Saturday, 14 January 2023

భోగిపండుగతో ఇంద్రుడి - భోగిమంటలు

 🔥భోగిపండుగతో ఇంద్రుడి బాంధవ్యం🔥

🌻🌺🌻🌺🌻🌺🌻🌺

మకర సంక్రాంతికి ముందు రోజున భోగిపండుగను జరుపుకుంటారు. భోగి పండుగకు సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. భోగి పండుగ నాడు పూర్వం ప్రజలు వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించేవారు. ఇలా పూజలందు కోవడం వల్ల ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది. అతడి గర్వం అణచాలని శ్రీకృష్ణుడు తలచి, ఇంద్రపూజలకు సిద్ధమవుతున్న యాదవులతో 'మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం. కాబట్టి ఈనాటి నుండి ఇంద్రుణ్ణి పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం' అని అన్నాడు.

అప్పుడు ఇంద్రుడు కోపోద్రిక్తుడై, అతి వృష్టి కురిపించాడు. యాదవులందరూ శ్రీకృష్ణునితో తమ బాధలు చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని, యాదవులకూ, గోవులకూ దాని క్రింద ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంద్రుడు తన వద్ద ఉన్న ఏడు రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ యాదవుల్ని ఏమీ చేయలేకపోయాడు. దానితో ఇంద్రుడి గర్వం అణిగింది. శ్రీకృష్ణుడి మహత్తు తెలుసుకొన్న ఇంద్రుడు పాదాక్రాంతుడయ్యాడు.

శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగిపండుగ నాడు ఎప్పటిలాగే మళ్ళీ ఇంద్రపూజ జరిగేందుకు ఆనతిచ్చాడు. మకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకుంటారు. వ్యవసాయదారునికి పశువులే సంపద. పంటలు వాటి శ్రమ ఫలితంగా వచ్చినవి కాబట్టి, ఆ రోజు పశువులను పూజించి వాటికి పొంగలి వండి పెడతారు.


భోగిమంటలు - వ్యామోహానికి నిప్పు🕉️🙏

🕉️🙏మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి.  అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి

🙏సర్వేజనాసుఖీనోభవంతు 🙏

గోదా కల్యాణం

 గోదా కల్యాణం :



విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారం. రామాయణంలో సీతలాగానే ఆమెకూడా అయోనిజ. జనకునికి సీత నాగేటిచాలులో దొరికినట్లు గోదాదేవి విష్ణుచిత్తునికి తులసీవనంలో దొరికింది. మనందరి కళ్లకూ రాతిబొమ్మగానే కనిపించే శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడి ఆయనలోనే లీనమైపోయింది. అప్పటినుంచి ఆమె ఆండాళ్ అయింది. ఆండాళ్ అంటే రక్షించడానికి వచ్చినది అని అర్ధం. ఆమె దొరికినప్పుడు విష్ణుచిత్తుడు పెట్టుకున్న పేరేమో కోదై అంటే పూలదండ. తాను ముడిచి విడిచిన పూలను స్వామికి ఇచ్చి, ఆముక్తమాల్యద అని పేరు తెచ్చుకుంది. చూడికుడుత్త నాచ్చియార్, నప్పిన్నైప్పెరాట్టి, ఆండాళ్ అని వివిధ పేర్లతో ప్రస్తుతులు పొందిన ఆమె శ్రీరంగనాథుని ఇల్లాలు కావడం వెనుక తిరుప్పావై వ్రత మహిమ దాగుంది. ధనుర్మాసం నెలనాళ్లూ గోదాదేవి రోజుకొక్క పాశురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథుని అర్చించింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి పాండ్యరాజు కలలో కనిపించి వివాహానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వివాహానికి తరలిరావలసిందిగా విష్ణుచిత్తులకు కబురందింది. రాజు పంపిన పల్లకీనెక్కి కల్యాణానికి తరలి వెళ్తూ విరహోత్కంఠిత అయిన గోదాదేవి మరో ప్రబంధం రచించింది. అది ద్రవిడ సాహిత్యంలో నాచ్చియార్ తిరుమొళిగా ప్రసిద్ధి కెక్కింది. ఒక రాతిబొమ్మను మానవకాంత పెళ్లాడే చిత్ర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. శ్రీరంగంలోని చిత్రవీధిలో నిండిపోయిన అశేష జనవాహిని మధ్య పల్లకి దిగింది పెళ్లికూతురు. దేవాలయపు ఉత్తరపు వీథిలో భోగి పండుగనాడు గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతు ముగిసిన మూలమూర్తికి అప్పగింతలు పెట్టడానికి పాండ్యరాజు వంటివారంతా తోడురాగా కన్యాదాత పెరియాళ్వార్ అమ్మను తోడ్కొని వెళ్లారు. గర్భాలయంలో శేషశయన మూర్తిగా దర్శనమిచ్చే శ్రీరంగనాథుని పాదాలను గోదాదేవి స్పృశించింది. స్వామి పాదాల వద్దసాక్షాత్తూ మహాలక్ష్మిలా ఆమె కూర్చునేంత వరకూ అందరికీ కనిపించి ఆయనలో లీనమయ్యింది.

