Friday, 23 December 2022

దోపిడి - దొంగతనం (26-Dec-22,Enlightenment Story)

 *దోపిడి - దొంగతనం  (26-Dec-22,Enlightenment Story)*

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అమెరికా పోలీసులు ఒక 15 ఏళ్ళ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు. జడ్జి విషయమేంటని అడిగితే ఈ అబ్బాయి ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వాచ్మాన్ పట్టుకున్నాడని అప్పుడు పెద్ద అద్దంపగిలిపోయిందని అందుకుగాను ఆ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు 

జడ్జి: దొంగతనం చేసావా ?   పిల్లాడు : అవును మేడం 

జడ్జి :ఏమీ దొంగతనం చేసావు ? పిల్లాడు: ఒక బ్రెడ్ ప్యాకెట్ 

జడ్జి: డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చుగా ? పిల్లాడు :డబ్బులు లేక తీసుకున్నాను మేడం 

జడ్జి :ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చుకదా 

పిల్లాడు :అమ్మ మాత్రమే ఉన్నారు అందులోనూ అనారోగ్యం అన్నాడు 

జడ్జి :ఏదైనా పని చేయొచ్చుగా నువ్వు 

పిల్లాడు :ఒక కారు షెడ్ లో పనిచేస్తుండేవాడిని మేడం అమ్మకు అనారోగ్యమని ఒక్కరోజు  సెలవు పెట్టినందుకు పని నుండి తీసేసారు 

జడ్జి :ఇంకెక్కడైనా పని చేయొచ్చుగా 

పిల్లాడు :ఉదయం నుండి యాభై మంది దాకా పని అడిగాను ఒక్కరుకూడా ఇవ్వలేదు. సూర్యుడు అస్తమించేసాడు ఇక ఏమీ చేయలేక ఈ పనిచేశానని తలదించుకున్నాడు. పిల్లాడితో సంభాషించాక జడ్జి తీర్పు రాయడం మొదలుపెట్టారు.

ఈరోజు ఈ పిల్లాడి పరిస్థితికి మనం అందరం నేరస్థులమే నాతో సహా. మన దేశంలో ఇంత సంపధ, డబ్బు ఉండి  ఆకలి అంటున్న అబ్బాయికి ఒక్క పూట తిండి అందించలేక పోయాము అందుకు జరిమానా ఇక్కడ కోర్ట్ లో ఉన్న ప్రతిఒక్కరు ఇతడిని పట్టుకున్న పోలీసులు నాతో సహా అందరూ 10 డాలర్ లు కట్టాలి  ఏ ఒక్కరు కట్టకుండా బయటకు వెళ్ళలేరు. ఇక ఇతడిపై కేసు పెట్టిన షాప్ యజమాని 100 డాలర్ లు జరిమానా కట్టాలి 

ఈ మొత్తాన్ని ఆ పిల్లాడికి అందించాలి అని తీర్పు రాశారు. ఆ పిల్లాడు అక్కడ ప్రజలు ఆ జడ్జి తీర్పుకు ఆశ్చర్యపోయారు ఆ పిల్లాడు తల ఎత్తి జడ్జి ని చూడగా బాధతో కళ్ళ వెంట కన్నీళ్లు 

సమాజంలో ఆకలి కోసం దొంగతనం జరుగుతున్నది అంటే మనం అందరం దానికి కారణమైనవాళ్ళమే. సాంకేతికత , సంపధ ఏ ఒక్కరి వల్ల సృష్టించబడదు. అది శ్రామికుల శ్రమ ఫలితం . అది తిరిగి వారికి సరిగా అందట్లేదు అంటే  మనమంతా దోపిడిధారులమే   అని ఆ జడ్జి తలవంచుకున్నారు

Thursday, 22 December 2022

స్వర్ణముఖి నది (25-Dec-22,Enlightenment Story)

 *స్వర్ణముఖి నది*

దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. తిరుపతి జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం ధూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, 

తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు.

సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.

ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.

