Thursday, 9 November 2023

విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చిందెవరో తెలుసా? (15-Nov-23, Enlightenment Story)

 విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చిందెవరో తెలుసా?

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

శ్రీ మహావిష్ణువు చేతిలోని చక్రం చాలా శక్తివంతమైందని పురాణాల్లో పేర్కొన్నారు. శివుడి చేతిలో శూలం, విష్ణువు చేతిలో చక్రం రెండూ శక్తివంతమైనవి. 

శ్రీహరి కుడిచేతి చూపుడు వేలికి ఉండే చక్రానికి అద్భుతమైన శక్తులున్నాయి. దీని గురించి విష్ణు పురాణంలో చాలా ఆసక్తికరమైన కథనాలను తెలిపారు. శ్రీమహావిష్ణువుకు ఈ ఆయుధం మధ్యలోనే వచ్చిందట. వెయ్యి సంవత్సరాలు కఠోర తపస్సు చేసి దీన్ని వరంగా పొందారని వివరించారు.

సుదర్శన చక్రంలో బ్లేడును పోలిన పదునైన ఆకారాలు 108 ఉంటాయి. రెప్పపాటులో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణిస్తుంది. ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు. చక్రాన్ని కేవలం శత్రువుల మీద మాత్రమే ప్రయోగించాలి. శత్రువు ఎంత శక్తివంతమైన వాడైనా దీని ముందు నిలబడలేడు. ఒకసారి చేతి నుంచి బయటపడితే శత్రువును వేటాడిగానీ తిరిగి రాదు. లక్ష్యం పూర్తయిన తర్వాతే వెనక్కు మళ్లుతుంది. 

సుదర్శన చక్రం దాడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. పరిగెత్తడం ఆపేసి శ్రీహరిని శరణు వేడితే ఆగిపోతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు. ఎనిమిదో అవతారమైన ద్వాపర యుగంలోని కృష్ణావతారంలో అగ్ని దేవుడి నుంచి ఈ చక్రాన్ని పొందాడని కొందరంటారు.

కేవలం పరశురాముడికి మాత్రమే సుదర్శన చక్ర ప్రావీణ్యత గురించి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. పురాణాల ప్రకారం శివుడి గురించి మహావిష్ణువు వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు.

అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని శ్రీహరి కోరడంతో పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని అందించాడు. 

అప్పటి నుంచి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడిచేతి చూపుడి వేలికి చక్రం ఉంటుంది. శివుడు విష్ణు మూర్తి కి సుదర్శన చక్రాన్ని బహుకరిస్తున్నదృశ్యం.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

ధ్యానానికి మించిన తీర్ధయాత్ర లేదు !! (14-Nov-23, Enlightenment Story)

 *ధ్యానానికి మించిన తీర్ధయాత్ర లేదు !!*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపు వాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలు పెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. 

పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.' అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.

అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

'అదేంటి బావా? ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.

దానికి కృష్ణుడు నవ్వి.' బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.

ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.

మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు. అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు. తపస్సు అంటేనే ధ్యానం . ధ్యానం ద్వారానే జ్ఞానసిద్ధిని పొందారు.

ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు. అలా కాకుండా స్వయంగా ఆలోచించడం అభ్యాసం చెయ్యటం అలవాటు చేసుకుంటే 95% సమస్యలు లెఖ్ఖలోకి రావు. ఆ ఆత్మ విశ్వాసంతో సమస్యలయిన ఆ 5% కూడా అధికమించేయ వచ్చు.  అంటే స్వయం శక్తితో సంకల్ప బలంతో దేన్నయినా అధిగమించేయ వచ్చన్నమాట.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

5 రోజుల దీపావళి గురించి తెలుసుకుందామా? (13-Nov-23, Enlightenment Story)

 🕉️ 5 రోజుల దీపావళి గురించి తెలుసుకుందామా?🕉️

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

భారతీయ సంస్కృతిలో పండుగలన్నీ పరమార్థంతోనే ఏర్పడ్డాయి. అందుకనే పైకి కనిపించే వేడుకలు, వినోదాలతోనే సరిపుచ్చకుండా పండుగలలోని అంతరార్థాన్ని తెలుసుకుని మరీ వాటిని జరుపుకోవాలి. శరదృతువు అయిన ఆశ్వయుజ, కార్తిక మాసాలలో వచ్చే పెద్ద పండుగలు దసరా, దీపావళితో పాటు మరికొన్ని పండుగలు మన బాధ్యతలను గుర్తు చేస్తాయి.

