Monday, 1 May 2023

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి (10-May-23, Enlightenment Story)

 💐💐💐గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి ?💐💐💐

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. 

1) గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

2) గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, 

3) ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. 

4) ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. 

5) ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.

6) అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. 

7)ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. 

8) ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. 

9) అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.

10) ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. 

11) ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

12) దేవలోక గోవు పటాన్ని గమనించినట్లైతే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. 

13) అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. 

14) గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు




🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️


Friday, 21 April 2023

శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్ (03-May-23, Enlightenment Story)

*సమాజంలో గొప్ప వ్యక్తులు* 

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

1977 సంవత్సరం గణిత మేధావుల మధ్యలో ఒక ఆవిడ కుర్చోని వుంది. వారు 201 అంకెలున్న సంఖ్యకు 23 వ వర్గాన్ని చెప్పమనగా  ఆమె మనసులోనే గుణించి 50 సెకన్సులోనే  సమాధానం చెప్పింది. అది నిజమో కాదో  ధృవీకరించుకోవడానికి యూనివాక్ 1108 కంప్యూటర్ లోకి ఫీడ్ చేయగా అది నిమిషం పైన లెక్క కట్టి  ఆమె చెప్పిన సమాధానం సరైనదని తేల్చింది. వారు ఆశ్చర్యపోయారు.

 1980 జూన్ 18 ఇంపిరియల్ కాలేజ్ ,లండన్ కంప్యూటర్ విభాగం వారు మళ్ళీ ఆమెకి ఒక పరీక్ష పెట్టేరు.ఈ సారి కంప్యూటర్ అప్పటికప్పుడు ఇచ్చిన రెండు పదమూడు అంకెలగల సంఖ్యలను గుణించి ఫలితం చెప్పమనగా కేవలం  28 సెకన్స్ లో ఫలితం చెప్పి వారిని ఆశ్చర్యపరిచింది. వారు ఆమెను హ్యూమన్ కంప్యూటర్ గా అభివర్ణించారు.1995 లో గిన్నీస్ బుక్ లోకి ఎక్కిందామే పేరు.

ఆమె ఎవరో తెలిసే వుంటుంది. యస్ ,ఆమే శకుంతలాదేవి గణితంలో భారతదేశ కీర్తిని సగర్యంగా నిలబెట్టిన మేధావి. ఆమె ఏం చదివిందో తెలుసా??? ఒకటవ తరగతిలో రెండురూపాయల ఫీజు కట్టలేక బడిమానేసిన పేదరికం ఆమెది.వాళ్ళ నాన ఒక సర్కస్ కంపెనీలో చిన్న పనివాడు.కాని ఇంటి దగ్గరే సాధనచేసి 6 ఏళ్ళ వయస్సులో ,యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ లోనూ, 8 ఏండ్ల వయస్సులో మద్రాస్ యూనివర్సిటీలో గణితం పై ప్రదర్శనలిచ్చినది. నిద్రపోతున్న ఆమెను లేపి గతశతాబ్థంలో ఏ తేదిన ఏ వారం వచ్చిందో చెప్పమంటే ఠక్కున తముడు కోకుండా చెప్పేది.

గణితం,జ్యోతిష్యాలను అంశాలుగా తీసుకొని ఫన్ విత్ నంబర్స్ ,ఆస్ట్రాలజీ ఫర్ యు,మరియు ఫజిల్ టు ఫజిల్ ,మాథాబ్లిట్ ,ఎ వేకన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్ , ఇన్ ది వండర్ లాండ్ ఆఫ్ నంబర్స్ మొదలగు గణితపుస్తకాలు రాసింది. పేదరికంతో బడి మానేసిన అమ్మాయి ఇంత ఉన్నత స్థితికి చేరిందంటే ఎంత పట్టుదల సాధన అవసరమో కదా??? అన్నట్లు హ్యూమన్ కంప్యూటర్ గా పేరుగాంచిన శకుంతలాదేవి గారి వర్థంతి నేడు..ఆమె జ్ఞాపకార్ధమే ఈ చిన్న వ్యాసం...