స్వర్ణముఖి నది పాకాల దగ్గరలో ఉన్న పాలకొండ లలో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టినది. ఇది చంద్రగిరి ఎగువన భీమానదితో సంగమించి నది అయింది. ఆతరువాత దిగువన ఉన్న కల్యాణీనదితో కలిసి పెద్దనదిగా మారింది. చంద్రగిరి వద్ద ఉన్న చంద్రనగము, హేమనగములలో ఇది హేమనగాన్ని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఇది సార్థక నామాధేయురాలైంది. వాస్తవానికి స్వర్ణముఖరీ ఇసుక వెండిలా తెల్లగానూ అలాగే సువర్ణంలో బంగారు వర్ణంతోనూ ఉంటుంది. తరువాత ఈ నది కొంతదూరం ఉత్తరంగా ప్రవహించి మరికొంత దూరం ఈశాన్యంగా ప్రవహిస్తు శేషాచల కొండలను స్పృజించి కల్యాణీ, భిమానదులతో సంగమించి కపిలతీర్ధం, అలివేలుమంగాపురం, శ్రీకాళహస్తి, నెల్లూరు మీదుగా ప్రవహించి నూడుపేట సమీపంలో ఉన్న సిద్ధవరం వద్ద తూర్పుసముద్రంలో సంగమిస్తుంది. స్వర్ణముఖీ నదీ తీరంలో అగశ్వేరాలయం, వరేశ్వరాలయం, పద్మావతీ దేవి ఆలయం, పరశురామేశ్వరాలయం ఉన్నాయి. ఈ నది మొత్తంగా దాదాపు 100 మైళ్ళు ప్రయాణిస్తుంది.

సువర్ణముఖి నది అగస్త్యుని తపోభంగం కలిగించగా అగద్త్యుడు స్వర్ణముఖినీ నదిని శపించాడు. అందువలన నదిలో నీరు ఇంకిపోయింది. అయినప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న కారణంగా నదీసమీపంలో ఉన్న బావులలో నీరు ఇంకిపోదు. నదీతీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా స్వర్ణముఖీ నదికి " మొగలేరు " అనే మరొకపేరు కూడా వచ్చింది. ఈ నదికి పలు వాగులు, వంకలు, ఏరులూ జలాలను ఆందిస్తున్నాయి. వాటిలో కల్యాణీ, భీమానదులు ప్రధానమైనవి. కల్యాణీ నదీతీరంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణశ్రీనివాసుడు వెలసి పూజలందుకుంటున్నాడు.


Wednesday, 21 December 2022

ప్రస్తుత వివాహ వ్యవస్థ (24-Dec-22,Enlightenment Story)

 *ప్రస్తుత వివాహ వ్యవస్థ*

💥💥💥💥💥💥💥💥💥💥

రాసినవి మాట్రిమొని నిర్వహించే వ్యక్తి నుండి.  అక్కడి తల్లితండ్రులు ,  ఆడపిల్లలు వేదనతో చెప్పిన  యదార్ధ సత్యాలు. అంతేకాని,  ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. 👉ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె!👈 

ముమ్మాటికీ తల్లి తండ్రులు వివాహాలను పాడు చేస్తున్నారు. వారి నాశనానికి వీరే బాధ్యులు.ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. ....

"ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి"

కావలసిన అర్హతలు: BTech, Software ,America అబ్బయికి సొంత ఇల్లు, తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం.సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం.ఆడపిల్లల తల్లితండ్రులకు 
సపోర్ట్ గా  ఉండాలి.

💥ఇంటర్వ్యూ: 

ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు.

"అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు". కాని,10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి  ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో) మీ అబ్బాయి ఫోటో,  వివరాలు whatsapp లో పంపండి ,  మా అమ్మాయిది పంపుతాము అంటుంది !  మనం పంపిస్తే వారు పంపరు. తరవాత మనమే ఫోన్ చేయాలి. అడిగితె

మొదటి వారం: 
"ఇంకా అమ్మాయి చూడలేదండి".

రెండవ వారం :
" అమ్మాయి లేట్ గా వస్తోందండి. ఇంకా చూడలేదు" .

మూడవ వారం: 
" ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి". 

నాలుగో  వారం:
శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" .

ఐదో వారం:
అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.

💥అమ్మాయిల విషయానికొస్తే:
తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా  జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా:

"మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా?  మీ ఇంట్లో  వీల్ ఛైర్ లు ఉన్నాయా? మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా?మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?" అని అబ్బాయి తల్లితండ్రుల నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత,
 
"మీ అమ్మ నాన్నలు మనతో ఉండడానికి వీలు లేదు, నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు. నీ సెల్ నేను ముట్టుకోను! 