*ధనత్రయోదశి*

ధర్మశాస్త్ర గ్రంథాలలో దీన్ని యమదీప త్రయోదశి అని చెప్పారు. కొన్ని పురాణాలు, బౌద్ధమతాచారాల సమ్మేళనంతో ధనత్రయోదశిగా మారింది. దానికి రెండు కథనాలున్నాయి. ఒక యువరాణి తన భర్తకు ఈ తిథినాడు రాసిపెట్టి ఉన్న మరణాన్ని తప్పించటానికి ఇల్లంతా దీపాలు వెలిగించింది. నగలు కుప్పలుగా పోసింది. ఆ వెలుగులో దారి కనపడక యముడు వెనక్కు వెళ్లిపోయాడు. అందరూ ఈ రోజు ఇలా చేస్తే ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్థిల్లుతారు. కనుక ఇది ధనత్రయోదశి అయింది. ధన్వంతరి పాలసముద్రం నుంచి ఈ రోజు అమృతాన్ని పైకి తెచ్చాడు కాబట్టి ఆయన పేరిట ఇది ధనత్రయోదశి అయింది. ఈ రోజు దీపం పెట్టటం, లక్ష్మీపూజ, శక్తిని బట్టి బంగారం, వెండి, నూతన వస్తువులు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు.

*నరక చతుర్దశి*

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి. పండుగల తిథులన్నిటిలో ఒక దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికే ఉంది! స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని శిక్షించి తీరాలనే సందేశాన్ని ఇచ్చే పండుగ నరకచతుర్దశి.

భూదేవి తల్లి అయినా, పుట్టినవాడు ప్రజాకంటకుడు అయ్యాడు. నరకుడు అంటే నరులను ప్రేమించేవాడు అనే అర్థంతో తల్లిదండ్రులు పేరు పెడితే నరులను పీడించేవాడు అనే అర్థాన్ని తెచ్చుకున్నాడు. ‘అసుర’ బిరుదును కూడా కలుపుకుని నరకాసురుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మించింది. భూలోకంలో నరకాసురుడిగా అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడిని శిక్షించడానికి భర్తతో పాటు ఆమె కూడా యుద్ధానికి వెళ్లింది. శ్రీకృష్ణుని కంటే మరింత చొరవను, పరాక్రమాన్నీ చూపించింది. నిర్దాక్షిణ్యంగా నరకాసురుడిని సంహరించింది. ఆ దుర్మార్గుని మరణానికి ప్రజలతోపాటు తాము కూడా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్న ఆదర్శప్రాయులైన తల్లిదండ్రులు సత్యభామాశ్రీకృష్ణులు.

*దీపావళి*

ఆశ్వయుజ అమావాస్యనాడు దీపావళి పండుగ. దీపం నుంచి దీపాన్ని వెలిగించినట్లు తరాల మధ్య అంతరాలు ఉన్నా ఒకే వెలుగు కొనసాగుతుండాలని పరమార్థం. దీపావళినాడు మహాలక్ష్మిపూజ ప్రధానం. అసలైతే అమ్మవారి దగ్గర, ఇంటిముందు, దేవాలయాల్లో; ఏనుగులు, గుర్రాలు, గోవులు ఉండేచోట దీపాలు వెలిగించడమే అసలైన దీపావళి పండుగ.

దీపావళినాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగనంపాలి. ఆమెపేరు జ్యేష్ఠాదేవి. ఆమెను వెళ్లగొట్టేందుకు స్త్రీలు చీపురు, చేట పట్టుకుని చప్పుడు చెయ్యాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ విషయంలో స్వచ్ఛత, పరిశుభ్రత సంపదలకు మూలమనే శాశ్వత సత్యం దాగుంది. ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీ, పురుషుల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది.

*కార్తీకం-పాడ్యమి*

కార్తికమాసంలోవచ్చే శుద్ధ పాడ్యమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో మొదటిది గోక్రీడనం. ఈ పాడ్యమినాడు గోపూజ చేస్తే పశుసంపద వర్థిల్లుతుంది. పాడిపంటలకు లోటు ఉండదు. ఇందులో భాగం గా ఉదయాన్నే ఆవులకు నీరాజనం ఇవ్వాలి. సాయంకాలం ఆవుల మెడలో పూలదండలు వేసి పూజించాలి. అలాగే ఆవుపేడతో గోవర్ధన పర్వతాన్ని చేసి పాడ్యమి పొద్దున దాన్ని పూజించాలి. పాడ్యమి మధ్యాహ్నం రెల్లుగడ్డితో పేనిన తాడును తూర్పు దిక్కున గల స్తంభానికి కట్టి పూజించాలి.

*భగినీహస్త భోజనం*

కార్తిక శుద్ధ ద్వితీయను యమద్వితీయ (విదియ) అంటారు. ఆ రోజున యమున తన సోదరుడైన యముడికి భోజనం పెట్టింది. కాబట్టి కార్తిక శుద్ధ విదియనాడు అన్నదమ్ములు తప్పకుండా అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనం తిని రావాలి. దీనినే భగినీహస్త భోజనం అంటారు.

ధర్మరాజు వంటి మహానుభావునికి కూడా భీష్మాదులు, మహర్షులు ఈ ధర్మాచరణను బోధించారు. ఉత్తములు ఆచరిస్తే సామాన్యులు కూడా వారి దారిలో నడుస్తారు. అందుకే కార్తిక శుద్ధ ద్వితీయ (విదియ) నాడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి తప్పకుండా భోజనం చేసి, వస్త్రాభరణాలతో సత్కరించి రావాలని ధర్మరాజుకు వివరించారు.

*సరసిజ నిలయే సరోజ హస్తే*

*ధవళ తరాంకుశ గంధమాల్యశోభే*

*భగవతి హరివల్లభే మనోజ్ఞే*

*త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్*

అనే శ్లోకంతో శ్రీమహాలక్ష్మిని పూజించి దీపాలు వెలిగిస్తే సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతారని, ‘దీపైః నీరాజనాదత్ర సైషా దీపావళిః’... అంటే దీపాలు వెలిగించడం, మహాలక్ష్మి అమ్మవారికి హారతులు ఇవ్వడమే దీపావళి అనీ ధర్మశాస్త్రం చెబుతోంది

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

🌻ధర్మాచరణ🌻 (12-Nov-23, Enlightenment Story)

 🌻ధర్మాచరణ🌻బుద్ధ జాతక కథలు

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🥀బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఇంద్రప్రస్థ నగరంలో ధనంజయుడనే కురురాజుగా జన్మించాడు.

🥀ఆయన పరిపాలనలో అతివృష్టి, అనావృష్టి, మొదలైన పీడలేవీ లేకుండా ప్రజలు సుఖ పడుతూ వచ్చారు. ధర్మాన్ని పాటించటం లోనూ, దాన ధర్మాలు చేయటంలోనూ, ధనంజయుడికి సాటి ఎవరూ లేరన్న ఖ్యాతి జంబూద్వీపమంతటా పాకింది.

🥀ఆ కాలంలోనే కళింగదేశానికి రాజధాని అయిన దంతపురమనే నగరాన్ని కాళింగుడనే పేరుగల రాజు పరిపాలిస్తూండేవాడు.