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Thursday, 20 April 2023

మజ్జిగ - మహా పానీయం (24-Feb-24, Enlightenment Story)

*మజ్జిగ - మహా పానీయం *  

🥛🥛🥛🥛🥛🥛🥛 ✍🏼💧🥛

“మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గా, కైలాస౦లో ఉ౦డే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు. “

“పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. “

“స్వర్గ౦లో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇ౦ద్రుడు బలహీనుడు అయ్యాడు."

 “మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” 


యోగ రత్నాకర౦ అనే వైద్యగ్ర౦థ౦లో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తు౦ది. 

మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!

వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు  దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు. 

అ౦దుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవు తు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. 

చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.

వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”    

ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని  ‘కూర్చిక’ అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు.  ”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.

వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”:

పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. భావ ప్రకాశ వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు

# ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి #

చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన  తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు

🌳🌳🥛🥛💎🥛🥛🌳🌳 🌳🌳🥛🥛💎🥛🥛🌳🌳 🌳🌳🥛🥛💎🥛🥛🌳🌳 🌳🌳🥛🥛💎🥛


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️


జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము (01-May-23, Enlightenment Story)

 *జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము*  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ పై తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై  అతని ముందున్న రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి వుంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది..

అందులో ఇలా వుంది

గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది

ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను.ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఇక ఋణం తీరిపోయింది 

ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది

ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది

దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!

చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది. కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడేపెట్టి వెళ్ళిపోయింది.

ఆయనకి మెలుకువ వచ్చింది.  తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద తను రాసింది కాకుండా ఇంకేదో రాసి వుండటం గమనించి చదవడం ప్రారంభించాడు

అందులో ఇలావుంది

గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి నుంచి శాశ్వతంగా ఉపశమనం లభించింది

ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని నా కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా  గడుపుతాను

ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే  ప్రశాంతంగా సహజమరణం చెందారు

ఈ ఏడాది నా కొడుక్కి పునర్జన్మనిచ్చింది. కారు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైనా నా కొడుకు ప్రాణాలతో బైటపడ్డాడు, కార్ కి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో మరో కొత్త కారు కొనుక్కున్నాను

హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"

అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు.

ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.

చాలావరకూ సమస్యలు మన ఆలోచనా దృక్పథం నుంచి ఉద్భవించేవే.. మన ఆలోచనా దృక్పథం #పాజిటివ్ గా ఉంటే ఎంతటి సమస్య ఐనా దూదిపింజెలా తేలికైపోతుంది,ఫలితం అనుకూలంగా ఉంటుంది. కానీ #నెగటివ్ ఆలోచనలు చిన్న సమస్యను కూడా బూతద్దంలో చూపించి మనశ్శాంతిని దూరం చేస్తాయి.ఆనందమయమైన 

🌸జీవితం కోసం పాజిటివ్ గా ఆలోచించడ అలవర్చు కొందాము🌸

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

Wednesday, 19 April 2023

ప్రాణాయామం (30-Apr-23, Enlightenment Story)

 *ప్రాణాయామం *  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️ 

23-Apr-23, Sunday- దయచేసి సూర్యభగవానుడు వీడియో చూడండి 

https://youtube.com/shorts/9cNI2tDnX7A

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️  

మన ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడానికి ఏవైనా వ్యాయామాలు కానీ, ఆహార జాగ్రత్తలు కానీ ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా చేయాలో అవగాహనా కోసం సలహాలు

1.- ఊపిరితిత్తుల ను శుభ్రం చేసుకునేందుకు రోజు ప్రాణాయామం చేయాలి.కొంత వ్యాయామం చేయాలి.సాత్వికాహారం తీసుకోవాలి.అంటే ఉప్పు,కారం, మసాలాలు చాలా తగ్గించి తీసుకోవాలి.వీలైనంతవరకు పళ్ళు తీసుకోవాలి.పచ్చి కారట్, కీరదోసకాయ వంటి వాటిని తురిమి పెరుగు లో వేసుకుంటే ఆరోగ్య మునకు చాలా మంచి ది.

