Sunday, 22 January 2023

జీవితంలో డబ్బే ముఖ్యము కాదు (23-Jan-23,Enlightenment Story)

 🍀*జీవితంలో డబ్బే ముఖ్యము కాదు అనడానికి చిన్న ఉదాహరణ* 🍀

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు..ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది..మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!!అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు..మరోటి వస్తుంది..మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!!

అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ..! ఇది మాయానాణెం..దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ..అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!!అని చెప్తుంది..అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు..తనను తాను మర్చిపోతాడు.. కుటుంబాన్ని మర్చిపోతాడు.. పిల్లల్ని మర్చిపోతాడు.. ప్రపంచాన్ని మర్చిపోతాడు. అలా రుద్దుతునే వుంటాడు..

గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు..!!ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది..రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు..అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు..పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు..కొత్త భవనాలు వెలసి వుంటాయి..కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి..

స్నేహితులు..చుట్టాలు..పుస్తకాలు..ప్రేమ,పెళ్ళి...జీవితం ప్రసాదించిన అన్ని సంతోషాలనూ అనుభవిస్తుంటారు..ఆ మనిషికి ఏడుపు వస్తుంది. ఇంతకాలం ఇవన్నీ వదిలెసి నేను చేసింది ఏమిటా అని కుప్పకూలుతాడు..!!ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణెం పట్టుకొని వుంటున్నామా అనిపిస్తుంది...

*సంపాదనలో పడి ..కెరీర్ లో పడి..కీర్తి కాంక్షలో పడి..లక్ష్య చేధనలో పడి,బంగారు నాణెం వంటి జీవితాన్ని..మకిలి రాగినాణెం తో జీవితాన్ని మార్చుకుంటున్నామా అనిపిస్తుంది..!!అమ్మ చేతి ముద్ద..తండ్రి మన కోసం ఎదురు చూపులు..భార్య ప్రేమ..పిల్లల అల్లారు ముద్దు..స్నేహితుడి మందలింపు..ఆత్మీయుడి ఆలింగనం.*

ఇలాంటి బంగారు నాణేలు మన జేబులో తగినన్ని వుండాలి....ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి, అదే జీవితం.ఒక్కసారి ఆలోచించండి

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺

Saturday, 21 January 2023

తాత - మనుమడు - తండ్రి (22-Jan-23,Enlightenment Story)

తాత - మనుమడు - తండ్రి (మంచి కుటుంబ సందేసం)

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

👉ఆ రోజు ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు లో సుమారు తొంబై దాటిన  తాతగార్ని ఓ మనవడు నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. చెప్పండి తాతగారు ! ఏంటి తింటారు ? అని అడిగాడు మనవడు.

👉నాకు వడలు చాలా ఇష్టం, కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు.

ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్  చాల మెత్తని మృదువైన వడ సాంబారుతో, బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో! అది అయ్యేలోపు టమోటా సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు. ఐదు నిమిషాల్లో టమోటా సూప్వచ్చింది!

👉ఆ మనుమడు ఒక తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి... సూప్ నెమ్మదిగా స్పూన్ తో త్రాపిస్తున్నాడు. అయినా అది ఆ బోసి నోరు చుట్టూ అంటుకుంది.  కర్చిఫ్ తో మూతి శుభ్రం చేసాడు. ఈ లోగామృదువైన వడ వచ్చింది. తాతయ్యకు నెమ్మదిగా స్పూన్ తో తినడం వలన చాలా సమయం పట్టింది...! 

👉ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ... నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు, ఆ తాతయ్య కళ్లలో ఆనందం.. ఓ పక్క కంటనీరు.

👉రెష్టారెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడపించుకొని తీసుకు వెళ్లిపోయాడు. కొడుకు, కోడలు చాలా మంచి వాళ్లు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనవడు అలా కాదు. వచ్చిన ప్రతీ సారి తాతయ్యను కార్లో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా, చిన్న పిల్లలకు తినిపించినట్లు, ఐస్ క్రీమ్స్, రక రకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు!

ఒక్కరోజుకు ఏం కాదు డాడీ... నేను చూసుకుంటాను కదా అని... రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ల రసం, టాబ్లెట్ వేసేస్తాడు.

👉మామూలు సమయంలో చాలాఇబ్బంది పడే పెద్దాయన... చిత్రంగా మనవడు వచ్చినపుడు హుషారుగా ఉంటారు. ఒక్క కంప్లైంట్ కూడ ఉండదు. కొడుకు ముసి ముసిగా నవ్వుకుంటాడు.