🥀ఆ రాజ్యంలో ఒక ఏడు వానలు కురవక కరువేర్పడింది. ప్రజలు తిండికి లేక అల్లాడారు. ఈ దుస్థితి చూసి కాళింగుడు తన మంత్రు లతో ఆలోచన జరిపాడు. ‘‘ఈ యేడు మన దేశంలో ఇంత క్షామం ఏర్పడటానికేమి కారణం? ఈ పీడ తొలగించడానికి మనం చేయవలసిన పని ఏమిటి?'' అన్నాడు రాజు.

🥀‘మహారాజా! ధర్మానికి హాని జరిగినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి. ఇంద్ర ప్రస్థం ఏలే ధనంజయుడు తన ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా పాటిస్తాడు.

🥀అందుచేతనే ఆ దేశం కరువు కాటకాలు ఎరగకుండా సుభిక్షంగా వుంటుంది,'' అన్నారు మంత్రులు. ‘‘అలా అయితే, మీరు ఇంద్రప్రస్థం వెళ్ళి, ఆ ధనంజయ రాజు దర్శనం చేసుకుని, బంగారు రేకులమీద ధర్మాలన్నీ రాయించుకు రండి.

🥀వాటిని మనం కూడా అమలు చేసి అరిష్టాలు లేకుండా చేసుకుందాం!'' అన్నాడు కాళింగుడు. ఆ ప్రకారమే కళింగ మంత్రులు కొన్ని బంగారు రేకులు తీసుకుని ఇంద్రప్రస్థానికి ప్రయూణమై వెళ్ళి, ధనంజయుడి దర్శనం చేసుకుని, ఆయనతో ఈ విధంగా అన్నారు.

🥀‘‘మహారాజా, మేము కళింగ దేశం నుంచి వస్తున్నాము. మా దేశప్రజలు భయంకరమైన క్షామంతో బాధపడ్తున్నారు. మీరు ధర్మస్వరూ పులుగా ఉండి, ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలిస్తుండటం చేత, మీ ప్రజలు ఈతి బాధలెరగక, సుఖంగా ఉంటున్నారు.

🥀మారాజు పాటించవలసిన ధర్మాలేవో మీరు ఈ బంగారు పత్రాలపై లిఖించి ఇచ్చినట్టయితే, మా రాజు గారు వాటిని అమలు జరిపి, ప్రజలను పీడించే కరువును పోగొట్టగలుగుతారు!'' ధనంజయుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు.

🥀‘‘మహామంత్రులారా, క్షమిం చండి! నేను ఈ పత్రాలపై ధర్మాన్ని లిఖించ డానికి తగినవాణ్ణి కాను. ఎందుచేతనంటే ఒకప్పుడు నా వల్లనే అధర్మం జరిగింది.

మా దేశంలో మూడేళ్ళకొకసారి కార్తికోత్సవం జరుగుతుంది.

🥀అప్పుడు రాజు ఒక చెరువు గట్టున యజ్ఞం చేసి, నాలుగు దిక్కులా నాలుగు బాణాలు వదలాలి. ఒకసారి నేను వదిలిన బాణాలలో మూడు దొరికాయి, కాని నాలుగవది చెరువులో పడిపోయింది.

🥀అది చెరువులో పడినప్పుడు దాని విసురుకు చేపలూ, కప్పపిల్లలూ చచ్చిపోయి ఉంటాయి. ఆ విధంగా నేను ధర్మం తప్పాను. మరి మా రాజ్యంలో అరిష్టాలు లేవంటే దానికి కారకులు పరిపాలక వర్గంలో ఇంకెవరైనా అయివుండవచ్చు.

🥀విచారించి చూడండి.'' ఈ మాటలు విని మంత్రులు ఆశ్చర్య పడ్డారు. వారు రాజమాత అయిన మాయూ దేవి వద్దకు వెళ్ళి, ‘‘తమరైనా మాకు ధర్మాలు రాసి పెట్టండి!'' అని కోరారు. ‘‘అయ్యో, నాయనా! నేనూ ధర్మం తప్పిన దాన్నే. ఒకసారి నా పెద్ద కుమారుడు నాకు సువర్ణహార మొకటి కానుక ఇచ్చాడు.

