Thursday, 12 January 2023

హరిదాసు అంటె పరమాత్మతో సమానం (16-Jan-23,Enlightenment Story)

హరిదాసు అంటె పరమాత్మతో సమానం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

గుమ్మం ముందుకు వచ్చి నాలుగు బియ్యం గింజలు కూడ వేయలేని పరిస్ధితిలో ఉన్నారు మన జనం. సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు. హరిదాసు అంటె పరమాత్మతో సమానం 

శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు  హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి 

హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు. నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు 

సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు. ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. 

ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.  

శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. 

హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. 

శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. 

అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.

హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి., మన సంస్కృతి ని కాపాడండి🙏🙏🙏🙏🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


Wednesday, 11 January 2023

స్వామి వివేకానంద జయంతి -1 (12-Jan-23,Enlightenment Story)

 *స్వామి వివేకానంద జయంతి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀

వివేకానంద జయంతి సందర్భంగా.. స్త్రీ తత్వం.. మాతృత్వం..ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో.. దాన్ని పొందే పద్దతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి.  మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు.. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు  -స్వామి వివేకానంద

వేద పురుషుల హృదయాన్ని, మహర్షుల నైతికతను వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకొని ఆచరణాత్మక విధానాలు రూపొందించినవాడు, తానుగా ఆచరించి చూపినవాడు, మన సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటించిన వాడు, భారతీయ స్త్రీల విశిష్టతను చాటి చెప్పిన వాడు, విశ్వమానవాళి నవశకం వైపు పరుసలు తీయాలని కోరుకున్న వాడు వివేకానందుడు.

స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళ నంలో భారతదేశానికి హిందూ మతానికి ప్రాతి నిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబర్‌ 11‌న చికా గోలో ప్రపంచ వ్యాప్తంగా పలు మతాల ప్రతి నిధులు పాల్గొన్న సమ్మేళనంలో ప్రసంగిస్తూ ప్రియ మైన అమెరికా సోదర సోదరీమణులారా అని సంబోధిస్తూ ప్రారంభించడంతోనే శ్రోతలను ఆక ట్టుకున్నారు. సాధారణంగా లేడిస్‌ అం‌డ్‌ ‌జెంటి ల్‌మెన్‌ అన్న సంబోధనకు అలవాటుపడ్డ వారిని ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది.

ఆయన సందేశానికి, వాక్పటిమకు, నిజాయి తీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. అమెరికన్‌ ‌పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం సందేశాన్ని ప్రశంసిం చాయి. 

ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.

మన సంస్కృతిలో మహిళకు ఇచ్చిన స్థానం, గౌరవం గురించి మాట్లాడుతూ నేటి భారతీయ మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యలేక పోవటం. ఎలాంటి సమస్యనైన విద్య మాత్రమే పరిష్కరిస్తుంది. సమాజం మహిళ విద్యకోసం గట్టి ప్రయత్నాలు చేయకపోవటం విచారకరమని, వేద కాలం లోనే మహిళలు విద్యను అభ్యసిం చారని గార్గె, హైత్రేయి వంటి మహిళామణులు.. పీఠాలను అలంకరించారని అంటూ చికాగో సభ లో వివేకానందుడు చెప్పాడు. తన దేశం అలాంటి స్థితికి రావాలని, చరిత్ర పునరావృతమవుతుందనే ఆకాంక్షని వ్యక్తం చేశారు. భారతీయ మహిళలు ఆదర్శ మహిళలని వారిని గురించి ప్రపంచం ఎంతో తెలుసుకోవలసి ఉందని అనేవారు.

భారతదేశంలో స్త్రీత్వం అంటే మాతృత్వమే. నిస్వార్ధత, త్యాగశీలత సహనము ఈ గుణాలతో విలసిల్లే స్త్రీ మూర్తియే మాతృమూర్తి అనేవారు. 

స్త్రీ పురుషుల సమానత్వానికి కృషి చేసిన ఆధునిక నాయకుడు. సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులు బం డికి ఉన్న రెండు చక్రాల వంటి వారని సమాజం అనే పక్షి ఎగరాలంటే రెండు రెక్కలుండాలని, ఒక రెక్కతో ఎగరలేదని వివేకానంద చెప్పేవారు. భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానంద సందేశాలు సూటిగా యువత హృద యాన్ని తాకుతాయి.

