Saturday, 8 April 2023

శ్రీవారు మూడునామాల (13-Apr-23, Enlightenment Story)

🥀*శ్రీవారు మూడునామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటి *🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

శ్రీవారిని తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు. మూడునామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ మూడునామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరచారు. ఏడుకొండలకు నడక దారిన వెళ్లేటప్పుడు కూడా మూడు నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది..

శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి.అసలు శ్రీవారికి ఈ మూడు నామాలు ఎందుకు ప్రత్యేకం ?మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు ?మూడునామాల వాడిగా ప్రసిద్ధ చెందడానికి కారణమేంటి ?

సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి, మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు. ఈ నామాలు అజ్ఙానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట. అలా....

 శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్లు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు...

 ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన, మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు. శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు... 

శ్రీవారి మూడు నామాలకు మరో అర్థం కూడా ఉంది. వైష్ణవుల్లో వడగలై, తెంగలై అనే రెండు తెగలున్నాయి. వడగలై అనే వాళ్లు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు. తెంగలైవారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం దిద్దుకుంటారు. అయితే ఈ రెండు ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం ప ను పోలి ఉంటుంది. దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు. అలా శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకమైయ్యాయి.



🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

దేవాలయం దర్శన విధానములో పరమార్థం (12-Apr-23, Enlightenment Story)

 🥀*శ్రీ దేవాలయం దర్శన విధానములో పరమార్థం*🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

👉 మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం.

కాని అలా ఎందుకు పాటిస్తున్నాము ?? వాటి వెనుకనున్న అంతరార్థ పరమార్థాలేమిటో ?? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.తీర్థ స్నానం:👉ఉదయానే్న చన్నీటి స్నానం: ముఖ్యంగా ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఉన్న చన్నీటి స్నానం శుచితోబాటు ఏకాగ్రతను కల్గిస్తుంది. అందులో ఖనిజ సంబంధమైన చన్నీటి స్నానం, అందులో చేసే సూర్యనమస్కారం శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కుంభమేళా మొదలైన పవిత్ర సమయాల్లో పరమయోగులు తీర్థాల్లో, నదుల్లో స్నానం చేస్తారు. కాబట్టి ఆ తీర్థస్నానం ప్రయోజనకరంగా ఉంటుంది.  అలాగే పుష్కర సమయాల్లో తీర్థస్నానం కూడా ఎంతో పవిత్రమైనది.

2.ప్రదక్షిణం: 👉ఆలయం ప్రాకారం లోపల, గర్భగుడికి వెలుపల మూడు ప్రదక్షిణలు చేస్తాం. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయం చుట్టూ పరచబడిన రాళ్ళపై వట్టి కాళ్ళతో నడుస్తాం. అలా రాళ్ళపైనున్న సన్నని రంధ్రాలపై అది కాళ్ళ బరువు ఆనుతుంది. ఆ ఒత్తిడికి కాళ్ళలోనున్న నరాల కూడళ్ళు కదిలి, ఇతరావయవాలు చక్కగా పనిచేస్తాయి. దీనినే ఆక్యుపంచర్ అంటారు.

3.ఆలయంలో కూర్చోవటం: 👉దర్శనం తర్వాత ఆలయంలో కూర్చొని వెళ్ళటం ఒక ఆచారం. ఇందుకు కారణం ఆలయంలో అనేక వృక్షాలుంటాయి. వాటికి ఔషధశక్తి ఉంటుంది. కావున ఆ చెట్టుక్రింద గాని, చెట్టుముందుగాని, ఆలయంలో ఎక్కడైన కూర్చొని ధ్యానం చేస్తే ఊపిరితిత్తులను శుభ్రపరిచి, శరీరం పైనున్న విషక్రిములను నాశనం చేసి, శరీరారోగ్యాన్నికాపాడుతుంది, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కుదురుతుంది.