🥀నా పెద్ద కోడలు ఐశ్వర్యవంతురాలనే ఉద్దేశంతో నేనా హారాన్ని చిన్న కోడలికిచ్చాను. కాని తరవాత నాలో కలిగిన భేదబుద్ధి నా కర్థమై బాధ కలిగింది.

🥀అందుచేత ఒకరికి ధర్మాలు రాసి ఇచ్చే అర్హత నాకు లేదు,'' అన్నది రాజమాత. కళింగ మంత్రులు రాజభ్రాత అయిన నందుడి వద్దకు వెళ్ళారు. అతను తాను కూడా ఒకసారి ధర్మం తప్పినట్లు చెప్పాడు. ‘‘నేను ప్రతి సాయంకాలమూ రాజాంతః పురానికి రథంలో వెళతాను. ఒక్కో రాత్రి అక్కడే వుండిపోతాను కూడా.

🥀నేను కొరడా రథంలో వుంచి వెళితే, రాత్రికి ఉండనన్న మాట. అప్పుడు సారథి నా కోసం వేచి ఉంటాడు. కొరడా తీసుకుని వెళ్ళానంటే సారథి రథం తోలుకుపోయి, మర్నాడు ఉదయం తిరిగి తెస్తాడు. ఒక రోజు కొరడా రథంలోనే వదిలి రాజాంతఃపురం ప్రవేశిం చాను, తిరిగి వద్దామనే నా ఉద్దేశం.

🥀అయితే ఇంతలో వాన ప్రారంభమయింది. రాజుగారైన మా అన్నగారు నన్ను వెళ్ళ నివ్వలేదు. ఆ రాత్రి అక్కడే వుండి పోయూను. వానకు తడుస్తూ, నా సారథి కూడా రథంలోనే ఉండి పోయూడు.

🥀అతన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి నేను ధర్మాన్ని తప్పాను,'' అన్నాడతను. కనీసం రాజపురోహితుడైనా తమ కోరిక నెరవేర్చుతాడని కళింగ మంత్రులు ఆయన వద్దకు వెళ్ళారు. కాని ఆయన కూడా ధర్మం తప్పినట్టు చెపుతూ, ఇలా అన్నాడు.

🥀‘‘ఒక రోజు నేను రాజభవనానికి పోతుంటే దారిలో ఒక రథం కనిపించింది.

దానికి బంగారు తొడుగువున్నది. అది చూడగానే నాకు లోభం కలిగి, రాజుగారు దాన్ని నాకు దానం చేస్తే బాగుండుననిపించింది.

🥀నేను తీరా వెళ్ళే సరికి రాజుగారు, ‘ఈ రథం మీరు తీసుకోండి,' అన్నాడు. వెంటనే నా లోభం జ్ఞప్తికి వచ్చి, పశ్చాత్తాపం కలిగి రథాన్ని వద్దన్నాను. నేను మీకు ధర్మాలు రాసి పెట్టగల వాణ్ణి కాను!'' కళింగ మంత్రులకేమీ పాలుపోలేదు. వారు చివరి ఆశ మంత్రిమీద పెట్టుకుని ఆయన వద్దకు వెళ్ళారు. కాని ఆయన కూడా వారికి ఆశాభంగం కలిగించాడు.

🥀‘‘ఒకనాడు నేను ఒక రైతు తాలూకు పొలం కొలతలు వేయబోయూను. కొలత ప్రకారం కర్ర పాతవలసిన చోట చిన్న బిలం ఉన్నది. అందులో ఏ ప్రాణి అయినా వుండ వచ్చునని అనుమానం వేసింది. కాని కర్ర కొంచెం ఇవతల పాతితే రైతుకు నష్టం, అవత లికి పాతితే రాజుకు నష్టం. అందుచేత ఆ బిలంలోనే కర్ర పాతమని ఆజ్ఞాపించాను.