2.-నిల్వ ఉంచిన పచ్చళ్లు,బిస్కెట్లు, వేపుళ్లు,పాలిష్ చేసిన పదార్థాలు, పంచదార వంటి వాటిని పూర్తిగా మానేయండి.పంచదారకు బదులు బెల్లం లేదా తేనెను తీసుకోండి.

3.-సిరి ధాన్యాలు కొత్త గా ప్రచారం లోకి వచ్చాయి.ఇవి ఆరోగ్య మునకు చాలా మంచి వి.వరి, గోధుమ లకు బదులు వీటిని వాడుకోండి.చాలా బాగుంటాయి.బిపి,సుగర్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి తీవ్రత తగ్గుతుంది.

4.-వ్యాయామం -చేయుట వలన గుండె కొట్టుకొనుట వేగవంతమై ఊపిరి తిత్తుల పనితీరు బాగుండి కండరములు ఆక్సిజెన్ సరఫరా మెరుగ్గా ఉండి కార్బన్ డయాక్సైడ్ ను వెలుపలకు పంపిస్తుంది.అన్ని రకముల కాలుష్యములకు దూరం పాటించాలి.

5.-ఇంటిలోపల ఫర్నిచర్ ను వాక్యూం చేస్తుండాలి (వారం -వారం )

6.-కిటికీలు తెరచి గాలి వెంటిలేషన్ ఉండే తట్టు గా చూడాలి

7.-కృత్రిమ ఎయిర్ ఫ్రెషనర్లు , కాండిల్స్ కూడదు

8.-ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రముగా ఉంచుకోవాలి దుమ్ము ధూళి వలన పీల్చే గాలితో ఊపిరితిత్తులను చేరి ఇర్రిటేషన్ కలుగ చేయును

9.-ఇంటిలో ధారాళమైన గాలికి -వెంటిలేషన్ -ఎక్సజాస్ట్ అమరిక ఉంచాలి

10.-అంటు వ్యాధులు బారిన పడకుండా జాగర్తలు పాటించాలి

11.-పండ్లు కూరగాయలు విరివిగా తీసుకోవాలి. ఎక్కువ మంచి నీరు తాగాలి

12.-వాక్సినేషన్లు తీసుకుంటూ ఉండాలి

13.-ఉచ్చాస -నిశ్వాసా ములను క్రమబద్దీకరణ పాటించాలి.(బ్రీతింగ్ ).

ఈ రోజుల్లో ఎవరికీ ఫలానా చేయండి అని సూచించకూడదు నా సలహాఇవన్నీ పాటిస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యవంతమై మనము కూడా ఆరోగ్యవంతులం కాగలం.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

ఇంటికి - పెద్దదిక్కు వుండాలి (29-Apr-23, Enlightenment Story)

 ఇంటికి  - పెద్దదిక్కు  వుండాలి (పురాణాల కధనం)

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

29-Apr-23, Saturday - దయచేసి శ్రీవారు వీడియో చూడండి 

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

ఇంటికి  - పెద్దదిక్కు  వుండాలి అంటారు. ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి. మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది.

కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు. ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి  -  తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేకపోయారు, విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు, భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం రాజ్యమే కూలిపోయింది..

పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి. నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి, ధర్మాన్ని చెప్పేవాడు ఓక్కడైనా వుండాలి, 

అదే ధృతరాష్ట్రుని గొప్పతనం.ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది.

అదే శకుడ్ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు. దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.

అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు, ధర్మ ప్రవర్తనతో బ్రతికారు, 

దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, గురువుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, శ్రేయోభిలాషుల మాట వినలేదు, భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు?

మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడి కోనైనా తెచ్చుకోవాలి."అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది,చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.. ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.

ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా?  అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి..

అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు. "ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని అంటాడు. ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు..

అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు.

కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

రాముడు - ప్రారబ్ద కర్మ (28-Apr-23, Enlightenment Story)

 *రాముడు - ప్రారబ్ద కర్మ*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

💝 మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే. ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో, పురాణాల లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం.

💖 రాముడు దండకారణ్యం లో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి, కారణం , ఒక మహాపతివ్రత శాపం !