4.జపం: 👉ఆలయంలోని వృక్షం క్రింద ఉన్న విగ్రహం ముందు గాని, ఆలయంలో విగ్రహం ముందు గాని కూర్చొని జపం చేస్తుంటాం. అనగా ఉత్తరాభిముఖంగా నుండి ధ్యానం చేసేటప్పుడు, ఉత్తర దిశలోని అయస్కాంత శక్తి ప్రభావానికి లోనై రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది.

5.ఆలయ నిర్మాణం:👉ఆలయం నిర్మాణానికి, చక్కటి ప్రకృతి రమణీయ స్థలాన్ని నిర్దేశించి, లోపాలేవి లేని సుక్షేత్రమును ఎన్నుకొని నిర్మిస్తారు. ఆలయంలో వాస్తు, జ్యోతిష్యం, ఆరోగ్యం, సంగీతం, నృత్యం వంటి సర్వశాస్త్ర సమ్మిళితం.

6.దేవతా విగ్రహాలు:👉ప్రత్యేక ముహూర్తంలో పవిత్రతో, పద్ధతితో మంత్రతో సేకరించబడిన రాళ్ళను విగ్రహాలుగా చెక్కి ఒక సుముహూర్తాన దేవాలయంనందు ప్రతిష్ఠింపబడతాయి. ప్రాణప్రతిష్ఠ జరుపబడిన ఈ దివ్యశిలలు సూర్య, చంద్రుల, వరుణ, వాయువుల ప్రభావాలకులోనై ఖనిజాలుగా మారి విద్యుత్‌శక్తి కలిగి ఇతర దివ్యశక్తులను పొంది, అపూర్వ గుణగణ సంపూర్ణమైనవిగా వెలుస్తాయి. ఈ దివ్య విగ్రహాలనుండి వెలువడే బ్రహ్మపదార్థము, దివ్య పరిమళము, భక్తులు శిరస్సు వంచి చేయబడు ప్రార్థన మూలకంగా మెదడు ద్వారా శరీర ప్రవేశం చేస్తాయి. దేవతా విగ్రహాల నుండి వెలువడే కిరణాలు, ప్రకంపనాలు భక్తుని మనస్సును నిర్మలంగా ఉంచడానికి దోహదపడతాయి.విగ్రహాల క్రింద స్థాపించబడిన యంత్రాలనుండి వెలువడే తరంగాలు మానవుణ్ణి మహోన్నత స్థితికి చేరుస్తాయ.

7.నమస్కారం:👉భక్తులు ఆలయంలో చేసే నమస్కారాల పద్ధతిలో వ్యాయామం దాగుంది.దీనివలన మెడ, తుంటి, మోచేయి, కాలు, చీలమండలం మొదలైన శరీర భాగాలన్నీ తేలికగా కదిలి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. సాష్టాంగ నమస్కారం సర్వశ్రేయస్కరం, అలాగే వినాయకునికి చేసే గుంజీలు కూడా ఇందులో భాగాలే.

8.మంత్రం: 👉ఆలయంలో అర్చకులు చేసే మంత్ర ఉచ్ఛారణ మనలో చైతన్యాన్ని ప్రకృతిలో శక్తిని పెంపొందిస్తుంది. కొన్ని మంత్రాలు మానవునికి ఆరోగ్యాన్ని, శక్తిని కోరికలను తీరుస్తాయి.

9.తీర్థం:👉ఆలయంలో భక్తులకు ఇచ్చే తీర్థంలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి. వాటిని స్వీకరించడం ద్వారా ఆరోగ్యం, మానసిక, శారీర ప్రశాంతతనిస్తుంది.

10.ప్రసాదం: 👉దైవదర్శనం అనంతరం ఆలయంలో స్వామికి నివేదించిన ప్రసాదాలు తీసుకోవడం ద్వారా శరీరంలో రక్తప్రసరణకు క్రమబద్ధంచేసి, జీర్ణశక్తిని కలిగిస్తాయి. ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే అక్కడ ఇచ్చే పసుపు నీరు, నిమ్మరసం, విభూతి, కుంకుమ, అభిషేక జలం, మన్ను మొదలైనవి సేవించడం వలన మానసిక రుగ్మతలు అరికట్టబడతాయి.

