమణమహర్షి, "అవును... నువ్వు నా మీదే శ్రద్ధ పెట్టి, దోసె పూర్తి చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యావు.    నువ్వు అస్సలు పరధ్యానంగా లేవు.

అదే విధంగా,   నీవు   నీ దృష్టిని  లేదా ఆలోచనలను భగవంతునిపై నిల్పి, నీ రోజువారీ కార్యకలాపాలను చేసినప్పుడు, దానిని ‘ధ్యానం’ అంటారు."

"మ్మ్" అన్న రెండు సంకేతాలు పుట్టుక - మరణం. ఈ రెండు సంఘటనల నడుమ, శ్రీ రమణ మహర్షి చూపించిన విధంగా…  ‘ధ్యానం’ లో నిమగ్నమవ్వవచ్చు. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి, మనమందరం పరిపక్వమై, పరిణతి చెందాలి, దీనికి ‘దైవానుగ్రహం’ కూడా అవసరం.

మనమందరం ఒకరికొకరు భిన్నంగా ఉంటాం, కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పట్టే సమయం కూడా వివిధరకాలుగా ఉంటుంది.✍️

*ధ్యానం చేసినప్పుడు, మనం ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకుంటాం.  ఇది మన చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది. *

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

పూజల్లోనూ, ధ్యానం చేసేటప్పుడు ఆసనాన్ని ఇందుకే వాడతారు!! (07-Mar-23, Enlightenment Story)

 *పూజల్లోనూ, ధ్యానం చేసేటప్పుడు ఆసనాన్ని ఇందుకే వాడతారు!!*

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏

మనం ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నా సరే, మన శారీరక భంగిమ, మన శ్రద్ధాసక్తులు మనకు తెలియకుండానే ఆ పని మీద ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా, పూజ, జపం, ధ్యానం లాంటివి చేస్తున్నప్పుడు మనం ఎలా కూర్చున్నాం, దేని మీద కూర్చున్నామనేది గమనించాల్సిన విషయం. ఎందుకంటే, మనంచేసే ఆ జప ధ్యానాలు నిర్విఘ్నంగా పూర్తి అయి, సత్ఫలితాలు ఇవ్వడానికి అవి కీలకం.

ఆసనం అంటే?

సర్వసాధారణంగా ఏదైనా ప్రార్థనచేస్తున్న ఎప్పుడు, ఏదైనా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడూ కాళ్ళు మడత పెట్టి, పద్మాసనంలో కూర్చోవడం హిందువుల సంప్రదాయం. ఆ పద్మాసన భంగిమలో కూడా వట్టి నేల మీద కాకుండా ఏదైనా ఆసనం పరుచుకొని, దాని మీద కూర్చోవడం ఆచారం. సరైన ఆసనం మీద కూర్చొని, వైదిక కర్మకాండ నిర్వహిస్తే పూర్తి ఫలితం సిద్ధిస్తుంది. ఆసనం వాడడం వెనుక ఇలా ఎంతో ప్రాధాన్యం ఉంది. 

ఆత్మ సిద్ధి ప్రధానాచ్చ సర్వ రోగ నివారణమ్ | 

నవ సిద్ధి ప్రధానాచ్చ ఆసనం పరికీర్తితమ్ ॥

'ఆత్మ జ్ఞానం కలిగించడానికి, సర్వ రోగాలనూ నివారించడానికి, నవ సిద్ధులనూ ప్రాప్తింపజేయడానికీ 'ఆసనం' ఎంతో అవసరం'.

'ఆసనం' అనే మాటకు ఓ విశేష వివరణ కూడా పెద్దలు చెప్పారు. 'ఆసనం'లోని 'ఆ' అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. 'స' అంటే సర్వరోగాలనూ హరించేది. 'నం' అంటే నవ సిద్ధులనూ ఇచ్చేది అని విశేష అర్థం. అందుకే, పూజా పునస్కారాలకూ, జపతపాలకూ ఆసనం ముఖ్యమైన అవసరం.

ఆసనంగా వేటిని ఉపయోగిస్తారంటే - పులిచర్మం, కృష్ణాజినం (నల్ల జింక చర్మం), కంబళి, చిత్రాసనం, దర్భాసనం, దావళి, పట్టు వస్త్రం, నూలు వస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించవచ్చు.

ఆసనం వాడడం ఎందుకు?

ఇంతకీ అసలెందుకు ఆసనం వినియోగించాలి, వినియోగిస్తే తక్షణ ప్రయోజనం ఏమిటని ఎవరికైనా సందేహం రావచ్చు. దీనికి మన పెద్దవాళ్ళు శాస్త్రీయమైన ఓ వివరణ ఇచ్చారు. కఠోర జపతపాలుచేస్తున్నప్పుడు సాధకుడిలో గణనీయమైన  స్థాయిలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ అంతర్గత శక్తి అతని ముఖవర్చస్సులో ద్యోతకమవుతూ ఉంటుంది. వట్టి నేల మీద కూర్చొని జపతపాలు నిర్వహించడం వల్ల ఓ ఇబ్బంది ఉంది. మన శక్తిని భూమి ఆకర్షించే ప్రమాదం ఉంది. కాబట్టి, దర్భాసనం పరచుకొని, దాని మీద కూర్చొని, జపతపాలుచేస్తే ఆ ఆసనం భూమ్యాకర్షణ శక్తిని నిరోధిస్తుంది. ఆ రకంగా జపతాపాల వల్ల సాధకుడిలో ఉత్పన్నమైన శక్తి వృథా కాకుండా కాపాడుతుంది.