నేను వంట చెయ్యను. కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము!లేదా వంటమనిషి పెట్టుకుందాం..
 
నాజీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో , నీ జీతం ఖర్చుపెడదాము!"ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు. కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం...లేకపోతె తాంబూలాలు లేవు. కొన్ని షరతులు తరవాత చెప్పి కూడాతాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి..

పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక..  విడాకుల వరకు వస్తే, విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం.అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది...విడాకులైనా ఏ మాత్రము మార్పు, బాధ లేకుండాకొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు.
సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు.

వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! 

ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా? ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం.

ప్రమాదమేమంటే,  మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కానిఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి  తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు.

ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది)
ఇవండీ!  మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు!  అనుభ వించిన వారు చెప్పిన నగ్న సత్యాలు! 

🌹30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు ,
🌹పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు,
🌹ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ, అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు ,
🌹18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , 
🌹అబ్బాయిలకు 
🌹తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు  
ఈ పోస్ట్ అంకితం.👍

🌷పోయిన వయసు రాదు.
🌷"35 వయసు దాటిన అబ్బాయిలు దయనీయ పరిస్థితి.

*"పురుషుడు-స్త్రీ- వయస్సు" ఇవి మూడే ముఖమైనవి. జీతం, చదువు కాదు ఒక వ్యక్తి ఆవేదన.*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂


Tuesday, 20 December 2022

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? Part -2 (23-Dec-22,Enlightenment Story)

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? Part -2

(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::) 

*జీవితాన్ని పరిశీలించుకొనుట*

ఇచ్చట అంక్షపెట్టే వారు, నిర్ణయించేవారు ఎవరూ ఉండరు. ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో అలాగ ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పుచేసానని ఫీల్ అవుతుంది. *తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా, రాబోయే తన జీవితానికి ఒక బ్లూప్రింట్ అంటే నఖలు లేదా ఒక ప్లాను వేసుకుంటుంది. ఏలాంటి సంఘటనలని ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలంజ్ లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నఖలు తయారుచేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే, నిమిషాలతో సహా, వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ, తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంటుంది.  

*నఖలు లేదా నమూనా*

ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము. ఒక ముఖ్యవిషయం చెప్పాలి అదే ఏమిటంటే, మీరు ఒక తప్పు చేసే దానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా భాదపడవలసి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మా తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది. ఒకోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపెట్టి వుంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయంతీసుకుంటుంది. అందువలనే, మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ వుంటారు ఎందుకంటే, అవే తర్వాత కూడా మోసుకునిపోబడతాయి కాబట్టి. ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారుచేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది.

*మరుజన్మ*

మన మరుజన్మ ఆత్మలలోకంలో తయారు చేసుకున్న నఖలు పై ఆధారపడి ఉంటుంది. జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము ఒకోసారి తల్లిగర్భంలో పిండం  రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన 4, 5 నెలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్ట్లు గ్రహముల అమర్చబడినాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను, నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏమిటంటే, నీ జీవితం మొత్తం కూడా, నువ్వు ఆత్మలలోకంలో తయారుచేసుకున్న నఖలు లేదా బ్లూప్రింట్ మాత్రమే. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక, 40 రోజులదాకా బిడ్డ తన గత జన్మకి సంబందించిన జ్ఞాపకాలు అన్నీ కలిగివుంటుంది. అందువలనే ఒకోసారి సంబంధం లేకుండా నవ్వడమూ లేక ఏడ్వడమూ జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత, గత జన్మకి సంబందించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమెటీక్ గా తుడిచివేయబడి, అసలు నాకు గతజన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము.

*నఖలు అమలుపరచబడుట*

ఇక అప్పటినుండి నఖలు లో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుండి, మన సంఘటనలు తలచుకుని, ఇతరులను మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. అందువలన మీరు ఇంకొకరిని వ్రేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ నఖలు లో మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని. మనము ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. తలిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామీ అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకువస్తున్నారంటే, వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి. 

మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని, చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్నపలంగా మరణం సంభవించడము.   ఏది ఏమైనప్పటికి ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది, ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి, ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది.