ఓసారి ఉండలేక కొడుకుని అడిగాడు.., ఏరా! వచ్చినపుడల్లా తాతయ్యను కుషీ చేస్తావ్! తాతయ్య అంటే అంత ఇష్షమా?

👉దానికి కొడుకు చెప్పిన సమాధానం... డాడీ! నా చిన్నతనంలో అమ్మా, మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వలన బిజీగా ఉండేవారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య, నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్లు. తాతయ్యా !... నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ... నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్దు చేసేవారు.

 ఒక్కోసారి నా బట్టలు పాడు చెసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్లను ఆనంద పరచగలను. నానమ్మ ఇప్పుడు లేదుగా. అందుకే వచ్చిన  ప్రతిసారీ కనీసం తాతయ్య తో ఒక్కరోజైనా గడపి నా జ్ఞాపకాలు సజీవం గా ఉంచుకుంటాను అని చెప్పాడు.

👉సమాధానం విన్న తండ్రి కళ్లలో నీళ్లు... నీ జ్ఞాపకాల మాటేమో గాని... నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్లలో ఉత్సాహం... చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్ధం అవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ల ముందు కనిపిస్తూంది...! యు ఆర్ గ్రేట్ మై సన్.

*గమనిక :-   డబ్బు వెనుక పరుగులుపెట్టే ఈ కాలంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే... !*

*అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తూ...!*

*కుటుంబ వ్యవస్థ ఇలా ఉంటే సమాజం   కూడా బాగుంటుందని భావిస్తూ*...🙏

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Friday, 20 January 2023

దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది (21-Jan-23,Enlightenment Story)

🌺 *దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది* 🌺

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

అదృష్టవంతులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు.అదృష్ట వంతున్ని ఎవరు చెడ గొట్ట లేరు. మనవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూచే దురదృష్ట వంతున్ని బాగూ చేయ లేరు. ఉదాహరణగా ఈ కథ..

ఒక రాజు గారి కొలువు లో ఇద్దరు పురోహితులున్నారు . అందులో ఒకనిపేరు #దైవాధీనం. ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు . జగత్తు అంతా దేవుని అధీనమై ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనక ఆపేరు వచ్చింది ఆయనకు.

రెండో వానిపేరు #రాజాధీనం. రాజు గారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖం గా ఉన్నారని నమ్మే వాడు కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. .రాజు గారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందు కునే వాడు .

ఒక రోజు రాజు గారికి రాజాదీనం గారిని సువర్ణ ,వజ్ర వైదూర్యాలతో సత్క రించాలని కోరిక కలిగింది .అదీ ఎవరికీ తెలీకుండా రహస్యం గా చేయాలని భావించాడు .ఒక గుమ్మడి కాయ ను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైదూర్య రత్న మాణిక్య సువర్నాలను నిక్షేపం చేసి రాజాదీనం గారికి స దక్షిణం గా దానం చేశాడు .ఆయన దాన్ని ఇంటికి మోసుకు పోతూ ఆలోచించాడు. " దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది" అని. ఆలోచన వచ్చిన వెంటనే ఒక వర్తకుడు గారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసు కొని ఇంటికి వెళ్లాడు .

వర్తకుడు గారికి ఒక ఆలోచన వచ్చింది . "గుమ్మడి కాయ దొరికింది పితృదేవతల పేరు తో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తిపరాయణులైన వారికి దానం చేస్తాను." అను కొన్నాడు .అప్పుడే అనుకోకుండా #దైవాధీనం గారు అటు వెళ్తూ కని పించారు . వర్తకుడు గారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణ తో సహా కూష్మాండ దానం (గుమ్మడికాయ దానం) చేశారు . దైవాధీనం గారి భార్య .... భర్త తెచ్చిన గుమ్మడి కాయను పగుల గొట్టించింది భర్త చేత .ఆడ వాళ్ళు గుమ్మడి కాయ పగుల గొట్ట రాదనీ ఆచారం కదా అందుచేత .అందులో వజ్రవైదూర్య మరకత మాణిక్య సువర్నాలు కని పించాయి .ఇదంతా దైవ లీల గా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు

మర్నాడు రాజాదీనం రాజ దర్శనానికి వెళ్లాడు ."గుమ్మడి కాయ కూర తిన్నారా..." అని రాజు అడిగాడు . ఆహా ,ఓహో అద్భుతం అని బొంకారు రాజాధీనంగారు. .రాజు గారికి అర్ధమైంది .... గుమ్మడి కాయ ఆయన ఇంటికిచేర లేదని . ఒల్లుమండింది. భటులను పిలిపించి కొరడా తో ఝాలిపించి నిజం కక్కించాడు .