Thursday, 12 January 2023

స్వామి వివేకానంద జయంతి -3 (14-Jan-23,Enlightenment Story)

స్వామి వివేకానంద జయంతి  ( జనవరి 12 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


స్వామి వివేకానందుడు ఒక కథ చెబుతుండేవారు - ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒక రోజు దారి సరిగా కనబడక పాడుబడ్డ నూతిలో పడిపోయింది. రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ‘‘ఇది ముసలిదైపోయింది. ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవడం మేలు. 

అది కూడా దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్లీ మరో గాడిద కొనుక్కోవాలి. ముసలి గాడిద ఎటూ పడిపోయింది కనుక, దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు’’ అనుకుని చుట్టుపక్కల రైతులను పిలిచాడు. తలా ఒక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు.

యజమాని వైఖరికి లోపలున్న గాడిద ఖిన్నురాలైపోయి - ఎంత దారుణం అనుకుంది. ఒక్క క్షణం ఆలోచించింది. ఇక నేను నా గురించి ఆలోచిస్తాను. తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను అనుకుంది. 

ఒకసారి సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది. పైనుంచి మట్టి పోస్తున్నారు. తనమీద పడిన దాన్ని దులుపుకుంటున్నది. పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే దాని మీదకు చేరుతున్నది. అలా లోపల మట్టి లెవల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ బావి పైఅంచు దగ్గరకు రాగానే ఒక్కసారి శక్తి కూడదీసుకుని బావి బయటకు దూకి పారిపోయింది. 

ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే, ఆ గాడిద కూడా ఒక అవశేషంగా మిగిలిపోయి ఉండేది. స్వామి వివేకానంద యువకులకు ఈ కథ చెబుతూ ‘‘భీరువులై (పిరికివారై) బతక్కండి, ధైర్యంగా నిలబడి కష్టాన్ని ఎదుర్కోండి’’ అని చెప్పేవారు.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


స్వామి వివేకానంద జయంతి -2 (జాతీయ యువజన దినోత్సవం ) -(13-Jan-23,Enlightenment Story)

జాతీయ యువజన దినోత్సవం ..స్వామి వివేకానంద జయంతి  ( జనవరి 12 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

*కెరటాలు నాకు ఆదర్శం. పడినందుకు కాదు..పడి లేచినందుకు’ స్వామి వివేకానంద*

స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 — జూలై 4, 1902),  ప్రసిద్ధి గాంచిన యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.

వేదాంత, యోగ, తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

స్వామి వివేకానంద గారి కొన్ని ఆణి ముత్యాలు

🤷‍♂️ 1.రోజుకు ఒక్కసారైన మీతో మీరు మాట్లాడుకొండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

👌 2. నీ వెనుక ఏముంది…ముందేముంది… అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.

👉 3. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.

👌 4. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

🤷‍♂️ 5. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.

👉 6. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.

🫧 7. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.

👉 8. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు!!!

💥 9. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత, తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.

👌 10. లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!!

 పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!!

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

💫 పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలచి దక్షిణాభిముఖుడై వటవృక్షం క్రింద కూర్చున్నాడు.

💫 అయితే,  దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు...? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే. మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయి ఉంటున్నారు? 

💫 అసలు ఉత్తర దక్షిణాలు – తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా? కాదు.  వీటికి అంతర్యంగా గొప్ప అర్దం ఉంది.

💫 ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉన్నాడు.  అయితే,  ఆ బుద్దిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు.  కనుకనే... వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. 

ఎవరి బుద్దిలో ఎటువంటి లక్ష్యం ఉంటుందో  వారి నడక ప్రయాణం కూడా ఆ లక్ష్యం వైపుగానే ఉంటుంది. వారి వారి నడతలను బట్టి మానవులను  నాలుగు విధాలుగా విభజించవచ్చు.

🌹 1. కొందరు మానవులు తమ తమ పుట్టు పూర్వోత్తరాలను, 

తమ వంశ చరిత్రను, పూర్వీకుల గొప్పతనాన్ని, జరిగిపోయిన విషయాలను తలచుకుంటూ మురిసిపోతూ ఉంటారు.  వీరే పూర్వభిముఖులు.  అంటే తూర్పు దిక్కుకు తిరిగినవారు అని అర్థం. (పూర్వ=తూర్పు)

🌹 2. మరి కొందరు మానవులు తమ భవిష్యత్తును గురించి ఊహించుకుంటూ,  రాబోయే వాటికోసం ఎదురు తెన్నులు చూస్తూ, ఎప్పుడూ జరగబోయే వాటి గురించే ఆలోచిస్తారు.  వీరు పశ్చిమాభిముఖులు. అంటే,  పడమర దిక్కున తిరిగినవారు అని అర్థం. (పశ్చిమ=పడమర)

🌹 3. చాలా మంది మానవులు ప్రపంచ ప్రమేయాలతో ఇరుక్కుపోయేవారు. 