11.ఏకాగ్రత: 👉దేవాలయంలో చెక్కబడిన మూర్తులు, శిల్పాలు, పురాణగాథలు, ఇతర కథలు ప్రాపంచిక ధోరణినుండి మనసును మరల్చి, మన సంస్కృతీ సాంప్రదాయాల విధులు, విలువలు, విధానాలు మనకు తెలియజేస్తూ, పరిశుభ్రతను, స్వచ్ఛతను, సామాజిక సంబంధ, బాంధవ్యాలను పెంచుతూ మానవతా, ఆధ్యాత్మిక, ఆరోగ్య కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి ఆలయాలు అనటంలో ఎలాంటి సందేహం లేదు. 

*స్వస్తి*


🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Thursday, 6 April 2023

జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము (12-Apr-23, Enlightenment Story)

🥀*జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము *🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ పై తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై  అతని ముందున్న రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి వుంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది..

*అందులో ఇలా వుంది*

గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది. ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను.ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఇక ఋణం తీరిపోయింది 

ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది. ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది

దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!! చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది. కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడేపెట్టి వెళ్ళిపోయింది.

ఆయనకి మెలుకువ వచ్చింది.  తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద తను రాసింది కాకుండా ఇంకేదో రాసి వుండటం గమనించి చదవడం ప్రారంభించాడు

*అందులో ఇలా వుంది*

గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి నుంచి శాశ్వతంగా ఉపశమనం లభించింది

ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని నా కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా  గడుపుతాను

ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే  ప్రశాంతంగా సహజమరణం చెందారు

ఈ ఏడాది నా కొడుక్కి పునర్జన్మనిచ్చింది. కారు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైనా నా కొడుకు ప్రాణాలతో బైటపడ్డాడు, కార్ కి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో మరో కొత్త కారు కొనుక్కున్నాను

హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"

అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు.

ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.

చాలావరకూ సమస్యలు మన ఆలోచనా దృక్పథం నుంచి ఉద్భవించేవే.. మన ఆలోచనా దృక్పథం #పాజిటివ్ గా ఉంటే ఎంతటి సమస్య ఐనా దూదిపింజెలా తేలికైపోతుంది,ఫలితం అనుకూలంగా ఉంటుంది. కానీ #నెగటివ్ ఆలోచనలు చిన్న సమస్యను కూడా బూతద్దంలో చూపించి మనశ్శాంతిని దూరం చేస్తాయి.ఆనందమయమైన 

🌸జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము🌸

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత (11-Apr-23, Enlightenment Story)

🥀*శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత*🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

చైత్ర పూర్ణిమను (06-Apr-23) హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. అదేగాక ఇంకో కధనం కూడా ఉంది. చైత్రపూర్ణిమ నాడు ఆంజనేయస్వామి వారి అసురసంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా, హనుమాన్ విజయోత్సవంగా జరుపుతారట.

శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు.శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది.పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు.

నేటి విశేషాన్ని పురస్కరించుకొని రెండు కథలు వున్నాయి.

1 , నేటి రోజున హనుమంతుడు సీత జాడను కనుగొని, తిరిగి ప్రయాణము అయి చేరిన రోజుగా పరిగణిస్తారు .అందుకే వానరులు అంతా కలసి విజయోత్సవ దినంగా చేసుకొని, హనుమంతుణ్ణి పొగిడిన రోజు కాబట్టి ఈరోజు , హనుమద్ విజయోత్సవ దినంగా జరుపుకుంటారు.

-- --  -- -- 

2, హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వర్వునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారది కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర, లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేసాడు. 

హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు. 

తన హృదయాన్ని చీల్చి సీతా రాములను చూపించాడు, ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోనతలు ఎన్నో కనబడతాయి.

చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది… హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు.

నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాదిలో ప్రథమ పౌర్ణమి, చంద్రుడు పదహారు కళలతో సూర్యేందు సంగమ కాలాన్నే పర్వ సంధి కాలం అని అంటారు. 

అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకి చంద్రునికి ఒక్కొక్క కళ హెచ్చుతూ, తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకు చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తాడు.

ఇలా పదహారు కళలతో చంద్రుడు సంవత్సరానికి 12 పౌర్ణమిలు అత్యంత కాంతివంతుడై, ప్రతీ మాసంలోని పౌర్ణమి నాటి నక్షత్రంతో కూడి వుండటం వల్ల, ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరుతో వస్తుంది. ఇలా ఏడాదిలోని పండ్రెండు పౌర్ణమిలు పండ్రెండు పర్వ దినాలుగా అందిస్తూ చంద్రుడు సర్వ మానవాళికి ప్రకాశవంతమైన జీవనాన్ని అందిస్తున్నాడు. 

అందుకే ఉగాదితో సంవత్సరం ప్రారంభం అవుతుంది అందుకే రాముడు చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవానికి ఎంచుకున్నాడు

కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.

హనుమంతుని నైజం :-

యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్బా

ష్పవారి పరిపూర్ణ లోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను

కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు. 

పరమశివుని అంశతో జన్మించారు, సప్త (7) చిరంజీవులలో ఒకరు, ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. 

ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. 

చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాక ముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి, చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. 

శని బాధలు తొలగిపోతాయి, బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 

5 ప్రదక్షిణలు చేయండి, అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం, వీలుంటే 5 పళ్ళు సమర్పించండి, 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల స్వామి వారి అనుగ్రహము కలుగుతుంది అని నమ్మకం...

శ్రీ రామ జయ రామ జయజయ🙏🍃☘️


🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️


Tuesday, 4 April 2023

భగవంతుడు మన లోనే వున్నాడు (10-Apr-23, Enlightenment Story)

🥀*భగవంతుడు  మనలోనే వున్నాడు*🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

పూర్వకాలంలో ఒక అందమైన కస్తూరిమృగం రోజంతా అడవిలో చెట్ల మద్య గంతులు వేస్తూ కాలం గడుపుతుండేది.

ప్రతిరోజూ దానికి ఒక అధ్బుతమైన సువాసన ముక్కుకి తగులుతుండేది. ఆ సువాసన  పూల వాసనకంటే ఎంతో బాగుండేది. నిజం చెప్పాలంటే అంత సువాసన, అంత అధ్బుతమైన సుగంధం ఎప్పుడూ దానికి ఎన్నడూ తెలియదు.అంత కమ్మని సువాసన ఎక్కడినించి వస్తున్నదో దానికి తెలియటంలేదు. ఆ కస్తూరిమృగం ఇలా వాసన చూస్తూ చెట్ల మద్య తిరుగుతూ “అబ్బా ఈ సువాసన బహుశా చెట్టునుంచి వస్తున్నదేమో!”అనుకుంటూ చెట్టు దగ్గరికి వెళితే చెట్టు వాసన మామూలుగానే ఉన్నది.

అన్ని చోట్లా వాసన చూస్తూ అది అడవి అంతా తిరిగింది.” ఈ సువాసన సీతాకొక చిలుకల నించి వస్తున్నదా? చూడు చూడు వాసన చూడు ….లేదు లేదు వాటినించి రావటంలేదు.”రాబిన్” నుంచి వస్తున్నదా?… లేదు లేదు అక్కడినించి కూడా కాదు.” అని తనలో తానే ఆశ్చర్య పడుతూ  అన్నింటిని వాసన పీల్చి చూస్తున్నది. ఒక వేళ అక్కడి చిత్తడి నేల నుంచి వస్తున్నదా? ఊహూ కాదు!బహుశా అక్కడ ఉన్న పాదుల నుంచి ,తుప్పల నుంచి వస్తున్నదా అని మళ్ళీ మళ్ళీ వాసన చూసింది. ఊహూ… కానే కాదు కాని సువాసన మాత్రం దాని ముక్కుకి సోకుతూనే ఉన్నది. కానీ ఈ అడవిలో దేని నుంచి ఈ సువాసన రావటంలేదు. 