వర్తకుడు ని పిలిచి అడిగితె డబ్బు ఇచ్చి దాన్ని దాన్ని కొన్నాననీ... దైవాధీనం గారికి దానం చేశాననీ.. చెప్పాడు .తాను ఒకటి తలిస్తే దైవం ఇంకో లాగా చేశాడేమిటి అని వితర్కించు కొన్నాడు రాజు .

మరోసారి ఒక సంచి లో ధనాన్ని మూట కట్టించి #రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి ... భటుడి ని కని పించ కుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజదీనం నడచి వస్తు ,దాన్ని గమనించ కుండా వెళ్లి పోయాడు .భటుడు రాజుగారికి విషయం తెలిపాడు .ఆయన మళ్ళీ ఆశ్చరయం లో మునిగాడు . రాజాదీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడ లేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసు కొని వెళ్ళ లేనా అని అక్కడికి రాగానే అని పించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా.అని బదులు చెప్పాడు.

రాజుకి అర్థమైంది... *తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని*

"దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది "అని ఇందులో ఉన్న సారాంశం.

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


Thursday, 19 January 2023

సర్వరోగ నివారిని ప్రాణాయామం (20-Jan-23,Enlightenment Story)

 🌷సర్వరోగ నివారిని ప్రాణాయామం🌷

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి  తెలుసుకుందాం.

1.ప్రాణాయామ విశేషాలు

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది. 

ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే *ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌* అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు. 

వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు

ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది. రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా బయటికి వెళ్లి పోతుంది. గుండెకు సత్తువ లభిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి. జఠరాగ్ని పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.

3. తీసుకోవలసిన జాగ్రత్తలు

మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి. గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు. మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు. ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి. పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు. నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి. ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.

ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది. ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

🌷 శ్రీ మాత్రే నమః 🌷

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Sunday, 15 January 2023

అరుణాచలం ఈ పేరే ఒక మాయ (17-Jan-23,Enlightenment Story)

అరుణాచలం ఈ పేరే ఒక మాయ 

అరుణాచలం ఈ పేరే ఒక మాయ ఒక అద్భుతం అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుందనేది తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది. మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది, ఆ గిరి 260 కోట్ల సంవత్సరములుగా ఉంది అని పురావాస్తు శాఖ వారు నిర్ధారించారు.. ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు సాక్షాత్తు స్వామి అమ్మవారు అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు అక్కడ, మనం అక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి  వెళ్లిపోతాము సమయం తెలియకుండా ఎంత సేపయినా అలా ధ్యానంలో ఉండిపోవచ్చు, భవబంధాలు గుర్తుకు రావు, బాహ్యసృహా ఉండదు. అలా ధ్యానంలో ఉన్న సమయంలో ఎందరో సిద్ధులు, అక్కడ సంచరిస్తున్న ఆశరీరుల దర్శనం, వారి వాక్కు కూడా మన మనో చక్షువులచే వినవచ్చు .

 ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనస్సును ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది అక్కడి వాతావరణం, అన్నీ మర్చిపోయి అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము.. ఆ మాయ ఎప్పటికి వదలదు , మాయ అని ఎందుకు అంటున్నాను అంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము, అరుణాచలంలో అడుగు పెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలు అవుతుంది అదే మెదలు అదే చివర అనే ధ్యాసకు లోనవుతుంది మనసు, అంతే ఆ మాయలో జీవితకాలం మొత్తం కూడా గడిచిపోవచ్చు.. 

ఎందరో నాస్తికులు కూడా కుతూహలంతో ఆ గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఏదో మాయ ఒక మహా శక్తిలాగా మనసులాగేస్తుందని అని కారణం తెలియని ఆనందాన్ని పొందుతామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి , దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ పడి దొర్లేస్తారు ఆ స్వామి కరుణామయుడు నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అడుగడుగునా శివ దర్శనం నిదర్శనం కనపడుతూనే ఉంటుంది.. 

‘అరుణాచలం’ అనే పదానికి ఎవరి అవగాహనను బట్టి వారు అనేక అర్ధాలను చెప్పుకున్నారు.అరుణాచలం అంటే ఆగమ ప్రధానులు అరుణాచలేశ్వర దేవాలయములో ప్రతిష్ఠింపబడిన శివలింగం. పౌరాణికులకు అరుణాచల పర్వతం భక్తులకు శివ స్వరూపం.యోగులకు పరంజ్యోతి దానికి అతీతం కూడా. జ్ఞానోపాసకులకు హృదయస్తుడైన పురుషుడు. నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి. భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీన మైన కొండ ఇలా ఎన్నో… ఎన్నెన్నో అర్థాలను చెబుతున్నారు.