🥀అదే సమయూనికి ఎండ్రకాయ ఒకటి బిలంలో నుంచి బయటికి వస్తూ కరప్రోటుకు చచ్చి పోయింది.అందుచేత నేను కూడా ధర్మం తప్పినవాణ్ణే. కనక, నా ఎక్కువ ఏమీ లేదు.'' కళింగ మంత్రులకు ఒక ఆలోచన తట్టింది. వారు తాము విన్న కథలన్నీ బంగారు రేకులపై రాసి, వాటిని తీసుకుపోయి తమ రాజుకు వినిపించారు.

🥀ధర్మం పట్ల శ్రద్ధగా ఉండటమే ఉత్తమ ధర్మమని కాళింగుడు తెలుసుకుని, ఆత్మవిమర్శనతో పరిపాలన సాగించాడు. వెంటనే వానలు కురిసి క్షామం తొలగి పోయింది. కళింగ ప్రజలు సుఖంగా జీవించారు.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Tuesday, 7 November 2023

అన్నం పెట్టడం (11-Nov-23, Enlightenment Story)

 *అన్నం పెట్టడం*

🍁🍁🍁🍁🍁🍁🍁

ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే మీ అదృష్టం. అంటే పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అని అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం.దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. 

ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్న్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.

నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది. నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని అన్నం కాని పెట్ట వలయును.










పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి, నీ ఇంటికి వస్తే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇచ్చినా కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం ఇచ్చినా యెంతో పుణ్యదాయకం.

ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు. మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు, మన పాప కర్మ తొలిగిపోతుంది

మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు. భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు.

నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తొలగిస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు అది ఆ సమయములోనే..అంతే ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది

నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి

కావున, *అమ్మా అన్నం పెట్టు అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి*. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది నల్లని ఆవుకు, నల్లని కుక్కకు అన్నం పెట్టడం వలన అపమృత్యు దోషం తొలిగిపోతుంది. 

అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

Friday, 3 November 2023

కార్తీకమాసం ప్రారంభం (10-Nov-23, Enlightenment Story)

 కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి,జ్వాలాతోరణం సహా కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే. ఏటా దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతోంది. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మమూహూర్తంలోనే కదా..అందుకే నవంబరు 12 దీపావళి మర్నాడు నవంబరు 13 సోమవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది. అందుకే నవంబరు 14 మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది. అంటే నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోంది. 

• 2023 నవంబరు 14 మంగళవారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి

• నవంబరు 15 బుధవారం యమవిదియ - భగినీహస్త భోజనం

• నవంబరు 17 శుక్రవారం నాగుల చవితి

• నవంబరు 20 కార్తీకమాసం మొదటి సోమవారం, కార్తావీర్యజయంతి

• నవంబరు 22 యాజ్ఞవల్క జయంతి

• నవంబరు 23 మతత్రయ ఏకాదశి

• నవంబరు 24 శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి

• నవంబరు 26 ఆదివారం జ్వాలా తోరణం

• నవంబరు 27 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ (Karthika Pournami 2023)

• డిసెంబరు 04 కార్తీకమాసం మూడో సోమవారం

• డిసెంబరు 11 కార్తీకమాసం నాలుగో సోమవారం

• డిసెంబరు 13 బుధవారం పోలి స్వర్గం

కార్తీకమాసం నెలరోజులూ అత్యంత నియమనిష్టలతో ఉంటారు. కార్తీమాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాధలకు స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవవుల  అనుగ్రహం లభిస్తుంది. దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నది గుర్తుంచుకోవాలంటారు పండితులు.