మరి ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తున్నది. ?అనుకుంటూ అది తనలో తానే తికమక పడుతున్నది. చాలా దూరం ఆ కస్తూరిమృగం పరుగులు పెట్టింది, గెంతింది,దూకింది, నాట్యం చేసింది. ఈ అపురూపమైన వాసన ఎక్కడినుంచి వస్తున్నదా అని అది పరిశీలిస్తూ, ఆ సువాసన మూలం కోసం వెతికింది.

అలా వెతికి వెతికి ఆ జింక విసిగిపోయింది...

అలిసిపోయింది. “ఎలా అయినా సరే ఈ వాసన ఎక్కడినుంచి వస్తున్నదో కనుక్కునే తీరతాను? అని పట్టుదలతో మళ్ళి వెతకటం ప్రారంభించిది. ఏ మాత్రం ఓపిక లేకపోయినా పరిగెత్తి, పరిగెత్తి అలా పరిగెత్తుతూ వెతుకుతూనే ఉన్నది. ఇక్కడా, అక్కడా, అన్నిచోట్లా,అన్నింటినీ వాసన చూస్తూ పరిగెడుతున్నది. “నా శరీరానికి ఇంక శక్తి చాలటం లేదు. అయినప్పటికి ఈ అధ్బుతమైన సువాసన ఎక్కడినుంచి వస్తున్నదో నేను కనిపెట్టి తీరుతాను.”అనుకున్నది. 

శరీరానికి వేగం తగ్గినా అలా వెతుకుతూనే ఉన్నది.ప్రయత్నిస్తూనే ఉన్నది. ఆఖరికి ఆ జింక ఇంక వెతకలేక నేలపై పడిపోయింది.

అలా నేలమీద శరీరం పడిపోయినప్పటికి , మనసులో మాత్రం ఇంకా ఆ వాసన మూలం కనుక్కొవాలని దానికి అనిపుస్తున్నది. ఇంతలో దానికి ఆ సువాసన గుప్పున వచ్చింది.” ఇదే ఇదే ఆ సువాసన!ఈ వాసన మూలం కనుక్కోవాలనే నేను ప్రయత్నంచేస్తున్నాను.! ఔను ఆ సువాసన ఇదే!.” అనుకున్న్నది జింక. 

కాని ఆ సువాసన ఎక్కడినుంచి వస్తున్నది??? క్షణంలో అది ఒక విషయాన్ని గ్రహించింది.”ఓయి భగవంతుడా! ఈ వాసన నాలోనుంచే వస్తున్నది. ఇంతకాలం నుంచి ఈ సువాసన నాలోనుంచే వస్తున్నది.” అని ఇంతో అన్నందంగా నవ్వుకుని, హాయిగా,ప్రశాంతంగా నిద్రపోయింది.

ఔను నిజమే ! ఆ వాసన తన లోనుంచే వస్తున్నది. భగవంతుడు కూడా అంతే.భగవంతుడు కూడా బయట ఎక్కడో ఉన్నాడని జనులు అనుకుంటూ ఉంటారు.కాని, భగవంతుడు ఎల్లప్పుడూ మనలోనే ఉంటాడు.మనకి దూరంగా ఎప్పుడూ లేడు. మనలోనే, మనచుట్టూ, మనతోనే ఉంటాడు.చాలా కాలం వెతికి వెతికి చివరికి ఆ కస్తూరి మృగం తననుండే వస్తున్న వాసనని గుర్తించినట్లే జగత్ప్రభువు కూడా మనలోనే ఉన్న విషయం తెలుసుకోవాలి.