 యువ శక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని ఆయన యువతకు ఇచ్చిన సందేశాల్లో ఇదో మచ్చు తునక. లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరే వరకు ఎక్కడ నిలవకండి.. ఎప్పుడూ జాగృతంగానే ఉండండి. బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకునేవాడు.

ఆధునిక యువతపైనే తనకు విశ్వాసం ఉందని, తను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారేనని, అలాంటి యువత ముందు బలిష్టంగాను, జీవ సంపన్నులుగాను, ఆత్మ విశ్వా సులు గాను రుజువర్తనులుగాను మారాలని, అలా ంటి యువత వందమంది ఉన్నా చాలని ఈ ప్రపంచాన్నే మార్చవచ్చని యువశక్తిని స్వామి వివే కానంద కొడియారు. జీవితం మిథ్య అన్న ఆలోచనను పక్కన పడేసి పని చేయడం మొదలు పెట్టాలంటాడు. 

నూరేళ్ల పుణ్యకాలాన్ని గాలికి, ధూళికి, దేవుడికి, దయ్యానికి వదిలిస్తే మనంగా బతికేదెప్పుడు, పనిచేసేదెప్పుడు, పుట్టినందుకు సార్ధకత సాధించేదెప్పుడు అంటాడు వివేకానంద.  దేవుడు పరీక్షిస్తున్నాడు, కాలం కలిసి రావడం లేదు, అంతా నా తలరాత అంటూ కష్టాన్ని తెచ్చుకుంటూ కూచోడాన్ని ఆయన తీవ్రoగా వ్యతిరేకిస్తాడు. 

నీ జీవితానికి నువ్వే కర్తవు, నీ జీవితానికి సంబంధించిన బాధ్యత అంతా నీదే, నీ విధికి నువ్వే కర్తవు. తలరాత అంటూ వేరే లేదు. నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. ధాతవు, విధాతవు అన్న నువ్వే అంటాడు.

మనిషి మనిషిగా చక్కగా చల్లగా బతకా లంటే సహనం, శాంతం కావాలి.  ఒక్క క్షణం సహనంగా ఉండగలిగితే అనేక ప్రమాదాలు తప్పు తాయి. క్షణకాలం అసహనంతో అనర్థాలు జరిగి పోతాయి అంటాడు. మనిషి రాణించడానికి విజ్ఞా నం, వివేకం ఎలా అవసరమో, శాంతం సహనం కూడా అంతే అవసరం అంటాడు. 

లోకంలో చాలా మంది తోచిందనో, తోచ లేదనో ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సార్లు వాళ్ల పనులు చెడగొట్టేస్తూ మాట్లాడుతారు. అయిన దానికి, కాని దానికి సలహాలు, సూచనలు అడుగు తుంటారు. అలా చేసి అందరిని ఇబ్బంది పెట్టడం కన్నా మనలో ఉన్న మనిషితో మాట్లాడండి. అద్భు తమైన సలహాలిస్తాడు. అలా చేయకపోతే జీవితం లో ఒక గొప్ప వ్యక్తితో మా ట్లాడే మధుర అవకా శాన్ని శాశ్వతంగా కోల్పో తారు అంటాడు వివేకా నంద.

కనుక పక్కవారిని సలహాలు, సూచనలు అడగటానికి ముందు మిమ్మ ల్ని మీరు సంప్రదిం చండి. దాన్నే ఆత్మావలోకనం అంటారు. ఆత్మ విచారణ చేశాకే మరెవరితోనైనా మాట్లాడండి. అద్భుతాలు చేయడానికి ఇదొక మహత్తరమైన చిట్కా. వివేకానందుడు చెప్పిన సూచనను గౌర విద్దాం. ఆచరిద్దాం జీవితకాలం బాగుపడదాం.

*దేనికీ భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికి రాకుండా పోతారు*. ఈ ప్రపంచంలో దు:ఖానికి మూలకారణం భయమే. నిర్భయమే మనకు సర్వాన్ని ప్రసాదించగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం. 