కార్తీకమాసంలో  ఈ పనులు చేయొద్దు - Karthika Masam 2023

• లైంగిక వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసానికి దూరంగా ఉండాలి

• కనీసం ఈ నెల రోజులు ఓ నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలు మానేయాలి

• విశ్వాసం ఉంటే దేవుడిని పూజించండి లేదంటే మానేయండి... దైవదూషణ మాత్రం చేయకండి

• దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించకండి

• మినుములు తినకూడదు, నలుగుపెట్టుకుని స్నానం చేయకూడదు

• కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినకూడదు

స్కంద పురాణంలో ఇలా ఉంది

“న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! 

నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్” 

 “కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.

కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం,  జ్వాలాతోరణం  మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే  బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు  ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఈ ఏడాది నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 13 బుధవారం పోలిస్వర్గంతో కార్తీకమాసం పూర్తవుతుంది. 

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు (09-Nov-23, Enlightenment Story)

 🕉️ *బావాజి* 🕉️ 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలోని మాడవీథులలోకి ప్రవేశించే భక్తులకు, ప్రధానగోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దానిమీద శ్రీ వేంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మఠమే హాథీరాం మఠం. ఆ భక్తుడే బావాజి! బావాజి బంజారా తెగకు చెందినవారు. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు.

అయితే శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా, ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్నా బావాజీకి తనివి తీరేది కాదట.

ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం, అర్చకులకు కంటగింపుగా మారింది. అతనెవరో తెలియదు, అతని భాషేమిటో అర్థం కాదు. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటం అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకమీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు.

శ్రీనివాసుని దర్శనభాగ్యం కరువైన బావాజి చిన్నపిల్లవాడిలా విలపించాడు. సాక్షాత్తూ ఆ దేవుడే తనని గెంటివేసినంతగా బాధపడ్డాడు. అలా రాత్రింబగలు కన్నీరుమున్నీరుగా తడుస్తున్న బావాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు.

నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం! నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తుంటాన` ని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత, ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు బాలాజీ.

పొద్దుపొడిచేవరకూ వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలూ ఆడుకునేవారు. అలా ఒకసారి....బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు. సాక్షాత్తూ ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు.

సుప్రభాతవేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వేంకటేశ్వరుడు దిగ్గున లేచి ఆలయం లోపలికి వెళ్లిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజి మఠంలోనే ఉండిపోయింది.

ఆ ఉదయం మూలవిరాట్టుని అలంకరిస్తున్న అర్చకులు, ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకి ప్రవేశించాడు. బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు. ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు.

సాక్షాత్తూ ఆ దేవుడే తనతో పాచికలాడేవాడంటే నమ్మేది ఎవరు! నవాబూ నమ్మలేదు.

బావాజీని కారాగారంలో పడేశారు. `నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రీ నీకోసం వచ్చే మాట నిజమే అయితే... నీకు ఒక పరీక్షను పెడుతున్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి.` అని హుంకరించాడు నవాబు. 

ఆ అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి. అవేమిటా అని లోపలికి తొంగిచూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు, బండెడు చెరుకుగడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలివాళ్లు అక్కడే ఉన్నారు. 

అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతవరకూ బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనకు `హాథీరాం బావాజీ` అన్న పేరు స్థిరపడిపోయింది.

హాథీరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు.

హాథీరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తున్నింటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని, అప్పటినుండి తిరుమల ఆలయం అతని వారసుల అధీనంలో ఉన్నదనీ కూడా ఒక కథనం ఉంది. 

ఈస్టిండియా కంపెనీవారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలుగ జేసుకోకూడదని నిర్ణయించుకొన్న తరువాత (ఈ కథనం ఆధారంగా కావచ్చును) 1843లో ఆర్కాటు జిల్లా కలెక్టరు సనదు (ఉత్తర్వు) తో తిరుమల నిర్వహణను హాథీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు

 శ్రీ విశ్వ తేజా గోవిందా, శ్రీ గిరి నిలయ గోవిందా, నిర్గుణ రూప గోవిందా, తిరుమల వాస గోవిందా; | 

 గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||36||

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...