మనం అంతర్ముఖులై , మన అంతరంగంలో వెతికి చూస్తే భగవంతుడు , శాంతి మనసులోనే ఉంటాయి.. కాని, మనం మాత్రం ఆ దేవుడి కోసం, శాంతి కోసం బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాము.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️


Monday, 3 April 2023

ఒక చిన్న చీమ - పెద్దదైన ఆకు (09-Apr-23, Enlightenment Story)


🥀*  ఒక చిన్న చీమ - పెద్దదైన .*🥀

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

ఒక ఆదివారం ఉదయం, ఒక ధనవంతుడు తన బాల్కనీలో సూర్యరశ్మిని, కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. బాల్కనీ యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు వెళుతున్న ఒక చిన్న చీమ దాని పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దదైన ఆకును మోసుకెళ్లుతున్నది. ఆ వ్యక్తి గంటకు పైగా దానిని చూశాడు. చీమ తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ, ఆగి, దారి మళ్లించి గమ్యం వైపు వెళ్ళింది.l

ఒకానొక సమయంలో ఆ చిన్న జీవికి నేలలో పగుళ్లు కనిపించాయి. కాసేపు ఆగి, విశ్లేషించి, ఆ తర్వాత పెద్ద ఆకును ఆ పగులు మీద ఉంచి, ఆకు మీద నడిచి, అవతలి వైపుకు వెళ్లి, ఆకును తీసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించింది.

దేవుని సృష్టిలో చిన్న జీవులలో ఒకటైన చీమ యొక్క తెలివితేటలకు ఆ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. ఈ సంఘటన అతనిని విస్మయానికి గురి చేసింది మరియు సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది. అది సృష్టికర్త గొప్పతనాన్ని చూపించింది. 

అతని కళ్ళ ముందు దేవుని యొక్క ఈ చిన్న జీవి ఉంది, పరిమాణం తక్కువగా ఉంది.., కానీ విశ్లేషించడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు అధిగమించడానికి మెదడును కలిగి ఉంది. 

కొద్దిసేపటి తరువాత ఆ జీవి తన గమ్యాన్ని చేరుకున్నట్లు ఆ వ్యక్తి చూశాడు - అదే దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం ఉన్న నేలలో ఒక చిన్న రంధ్రం. ఈ సమయంలోనే చీమ యొక్క లోపం ఆ వ్యక్తికి తెలియ వచ్చింది. చీమ తాను జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకు వచ్చిన పెద్ద ఆకును చిన్న రంధ్రంలోకి ఎలా తీసుకెళ్లగలదు..? దానికి అది సాధ్యం కాలేదు..!

అందుకని ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టపడి, మరెంతో శ్రమించి, మార్గమధ్యంలో అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీ చేతులతో ఇంటికి (రంధ్రంలోకి) వెళ్లిపోయింది.

చీమ సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు. చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది తప్ప ఉపయోగపడలేదు. ఆ జీవి తన గమ్యాన్ని చేరుకోవడానికి దానిని విడిచి పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి గొప్ప పాఠం నేర్చుకున్నాడు.

మన జీవితాలకు సంబంధించిన సత్యం కూడా అదే. మనము మన కుటుంబం గురించి చింతిస్తాము, మన ఉద్యోగం గురించి చింతిస్తాము, ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడ నివసించాలి, ఎటువంటి వాహనం కొనాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఏ ఉపకరణాలను మేలైనవి కొనాలి... అని ఆలోచించి మన గమ్యం (సమాధి) చేరుకోగానే వీటన్నిటినీ వదిలేస్తాం.

మన జీవిత ప్రయాణంలో వాటిని కోల్పోతామనే భయంతో, ఎంతో శ్రద్ధతో మోస్తున్న భారాలు మాత్రమేనని, చివరికి అవి నిరుపయోగంగా పడి ఉంటాయని, వాటిని మనతో తీసుకెళ్లలేమని మాత్రం గ్రహించలేము!