అలా జరిగితే, ఆత్మల పరిస్థితి మరీ దయానీయకమై పోతుంది. ఎందువలన అంటే, అవి ఆత్మలలోకానికీ వెళ్లలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు.   అందువలననే మన ప్రార్థనలు మరియు మరణించినవారికి జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అలా చేయడం వలన, ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలలోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సాంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్దం అని వుంది.   *మనము మరణించిన వారికి కాపాడుటకు వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం చేయడం కూడా ఎంతో  ప్రాధాన్యమైనదే.*

🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏

*మనకి మరణం లేదు, మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ, మనం కలుసుకోవడానికి.*🙏🏻ఓం నమః శివాయ 🙏🏻

🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

         

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? Part -1 (22-Dec-22,Enlightenment Story)

మరణం తర్వాత? ఏం జరుగుతుంది? Part -1

(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)(:::🔴:::)

*భూమితో అనుసంధానింపబడి ఉన్న  చక్రాలతో సంబంధం తెగిపోతుంది*

భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే 

మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని  యొక్క అరికాలు పాదాలు గమనించారంటే. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. 

*సూక్ష వెండి తీగ*

అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి                                                                                                   అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ, అలా శరీరం నుండి పైకి, ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది.

*భౌతికశరీరానికి ముగింపు*

శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మా తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది, నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ, ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను  ఇక తన శరీరంలో జేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి, ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకూ ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన వుంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే, అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి, అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ, వింటూ ఒక సాక్షిభూతంగా వుందని.

*భౌతికదేహంతో విడివడుట*

ఇక అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక, ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థీవ దేహం పంచభూతాలలో కలసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన, ఇక ఆత్మకి పూర్తి స్వేచ్చ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలచుకున్న మాత్రానా ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిసాకా, తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని, భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది.

*ఆత్మప్రయాణం*

ఆత్మలలోకానికి వెళ్ళ్దడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసివుంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజులలో మనం జరుపవలసిన కార్యక్రమాలు చక్కగ నెరవేర్చవలసి వుంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్ధించడము జరుపవలెను. అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మలలోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనగా, మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు కనపడుతుంది.

*పూర్వీకులను కలసుకొనుట*

హిందువులు 11వ మరియు 12వ రోజున జరుపబడే ఇతర కార్యక్రమాలవలన, ఆత్మ తన పూర్వీకులను, ఆప్త మిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలాగైతే, మన దూరపుబంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో, అదేవిధంగా ఆత్మలలోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని అహ్వానించి మనస్పూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు, ఆత్మని తను భూలోకంలో, భాద్యతవహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి, ఒక పెద్ద వెలుగువంటి బోర్డ్ ఉన్న ప్రదేశానికి తీసుకునివెళ్తారు. దీనినే కార్మిక్ బోర్డ్ అంటారు. ఈ బోర్డ్ లో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది.

🙏🎟🎟🎟🎟🎟🙏🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟

*మనకి మరణం లేదు, మరణం అనేది అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ, మనం కలుసుకోవడానికి.*🙏ఓం నమః శివాయ 🙏🏻

🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟🙏🎟🎟🎟🎟🎟


🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂                

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః (21-Dec-22,Enlightenment Story)

 గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

*గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః*

ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది. మొదట ఎవరు పలికారు. ఎందుకు పలికారు.. దాని వెనుక ఉన్న కథ.

పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.

గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.

వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను అని చెప్పాడు.

కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.

కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.

అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః  గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః

తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు

ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ...

కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి.

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Monday, 19 December 2022

పటిక బెల్లం లో మూడవవంతు (20-Dec-22,Enlightenment Story)

పటిక బెల్లం లో మూడవవంతు (20-Dec-22,Enlightenment Story)

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

*అరుణాచల ఆలయంలో యదార్థo*

ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు. అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.

ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.

ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం  మాయమవుతోంది.ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల  పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదేమీ శిక్ష అన్నాడు.పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి  చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని  గట్టిగా వాటేసుకున్నాడు.

అద్భుతం!!

మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గార్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు.అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట. ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ "  అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురుంచి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు.

సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి ??.

నిష్కల్మష  ప్రేమకు, నిర్మల  భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బందియే !! అరుణా చలుడు  కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో  మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( beam of light ) రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం . 

అరుణాచలం శివయ్య 🚩🕉️🔱🙏🙏🙏

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...