💓 దేవాసుర సంగ్రామం సమయంలో, మృతసంజీవనీ మంత్రబలంతో చావులేకుండా, దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి, వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిల్చుందాఋషి పత్ని !

💓 శ్రీమహావిష్ణువు విధి లేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శనచక్రంతో హతమార్చాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త, మహా తపోధనుడు, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ శపించాడు. తన భార్యను హతమార్చి, తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్యావియోగం తో బాధపడాలి అని ! అందుకే రాముని వనవాసానికి కైక, లేదా మందర , లేదా దశరథుడు కారణంకాదనీ, వారు నిమిత్త మాత్రులనీ స్పష్టమౌతున్నది.



❤️ అంటే శ్రీరాముడిక్కూడా కర్మానుభవం తప్పలేదు. అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి, రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో తీరా కైకమ్మ వరాల విషయంగా, వనవాసం చేయడానికి వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు... "ఈ ముసలి తండ్రిని చంపి రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తాను” అన్నాడు.

💖 అప్పుడు రాముడు తమ్మునితో “నాయనా! నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు ఇప్పుడు మౌనంగా ఉండటం ఆయన తప్పు కాదు. అతి బలీయం విధివిధానం! అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో. పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు. ఈ ప్రారబ్దకర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు. కనుక కోపాన్ని తగ్గించుకొని తండ్రిఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణా!”అన్నాడు.

💓 భగవద్గీతలో చెప్పిన "స్థితప్రజ్ఞత" అంటే ఇదే ! కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడమే భావ్యం !"అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి.

❤️ భగవద్గీతలోని 18 వ అధ్యాయం 61 వ శ్లోకంలో, “ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ, జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను !!"అని గీతాచార్యుడు చెప్పినట్టుగా, సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే.

💓 వారే కాదు… భూమిపై జన్మించిన ఏ ప్రాణీ కూడా కర్మలకు అతీతుడు కాడు.! దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు. మనం కర్మలు చేయవలసిందే. ఆ కర్మల ఫలితం, సుఖమైనా, దుఃఖమైనా, ఇష్టమున్నా లేకున్నా, రాముడైనా, కృష్ణుడైనా అనుభవించ వలసిందే.

💞 వాలిని చెట్టుచాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రాముడు తన మరుజన్మ అయిన కృష్ణావతారంలో తన నిర్యాణంకోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో కర్మ ఫలితాన్ని తాను అనుభవించక తప్పలేదు.

💝 మరో దృష్టాంతం. ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయంతో బాటు తమ కళ్ళ ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు కూడా, జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు. భారత మహాసంగ్రామంలో మిడతల వలె మాడిపోయారు.

💖 అలా అన్యాయం చేస్తున్నవారితో బాటు, సమర్థత ఉండి, అన్యాయం జరగకుండా అడ్డుకునేశక్తి ఉండి కూడా చూస్తూ మిన్నకుండి పోయినవాళ్లు కూడా అంతే పాపాత్ములు. కనుకనే శిక్షకు పాత్రులు అవుతున్నారు. ఎంతటి ప్రజ్ఞాశాలియైనా తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు

💝 రామాయణ భారత భాగవతాలన్నీ “సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి” అని బోధిస్తున్నాయని మనం గ్రహించాలి.

💖 దేవుడు మనిషికి రెండు వరాలు అనుగ్రహించాడు. ఒకటి జ్ఞానం, రెండు మాట్లాడే ప్రతిభ. వీటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన, సత్ చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. ఉత్కృష్టమైన ఈ మానవజన్మను సార్థకం చేసుకోవాలి. ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా.

💓 పరపీడనం పాపాన్నీ, తాపాన్నీ కలిగిస్తుంది. నవ్వులాటకైనా ఏ ప్రాణినీ హింసించకూడదు. ఎందుకంటే అన్ని శరీరాల్లో ఉన్నది కూడా పరమాత్ముడే. అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ అన్నీ గమనిస్తూ… మనలోనే ఉంటూ మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మరచిపోవద్దు.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...