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️



Saturday, 1 April 2023

పారిజాత వృక్షం సముద్రగర్భం (08-Apr-23, Enlightenment Story)

🥀* క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా.*🥀
🌸❄️🌸❄️🌸❄️❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️🌸
పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.
పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. అయితే, దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి. ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచీ పరచినట్లుగా పడతాయి. కిందపడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి, దేవుడి సేవలో వినియోగిస్తారు. దేవతా పుష్పాలు కావడంతో కిందపడినా వీటికి ఏ దోషమూ ఉండదు. అలాగే, చాలా ఎత్తు ఎదిగే పొన్న చెట్టు (దేవ వల్లభం) కూడా దేవతా వృక్షమే. ‘ఓం చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః’ అని లలితాదేవిని ఆరాధిస్తారు. పొడుగాటి కాడలతో చాలా ఎత్తులో వికసించే పున్నాగలను రాల్చకూడదు. కార్తికం మొదలు మాఘ మాసం వరకు విరివిగా పూసే ఈ పూలు రాలిన ప్రదేశాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. కిందరాలినా వీటికి ఏ దోషం ఉండదు కాబట్టి దేవుడికి నిస్సంకోచంగా సమర్పించవచ్చు.
సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు.

*పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది*
అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు. ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టుమీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు. అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా ఎందుకు రాలిన పుష్పాలని ఏరుకొని పూజ చేయాలి అనే విషయానికి వస్తే. 
సాధారణంగా ప్రతి వృక్షం భూమినుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది. ఇలా స్వర్గం నుంచి భూలోకంలోకి రావడం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెబుతారు. అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి నేల పై రాలిన పుష్పాలు ఏరుకొని భగవంతుడికి సమర్పించాలి. ఇక పారిజాత వృక్షం ఏ ఇంటి ఆవరణంలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో సిరిసంపదలకు కొదవుండదని చెప్పవచ్చు.
పారిజాతం గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసి వాటిని నీటితో కలిపి తలమాడుకు పెట్టుకుంటే పొక్కులు తగ్గుతాయి. ఈ పారిజాత చుర్ణాన్ని కొబ్బరినూనెలో కలుపుకొని పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
పారిజాతం ఆకులను మెత్తగా నూరి వాటిని ఆముదం నూనెలో కలిపి, సన్నని సెగపై వేడి చేసి వాతపు నొప్పులు ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటే నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. దీని ఆకుల రసాన్ని నాలుగు చుక్కలను చెవిలో పోసుకుంటే చెవిపోటు తగ్గతుంది. 20 పారిజాతం ఆకులను మెత్తగారుబ్బి రసాన్ని తీసి సన్నని సెగపై సగం అయ్యే వరకు వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే దానిలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. సయాటికా నొప్పి తగ్గిపోతుంది.

గజ్జి, తామర సమస్య ఉన్నవారు పారిజాతం గింజలను కుండపెంకుల్లో మాడ్చి.. మసిగా చేసి ఈ చూర్ణంలో కర్పూరం కలిపి ఆ లేపనాన్ని పూస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలా మంది ఈ చెట్లను దేవాలయాల్లోనే పెట్టాలి అంటారు. ఆ సందేహం లేదు. ఇది మన ఇళ్ల దగ్గర పెట్టుకుంటే వాస్తు దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ చెట్టు కింద పేడతో అలికి పెట్టాలి. దానిపై పడిన పూలను దేవుడికి ఉపయోగించాలి. ఇది ఎవరూ ఇచ్చినా తీసుకోకూడదు. ఇచ్చినవారికి మాత్రమే పుణ్యం చెందుతుంది. పారిజాతం ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటారు. పారిజాత పుష్పం వాసనతో మనకు ఆరోగ్యం. వీటి ఆకుల్లో ఉండే ఫ్లావనాయిడ్స్‌ మోకాల్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు మొలలు కూడా తగ్గిపోతాయి. నిఫా వైరస్‌కు కూడా పారిజాతం ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...