Sunday, 11 December 2022

పరీక్షలు (12-Dec-22,Enlightenment Story)

 12-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

పరీక్షలు

ఒక శిల్పిఒక రాయిని ఎన్నుకునే క్రమంలోనే ఆ రాయిని ఎన్నో దెబ్బలు కొడతాడుపరీక్షించడానికి  కేవలం పరీక్షించడానికే.రాయి శిల్పంగా మారడానికి ఎన్ని దెబ్బలు తగలాలిఒక రాయి కే  ఇన్ని పరీక్షలు దెబ్బలు అయితే

ఒక గురువు శిష్యున్ని ఎన్నుకోవడానికి ఎన్నో పరీక్షలు పెడతాడు. గురువు పెట్టే పరీక్షల్లో నెగ్గితేనే శిష్యుడికి జ్ఞానోపదేశం చేస్తాడు.గురువు శిష్యుడికి పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే జ్ఞానం అందించిన తర్వాత శిష్యుడు పొరపాటు చేయకూడదు. తప్పుడు మార్గంలో పోకూడదు అనే ఉద్దేశంతోనే తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి గురువు అన్ని పరీక్షలు పెడతాడు తప్ప గురువుకు శిష్యుడి మీద ఎలాంటి కోపం ద్వేషం ఉండదు.

ఒక జీవి ఎన్ని సంవత్సరాలు జీవించిన, ఒక జీవి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా, జీవికి ఎన్ని యుగాలు గడిచినా జీవి ఏ లోకంలో ఉన్న ఇంద్రియ సుఖదుఃఖాలు అనుభవించాలి పుట్టడం,చావడం,ఆకలి,దప్పిక,నిద్ర,భయం, మైధునము,రాగద్వేషాలు,కర్మలు,ఫలాలు,అనుభవాలు,జ్ఞాపకాలు,బ్రమ  భ్రాంతిఇంతకుమించి ఏమీ లేదు.బాహ్య మాయా ప్రపంచం లో ఇంకేమైనా ఉన్నది అనుకుంటే అది కేవలం అజ్ఞానం మాత్రమే మాయ ప్రపంచం కలలో ప్రపంచం లాంటిదే. ఈ ప్రపంచం పై మాయా మొహాలు వదిలేసి

.నేను దేహం కాదు ఆత్మని అనే ఎరుక తెచ్చుకొని దేహాన్ని వదిలేసి పరమాత్మలో లీనం కావడమే మనిషి చివరి గమ్యస్థానం దానికి మార్గాలు. భక్తి, జ్ఞాన,వైరాగ్యము,త్యాగము,తత్వం అనే మార్గాల ద్వారా యోగ మార్గాన్ని అనుసరించి తన దేహంలో ఉన్న ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తే సమస్తం ఉన్నది ఒకటే పరబ్రహ్మము అని అర్థంఅవుతుంది. ఇదే అఖండమైన బ్రహ్మ స్థితి ఇంతకుమించి చెప్పేది అంటూ ఏమీ లేదు వినేది అంటూ ఏమీ లేదు తెలుసుకోవాల్సింది అంటూ ఏమీ లేదు.

సర్వేజనా సుఖినోభవంతు

సర్వేజనా సుఖినోభవంతు

సర్వేజనా సుఖినోభవంతు

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Saturday, 10 December 2022

రామ లక్ష్మణులు (11-Dec-22,Enlightenment Story)

 రామ లక్ష్మణులు  ( 11-Dec-22,Enlightenment Story)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂🍃🍂 🍃🍂

రామ-లక్ష్మణులు పుట్టుకతో కవలలు కాదు.  కానీ మన సమాజంలో ఎక్కువ మంది కవలలకి ఈ పేర్లు పెడుతుంటారు. సుమిత్రకి జన్మించిన లక్ష్మణ-శత్రుఘ్నులు కవలలు. సీతకి జన్మించిన లవ-కుశులు కవలలు ఈ పేర్లు కాకుండా రాము-లక్ష్మణ్ అని పేర్లు పెట్టడంలో ఆంతర్యం ఏంటి?

వివరణ: 

భారతీయ సమాజం రామ, లక్ష్మణులను వేర్వేరు తల్లులకు పుట్టిన బిడ్డల్లా చూడలేదు. అన్నదమ్ముల అనుబంధానికి, ధర్మానికి ప్రతీకగా చూసింది. ఒక ధర్మానికి కట్టుబడిన పురుషోత్తమునిగా రాముని, ధర్మమూర్తి అయిన అన్న వెంట నిరంతరం అనుసరించిన తమ్మునిగా లక్ష్మణుడు ఈ జాతికి ఆదర్శప్రాయులయ్యారు. 

నిజానికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 'ఆదర్శ అన్నదమ్ములు'  అనే పదానికి నిదర్శనం. ఇది శ్రీరామ పట్టాభిషేకం ప్రకటించిన, తరువాత పరిణామాలలో వ్యక్తమవుతుంది. ఊహ వచ్చినప్పటి నుంచి, లక్ష్మణుడు రాముని విడిచి ఉండలేదు. కష్టాలకు గానీ, ప్రాణాలకు గానీ వెరవలేదు.

రాముడు సైతం లక్ష్మణుని ఎంతో ప్రేమించాడు. రామ-రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లితే, తల్లడిల్లి పోయాడు. సంజీవని తెచ్చిన హనుమంతుని ఆత్మబంధువుగా భావించాడు. ఇదంతా వారిద్దరి మధ్య వున్న అనుబంధాన్ని సూచిస్తుంది.

అందుకే భారతీయులు ఎక్కడ గుడి కట్టినా, అందులో సీతారాములతో పాటు లక్ష్మణుని విగ్రహం చేర్చుతారు. వీరితోపాటు ఆంజనేయుని విగ్రహం ఉండి తీరుతుంది. 

ఈ కారణాలవల్ల, కవలలకు రామలక్ష్మణుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

కుశలవుల పేర్లుకూడా పెడుతుంటారు. కానీ, చాలా అరుదుగా నామకరణం చేస్తారు. చాలా తక్కువగా వీరి పేర్లు పెట్టడానికి కారణం, రామలక్ష్మణులు సాక్షాత్తు విష్ణుమూర్తి, ఆదిశేషుని అవతారాలు కాబట్టి, తమ పిల్లలకు ఆ పేర్లు పెడితే వారు ఉచ్ఛస్థితికి వస్తారని భావిస్తారు. 

రామ లక్ష్మణుల గాధలతో పోలిస్తే,కుశ లవుల కథలు స్వల్పంగా భావిస్తారు. అందుచేత కవలలకు రామ లక్ష్మణుల పేర్లు పెట్టడానికే మొగ్గుచూపుతారు.✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🌷🙏🌷

🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Friday, 9 December 2022

తాపత్రయం (తపన) - 10-Dec-22,Enlightenment Story

 10-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

తాపత్రయం (తపన)

ఒక కోటిశ్వరునికి పెద్ద కారు  ప్రమాదం జరిగింది. పదిహేను రోజుల తర్వాత  కోమాలో నుండి  స్పృహలోకి వచ్చాడు. చుట్టు ఉన్న కుటుంబ సభ్యులందరు ఆనందంతో చూసారు. 

*తాపత్రయం మొదటి మెట్టు*

అందరు ఇక్కడే వున్నారా అని అడిగాడు..అవుననే కొడుకు చెప్పాడు. అందరు ఇక్కడే ఉంటే అక్కడ షాపులో ఎవరున్నారు అని అడిగాడు.

*తాపత్రయం రెండో మెట్టు*

నేను అదృష్టవంతురాలిని.  నా మాంగల్యం గట్టిది. మీకు పెద్ద కారు ప్రమాదం జరిగింది , కారు నుజ్జునుజ్జు అయ్యింది, అయినా మీరు ప్రాణాలతో బయటపడ్డారు, అంది భార్య. వెంటనే కారు ఇన్సూరెన్స్ చేయించారా అని అడిగాడు.

*తాపత్రయం మూడో మెట్టు*

నాన్న మీకింకొక విషయం చెప్పాలి.  కారు ప్రమాదంలో మీచెయ్యి కారు డోరులో ఇరుక్కుపోయింది. మీ చెయ్యి తీసేసారు అన్నాడు.  చెయ్యి చూసుకున్నాడు, లేదు. చేతికి పాతిక లక్షల రోలెక్స్ వాచీ వుండాలిరా అన్నాడు.

*తాపత్రయం నాలుగో మెట్టు*

వాచీ తీసుకున్నారా అని లేవబోయాడు. నాన్న కంగారు పడకండి, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రమాదంలో మీ వెన్నెముక విరిగిపోయింది.  మీరు నడవలేరు. మీపనులన్నీ చేసుకొనేందుకు అనువుగా మీకు కోటిరూపాయలతో ఎలక్ట్రానిక్ రోబో వీల్ చెయిర్ తీసుకొన్నాం.  అందులో కూర్చుంటే పళ్ళు బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం వంటి అన్ని మీపనులు మీరే చేసుకోవచ్చు అన్నాడు కొడుకు. కోటిరూపాయలతో కొన్నారా, కొంటానికి  కొటేషన్ తీసుకున్నారా, ఇంకా తక్కువకి వచ్చేదేమో అన్నాడు. 