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

తల్లిదండ్రులను ద్వేషించకండి (06-Mar-23, Enlightenment Story)

*తల్లిదండ్రులను ద్వేషించకండి* ( అర్ధం- అపార్థం!)

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏🌷🌷🙏

రెండు పదాలకు మద్య ఒక అక్షరం తేడా అంతే, కానీ భావం మారుతుంది, సంబంధాలను, భవబంధాలను ప్రశ్నార్థకం చేస్తుంది.  పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.  భారవి తండ్రితో ‘నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా!’ అనేవారు.

ఆయన మాత్రం ‘వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే!’ అనేవాడు. భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.  తల్లి దగ్గర ‘నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు. వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది, యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.’ అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది. భారవి, అన్నం తిన్నాక పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.

అప్పుడు భారవి తల్లి భర్తతో *మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు? వాడు చాలా బాధ పడుతున్నాడు*. వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!’

అప్పుడు తండ్రి నవ్వి.... ‘పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాటి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా?’ అన్నాడు.

అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది. పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు. తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి ‘నాకేదయినా శిక్ష వేయమ’ని బ్రతిమాలుకున్నాడు.

’పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు?’ అని తండ్రి చెప్తున్నా వినకుండా  తనకు ‘శిక్ష వేయమ’ని పట్టు బట్టాడు.  తండ్రి ‘సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా!’ అన్నాడు.

’ఇంత చిన్న శిక్షనా?’ అన్నాడు భారవి.తండ్రి నవ్వి ‘అది చాల్లే వెళ్ళు!’ అన్నాడు. భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు. సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు. రోజుకో పిండివంట చేసి ఆదరించారు. నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.

చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు. అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు...దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.

అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ ‘మీరు మీ ఊరు వెళ్లిపోండ’ని  యెంతో చెప్పి చూసింది. భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు. ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి ‘యింక నేను  మావూరికి పోయివస్తాన’ని బయల్దేరాడు.

ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి ‘నాశిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను!’ అని చెప్పాడు.

ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.  భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు. కోపంగా మాట్లాడే ప్రతివారి ని శతృత్వముతో చూడరాదు.

చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి! అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

*తల్లిదండ్రులను ద్వేషించకండి! అంతకంటే పాపం ఇంకోటి వుండదు!*

బంధాన్ని కాపాడుకోడానికి తల వంచాల్సివస్తే వంచేయి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సివస్తే ఆ బంధం కోసం ఆలోచించాల్సిందే. చెప్పే ప్రతి వాడు వేదాంతి కాకపోవచ్చు కానీ నీ మాటవినే ప్రతి వాడు వెర్రి వాడు మాత్రం కాదు...✍️

🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Thursday, 2 March 2023

నామత్రయం (05-Mar-23, Enlightenment Story)

*నామత్రయం*

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏🌷🌷🙏

👉 నామ త్రయం అంటే మూడు నామాలు. అవి 'శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః' ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి.

👉 ఈ నామాలు ఒక దివ్యౌషధం లా పనిచేస్తుంది. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద అన్నవి. 

👉 పద్మ పురాణంలో ఈ నామ మహిమ 'అచ్యుతానంత గోవింద నామోచ్ఛారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహ' అని మిక్కలి గొప్పగా వర్ణించబడింది. 

👉 అంటే 'ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను' అని దీనర్ధం.

👉 ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రధమ స్థానం

👉 పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారయణుని లీలల గురించి, కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మథన గాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతీ! పాల కడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.

👉 ఆ హాలాహలం చూసి దేవతలు, దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకూటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్తుతించ సాగారు.

👉 అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వ దుఃఖ హరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన మూడు నామాల్ని అచ్యుత, అనంత, గోవింద అన్న మూడు మహా మంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహా భయంకరమైన కాలకూట విషాన్ని త్రాగివేశాను.

👉 సర్వ వ్యాపి అయిన విష్ణు భగవానుని యెుక్క ఆ నామ త్రయం యెుక్క మహిమ వల్ల సర్వ లోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది అని సాక్షాత్తూ సదా శివుడు తెలిపాడు.

👉 కనుక మీరు కూడా 'శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః' అన్న 'నామ త్రేయాస్త్ర మంత్రాన్ని' పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకముంచుకుని, విశ్వాసం పెంచుకుని, మంత్ర మననం చేయడం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకుని, ఆయురారోగ్యాలను పొందవచ్చు.

 👉 ప్రతి రోజు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటితో మీ దినచర్యను ప్రారంబించండి. నీటి గ్లాసును చేత పట్టుకుని ' నామ త్రేయాస్త్ర మంత్రాన్ని' కొద్దిసేపు పలికి, ఆ నీటిని మంత్ర బలంతో శక్తివంతం చేసి, తరువాత ఆ నీటిని స్వీకరించండి. ప్రతి రోజు ఇలా చేయడం వలన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...