 కానీ…

భగవాన్‌ శ్రీ రమణ మహర్షి వాక్కుల కు వేరే ప్రమాణముల ఆవశ్యకత లేదు. వారు అనేక పర్యాయములు అరుణాచలం గురించి ప్రస్తావించడం జరిగింది. అరుణాచలం సాక్షాత్తు కైలాసమే అన్నారు. ఈ క్షేత్రములో ప్రతి శిలా శివలింగమే. ఈ క్షేత్రములో తీసుకొన్న ఆహారము, నీరు అమృతమే. ఈ క్షేత్రములో ఏమి మాట్లాడుకున్నా శివ స్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజయే. గిరి ప్రద క్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరిచుట్టూ ఉన్న 24 మైళ్ళలోపు ఎక్కడ మరణించినా వారికి ముక్తి కలుగుతుంది. కమలాలయమును తిరువారూర్‌ నందు జన్మించినచో ముక్తి కలుగుతుంది. అలాగే కాశీ క్షేత్రములో మరణిస్తే ముక్తి కలుగుతుంది. కానీ అరుణాచలములో పుట్టడం, మరణిం చడం జరిగితే ముక్తి కలగడంతోపాటు అరుణాచలమును స్మరిస్తే చాలు ముక్తి కలుగుతుంది. దీనిని బట్టి అరుణాచలం ఎంత గొప్ప విశిష్టత కలిగిన క్షేత్రమో తెలుస్తున్నది. మిగిలిన అన్ని గిరులను ఒక దేవతకు నివాస స్థానాలుగా వర్ణించారు.

 అరుణాచలాన్ని మాత్రం గిరి రూపంలో నున్న దేవుడే అంటారు. మనం దేహంతో తాదాత్మ్యం చెందినట్లే పరమ శివుడు ఈ కొండతో తాదాత్యము చెందాడు. అందువల్ల ఈ కొండ పరమశివుడే. తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్లకు కనపడాలని శివుడు కొండ రూపం దాల్చాడు.

ఎంతో మంది అక్కడి నుండి రాలేక అరుణగిరికి దూరంగా ఉండలేక అక్కడే స్థిరపడిపోయారు.. ఒక మైనింగ్ వ్యాపారం చేసే ఆవిడ యిరువది సంవత్సరములుగా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నుండే తన వ్యాపార పనులు చేసుకుంటూ ప్రతి రోజూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇంకొకరు పన్నెండు  సంవత్సరములుగా అక్కడే నివాసం ఉంటున్నారుడు, అక్కడి వాస్తవ్యులు కొందరు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణ దీక్షగా చేస్తున్నారు.. ఎందరో అక్కడ స్థిరపడ్డారు నిత్యం ఆ కొండను దర్శించి పునీతులవుతున్నారు, వారి లక్ష్యం ఒక్కటే బతికి ఉన్నంత కాలం అలా ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడే ప్రాణం వదిలేయడం శివైక్యం పొందటం.. 

 గిరి ప్రదక్షిణ శ్రద్ధగా చేయాలి భక్తితో ఆనందిస్తూ చేయాలి అడుగడుగునా మహమాయని అనుభూతి చెందుతూ చేయాలి, వ్యర్ధప్రేలాపన చేయకూడదు సమయం వినియోగించుకోవాలి. ఇది అక్కడ ఉండే వారి కోరిక.🙏

🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Saturday, 14 January 2023

భోగి అంటే ఏమిటి ? | ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? (15-Jan-23,Enlightenment Story)

 *భోగి పండుగ - మకర సంక్రమణం & ఉత్తరాయణ పుణ్యకాలం - రా2.02 నుండి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

1) "భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది, భోగం అంటే సుఖం                                             

2) *శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది*                                                                                                                                                      

3) *బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది*                       

4) *కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు*                                          

5) *శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు*                                                                                                                                                    

6) భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా,ఔషదంగా ఇది పని చేస్తుంది.గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రీములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది.                                                                                                                                       

7) భోగి పళ్ళు తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. 

ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. 

మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసుకుందాం!!..

"భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది, భోగం అంటే సుఖం

పూర్వం ఈ దినమే *శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది* మన పురాణ గాద.. 

శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. *బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది*

*కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు* ఇదే...

శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. 

కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా, ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రీములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది, చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. 

ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది, భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు.అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. 

అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. 

అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. 

ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాణి వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. 

మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

*భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుస్సుకుందాం.*

భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం, సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. 

వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం. మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంద్రం మన తల పై భాగంలో ఉంటుంది.  ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి.

అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి అసిర్వాదిస్తారు.మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.

స్వస్తి...🙏  🌿శుభమస్తు🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయాలని

  సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయాలని చెప్పడం వెనుక పురాణ గాథ ఇదే..


🔆 మకర సంక్రాంతి రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఏడు జన్మల పాపాలు పోతాయని చెబుతారు.

గంగాస్నానానికి వెళ్లలేకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలని చెబుతారు.


🔆 హిందూ గ్రంథాలలో పేర్కొన్న వివరాల ప్రకారం, కపిల మహర్షి నాటి కాలంలో గంగాసాగర్ దగ్గర ఆశ్రమం నిర్మించి తపస్సు చేసుకునేవాడు.

నాటి రోజుల్లో సాగర రాజు కీర్తి మూడు లోకాలలోనూ వ్యాపించింది.

రాజులందరూ సాగరుడు చేసే దానధర్మాలను, సత్కార్యాల మహిమను గానం చేసేవారు.

దీనిని చూసిన స్వర్గలోకపు రాజు ఇంద్రుడు చాలా ఆందోళన చెందాడు.


🔆 ఈ సమయంలో సాగర రాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు.ఇంద్రుడు అశ్వమేధ యాగ గుర్రాన్ని దొంగిలించి, కపిలముని ఆశ్రమం దగ్గర కట్టేశాడు.

అశ్వమేధ యాగానికి తెచ్చిన గుర్రాన్ని వెతకడానికి సాగర రాజు తన 60 వేల మంది కుమారులను పంపాడు.

ఆ కుమారులందరూ గుర్రాన్ని వెతుక్కుంటూ కపిల ముని ఆశ్రమానికి చేరుకున్నారు.

అక్కడ అశ్వమేధ యాగం కోసం తెచ్చిన గుర్రాన్ని చూశాడు.దీంతో వారు కపిలముని ఈ గుర్రాన్ని దొంగిలించారని ఆరోపించారు.

కోపోద్రిక్తుడైన కపిల ముని సాగర రాజు 60 వేల మంది కుమారులందరినీ కాలి బూడిద కమ్మంటూ శపించాడు.

వెంటనే సాగరరాజు కపిల ముని ఆశ్రమానికి చేరుకుని, తన కుమారులను క్షమించాలని అభ్యర్థించాడు.


🔆 అప్పుడు కపిల ముని అతనితో నీ కుమారులందరి మోక్షానికి ఒకే ఒక మార్గం ఉంది.

మీరు మోక్షదాయిని అయిన గంగను భూమిపైకి తీసుకురండి అని చెప్పాడు.

సాగర రాజు మనవడు రాజు అన్షుమాన్, గంగామాతని భూమిపైకి తీసుకువచ్చే వరకు తమ రాజవంశానికి చెందిన ఏ రాజు శాంతియుతంగా కూర్చోకూడదని కపిల ముని సూచనపై ప్రతిజ్ఞ చేసుకున్నాడు.

అతను తపస్సు చేయడం ప్రారంభించారు.

రాజు అన్షుమాన్ మరణం తరువాత, భగీరథుడు గంగామాతను తన తపస్సుతో సంతోషపెట్టాడు.


🔆 భగీరథుడు తన తపస్సుతో శివుడిని కూడా ప్రసన్నం చేసుకున్నాడు, తద్వారా శివుడు గంగామాత తన జఠాఝూటం ద్వారా భూమిపైకి దిగేలా చేశాడు.

గంగామాతను కేశాల్లో పెట్టుకుని శివుడు గంగాధరుడయ్యాడు.

గంగామాత భూమిపైకి దిగింది.


🔆 ముందు భగీరథ రాజు వెళుతుండగా వెనుక భూమిపై గంగామాత ప్రవహించడం ప్రారంభించింది.

భగీరథుడు గంగను కపిల ముని ఆశ్రమానికి తీసుకువచ్చాడు, అక్కడ గంగామాత సాగర రాజు 60 వేల మంది కుమారులకు మోక్షాన్ని ఇచ్చింది.సాగర రాజుకు గల 60 వేల మంది పుత్రులకు గంగామాత మోక్షాన్ని ఇచ్చిన రోజే మకర సంక్రాంతి అని చెబుతారు అక్కడి నుండి గంగ ముందుకు సాగి సముద్రాన్ని చేరింది.


🔆 అలా కలిసే ప్రదేశాన్ని గంగా సాగర్ అని అంటారు.మకర సంక్రాంతి రోజున గంగాసాగర్ లేదా గంగా నదిలో స్నానం చేయడం మోక్షానికి దారి తీస్తుంది.పాపాలను కడిగివేస్తుందని చెబుతారు.

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...