జీవితం-ప్రపంచం-సుఖాలు-భోగాలు-సంపాదన-అనుభవించటం అంటూ ఇందులోనే కూరుకుపోయేవారు. వీరే దక్షిణాభిముఖులు.  అంటే,  దక్షిణ దిక్కున తిరిగిన వారు అని అర్దం

🌹 4. ఇక చాలా కొద్ది మంది మాత్రం - పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కారణంగా, 

పెద్దల యొక్క మహాత్ముల యొక్క సేవ చేసిన కారణంగా ఈ ప్రపంచ పరిమితులను దాటిపోయి సంసార జనన మరణ దుఃఖాల నుండి తరించి ముక్తులు కావాలని కోరుకునే వారు.  వీరే ఉత్తరాభిముఖులు. (ఉత్+తర =తరించి పైకి పోవాలనుకునేవారు).

💫 ఇలా నాలుగు రకాలైన మార్గాలలో ప్రయాణించే మానవుల యొక్క స్థితిని తెలియచేసేవియే నాలుగు దిక్కులు.

💫 ప్రపంచం నుండి తరించి బయట పడాలనుకునే ముముక్షువులే ఉత్తరాభిముఖులు. కనుక, సనకసనందాది మునులు జ్ఞానపిపాసులు కనుక  వారు ఉత్తరాభిముఖులు అని చెప్పటం జరిగింది.

💫 ఉత్తరాభిముఖులైన మహర్షులకు జ్ఞాన భోద చేయాలి కనుక పరమేశ్వరుడు దక్షిణాభిముఖుడు అయ్యాడు.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏

🚩 హిందువునని గర్వించు

🚩 హిందువుగా జీవించు

అష్టదిక్పాలకులు (17-Jan-23,Enlightenment Story)

 అష్టదిక్పాలకులు


ఇంద్రుడు - తూర్పు దిక్కు ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.

అగ్ని   - ఆగ్నేయ మూల ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం ఆయుధం శక్తిఆయుధము. తగరు, వీరి

యముడు  - దక్షిణ దిక్కు ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.

నైఋతి   - నైఋతి మూల ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.

వరుణుడు   - పడమర దిక్కు ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.

వాయువు  - వాయువ్య మూల ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.

కుబేరుడు  - ఉత్తర దిక్కు ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.

ఈశాన్యుడు  - ఈశాన్య మూల ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము

దేవుని లెక్క (22-May-24,Enlightenment Story)

 దేవుని లెక్క

🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ఇద్దరు  వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు  చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా  పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీఇద్దరితో పాటు నేను మీతో  కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు,  మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు. ముగ్గురు  కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలి వాన మొదలయ్యింది. వాళ్లు ఇక అక్కడ  నుంచి వెళ్లిపోలేకపోయారు.

ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన  ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం అతడి దగ్గర మూడు నాదగ్గర  ఐదు రొట్టెలున్నాయి ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు.కానీ ఎనిమిది రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది



అందుకు  మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం ఎనిమిది రొట్టెలను మూడు మూడు  ముక్కలుగా చేద్దాం అప్పుడు వచ్చిన ఇరవైనాలుగు ముక్కలను ముగ్గురం సమానంగా  తిందాం అని అంటాడు. అది అందరికి సబబుగా తోచి ఎనిమిది రొట్టెలను మూడు మూడు  ముక్కలుగా చేసి తలా ఎనిమిది ముక్కలు తిని ఆకలి తీర్చుకొని నిద్రపోతారు.

 తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్లిపోబోతూ  మీరు రాత్రి నాకు తోడుగా ఉండటమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా  తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న ఎనిమిది బంగారు నాణాలు మీకు  ఇస్తాను. మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి ఎనిమిది బంగారు నాణాలు ఇచ్చి  వెళ్లిపోతాడు. అతడు వెళ్లిపోయాక మొదటి వ్యక్తి నా నాలుగు బంగారు నాణాలు  నాకిస్తే నేను వెళ్లిపోతాను అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి నీవి  మూడు రొట్టెలే నావి ఐదు రొట్టెలు కాబట్టి లెక్క ప్రకారం నాకు ఐదు బంగారు  నాణాలు, నీకు మూడు బంగారు నాణాలు చెందుతాయి అని అంటాడు.

ఇలా వీళ్లిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది.

ఈ చిక్కు  తీర్చుకోడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ  విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా  వేస్తాడు.

రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు  చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా  తోస్తున్నది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగా విన్నావా  అని అడిగి మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణెం మాత్రమే  ఇవ్వాలి అని అంటాడు.

న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు.ఎలాంగంటే మొదటి  వాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి  దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు 15 ముక్కలు చేశాడు.

అయితే  మొదటి వాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండో  వాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి ఏడు నాణాలు  రెండో వాడికి చెందాలి ఇదే నాలెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు.  తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటి వాడు ఇతడే నయం  3 నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు. అది విని  న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు. 

దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మనదగ్గర  ఉన్నదాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నమన్నదే దేవుడు పరిగణలోకి  తీసుకుంటాడు.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...