*తాపత్రయానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమి కావాలి*

*నీతి : తాపత్రయం తగ్గించుకోండి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అంత ఆనందంగా ఉంటాము. చిన్న జీవితం మనది*

🙏💐🙏శుభోదయం🙏💐🙏

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Thursday, 8 December 2022

మానవుని పంచకోశాలు (09-Dec-22,Enlightenment Story)

 09-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

మన శరీరాలు వాస్తవానికి మూడు శరీరాలతో రూపొందించబడ్డాయి; భౌతిక, జ్యోతిష్య మరియు కారణ. ఈ ఐదు తొడుగులు లేదా 'కోశాలు' లోపల; అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ మరియు ఆనందమయ కోశ.

ఐదు కోషాలు లేదా తొడుగులు

అన్నమయ కోశ - ఆహార కోశం

మన భౌతిక శరీరాలు భౌతిక ప్రపంచంలోని భౌతిక అంశాలతో రూపొందించబడ్డాయి. మనం తినేది మనమే, అలా మాట్లాడాలి. మనం ఆహారంతో తయారయ్యాము మరియు మన మరణం తర్వాత మన ఆహారం ఎక్కడ నుండి వచ్చిందో భూమికి తిరిగి వస్తాము. ఈ తొడుగు భౌతిక శరీరానికి చెందినది.

ప్రాణమయ కోశ - ప్రాణాధార కోశం

ఈ తొడుగు జ్యోతిష్య శరీరానికి చెందినది. మేము ఐదు ముఖ్యమైన శక్తులతో కూడి ఉన్నాము, ఇవన్నీ జ్యోతిష్య విమానం ద్వారా భౌతిక శరీరం గుండా ప్రవహిస్తాయి; ప్రాణ, అపాన, సమాన, ఉదాన మరియు వ్యాన. vyana  ప్రాణమయ కోశంలో ఐదు క్రియలు (కర్మ ఇంద్రియాలు) కూడా ఉన్నాయి; నోరు, చేతులు, పాదాలు, పాయువు మరియు జననేంద్రియాలు. ఈ కోశాలో, మేము వేడి, చలి, ఆకలి మరియు దాహం మొదలైన వాటిని అనుభవిస్తాము.

మనోమయ కోశ - మానసిక కోశం

ఈ తొడుగు మళ్లీ జ్యోతిష్య శరీరంలో కూర్చుంటుంది. మేము ఈ కోశం ద్వారా ఆలోచనను అనుభవిస్తాము. మనం ఆలోచించడం, అనుమానించడం, కోపం, కామం మొదలైన వాటిని అనుభవించవచ్చు. మనస్సు (మనస్), ఉపచేతన (చిత్త) మరియు జ్ఞాన ఇంద్రియాలు (జ్ఞాన అవయవాలు; కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం).

విజ్ఞానమయ కోశ - మేధో కోశం

ఈ తొడుగు జ్యోతిష్య శరీరానికి సంబంధించినది. ఇది మేధస్సును కలిగి ఉంటుంది, ఇది మనం స్వీకరించే సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ఇది మన స్వీయ-ధృవీకరణ సూత్రమైన అహంకారాన్ని (అహంకారాన్ని) కూడా నియంత్రిస్తుంది. ఇది పైన జాబితా చేయబడిన జ్ఞానం యొక్క ఐదు అవయవాలతో పాటు పనిచేస్తుంది. వివక్ష మరియు నిర్ణయం తీసుకోవడం దాని వ్యక్తీకరణలు.

ఆనందమయ కోశ - ఆనంద కోశం

ఇది కారణశరీరంలో కూర్చునే ఏకైక కోశం. ఆనందం, ఆనందం మరియు శాంతిని అనుభవించేది మనలో భాగం. ఇది అనుభూతి చెందడం అత్యంత కష్టతరమైన శరీరం కాబట్టి మనం సంబంధాన్ని కోల్పోతాము. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే ఆ అంతర్భాగానికి చేరుకోగానే ఆనందమయతో మనకున్న అనుబంధం కనపడింది.









🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Wednesday, 7 December 2022

రెండు ఇడ్లిలు ( 08-Dec-22,Enlightenment Story)

 08-Dec-22,Enlightenment Story

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

రెండు ఇడ్లిలు

వేదవతి  ప్రతిరోజు  తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లిలు పెడుతూ  వచ్చేది ఆకలితో ఉన్నవాళ్లు  ఎవరైనా  తింటారు అని ఆ దారివెంట  వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లిలు తీసుకోవడం ఏదో  చిన్నగా  గొణుక్కుంటూ  వెళ్లడం  జరిగేది. ఒకరోజు వేదవతి గోడ  పక్కనే  నిలబడి  అతను  ఏమి అంటున్నాడో  వినాలని  అనుకున్నది.

అతను చెప్తున్న మాటలు నువ్వు చేసిన  పాపం నీ దగ్గరే ఉంటుంది. నువ్వు చేసే పుణ్యం  వచ్చి నిన్నే  చేరుతుంది. ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు  

రోజు ఇడ్లి  పెడుతున్నాను తీసుకు  పోతున్నాడు. నువ్వు మహాలక్ష్మివి  చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కక పొయినా పర్లేదు.ఇడ్లిలు బావున్నాయని  చెప్పకపోయినా  పర్లేదు. ధన్యవాదాలు అమ్మ అని చెప్పడం  కూడా  తెలియలేదా  ఇతనికి ఏదో ఆ చెత్త వాగుడు  వాగిపోతున్నాడు  అని చాల కోపంతో  రగిలిపోయింది  అయినా ఇడ్లిలు పెట్టడం మరిచిపోలేదు. రోజురోజుకి అతనిపై  పెరుగుతున్న  కోపం  అతనిని  చంపేయాలి  అనేంతగా  మారిపోయింది  

*ఒకరోజు ఆ ఇడ్లిలపై  కాస్త విషం  చల్లి పెట్టబోయింది.కానీ మనసు ఒప్పుకోలేదు చేతులు వణకడం  మొదలెట్టింది ఆలోచన మొదలయింది. చ వద్దు  అతను అలాఉంటే  నేను ఎందుకు  ఇలా మారిపోయాను  అని ఆ ఇడ్లిలు పడేసి  మంచి ఇడ్లిలు పెట్టింది.*

ఆ వ్యక్తి  ఇడ్లిలు తీసుకుని  మళ్ళీ అవే మాటలు చెప్తూ  వెళ్ళాడు కొట్టాలన్న కోపం  వచ్చినా తనను  తాను  సమాధాన  పరుచుకుంది . ఆ రోజు మిట్ట మధ్యాహానం  ఎవరో తలుపు కొట్టినట్టు   ఉంటె వెళ్లి  తలుపు తీసింది ఎదురుగా మురికి  బట్టలతో ఓ యువకుడు అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం  చేసుకుంటానని ఇల్లు వదిలి  అలిగి  వెళ్లిన తన కొడుకు అమ్మా ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేసారు చేతిలో చిల్లి గవ్వ లేదు బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లిలు ఇచ్చి  నా ఆకలి తీర్చాడు  నా ప్రాణాలు  కాపాడాడు  అని చెప్పాడు  


*ఆ మాటలు వినగానే  ఆమెకు  వణుకు  పుట్టేసింది. విషం కలిపిన ఇడ్లిలు పెట్టుంటే నా కొడుకుకి  నేనే  యముడినై  ఉండిఉంటానే  అని కంటతడి  పెట్టుకుంది*. ఇప్పుడు ఆమెకు  ఆ ముసలాయన మాటలు అర్థం  అయింది. *నువ్వు చేసిన పాపం నీతోనే  ఉంటుంది. నువ్వు చేసే మంచి నిన్ను  వెతుకుని  వచ్చి చేరుతుంది*

అందరికి అన్ని అర్థం అవ్వవు. అర్థం అయ్యేంతవరకు  ఎవరూ  ఎదురుచూడము. చేసిన ధర్మం  ఎప్పుడూ   ఏదో ఒక రూపంలో  మనకు  వచ్చిచేరుతుంది. ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి

మనం తెలియక చేసే తప్పులనుండి  బయట పడే  మార్గం  మంచి చేయడం మాత్రమే

🌹🌹🙏🏻ధర్మో రక్షతి రక్షితః🙏🏻🌹🌹

🌹🙏🏻 కృష్ణం వందేజగద్గురుమ్ 🙏🏻🌹

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂 🍂

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🍃🍂

Tuesday, 6 December 2022

శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? ( 07-Dec-22,Enlightenment Story)

 07-Dec-22,Enlightenment Story

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు, ఇంకా శివుడిలో ఎవరు గొప్పా అని అడిగారు. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవడు అని అన్నాడు విష్ణువు.

ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహాఇంచడానికి ఏముంది? రాముడె ఈశ్వరుడుగా గలవాడు (రాముడు (విష్ణువు) తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని) అన్నాడు.

వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు.

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

అసలు వీళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు.

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే | శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది.

శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.

కాశీ లో ఉన్నది విశ్వనాదుడు, పూరిలో ఉన్నది జగన్నాధుడు విశ్వం అన్నా జగం అన్నా ఒక్కటే, చిదంబరం లో ఉన్నది నటరాజ, శ్రీ రంగంలో ఉన్నది రంగరాజు (రంగనాధుడు) నటనాస్థలమన్నా, రంగస్థలమన్నా ఒక్కటే, ఈ ప్రపంచమే ఒక రంగస్థలం దీనిని ఆడించే రాజు ఒక్కడే,  కాట్మాండులో ఉన్నది పశుపతి నాధుడు, ద్వారాకలో ఉన్నది గోవులు కాసే పరమాత్మ శ్రీ కృష్ణుడు,  అజ్ఞానంలో ఉన్న ప్రతి జీవీ పశువే అందుచేత మనందరినీ కాచేవాడైన పరమాత్మ ఒక్కడే!!

🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏🛕🙏

Monday, 5 December 2022

పిచ్చుక మూడు నీతి సూక్తులు ( 06-Dec-22, Enlightenment Story)

 06-Dec-22, Enlightenment Story

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

🌹పిచ్చుక మూడు నీతి సూక్తులు🌹

అనగనగా ఒక రోజు ఒక వేట గాడి చేతికి ఒక చిన్న పక్షి(పిచ్చుక) దొరికింది . అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది. "అయ్యా నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు, నా లాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేమి ఉపయోగం? నీ పిడికిలి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయచేసి నాకు ప్రాణ బిక్ష పెట్టి నన్ను వదిలి వేయి.

అందుకు ప్రతి ఫలంగా నేను నీకు అమూల్యమయిన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషం గా సుఖంగా జీవించడానికి  ఎంతగానో  ఉపయోగపడతాయి."అది విన్న వేటగాడు క్షణం అలోచించి, నిజమే ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగము లేదు అనుకుని, "సరే వదిలివేస్తాను     ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు" అన్నాడు.

అప్పుడు  ఆ పిచ్చుక, "అయ్యా కానీ నాది ఒక షరతు, నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను, రెండవది నీ ఇంటి పైకప్పు పై కూచుని చెప్తాను, ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూచుని చెప్తాను అంది."   వేటగాడు సరే అని ఒప్పుకుంటాడు. 

పిచ్చుక వేటగాడి చేతిలో కూచుని మొదటి నీతి సూక్తి ఇలా చెప్తుంది ...

1) ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు. అని చెప్పి, వేటగాడి చేతి లో నుండి ఎగిరి వెళ్లి ఇంటి పైకప్పు పై కూచుంటుంది.

అక్కడ నుండి ఫక్కున నవ్వి అంటుంది  "ఓరి మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకున్నావు, నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువయిన వజ్రం ఉంది, అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలివేసావు ."అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలచుకుని ఏడవటం మొదలుపెడతాడు. అయ్యో అంత విలువయిన బరువయిన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను అని గట్టి గట్టిగా ఏడవటం మొదలుపెడతాడు. అప్పడు  పిచ్చుక అంది, ఓరీ నీవు నిజంగానే మూర్ఖుడివి, నేను ఇంతకు ముందే నీకు చెప్పాను

"ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు."నీ పిడికిలి అంత కూడా లేని నేను, నా కడుపులో బరువయిన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా, 

రెండవ నీతి సూక్తి ఏమిటంటే

2) ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు. అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టు కొమ్మ పై కూచుంది. వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. "లేదు, నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేసావు."

పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూచుని ఉంది.కాసేపటికి వేటగాడు తేరుకుని సరే, "ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు" అని గుర్తు చేసుకుని,  సరే ఇప్పుడు మూడవ సూక్తి ఏమిటో చెప్పు అంటాడు. అప్పుడు పిచ్చుక, ఎలాగూ నే చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు, 

మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు.

3) నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తినీ, విజ్ఞానాన్ని, సమయాన్ని వృథా చేసుకోవద్దు. అని మూడవ సూక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోతుంది

🍁సర్వేజనాసుఖినోభవంతు 🍁

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...