– వివేకానంద

🍂శుభమస్తు🍂

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

దేవుడు మనలో ఉంచిన శరీర భాగాల సంఖ్య (19-Jan-23,Enlightenment Story)


*మన ఆరోగ్యం…దేవుడు మనలో ఉంచిన శరీర భాగాల సంఖ్య (THE HUMAN BODY)*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 1: ఎముకల సంఖ్య (Number of bones) : 206  

 2: కండరాల సంఖ్య (Number of muscles): 639

 3: కిడ్నీల సంఖ్య(Number of kidneys): 2

 4: పాల దంతాల సంఖ్య(Number of milk teeth): 20

 5: పక్కటెముకల సంఖ్య(Number of ribs) : 24 (12 జత,Pair)

 6: గుండె గది సంఖ్య(Heart chamber number): 4

 7: అతి పెద్ద ధమని (Largest artery): బృహద్ధమని (Aorta)

 8: సాధారణ రక్తపోటు(Normal blood pressure): 120/80 Mmhg

 9: రక్తం (Blood) Ph: 7.4

 10: వెన్నెముక కాలమ్‌లోని వెన్నుపూసల సంఖ్య(Number of vertebrae in spinal column): 33

 11: మెడలోని వెన్నుపూసల సంఖ్య (Number of vertebrae in the neck): 7

 12: మధ్య చెవిలో ఎముకల సంఖ్య (Number of bones in middle ear:): 6

 13: ముఖంలోని ఎముకల సంఖ్య (Number of bones in face): 14

 14: పుర్రెలోని ఎముకల సంఖ్య (Number of bones in skull) : 22

 15: ఛాతీలోని ఎముకల సంఖ్య (Number of bones in chest) : 25

 16: చేతుల్లోని ఎముకల సంఖ్య (Number of bones in arms) : 6

 17: మానవ చేతిలోని కండరాల సంఖ్య (Number of muscles in the human arm) : 72

 18: గుండెలోని పంపుల సంఖ్య (Number of pumps in the heart): 2

 19: అతి పెద్ద అవయవం (Largest organ) : చర్మం

 20: అతి పెద్ద గ్రంథి (Largest gland) : కాలేయం

 21: అతి పెద్ద కణం (Largest cell) : స్త్రీ అండం

 22: అతి చిన్న కణం (Smallest cell) : స్పెర్మ్ (Sperm)

 23: అతి చిన్న ఎముక (Smallest bone) : స్టేప్స్ మధ్య చెవి (Stapes middle ear)

 24: మొదటి మార్పిడి చేసిన అవయవం (First transplanted organ) : కిడ్నీ (Kidney)

 25: చిన్న ప్రేగు యొక్క సగటు పొడవు (Average length of small intestine) : 7మీ (7m)

 26: పెద్ద ప్రేగు యొక్క సగటు పొడవు (Average length of large intestine) : 1.5 మీ ( 1.5 m)

 27: నవజాత శిశువు యొక్క సగటు బరువు (Average weight of newborn baby) : 3 కిలోలు (3 kg)

 28: ఒక నిమిషంలో పల్స్ రేటు (Pulse rate in one minute) : 72 సార్లు (72 times)

 29: సాధారణ శరీర ఉష్ణోగ్రత (Normal body temperature) : 37 C ° (98.4 f °)

 30: సగటు రక్త పరిమాణం (Average blood volume) : 4 నుండి 5 లీటర్లు (4 to 5 LITERS)

 31: జీవితకాలం ఎర్ర రక్త కణాలు ( LIFETIME Red blood cells) : 120 రోజులు (120 days)

 32: జీవితకాలం తెల్ల రక్త కణాలు (LIFETIME White blood cells) : 10 నుండి 15 రోజులు (10 to 15 days)

 33: గర్భధారణ కాలం (Pregnancy period) : 280 రోజులు (40 వారాలు) -280 days (40 weeks)

 34: మానవ పాదంలోని ఎముకల సంఖ్య (Number of bones in human foot) : 33

 35: ప్రతి మణికట్టులోని ఎముకల సంఖ్య (Number of bones in each wrist) : 8

 36: చేతిలో ఉన్న ఎముకల సంఖ్య (Number of bones in hand) : 27

 37: అతి పెద్ద ఎండోక్రైన్ గ్రంథి (Largest endocrine gland) : థైరాయిడ్ (Thyroid)

 38: అతి పెద్ద శోషరస అవయవం (Largest lymphatic organ) : ప్లీహము (Spleen)

 39: అతిపెద్ద మరియు బలమైన ఎముక (Largest and strongest bone) : తొడ ఎముక (Femur)

 40: అతి చిన్న కండరం (Smallest muscle) : స్టెపిడియస్ (మధ్య చెవి) Stapedius (middle ear)

 41: క్రోమోజోమ్ సంఖ్య (Chromosome number) : 46 (23 జత)

 42: నవజాత శిశువు ఎముకల సంఖ్య (Number of newborn baby bones) : 306

 43: రక్త స్నిగ్ధత (Blood viscosity) : 4.5 నుండి 5.5

 44: యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్ (Universal donor blood group) : ఓ (O)

 45: యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం (Universal recipient blood group) : AB

 46: అతి పెద్ద తెల్ల రక్త కణం (Largest white blood cell) : మోనోసైట్ (Monocyte)

 47: అతి చిన్న తెల్ల రక్త కణం (Smallest white blood cell) : లింఫోసైట్ (Lymphocyte)

 48: పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్యను అంటారు (The increased red blood cell count is called): పాలీసైథెమియా ( Polycythemia) 

 49: శరీరంలోని బ్లడ్ బ్యాంక్ (Blood bank in the body is) : ప్లీహము (Spleen)

 50: జీవ నది అంటారు (River of Life is called) : రక్తం (Blood)

 51: సాధారణ రక్త కొలెస్ట్రాల్ స్థాయి (Normal blood cholesterol level) : 100 mg / dl

 52: రక్తంలోని ద్రవ భాగం (Fluid part of blood is) : ప్లాస్మా (Plasma)


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*  *🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Tuesday, 10 January 2023

మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది (11-Jan-23,Enlightenment Story)

 🕉✡👏 👏#దేవుడి_చిరునామా 👏👏🕉✡

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు."స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా?" కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను.సాధువు తల ఎత్తి అతని వంక చూసి,.ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు.

"దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?" పరిహాసంగా అడిగాడు అతను. అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు.

"నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు. 

పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను". చెప్పిందా పిల్ల.

"ఎవర్ని చేసుకుంటావయితే?" ప్రశ్నించింది తల్లి.

"మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు?" ఆడిగిందా అమ్మాయి.

"మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు" చెప్పాడు తండ్రి.

"అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను." చెప్పిందా పిల్ల.

అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి.

తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక 'సరే' అన్నాడు.

ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. 'నన్ను పెళ్లి చేసుకో ' అని అడగబోతుండగా, ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. ' ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు?' అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది.. 

అతని దగ్గరకు వెళ్లి.ఆ.విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది. ' ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప. చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి' అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే".

కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు.

"మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. 

దేవుడికోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. 

అదే దేవుని చిరునామా"...🕉✡✡🕉

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Tuesday, 3 January 2023

గోదానం చేస్తే మంచిదంటారు..ఎందువల్ల..!!? (10-Jan-23,Enlightenment Story)

 గోదానం చేస్తే మంచిదంటారు..  ఎందువల్ల..!!?

దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.

కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞజపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నచికేతుడికి అవి కనిపించలేదు.

నది పొంగడంతో అవి నది గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. 

ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నచికేతున్ని నరకానికి వెళ్లు అని మండిపడ్డాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి.

తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. సూర్యోదయ సమయానికి నచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు.

నచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చనిపోమ్మని శాపం ఇవ్వలేదు కనుక నచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నచికేతుడు తెలిపాడు.

అనంతరం నచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొనట్టు అతను తెలిపాడు.

అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.

శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ... మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. 

చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నచికేతుడు తండ్రికి తెలిపాడు. ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు

Sunday, 1 January 2023

కొత్త వెలుగు (9-Jan-23,Enlightenment Story)

 🪔🪔 *కొత్త వెలుగు*🪔🪔

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌹వేసిన రోడ్డు మీద వెళ్ళిపోవడం సులువు. మనమే ఒక రోడ్డు వేసుకుని వెళ్ళడం కష్టం. అమ్మ చందమామను చూపించి బువ్వ తినిపిస్తుంది. జ్ఞాని దేవుణ్ని చూపిస్తాడు. చివరికి అతడే గురువుగా మిగిలిపోతాడు. మంచివాళ్లు, ఆదర్శవంతులు ఒక మార్గం చూపిస్తారు. ఆ దారిలో మనం వెళ్ళే జీవితం ఎక్కువ కష్టాలు లేకుండా సాగిపోతుంది.

🌹కాలం మనతోనే ప్రారంభం కాలేదు. మన ముందు ఎందరో ఉన్నారు. గొప్పగా బతికారు. ఎక్కడికక్కడ ఎలా అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళాలో జీవించి చూపించారు. అందువల్ల- మనకు ఒక దారి ఉంది. ధైర్యం ఉంది. భయం లేదు. అలా ముందుకు వెళ్ళిపోదాం! అక్కడ మనకు ఎదురయ్యే ఆటంకాలను, అవరోధాలను పరిష్కరించి, రాబోయే తరాలకు మన మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నామో చూపిద్దాం.

🌹మార్గం పేరు, లక్ష్యం వేరు. సరైన మార్గం ఎన్నుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలం. మనం ఎంతో అదృష్టవంతులం. మన ముందు తరాలవారు మనకు ఎన్నో ఉపాయాలు, పరిష్కారాలు, కిటుకులు అందించారు. భయపడకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేయండి. మీకు మేమున్నాం- అని వాళ్ల అనుభవాల చరిత్ర భరోసా ఇస్తోంది. వారికి మనం ఎన్నో ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనం | కూడా ఎంతో కొంత కృషిచేసి, మన పని మనం చేసుకుంటూ ఇతరులకు ఆదర్శప్రాయమై నాలుగు దారులు కూడలిలో దీపాలు వెలిగించాలి. ఆ వెలుగు భావితరాలకు కనిపించాలి. వాళ్లు మనకు అభినందనలు తెలపాలి.

🌹 ఇదే జీవితం! వెళ్ళేవారు. వెళ్తుంటారు. వచ్చేవాళ్లు వస్తుంటారు. ఎవరి అనుభవాలు వారివి. చివరికి అందరికీ కొన్ని అరుదైన అనుభవాలు శాశ్వతంగా మిగిలిపోతాయి. మరణించిన తరవాతా లోకంలో శాశ్వతంగా ఎలా ఉండిపోవాలో తెలియజేస్తోంది భగవద్గీత. ఎలా బతికితే శాశ్వత పరందామ పథం పొందగలమో కూడా వివరణ ఇస్తుంది. శ్రీకృష్ణుడు మనకు చేసిన | మహోపకారం- భగవద్గీత ద్వారా చూపిన జ్ఞాన మార్గం. 

🌹మానవజాతి మొత్తం తరించిపోవడానికి ఆ దారి ఒక్కటి చాలు, కథలున్నాయి. గాథలున్నాయి. కావ్యాలున్నాయి. ప్రబంధాలున్నాయి. పురాణాలున్నాయి. శతకాలున్నాయి. నీతులున్నాయి. ధర్మాలున్నాయి. మనిషి ఎలా బతకాలో, ఇతరులను ఎలా బతికించాలో తెలిపే ధర్మసూక్ష్మాలున్నాయి. మహా గ్రంథాలు, మహానుభావులు అనుభవాలే మనకు దిక్సూచి. వారి కార్యాచరణే మనకు శిరోధార్యం. వారి నిబద్ధతే మనకు ప్రాణసమానం. వాళ్లే మన ఊపిరి. ఆ తాతముత్తాతలు ఆస్తులు ఇస్తారు. 

🌹తల్లిదండ్రులు సంపాదించినవి ఇస్తారు. కాని, వెలకట్టలేనివి మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు. అవే మనకు విలువైన సంపద. తరగని ఆస్తి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాముడంటే తెలియని ఒక ప్రదేశంలో పుడితే, రామాయణం కూడా తెలియదు. దాని గొప్పదనం తెలియదు. మన ముందు నడిచిన మహానుభావుల అడుగుజాడల్లో నడవాలి. ధైర్యం విడిచిపెట్టకూడదు. వీరులు వాళ్లు. మన సుఖం కోసం వారెన్నో త్యాగాలు చేశారు. యుద్ధాలను ఆహ్వానించారు. విజయం సాధించారు. శాంతిని అందించారు.

🌹అదే దారిన పడుతూ లేస్తూ అయినా వెళదాం. వెయ్యిసార్లు కిందపడినా, మళ్ళీ లేచి నిలబడదాం. ఒక కొత్త వెలుగును లోకానికి చూపిద్దాం!వారసత్వాన్నే మన సంపదగా అందుకోవాలి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నా తలమీది వెంట్రుకలు ఉన్నట్టుండి తెల్లబడలేదు (4-Jan-23,Enlightenment Story)

🕉️  *నా తలమీది వెంట్రుకలు ఉన్నట్టుండి తెల్లబడలేదు* 🕉️

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕

ఒక రైలు . బోగీలో ఒకే ఒక వృద్ధుడు ఉన్నాడు. తర్వాతి స్టేషన్ లో కొందరు యవకులు ఆ బోగీలో ఎక్కారు. కాసేపటికి ఈ వృద్ధుడి  ఎదురుగా వచ్చి కూర్చున్నారు. ఒక యువకుడి దృష్టి బోగీలోని చైన్ మీద పడింది. స్నేహితులతో , నేను చైన్ లాగుతాను అన్నాడు. రెండవవాడు అనవసరంగా అది లాగి, రైలును ఆపితే 500 జుర్మానా వేస్తారు. అదీగాక జైలు శిక్ష కూడా వేయవచ్చు అన్నాడు. జైలు శిక్ష తప్పించుకోవాలంటే 500 లతోబాటు మరో 700 కట్టాల్సొస్తుంది కూడా . అపుడు మొదటి యువకుడు మన దగ్గర ఎంత డబ్బులున్నాయో తీసి మూడవ స్నేహితుడి వద్ద పెట్టండి అన్నాడు. ఒకడేమో 500 నోటు, రెండవ వాడు 200 నోటు, మరో అయిదుమంది తలా 100 నోట్లు తీసి ఇచ్చారు. ఇదయ్యాక మొదటి యువకుడు, అయినా నేను చైన్ లాగినా టి.సి. వచ్చినపుడు ఎదురుగా ఉన్న ఈ ముసలాడు చైన్ లాగాడు అని చెప్పేస్తే సరి. మనడబ్బులు మిగిలిపోతాయి అన్నాడు. అన్నదే తడవుగా చైన్ లాగేశాడు. రైలు ఆగిపోయింది. కాసేపటికి ఇద్దరు రైల్వే పోలీసులను వెంటబెట్టుకుని టి.సి. వచ్చాడు. ఎవరు చైన్ లాగింది? అనడగ్గా యువకుడు వృద్ధుడివైపు చూపించాడు. టి.సి.కి కోపం వచ్చి, వృద్ధుడిని చెడామడా తిట్టాడు. అపుడు వృద్ధుడు చైన్ లాగింది నేనే. దానికొక కారణం ఉంది. ఈ యువకులందరూ కలిసి నాదగ్గరున్న 1200 రూపాయలను లాక్కుని , ఆ మూడవ యువకుడి వద్ద దాచారు. ఒకటి 500 నోటు, ఇంకొకటి 200 నోటు, మిగితావి 100 నోట్లు అన్నాడు. టి.సి. కి మరింత కోపం వచ్చి, పోలీసులను సోదా చేయమన్నాడు. పోలీసులకు డబ్బు దొరికింది.ఆ డబ్బును టి.సి. ఆ వృద్ధుడికి ఇచ్చేశాడు.  వెంటనే యువకుల మీద ఫైన్ తో బాటు కేసు బుక్ చేసి బోగీలోనుండి దిగమన్నాడు. బోగీలోనుండి దిగబోతున్న  మొదటి యువకుడిని చూస్తూ, "నా తలమీది వెంట్రుకలు ఉన్నట్టుండి తెల్లబడలేదు" అన్నాడు వృద్ధుడు.

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻🌹🌼💐 🌷🌻🌷🌻🌹🌼💐 🌷🌻

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...